👉ఎర్రజెండా ఎగురవేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ తో ఇక పెద్ద యుద్ధమే..👉 విమాన ప్రమాదం వెనక అసలు విషయాలు ఇవేనా ?..👉 టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ *..మట్కా బిటర్ల అరెస్ట్.. కడప జీల్లా ప్రొద్దుటూరు

👉👉ఎర్రజెండా ఎగురవేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ తో ఇక పెద్ద యుద్ధమే తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. తమ శత్రుదేశమైన పాలస్తీనాకు సహాయం చేస్తోందని, తమపై కుట్రలకు పాల్పడుతోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ప్రస్తుతం ప్రపంచంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం వల్ల వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ దారుణం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా మదిలో ఉండగానే, ఇటీవల అమెరికా సిరియాపై బాంబుల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనాపై, దాని శత్రు దేశాలపై ఒక్కసారిగా విరుచుకుపడింది. పాలస్తీనాకు సహాయం చేస్తున్న ఇతర దేశాలపై కూడా తీవ్రస్థాయిలో బాంబుల వర్షం కురిపించింది. హమాస్ ఉగ్రవాదులపై కూడా విరుచుకుపడి బీభత్సంగా దాడులు చేస్తూ మట్టుబెడుతోంది. తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. తమ శత్రుదేశమైన పాలస్తీనాకు సహాయం చేస్తోందని, తమపై కుట్రలకు పాల్పడుతోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ కారణంతోనే ఇరాన్‌పై దాడులు చేసింది. ఇరాన్‌లోని ప్రధాన నగరాలపై ఇజ్రాయెల్ డ్రోన్‌ల సహాయంతో దాడులు చేసి, క్షిపణులను ప్రయోగించి భారీ స్థాయిలో నష్టం కలిగించింది. ఇది ఇరాన్ దేశానికి తీవ్రస్థాయిలో నష్టం కలగజేసింది. దీంతో ఇరాన్ తీవ్రంగా స్పందించడానికి సిద్ధమవుతోంది. ఇటీవల ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా గట్టి కౌంటర్ ఇవ్వాలని ఇరాన్ భావిస్తోంది. ఇందులో భాగంగానే జంకరన్ మసీదు మీద ఎరుపు రంగు జెండా ఎగురవేసింది. తీవ్ర స్థాయిలో దుఃఖం, ప్రతీకారం వంటి సంకేతాలను బలంగా చూపించడానికి ఇటువంటి జెండాలను ఎగరవేస్తారు. ఒక రకంగా ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ ఇలాంటి ఎరుపు రంగు జెండా ఎగురవేసిందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సైన్యం పరంగా చూసుకుంటే ఇరాన్ కంటే ఇజ్రాయెల్ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, వారు యుద్ధ రంగంలోకి దిగితే భీకరంగా దాడులు చేస్తారు. ఇటీవల సిరియా, హమాస్ ఉగ్రవాదులకు ఈ అనుభవం ఎదురైంది. పైగా హమాస్ ఉగ్రవాదులను ఇరాన్ భూభాగంలోనే ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఈ రకంగా చూస్తే ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ దేశానికి తీవ్రమైన ప్రతిఘటన తప్పదని తెలుస్తోంది. దీనికి తోడు అత్యంత పటిష్టమైన గగనతల రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ కలిగి ఉంది. అలాంటప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఎలాంటి దాడులు చేస్తుందనేది చూడాల్సి ఉంది. దీనిని ఇజ్రాయెల్ ఏ విధంగా అడ్డుకుంటుంది అనేది కూడా గమనించాల్సి ఉంది. మొత్తానికి మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
👉 విమాన ప్రమాదం వెనక అసలు విషయాలు ఇవేనా ? ప్రస్తుతం విమాన ప్రమాదం గురించి ప్రజాల్లో అనేక అపోహలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఎందుకు ప్రమాదానికి గురి అయింది అన్నది ఇంకా ఎవరికీ తెలియడం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయి దర్యాప్తు లోతుగా జరగాల్సి ఉంది. అయితే ఈలోగా నిపుణుల నుంచి మేధావుల వరకూ ఏ విధంగా ప్రమాదం జరగవచ్చు అన్న దాని మీద తమకు ఉన్న అవగాహనతో అంచనాలు వేసి వివరిస్తున్నారు. ఇక అదే విభాగానికి చెందిన నిపుణులు కానీ అధికారులు కానీ చెప్పే విషయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. అంతే కాదు ఆ విధంగా జరిగే అవకాశాలు హెచ్చుగా ఉండొచ్చు అన్నది కూడా అనిపిస్తుంది. తెలంగాణాకు చెందిన ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి అయితే అహ్మదాబాద్ లో కుప్పకూలిన విమానం వెనక ప్రమాదానికి దారి తీసిన విషయాలు గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విమాన ప్రమాదం గురించి ప్రజాల్లో అనేక అపోహలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే విమానాలలో ఉండే సాంకేతికత భద్రతా ప్రమాణాల గురించి తాను స్పష్టత ఇవ్వదలచుకున్నట్లుగా వెల్లడించారు. ఇక విమానాల్లో రెండు ఇంజన్లు ఉంటాయి. ఒకటి ఆగిపోతే మరొకటి పనిచేస్తుంది అన్నది కరెక్ట్ కాదని ఆయన అన్నారు. రెండూ ఒకేసారి పనిచేస్తాయని ఆయన చెప్పారు అంతే కాదు టేకాఫ్ కి ముందు రెండు ఇంజన్లను పరిశీలించిన మీదటనే రన్ వే మీదకు అనుమతి ఇస్తారని ఆయన వివరించారు. ఇక విమానం గాలిలో ఉన్నపుడు ఇంధనం బ్లాక్ అయితే ప్రమాదం జరుగుతుంది అన్నది కూడా ఒక తప్పుడు అభిప్రాయం అన్నారు. అలా బ్లాక్ ఏర్పడినా మిగిలిన ఇంధనంతో ఆ విమానం క్షేమంగా తిరిగి ఎయిర్ పోర్టుకు చేరుకుంటుందని అంతే కాదు సురక్షింతంగా ల్యాండ్ అవుతుందని అన్నారు. అదే విధంగా చూస్తే పక్షులు ఢీ కొట్టడం వల్ల ప్రమాదం జరగడం అన్నది కూడా కాదని చెప్పారు అలాగైతే విమానాశ్రయాలలో పక్షుల సంచారం అన్నది ఎపుడూ ఉండేదే అని అంటున్నారు. ఇక రెండు ఇంజన్లలోకి ఒకేసారి రెండు పక్షులు ప్రవేశించడం అరుదైన ఘటన అని అత్యంత అసాధారణ ఘటన కూడా అని ఆయన అన్నారు. అందువల్ల అలా జరగడానికి కూడా వీలు తక్కువ అని చెప్పారు. మేడే సిగ్నల్ ఇవ్వడం విమానం అత్యంత ప్రమాదంలో ఉనని చెప్పడమే అన్నారు. అయితే అలాంటి సందర్భాలలో సైతం విమానాలు ప్రమాదాల నుంచి బయటపడిన ఘటనలు ఎన్నో ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే అహ్మదాబాద్ దుర్ఘటన కేవలం నలభై సెకండ్లలోనే జరిగిపోయింది అని అన్నారు. దీని వల్ల పైలెట్ కి విమానాన్ని నియంత్రించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది అని అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రమాదం జరగడానికి ఒక కారణాన్ని ఆయన అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. విమానం టేకాఫ్ తీసుకుని పైకి ఎగిరే సమయంలో భూమి మీద కొన్ని వందల అడుగుల వరకూ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. దానిని అధిగమించి విమానం ముందుకు పైకి సాగుతుంది. అలా గురుత్వాకర్షణ శక్తిని అధిగమించేలా దానిని వ్యతిరేకంగా పనిచేసేలా ఒక టెక్నాలజీ ప్రతీ విమానంలో ఉంటుంది. బహుశా అది ఫెయిల్ కావడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించి ఉండొచ్చు అని ఆయన అంటున్నారు. సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదం చూసినపుడు ఆయన అంచనాలలే కరెక్ట్ అన్న భావన ఏర్పడుతోంది. అంతే కాదు విమాంలో ఉండే వింగ్ బ్లేడ్స్ కూడా విమాన స్థిరత్వానికి ఒక ఆయుధంగా పనిచేస్తాయి ఆయన అంటున్నారు ఇందులో ఏ ఒక్క వింగ్ బ్లేడ్ పనిచేయకపోయినా కూడా విమానం ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. అంటే ఇది కూడా ఏమైనా కారణం అవుతుందా అన్నది ఆయన మాటలను బట్టి ఆలోచిచుకోవాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ అతి పెద్ద విమాన ప్రమాదం మాత్రం ఎన్నో సవాళ్ళను ప్రశ్నలను కళ్ళ ముందు ఉంచింది. దర్యాప్తులోనే జవాబులు కొన్ని అయినా దొరుకుతాయని అంటున్నారు.
👉 టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌
ఏడాది పాలనపై నేతలతో చర్చించిన చంద్రబాబు
ఈనెల 23 నుంచి నెల రోజులు తొలి అడుగు కార్యక్రమం
నిబద్ధత కలిగిన నేతలతో పార్టీ కమిటీలు-చంద్రబాబు
జూలైలో పార్టీ నేతలు, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణ
ఎమ్మెల్యేలు రోజూ కొంత సమయం పార్టీకి కేటాయించాలి
వచ్చే వారం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తాం

ఒకే నెలలో రెండు పథకాలు అమలు చేస్తున్నాం-చంద్రబాబు
👉సోమవారం లోపు తల్లికి వందనం డబ్బులు మీ ఖాతాలో జమ కాకపోతే,*మీ సచివాలయంలో ఎంక్వైరీ చెయ్యండి,జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం.*
👉కూటమి విజయాలు, నెరవేర్చిన హామీలు ప్రజలకి వివరించండి..టీడీపీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు వెల్లడి.- తల్లికి వందనంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు..ఐటీ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్.- 1,450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.1,052 కోట్లతో టెండర్లు పిలవడానికి..సీఎం చంద్రబాబు అధ్యక్షతన 49 వ సీఆర్డీఏ సమావేశం ఆమోదం తెలిపింది- తల్లికి వందనం పథకం అమలు జరుగుతున్న తీరుపై ఆర్థికశాఖమంత్రి పయ్యావుల కేశవ్ తో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష. తల్లికి వందనంతో లక్షల కుటుంబాల్లో వెలిగిన ఆశల దీపం..సీఎం చంద్రబాబుకు తల్లుల కృతజ్ఞతలు..
👉 మట్కా బిటర్ల అరెస్ట్.. కడప జీల్లా* ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవ్ నగర్ కాలనీ ఏరియాలో ఎనిమిది మంది మట్కా బిటర్లను అరెస్ట్ చేసి వారి వద్ద 5400/- నగదు మరియు ఈ మట్కా జూదం ఆడుతున్నటువంటి పది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది.ఈ మట్కా జూదం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు అయినటువంటి బండారు శ్రీనాథ్ ను మరియు అతనికి ఈ మట్కా జూదం ఆడటంలో సహాయపడుతున్న మిగిలిన ఏడు మంది సహ బీటర్లు అందరూ కూడా సంజీవనగర్, వివేకానంద నగర్ వంటి వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వారే. వీరందరికీ కూడా ఇదివరకు మట్కా జూదం వలన జరిగే నష్టాన్ని కూడా కౌన్సిలింగ్ ద్వారా వీరికి వివరించడం అయినది అయినప్పటికీ వీరు ఈ వెనుకబడిన ప్రాంతంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయడం వలన ప్రజలు ఇంకా భారీగా నష్టపోతున్నారు కాబట్టి ప్రొద్దుటూరు ప్రాంతవాసుల అందరికి కూడా ప్రొద్దుటూరు పోలీసు వారి తరఫున విన్నవించుకోవడం ఏమనగా దయచేసి ఈ మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరుచున్నాము.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..