👉ఇరాన్ ఇజ్రాయిల్ వార్…ప్రపంచ యుద్ధమే ? .. 👉ఇజ్రాయెల్ కు చైనా మిత్రుల కూటమి షాక్..! భారత్ కౌంటర్..👉అమెరికాను బెదిరిస్తోన్న ఇరాన్.. ఇరాన్ ను బెదిరిస్తోన్న ఇజ్రాయెల్!.. 👉ఉగ్రవాద భావజాలానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయడమే పరిష్కార మార్గం…మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు.. 👉మాగంటి గోపినాథ్ మరణం చాలా బాధాకరం: ఎమ్మెల్యే పరిటాల సునీత..👉 ఏడాదికి రెండు వందల రోజులు పని కల్పించాలి.. 👉నీట్ లో అర్హత సాధించిన 143 మంది గురుకుల విద్యార్థులు..👉 ఉర్దూ ఎస్జిటి ల కౌన్సిలింగ్ లో అంతరాయం.. *డెలివరీ బాయ్ స్కామ్*

👉ఇజ్రాయెల్ కు చైనా మిత్రుల కూటమి షాక్..! భారత్ కౌంటర్..!

ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం ఇవాళ భీకర పోరు దాల్చింది. ఇరాన్ అణుస్ధావరాలు, శాస్తవేత్తలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడులు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. దీంతో ఇవాళ ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో స్పందించిన భారత్ దౌత్య, చర్చల మార్గాల్లో ఇరుదేశాలూ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరింది. అయితే ఇవాళ చైనా మిత్రదేశాలతో కూడిన షాంఘై సహకార సమాఖ్య మాత్రం భిన్నంగా స్పందించింది.
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడుల్ని షాంఘై సహకార సమాఖ్య ఖండించింది. చైనా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ , బెలారస్ వంటి దేశాలతో కూడిన ఈ కూటమి ఇజ్రాయెల్ దూకుడుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభ్య దేశాలు ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పౌర లక్ష్యాలపై ఇటువంటి దూకుడు చర్యలు అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్ ను తీవ్రంగా ఉల్లంఘించడమే అని పేర్కొన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చర్చలు జరపాలని నిర్ణయించింది.
అయితే ఈ చర్చలకు దూరంగా ఉండాలని భారత్ నిర్ణయించింది. ఇజ్రాయెల్-ఇరాన్ పోరుపై ఇప్పటికే తమ వైఖరి స్పష్టం చేసినట్లు క్లారిటీ ఇచ్చింది. ఈ కూటమిలో భాగంగా ఉన్న భారత్ వీరి చర్చల్లో పాల్గొనేది లేదని తేల్చేసింది. ఇప్పటికే ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం ఆపేలా దౌత్య, చర్చల మార్గాల్లో ప్రయత్నించాలని నిన్న భారత విదేశాంగశాఖ కోరింది. అదే విషయం మరోసారి గుర్తుచేసింది. దీంతో చైనా మిత్ర దేశాలకు షాక్ తగిలినట్లయింది.
👉అమెరికాను బెదిరిస్తోన్న ఇరాన్.. ఇరాన్ ను బెదిరిస్తోన్న ఇజ్రాయెల్! అవును… ప్రస్తుతం పశ్చిమాసియా అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఒక్కసారి బరిలోకి దిగాక మాటలుండవ్… ఇది ఒక సినిమా డైలాగ్ అనుకుంటే.. నిజజీవితంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, యుద్ధానికి ముందు నెగోషియేషన్స్ చాలా ముఖ్యమని అంటారు. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం కాని సమస్యలు ఉండమని చెబుతారు. అయితే ఇరాన్ కు 60 రోజుల సమయం ఇచ్చాము ఇక మాటల్లేవ్ అంటున్నారు ట్రంప్. ఈ సమయంలో ట్రయాంగిల్ ఫైట్ ఇష్యూ ఒకటి తెరపైకి వచ్చింది. అవును… ప్రస్తుతం పశ్చిమాసియా అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకరస్థాయిలో విరుచుకుపడగా.. ఇరాన్ సైతం ఏమాత్రం తగ్గకుండా ప్రతిదాడులు చేసింది. ఈ సమయంలో ఇరు వైపులా ప్రాణ నష్టం మొదలవ్వగా.. తాజాగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఇరాన్ ను ఇజ్రాయెల్ బెదిరిస్తుంటే.. అమెరికాను ఇరాన్ బెదిరిస్తోంది. తాజా దాడుల నేపథ్యంలో స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్… ఇరాన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఇరాన్ తమ దేశంపై క్షిపణులను ప్రయోగించడం కొనసాగిస్తే.. టెహ్రాన్ తగలబడిపోతుందని హెచ్చరించారు. పౌర నివాసాలపై దాడులు చేసి, వారికి హాని తలపెట్టాలని చూస్తే.. ఆ దేశం తీవ్ర ప్రైణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇరాన్ తన చర్యలతో తన దేశంలోని ప్రజలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో.. ఇరాన్ లోని పలు లక్ష్యాలపై దాడులు చేయడానికి తమ దేశ వైమానిక దళం సిద్ధంగా ఉందని చెప్పిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.. ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా.. ఇరాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ బెదిరింపులు అలా ఉంటే… తాము ఇజ్రాయెల్ పై చేస్తున్న దాడులను ఆపాలని అమెరికా చూస్తే.. ఇజ్రాయెల్ కు సహకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని టెహ్రాన్ హెచ్చరించింది. ఇందులో భాగంగా.. ఇజ్రాయెల్ కు సహకరిస్తే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను, నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. తమపై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ కు సహకరించే ఏ దేశానికైనా ఇవే హెచ్చరికలని తెలిపింది. ఇదే సమయంలో అణు ఒప్పందంపై ఇరాన్‌ కు మరోసారి ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.ఇందులో భాగంగా రోజులు గడిచేకొద్దీ ఇజ్రాయెల్‌ దాడులు మరింత తీవ్రమవుతాయని స్పష్టంచేశారు. అందువల్ల.. పరిస్థితి చేయి దాటకముందే అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. దీనికోసం ఇరాన్‌ కు ఇప్పటికే వరుసగా అనేక అవకాశాలు ఇచ్చామని తెలిపారు. మరోవైపు.. తాము ఇజ్రాయెల్ కు యుద్ధంలో సహకరించడం లేదని చెబుతుండటం గమనార్హం!
👉ఇరాన్ ఇజ్రాయిల్ వార్… ప్రపంచ యుద్ధమే ? ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మొదలైంది. ఇన్నాళ్ళూ పరోక్షంగా సాగిన ఈ యుద్ధం కాస్తా ఇపుడు ప్రత్యక్ష యుద్ధంగా మారింది. ఇజ్రాయిల్ అన్న దేశం ఈ భూభాగం మీద ఉండరాదు అన్న పంతంతో ఇరాన్ వ్యవహరిస్తోంది. ఆ టార్గెట్ లో భాగానే యుద్ధానికి సై అంటోంది. మరో వైపు చూస్తే ఇరాన్ తమకు వ్యతిరేకంగా అణ్వాయుధాలను తయారు చేస్తోంది అన్నది ఇర్జాయిల్ ఆరోపణ. ఆ అణ్వాయుధాలు కనుక ఉగ్రవాదుల చేతులకు చిక్కితే మాత్రం అది కచ్చితంగా ప్రమాదం తమకే అని భావిస్తూ ముందస్తు చర్యలలో భాగంగానే ఇజ్రాయిల్ ఇరాన్ కోని అణు తయారీ స్థావరాల మీద దాడులు చేసింది. అలాగే ఆరుగురు అణు శాస్త్రవేత్తలను ఇరాన్ కీలక నేతలను మట్టుబెట్టింది. అంతే కాదు ఇరాన్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసింది. తమకు ఇరాన్ తో యుద్ధం అంటే దేశాన్ని కాపాడుకోవడమే అని ఇజ్రాయిల్ అంటోంది. నిజానికి ఇజ్రాయిల్ వాదన కూడా కరెక్టే. చుట్టూ ముస్లిం దేశాలు మధ్యలో ఉన్న అతి చిన్న దేశం ఇజ్రాయిల్ అన్నది అందరికీ తెలిసిందే. ఇంతకాలం ఇజ్రాయిల్ చుట్టూ ఉన్న దేశాలలో ఉగ్ర మూకలకు మద్దతు ఇస్తూ ఇజ్రాయిల్ మీదకు ఉసిగొలుపుతూ ఇరాన్ ఆ దేశాన్ని దెబ్బ తీస్తోంది అన్నది ఇజ్రాయిల్ బలమైన ఆరోపణ. అందుకే ఈసారి ఇజ్రాయిల్ తోనే తాము తేల్చుకోవాలని చూస్తోంది. అందుకే రెండు దేశాలు తమ ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధమైపోయాయి. ఈ నేపధ్యంలో అమెరికా, ఫ్రాన్స్ యూకే వంటి దేశాలు ఇజ్రాయిల్ కి ఏ విధంగా మద్దతు ఇచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ అపుడే హెచ్చరికలను జారీ చేసింది అయితే ఎంత ఇరాన్ బయటకు చెప్పినా హెచ్చరించినా ఇర్జాయిల్ వెనక ఉన్నది అమెరికా అన్నాది అందరికీ తెలిసిందే అన్న ప్రచారం ఉంది. ఇంకో వైపు చూస్తే కనుక ఇరాన్ కి ఎవరు సాయం చేస్తారు అంటే రష్యా చైనా అని అంటున్నారు. అయితే రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ తో యుద్ధంతో పూర్తిగా ఇబ్బందులో ఉంది. చైనా తీరు చూస్తే ఎపుడూ తెర వెనక నుంచి సాయమే కానీ తెర ముందుకు వచ్చింది ఉండదు. దాంతో ఇరాన్ కి ఎంత మేరకు ఇతర దేశాల సాయం దొరుకుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఇరాన్ కి మద్దతుగా ముస్లిం దేశాలు అన్నీ ఏకం కావాలని పాకిస్థాన్ ఇప్పటికే పిలుపు ఇస్తోంది. ఇంకో వైపు గల్ఫ్ దేశాల నుంచి ఇరాన్ కి ఏ మేరకు మద్దతు ఉంటుంది అన్నది కూడా చూడాల్సి ఉంది. అలా రెండు వైపుల నుంచి మోహరింపు కనుక ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటే కనుక అది నెమ్మదిగా ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు అని అంటున్నారు. అయితే అంతదాకా పరిస్థితి రాదు అని అంటున్నారు. ఇంకో వైపు ఈ రెండు దేశాలలో విజయం ఎవరిది అన్న చర్చ కూడా ఉంది. ఇరాన్ తమ దేశంలో అంతర్గత సమస్యలతో సతమతం అవుతోంది అని అంటున్నారు. అలాగే గల్ఫ్ దేశాల మధ్య ఆధిపత్య పోరు కూడా ఇరాన్ కి శాపంగా మారవచ్చు అని అంటున్నారు. దాంతో ఇరాన్ కే ఈ యుద్ధం వల్ల నష్టం ఉండొచ్చు అన్నది ఉంది. ఇజ్రాయిల్ తనకు ఉన్న ఇంటెలిజెన్స్ సంపత్తితో ఇప్పటికే ఇరాన్ లోని కీలక ప్రాంతాలను అన్నింటినీ టార్గెట్ చేసింది అని అంటున్నారు. దాంతో ఏ మేరకు ఇరాన్ కి దెబ్బ పడుతుంది అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయిల్ కి ఏమైనా ముప్పు ఉందా అన్న కోణంలో కూడా చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
👉ఉగ్రవాద భావజాలానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయడమే పరిష్కార మార్గం…మాజీ ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు..మార్కాపురం

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మృతి చెందిన 26 కుటుంబాలు బలి కావడం జరిగిందని, ఉగ్రవాద భావజాలానికి మతంతో సంబంధం లేకుండా పిచ్చోడి చేతిలో రాయిలా ఉగ్రవాదులు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉగ్రవాద భావజాలానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడం, ప్రజల కొనుగోలు శక్తి పెంచడం,ప్రజల సమస్యలు సరైన మార్గంలో పరిష్కారం చేయడమే ఉగ్రవాదానికి సరైన మందు అని అన్నారు.శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సమైక్యత సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సదస్సుకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మాజీ జిల్లా కార్యదర్శి పి ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరై ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని, పిచ్చివాడిని చేతుల చేతిలో రాయి చందంగా ఉగ్రవాదులు వ్యవహరిస్తున్నారనీ తెలిపారు.ఉగ్రవాదానికి మతం, కులము ప్రాంతంతో సంబంధం లేదన్నారు.అణచివేయబడిన వారిపై తిరుగుబాటు చేయడం ఉగ్రవాదుల పనిగా మారిందన్నారు. పాకిస్తాన్లో మెజారిటీ మత ఉన్మాదం ఆ దేశ, అదే మతానికి సంబంధించిన అధ్యక్షులను సైతం హతమార్చిన సందర్భాలు ఉన్నాయని,అందుకు బెనజీర్ భుట్టో హత్య నిదర్శనం అన్నారు.జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ప్రజలు సుఖంగా జీవన ప్రమాణాలతో జీవించడం ఉగ్రవాదులకు నచ్చదని అన్నారు. పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ నిర్వహణలో భారత దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం వాటిల్లేలాగా అమెరికా జోక్యం చేసుకొని యుద్ధ విరమణను ప్రపంచానికి వెల్లడించడం భారతదేశ యొక్క స్వతంత్రతను, సార్వభౌమత్వాన్ని చిన్న చూపు చూడటమే అవుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకొని పెద్ద ఎత్తున దేశంలో విష ప్రచారం జరుగుతుందని అన్నారు.కులమత భావాలకతీతంగా అన్ని తరగతుల ప్రజలు ఐక్యంగా జీవించినప్పుడే సమాజం అభివృద్ధి అవుతుందని, భిన్నత్వంలో ఏకత్వం సరిడవిల్లుతుందన్నారు.ఏపీ సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు,న్యాయవాది పిచ్చుక శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని నిర్మూలించబడాలంటే దేశం అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే సాధ్యమ న్నారు.కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
👉 ఏడాదికి రెండు వందల రోజులు పని కల్పించాలి
ఉపాధి కూలీలకు సంవత్సరానికి 200 రోజులు పని దినాలు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కేజీ మస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిదేపి గ్రామంలో ఉపాధి కూలీలు పని వద్దకు వెళ్లి వారి యొక్క స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు ఉపాధి కూలీలకు వేతనాలు 15 రోజుల లోపల ఇవ్వాలి ఆ తర్వాత వడ్డీతో కలిపి ఉపాధి కూలీలు వేతనాలు పంపిణీ చేయాలి ఇది చట్టం చెప్తున్న మాట అది అమలు అయ్యే విధంగా అధికారులు కూడా సహకరించాలని వారికి విజ్ఞప్తి చేశారు సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలి, పలుగు పార తట్ట మెడికల్ కిట్టు టెంటు ఇవ్వాలని చట్టం చెప్తుంది అది అమలు చేసినందుకు అధికారులు కోరుకోవాలని ఆయన కోరారు, రైసింగ్ జిల్లా నాయకులు ముప్పరాజ్ బ్రహ్మయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు ఉపాధి కూలీలు ఐక్యంగా నిలబడి ఉపాధి పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని అన్నారు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అంగలకుర్తి బ్రహ్మయ్య మాట్లాడుతూ ప్లే సిప్లివ్వాలని, 2006వ సంవత్సరంలో ఇచ్చిన పనిముట్లు తప్ప ఇప్పటివరకు పనిముట్లు ఇవ్వలేదని తక్షణమే ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లెక్కిపోగు సామ్యూల్ అంగళకుర్తి ఆశీర్వాదం, అంగళకుర్తి ఆదం తిరుపతి వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య తదిరులు పాల్గొన్నారు
👉 జెసిపి ల ద్వారా ఆక్రమణలు తొలగింపు.పామూరు..
పామూరు పట్టణంలో కొన్ని సంవత్సరాల నుండి ఆక్రమణలు గురికాగా తొలగించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకున్నవి. గత పది రోజుల నుండి పంచాయితీ అధికారులు పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించాలని ఆటో ద్వారా ప్రచారం చేశారు. గడువు ముగించడంతో శనివారం పంచాయతీ కార్యదర్శి, సిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ హైస్కూల్ నుండి కనిగిరి రోడ్డు ఆక్రమణలను జెసిపిల ద్వారా తొలగించి, సైడ్ కాలువల పైన వేసిన బ్రిడ్జిలను పగలగొట్టారు. వాహనాలు పొయ్యేందుకు ఇబ్బందులను పడుతున్న విషయం తెలిసింది. మెయిన్ రోడ్డు, కందుకూరు రోడ్డు, సిఎస్పురం రోడ్డు, సైడ్ కాలంలో పై దుకాణాలు పెట్టుకొని బాడుగులుకి ఇచ్చి వేల రూపాయలు తీసుకుంటున్నారని పంచాయతీ అధికారులు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులపై ప్రైవేటు వారికి ఎలాంటి హక్కు లేదని బాడుగలికిచే హక్కు లేదని అధికారులు హెచ్చరించారు.రోడ్లు విస్తరణ చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. రోడ్డు విస్తరణ చేసిన తర్వాత, ఇలాగే వదిలేస్తారా లేక డబల్ రోడ్డు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తారా లేదా అనే అనుమానం ప్రజల్లో బాగా ఉంది. ఈ విస్తరణ చేయటం స్వచ్ఛందంగా ఎక్కువ మంది తొలగించుకున్నారు.
👉 *డెలివరీ బాయ్ స్కామ్*
మీరు ఆర్డర్ చేయకుండానే మీకు ఆన్లైన్ లో ఆర్డర్ వచ్చిందని డెలివరీ బాయ్ వస్తే ఖచ్చితంగా స్కాం అని గుర్తించండి.
మీకు ఎవరో ఆర్డర్ పంపారు అని మీ మొబైల్ కు వచ్చిన OTP చెప్పమని అడిగితే చెప్పకండి. మీకు తెలియకుండానే మీకు ఎలాంటి ఆర్డర్ రాదు. కాబట్టి అది ఖచ్చితంగా మోసమే అని గ్రహించండి. సైబర్ మోసాలకు ఒక్క అడుగు దూరంగా ఉండండి.*అన్నమయ్య పోలీస్*
👉మాగంటి గోపినాథ్ మరణం చాలా బాధాకరం*
ఆయనతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది*
*మాగంటి కుటుంబానికి ఎమ్మెల్యే పరిటాల సునీత పరామర్శ..*హైదరాబాద్ లోని మాగంటి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే సునీత*

సినీ నిర్మాత, హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ శాసభసభ్యుడు మాగంటి గోపినాథ్ మృతి చాలా బాధాకరమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. గత వారంలో అనారోగ్యానికి గురై మరణించిన నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన నివాసానికి ఎమ్మెల్యే సునీత వెళ్లారు. అయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారని ఈ సందర్భంగా సునీత అన్నారు.సినీ నిర్మాతగా ఆయన పేరు గడించారని స్వతహాగా ఎంతో మంచి వ్యక్తిగా,అందరితో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేకించి మా కుటుంబంతో మాగంటికి ఎంతో అనుబంధం ఉందన్నారు. తమ కుటుంబంలో జరిగిన శుభాకార్యాలకు హాజరయ్యారని సునీత అన్నారు. ఎప్పుడు కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలుకరించే వారన్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే సునీత ఆకాంక్షించారు.

👉నీట్ లో అర్హత సాధించిన 143 మంది గురుకుల విద్యార్థులు.. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి స్వామి మాట్లాడారు.ఎంబీబీఎస్ లో 32 మంది విద్యార్థులకు సీట్లు దక్కే అవకాశం ..దేశ స్థాయి పరీక్షలో గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారు.గురుకులాల్లో జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లు 3 నుంచి 10 కి పెంచాం ..పేదింటి బిడ్డలు డాక్టరు, ఇంజనీర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు స్వప్నం..నాడు జగన్ నాన్నకు ఇంధనం పేరుతో నకిలీ మద్యంతో పేదల నుంచి వేల కోట్లు దోపిడి చేస్తే
నేడు చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పేరుతో పేద విద్యార్థులకు రూ.10 వేల కోట్లు ఇచ్చారు..డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి..
👉 ఉర్దూ ఎస్జిటి ల కౌన్సిలింగ్ లో అంతరాయం
ఉమ్మడి ప్రకాశం జిల్లా కు చెందిన ఎస్.జి.టి (ఉర్దూ) (జడ్పీ/ఎంపీపీ మేనేజ్మెంట్) 56 పోస్టుల బదిలీలకు సంబంధించి ఆదివారం నాడు కొంత అంతరాయం చోటుచేసుకుంది. సీనియరిటీ లిస్టు 6 లో కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న షేక్ మహమ్మద్ ఇక్బాల్ భాషా (ఎన్ సి సి) కంపల్సరీ కోటా కు బదులు గా రీ అపోర్షన్ కేటగిరి మార్కులతో (40.55)దరఖాస్తు చేసుకున్నారు.ఈ అంశాన్ని గుర్తించిన పిఆర్టియు నాయకులు అభ్యంతరం లేవనేత్తడం తో  ఉదయం 10 గంటలకు ప్రారంభించవలసిన కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. సమస్యను విద్యా శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన అనుమతి తో కౌన్సిలింగ్  నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాకాధికారి ఎ కిరణ్ కుమార్  ప్రకటించారు. కాగా నిబంధనలు ప్రకారం రీ అపోర్షన్ వర్తించని ఎస్ జి టికి  అదనపు మార్కులు వేసిన ఎంఇఒ చర్యలు పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 1. 15 గంటలకు కమిషనర్ నుంచి ఇక్బాల్ ను ప్రభుత్వ నిబంధనల కనుగుణంగా అనుమతించాలన్న ఆదేశాల కనుగుణంగా ఉపాధ్యాయ సంఘాల నేతలతో తో చర్చించి మధ్యాహ్నం 1.15 గంటలకు కౌన్సిలింగ్ ప్రారంభించారు.
👉104 ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి: సిఐటియు. గత రెండు మెల్లగా 104 ఉద్యోగుల చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సిఐటియు నాయకులు కాలం సుబ్బారావు అన్నారు. ఆదివారం ఒంగోలు సీఐటీయూ ఆఫీస్ లో 104ఎం.ఎం.యు ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాసరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న గౌరవాధ్యక్షులు కాలం సుబ్బారావు మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ లో 104 సర్వీస్ లను గతం లో అరబిందో యాజమాన్యం నిర్వహించేదని ఈ సంస్థ రెండు నెలలు గా వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల కు రావాల్సిన బకాయి వేతనాలు, ఇతర బకాయిలు (ఇఎల్,గ్రాట్యుటీ )చెల్లించాలన్నారు. ప్రస్తుతం 104 సర్వీస్ లు నిర్వహిస్తున్న భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కూడా ఉద్యోగులకు ప్రతీ నెల వేతనాలు చెల్లించాలని జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానాల్లో సీనియారిటీ ప్రకారం బదిలీలు చేసి మిగతా స్థానాల్లో కొత్త నియామకాలు జరపాలన్నారు.2020జులై లో విధుల్లో చేరిన ఉద్యోగులకు కూడా స్లాబ్ సిస్టమ్ అమలు చేయాలని,
గత ఐదు సంవత్సరాలనుండి మరమ్మతులకు నోచుకోని వాహనాలను వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. ప్రస్తుత యాజమాన్యం గా వున్నా భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ప్రతీ నెల అన్నీ జిల్లాలో కూడా గ్రేవెన్స్ మీటింగ్ నిర్వహించి సమస్యలు పరిస్కారం కి చొరవ తీసుకోవాలన్నారు. అదే విదంగా 104 వాహనాల్లో క్షయ పరీక్షలు కి సంబదించిన నమూనాలు రవాణా మంచిది కాదని, వాహనాల్లో గర్భిణీ స్త్రీలను పరీక్షలు చేస్తున్నారని, చాలా చోట్ల ఆరోగ్య కేంద్రాలు లేని చోట సిబ్బంది కూడా వాహనాల్లో సేవలు కొనసాగిస్తున్నారని ఇది చాలా ప్రమాదకరం అన్నారు. ప్రభుత్వం పునరాలోచించికోని దీనిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. ఈ విషయాలు మీద రాష్ట్ర ప్రభుత్వం మరియు గత, ప్రస్తుత యాజమాన్యం వారు చర్యలు తీసుకోవాలని, ఎ.పి 104 ఎం.ఎం.యు ఎంప్లాయిస్ యూనియన్ గా తెలియజేస్తున్నామన్నారు కార్యక్రమంలో భారీ సంఖ్యలో 104 ఉద్యోగులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..