👉 భారత్ కు బిగ్ షాక్ ఇచ్చిన పాకిస్థాన్, అమెరికా..? ఆ నరరూప రాక్షసుడికి అమెరికా ఘన స్వాగతం..!

భారత్ కు అమెరికా, పాకిస్థాన్ బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ను అమెరికా 250వ ఆర్మీ పరేడ్ కు ఆహ్వానించినట్లు సమాచారం అందుతోంది. జూన్ 14 న జరగనున్న ఈ ఆర్మీ పరేడ్ లో అసిమ్ మునీర్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీనిపై అమెరికా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది భారత ప్రభుత్వం. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 200 మందికిపైగా ఉగ్రవాదులు హతం అయినట్లు కేంద్ర రక్షణశాఖ పేర్కొంది.
అనూహ్య నిర్ణయం..!
👉అణుచర్చల్లో బిగ్ ట్విస్ట్-ఇరాన్ దెబ్బకు తోకముడిచిన ట్రంప్ ! అనూహ్య నిర్ణయం..!”
అయితే మే 8 అర్ధరాత్రి నుంచి 11 వరకు సాగిన ఆపరేషన్ సిందూర్.. ఎట్టకేలకు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన ద్వారా నిలిచిపోయింది. పాక్ ఏమైనా తోక జాడిస్తే.. మరోసారి దాడులు చేస్తామని భారత్ హెచ్చరించింది. ఈ క్రమంలో భారత్- పాకిస్థాన్ ల మధ్య సంధి.. తానే కుదిర్చానని అణు యుద్ధాన్ని ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటూ తిరిగారు. ఆయన ఏ దేశంలో పర్యటించినా.. లేదా ఏ దేశాధిపతులు అమెరికా గడప తొక్కినా ఇదే విషయం ప్రస్తావిస్తూ వచ్చారు.
ఈ క్రమంలో ట్రంప్ వైఖరిని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చాలా సార్లు ప్రపంచ దేశాల వేదికగా ఖండించారు. ట్రంప్ జోక్యం లేదని.. పాకిస్థాన్ ప్రాధేయపడితే కనికరించి వదిలేశామని జై శంకర్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో భారత్ పై అక్కసు వెల్లగక్కుతూ వచ్చింది అమెరికా. ఇటీవల యాపిల్ ఐ ఫోన్ తయారీ పరిశ్రమను సైతం భారత్ కు రాకుండా ట్రంప్ కాళ్లు అడ్డం పెట్టారు. యాపిల్ సంస్థకు అమెరికా రాయితీలు ఇస్తుందని ప్లాంట్స్ ఇక్కడే ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేసి భారతీయుల ఆగ్రహానికి గురయ్యారు ట్రంప్.
ఇదిలా ఉంటే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుని తన వక్రబుద్దిని చాటుకుంది అమెరికా. పాకిస్థాన్ లోని నరహంతకుడు, పహల్గాం ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు అమెరికా ఆహ్వానం పంపినట్లు సమాచారం. జూన్ 14న అమెరికాలో జరగనున్న 250వ ఆర్మీ పరేడ్ దినోత్సవానికి అసిమ్ మునీర్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
అమెరికా ఆర్మీ 1775, జూన్ 14న ఏర్పడింది. ఈ సందర్భంగా జూన్ 14న 250వ ఆర్మీ పరేడ్ నిర్వహించనుంది అమెరికా సర్కార్. అయితే ఈ పరేడ్ కు అన్ని దేశాల ఆర్మీ చీఫ్ లను ఆహ్వానించాలని అమెరికా భావించిందట. కానీ భారత ఆర్మీ చీఫ్ కు మాత్రం ఇంతవరకూ ఆహ్వానం రాకపోవడం గమనార్హం. ఇక మరోవైపు అసిమ్ మునీర్ ను అమెరికా ఆహ్వానించడంపై పాకిస్థాన్ లోని పీటీఐ పార్టీ ఆందోళనలు చేపట్టింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పీటీఐ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలు తెలిపింది.
👉ఇరాన్‌తో భగ్గుమన్న ఉద్రిక్తతలు.. అమెరికా సంచలన నిర్ణయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. “అదో ప్రమాదకరమైన ప్రాంతం” అని పేర్కొన్న ట్రంప్, తమ సైనిక కుటుంబాలను , దౌత్య సిబ్బందిని అక్కడి నుండి తరలిస్తున్నామని తెలిపారు. వారికి ఆ ప్రాంతాన్ని వీడాలని నోటీసులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. “అది ప్రమాదకరమైన ప్రాంతం. మా సైనిక కుటుంబాలను, దౌత్య సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నాం. ఆ ప్రాంతాన్ని వీడాలని వారికి నోటీసులు జారీ చేశాం. ఏం జరుగుతుందో చూడాలి” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఉద్రిక్తతలు తగ్గాలంటే ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని ఆయన హెచ్చరించారు. అణు చర్చలు విఫలమైతే, ఇరాన్‌పై దాడులు చేస్తామని ట్రంప్ పదేపదే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఓ ఇంటర్వ్యూలో కూడా యురేనియం శుద్ధి చేయడాన్ని టెహ్రాన్ ఆపేస్తుందనే నమ్మకం తనకు లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమపై దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదే హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో యూఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో తమ సిబ్బందిని ఎక్కడికీ తరలించడం లేదని పేర్కొంది. అయితే, కువైట్ అధికారులు మాత్రం దీనికి భిన్నంగా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో అత్యవసరం కాని అమెరికా సిబ్బంది ఆ ప్రాంతాన్ని వీడాలని కోరింది. ఇదిలావుండగా ఇరాన్‌తో అణుఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఉన్నతస్థాయి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఆ చర్చలు విఫలం అయినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోందని పలు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
👉తాడేపల్లి పోలీసు స్టేషన్ లో వైసీపీ నేత సజ్జల
రామకృష్ణా రెడ్డి పై ఫిర్యాదు …
రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపద్యం లో చర్యలు తీసుకోవాలని దళిత యువజన జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్
కంభం పాటి శిరీష ఫిర్యాదు .
👉 ఒకే బిడ్డ ఉన్న తల్లులు 18,55,760 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లులు 14,55,322 మందికి, ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులు 2,10,684 మందికి, నలుగురు పిల్లలు ఉన్న తల్లులు 20,053 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం….
*ఇచ్చిన మాట ప్రకారం 67,27,164 మంది పిల్లలకి తల్లికి వందనం*
👉 తెలుగుదేశం జనసేన పార్టీ 2029లో కలిసి పోటీ చేస్తే 50% పైన ఓట్లు వస్తాయి అందువల్ల వైకాపా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. 50 శాతం పైన ఓట్లు వస్తే కనీసం 145 నుంచి 155 సీట్లు తప్పకుండా ఈ కూటమికి
వస్తాయి. 2029 లోపల వైఎస్ జగన్ మీద ఇప్పుడున్న ఈడి సిబిఐ 22 కేసు లో శిక్ష పడి డిస్క్ క్వాలిఫై అయితే అరెస్ట్ అయి జైలుకు పోకపోయినా తదుపరి విచారణ కోసం హైకోర్టు సుప్రీంకోర్టులో దాదాపు పది సంవత్సరాలు డిస్క్ క్వాలిఫై అయిపోయి శాసనసభకు పోటీ చేసే అవకాశం 10 సంవత్సరాల్లో ఉండకపోవడం వల్ల ఆయన ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలే లేవు.
నేను 2014-19 ఏది చెప్పినా వైసీపీ వాళ్లు దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లేవారు.. కానీ టీడీపీ వాళ్ళు నేను చెప్పినవి ఎక్కడా ప్రచారం చేయరు.. అందువలనే జగన్ ఇక జన్మలో సీఎం కాడు అన్న విషయం ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు.
👉 మీరు “తల్లికి వందనం” పథకం 2025 లబ్ధిదారుల జాబితాలో లేరని చూపిస్తే, మీరు ఈ క్రింది చర్యలు తీసుకోవచ్చు:
* అనర్హతకు కారణం తెలుసుకోండి:
* మీరు ఎందుకు చేర్చబడలేదో తెలుసుకోవడానికి మీ గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. వారు మీకు కారణాన్ని తెలియజేయాలి.
* “తల్లికి వందనం” పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వాటిని ఒకసారి సరిచూసుకోండి. సాధారణంగా అర్హత లేకపోవడానికి కొన్ని కారణాలు:
* కుటుంబ వార్షిక ఆదాయం నిర్దేశిత పరిమితిని మించడం. * విద్యార్థికి 75% హాజరు లేకపోవడం.
* తల్లి పేరుపై బ్యాంకు ఖాతా లేకపోవడం లేదా NPCI లింక్ కాకపోవడం.* హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో తల్లి లేదా పిల్లల వివరాలు నమోదు కాకపోవడం.
* కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి, ప్రజా ప్రతినిధి, ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉండటం.
* మూడు ఎకరాలకు మించి మాగాణి భూమి లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండటం.
* కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం (ట్రాక్టర్లు, ఆటోలు మినహా) ఉండటం.
* నెలవారీ కరెంట్ వినియోగం 300 యూనిట్లు దాటడం. * 1000 చదరపు అడుగులకు మించి ప్రాపర్టీ ఉండటం.
* ఫిర్యాదు / గ్రీవెన్స్ పెట్టుకోండి:
* అర్హత ఉండి కూడా జాబితాలో మీ పేరు లేకపోతే, మీరు అభ్యంతరం లేదా ఫిర్యాదు పెట్టుకోవచ్చు (గ్రీవెన్స్).
* గ్రామ/వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించడానికి అవకాశం కల్పిస్తారు.
* ప్రభుత్వం జూన్ 20, 2025 వరకు ఫిర్యాదులను స్వీకరించి, జూన్ 30, 2025 న తుది జాబితాను విడుదల చేస్తుందని ప్రకటించింది. కాబట్టి, మీకు అవకాశం ఉంది.
* మీరు మీ దరఖాస్తును మళ్లీ సమర్పించవలసి రావచ్చు, లేదా మీ అర్హతను రుజువు చేసే అదనపు పత్రాలను సమర్పించవలసి రావచ్చు.
* అవసరమైన పత్రాలు సరిచూసుకోండి:
* మీరు దరఖాస్తు చేసినప్పుడు సమర్పించిన పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి తనిఖీ చేసుకోండి.
* తల్లి మరియు పిల్లల ఆధార్ కార్డులు.
* తల్లి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతా, అది ఆధార్ మరియు NPCI తో లింక్ అయి ఉండాలి (ఇది చాలా ముఖ్యం). * కుటుంబ ఆదాయ ధృవపత్రం.
* విద్యార్థి యొక్క హాజరు శాతం వివరాలు.
* రేషన్ కార్డు. * బర్త్ సర్టిఫికెట్ (పిల్లలది).
* హౌస్‌హోల్డ్ డేటాబేస్ & eKYC:
* తల్లులు మరియు వారి పిల్లల వివరాలు హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో నమోదు అయి ఉండాలి.
* తల్లి యొక్క eKYC తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. ఇది పూర్తి చేయకపోతే పథకం లబ్ధి చేకూరదు. ఇది మీ దగ్గరలోని గ్రామ/వార్డు సచివాలయంలో లేదా మీసేవ కేంద్రంలో చేసుకోవచ్చు.
ముఖ్య గమనిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హత ఉండి అనర్హత జాబితాలో పేర్లు ఉన్న వారికి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. కాబట్టి, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అవసరమైతే, పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కూడా సంప్రదించవచ్చు.
👉ఒడిశాలో కులాంతర వివాహం..40 మందికి శిరోముండనం..
గోరఖ్‌పూర్ : ఒడిశాలోని రాయగడ జిల్లా, కాశీపూర్ సమితి పరిధిలో అమానవీయమైన ఘటన చోటుచేసుకుంది. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు యువతి కుటుంబంలోని దాదాపు 40 మంది పురుషులు శిరోముండనం చేయించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరఖ్‌పూర్ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ అమ్మాయి, షెడ్యూల్డ్ కులానికి చెందిన అబ్బాయినీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే, యువతి తరపు వారు ఈ వివాహానికి అంగీకరించక పోవడంతో ఇద్దరూ మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసేసుకున్నారు.పెళ్లి చేసుకున్న జంట గ్రామానికి రావడంతో విషయం తెలిసిన పెద్దలు గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి కుటుంబ సభ్యులను గ్రామ బహిష్కరణ చేశారు.దీని నుంచి తప్పించు కోవాలంటే శిక్షగా గుండు చేసుకుని,మూగ జీవాలను బలిచ్చి,కొత్త జంటకు పెద్ద కర్మ చేయాలని గ్రామ పెద్దలు ఆదేశించారు. దీంతో యువతి తరపు కుటుంబ సభ్యులతో పాటు బంధువుల్లో 40 మంది పురుషులు గుండు చేయించుకుని మేక,గొర్రె,కోడి,పావురాలను బలి ఇచ్చి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే,ఆ యువతి, యువకుడికి పెద్దకర్మ కూడా చేశారు.ఇక ఈ ఘటనపై పోలీసులను ప్రశ్నించగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలియజేశారు
👉 భారత్ కు బిగ్ షాక్ ఇచ్చిన పాకిస్థాన్, అమెరికా..? ఆ నరరూప రాక్షసుడికి అమెరికా ఘన స్వాగతం..*అణు చర్చల్లో బిగ్ ట్విస్ట్-ఇరాన్ దెబ్బకు తోకముడిచిన ట్రంప్ ! ..👉ఇరాన్‌తో భగ్గుమన్న ఉద్రిక్తతలు.. అమెరికా సంచలన నిర్ణయం..*వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి పై ఫిర్యాదు …*”తల్లికి వందనం” పథకం 2025 లబ్ధిదారుల జాబితాలో లేరని చూపిస్తే ఇలా చేయండి..👉ఒడిశాలో కులాంతర వివాహం..40 మందికి శిరోముండనం..
Recent Posts

