👉 రాహుల్ జగన్ లను ఈవీఎంలు కలుపుతాయా ? ఎవరికి ఎవరూ మిత్రులు కాదు, శత్రువులూ కానే కాదు ఆ మాటకు వస్తే వైసీపీ ఏపీలో ఇపుడు తటస్థంగా ఉంది. ఎవరి ఏ దారిలో ఉన్నా రాజకీయ గోదావరి అందరినీ కలుపుతుంది. ఇది పొలిటికల్ రూల్. రాజకీయాలు ఎపుడూ అవసరాల మీద ఆధారపడి సాగుతాయి. ఎవరికి ఎవరూ మిత్రులు కాదు, శత్రువులూ కానే కాదు ఆ మాటకు వస్తే వైసీపీ ఏపీలో ఇపుడు తటస్థంగా ఉంది. ఆ పార్టీ బీజేపీకి దగ్గర కాదు, దూరం ఉందా అంటే కాలం చెప్పాలి. మరో వైపు చూస్తే దేశంలో ఎన్డీయే ఇండియా కూటములు రెండూ ఉన్నాయి.

ఈ రెండు కూటములలో చేరని పార్టీలు బీఆర్ఎస్ బీజేడీ, వైసీపీ వంటివి ఉనాయి. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రత్యర్ధి. బీజేపీ అధికారం కోసం తమతో పోటీ పడుతున్న ప్రత్యర్ధి. అందువల్లనే బీజేపీ తటస్థ వైఖరిని ఎంచుకుంది. అది అనివార్యమైంది. ఇక ఒడిషాలో చూస్తే బీజేడీకి ఇలాంటి సీన్ ఉంది. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ బీజేపీడి గట్టి ప్రత్యర్ధి. తమతో అధికారం కోసం పోటీ పడుతున్న కాంగ్రెస్ మరో ప్రత్యధి. అందుకే నవీన్ పట్నాయక్ కూడా జాతీయ స్థాయిలో న్యూట్రల్ స్టాండ్ కొనసాగిస్తున్నారు. ఆయనది కూడా అనివార్యమైన పరిస్థితే. కానీ ఏపీలో వైసీపీది మాత్రం విచిత్రమైన పరిస్థితి. ఆ పార్టీకి ఏపీలో బీజేపీ డైరెక్ట్ గానే ప్రత్యర్ధి. ఎలాగంటే ఏపీలో టీడీపీ జనసేనలతో కలసి ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో ఉంది. ప్రతిపక్షంలో వైసీపీ ఉంది. పోటీగా మరో పార్టీ సమీపంలో కూడా లేదు. కాంగ్రెస్ అయితే ఉనికి పోరాటం చేస్తోంది. దాంతో వైసీపీకి కాంగ్రెస్ వంటి పార్టీతో చేతులు కలపడం వల్ల రాజకీయ లాభమే తప్ప నష్టం అయితే ఏ కోశానా లేదు. ఇక మూడు పార్టీలతో బలంగా ఉన్న టీడీపీ కూటమిని ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో చేరడమే వైసీపీకి ఉత్తమమైన మార్గం అని అంటున్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు యాంటీగా ఇండియా కూటమితో పాటే వైసీపీ ఓటు చేసింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే విధానాలలో చాలా వాటిని వ్యతిరేకిస్తోంది. ఇక మైనారిటీలు, దళిత్స్ ఇతర బలహీన వర్గాలు ఇండియా కూటమికి ఓటు బ్యాంక్ అయితే వైసీపీకి వారే అండగా ఉంటున్నారు. కేంద్రంలో బీజేపీ ఎన్డీయే పాలిత రాష్ట్రాలలో ప్రత్యర్ధులను ఏదో కేసులలో ఇరికిస్తోంది అని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. ఏపీలో వైసీపీ నేతల మీద వరస కేసులు ఎన్డీయే కూటమి ప్రభుత్వం పెట్టి గత ఏడాదిగా ఇబ్బంది పెడుతోంది. మరో వైపు చూస్తే ఈవీఎంలతో పాటు వ్యవస్థలను మేనేజ్ చేసి 2024 ఎన్నికల్లో గెలిచారు అన్నది వైసీపీ నేతల ఆరోపణ. అవే ఆరోపణలను రాహుల్ గాంధీ కూడా చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో రాసిన వ్యాసంలో ఇదే విషయం మీద తీవ్ర విమర్శలు చేశారు. గత ఏడాది నవంబరులో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై రాహుల్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం నియామక ప్యానెల్‌ను తారుమారు చేయడం, ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్లను చేర్చడం, ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచి చూపడం, దొంగ ఓటింగ్ వంటి వాటిని పేర్కొంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కారణాల వల్లనే కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం పాలైందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం సంతకం లేని నోట్స్ విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా సందేహాల నివృత్తికి ఏకంగా బూత్‌ల సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్ ఆరోపణలను పూర్తిగా కొట్టేసింది. పోలింగ్ సమయంలో గానీ, ఆ తర్వాత జరిగిన పరిశీలనలో గానీ కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీ ఏజెంట్ల నుంచి కూడా తీవ్రమైన ఫిర్యాదులు రాలేదని ఈసీ స్పష్టం చేసింది. అయితే రాహుల్ సీసీ ఫుటేజ్ డిమాండ్ మీద మాత్రం స్పందించడం లేదు. ఇక హర్యానా ఎన్నికల వేళ కూడా రాహుల్ ఇదే రకమైన ఆరోపణలు చేశారు వైసీపీ కూడా ఈ విధంగానే మాట్లాడుతూ వస్తోంది. మరి ఒక రకమైన డిమాండ్ ఒకే రకమైన భావజాలం ఒకే రకమైన వర్గాల కోసం పోరాడుతున్న రెండు పార్టీల మధ్య భావ సారూప్యత చాలానే ఉంది అని అంటున్నారు. మరో వైపు 2029 ఎన్నికల్లో కూడా బీజేపీతో కలసి పోటీ చేస్తామని టీడీపీ జనసేన ప్రకటించిన నేపధ్యంలో ఒంటరిగా ఏపీలో ఎదుర్కోవడం అన్నది వైసీపీకి బిగ్ టాస్క్ అని అంటున్నారు. ప్రజలు ఉన్నారు ఓట్లేస్తారు అనుకున్నా చాలా రకాలైన వ్యూహాలను ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయిలో అండ అన్నది వైసీపీకి అవసరం అని అంటున్నారు. మరి ఈవీఎంల మీద ఒకే గొంతుకతో ఉన్న రాహుల్ జగన్ లను అదే కలుపుతుందా అంటే వెయిట్ అండ్ సీ.
👉బీహార్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్న బీజేపీ …ఇటీవల కాలంలో నితీష్ కుమార్ వింత వింతగా ప్రవర్తిస్తున్నారు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోడీ అమిత్ షా సభలలో కూడా వారి పక్కన ఉంటూ నితీష్ కుమార్ తడబాట్లూ పొరపాట్లు చేయడాన్ని కళ్ళారా చూశారు. బీజేపీ రాజకీయ చాతుర్యం ఏమిటి అంటే ఎక్కడా తగ్గాలో తెలుసుకోవడం. తన బలాన్ని పూర్తిగా అంచనా వేసుకోవడం. ఇక బీహార్ సీఎం గా దాదాపుగా రెండున్నర దశాబ్దాల పాటు కొనసాగుతున్న నితీష్ కుమార్ తోనే మళ్ళీ తమకు అధికార పీఠం దక్కుతుందని బీజేపీ కచ్చితంగా అంచనాలు వేసుకుంటోంది. ఇటీవల కాలంలో నితీష్ కుమార్ వింత వింతగా ప్రవర్తిస్తున్నారు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోడీ అమిత్ షా సభలలో కూడా వారి పక్కన ఉంటూ నితీష్ కుమార్ తడబాట్లూ పొరపాట్లు చేయడాన్ని కళ్ళారా చూశారు. అయినా కూడా నితీష్ చేయి వదలడానికి బీజేపీ ఇష్టపడడం లేదు.. 113 ఏళ్లకు లార్డ్స్ లో ఆసీస్-దక్షిణాఫ్రికా మ్యాచ్ పైగా నితీష్ నాయకత్వంలోని జేడీయూకి సరిసమాన సీట్లను ఇస్తూ ఫిఫ్టీ ఫిఫ్టీ విధానంలో షేర్ చేసుకుంటోంది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అక్కడ ఎన్డీయే కూటమిలో అయిదు పార్టీలు ఉన్నాయి. బీజేపీ జేడీయూ తర్వాత కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ మూడవ పెద్ద పార్టీ. మరో రెండు చిన్న పార్టీలు కూటమిలో ఉన్నాయి. ఇక ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే బీహార్ ఎన్నికల్లో మొత్తం 243లో 203 సీట్లను బేజేపీ జేడీయూ పంచుకోనున్నాయి. ఇందులో కూడా జేడీయూకే 103 సీట్లు ఇచ్చి బీజేపీ వంద సీట్లకు పోటీ పడాలని చూస్తోందట. ఇక మిగిలిన నలభై సీట్లలో చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 30 సీట్లు, మరో రెండు చిన్న పార్టీలకు చెరి అయిదు సీట్లు కేటాయిస్తారు అని అంటున్నారు. ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులకు నరకం బీహార్ లో నితీష్ కి మంచి ఇమేజ్ ఉంది. పైగా ఆయన సామాజిక వర్గం అండ ఉంది. దాంతోనే నితీష్ ని ముందు పెట్టి ఈ ఎన్నికలను ఎదుర్కోవాలని బీజేపీ చూస్తోంది అంటున్నారు. ఒకవేళ నితీష్ కుమార్ పార్టీకి తక్కువ సీట్లు ఇస్తే ఆయన ఎక్కడ ఇండియా కూటమిలోకి వెళ్తారో అన్న కలవరం కూడా ఉంది అని అంటున్నారు. అందుకే ఆయనకే సీట్ల ఒప్పందంలో అగ్ర తాంబూలం ఇవ్వాలని కమలనాధుకు వ్యూహ రచన చేశారు అని అంటున్నారు. సరిగ్గా 2020లోనూ ఇదే విధంగా వ్యవహరించారు. అయితే అప్పట్లో మొత్తం సీట్లను బీజేపీ 121, జేడీయూ 122గా తీసుకున్నాయి. ఈసారి బీజేపీ కొత్త వ్యూహం అనుసరిస్తోంది. ఇద్దరి సీట్లు తగ్గించుకుని మిత్రులకు 40 సీట్లు వదిలేసింది. అందులో కూడా చిరాగ్ పాశ్వాన్ కి ఎక్కువ సీట్లు దక్కేలా చూస్తోంది. ఒకవేళ జేడీయూ కనుక రివర్స్ అయితే చిరాగ్ తో మైత్రిని కొనసాగిస్తూ అధికారం దక్కించుకోవాలన్న వ్యూహమేదో ఉందని అంటున్నారు. ఏది ఏమైనా నితీష్ నే సీఎం అభ్యర్ధిగా బీజేపీ ప్రచారం చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.
👉కలెక్టర్ చేతులమీదుగా ప్రతిభ అవార్డు అందుకున్న పొదిలి శ్రీ వివేకానంద విద్యార్థిని షేక్ రబ్బానీ ముస్కాన్*
*రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిభ అవార్డ్ ను ఈరోజు పొదిలి శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థిని పొదిలి మసీదు తోట కి చెందిన షేక్ రబ్బానీ ముస్కాన్ కలెక్టర్ తమీమ్ అన్సారియ చేతులమీదుగా అందుకున్నారు.ఇంటర్ ఎంపీసీ గ్రూప్ లో 1000 మార్కులకు గాను 988 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 4 వ ర్యాంక్ సాధించినందున ఈ అవార్డ్ కు ఎంపిక అయ్యారు.ఈరోజు ఒంగోలు లో జరిగిన ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం లో అవార్డ్ అందుకున్నారు.వారితో పాటు కళాశాల ప్రిన్సిపాల్ మేడా కుమార్ ప్రకాశం జిల్లా ఇంటర్ బోర్డ్ అధికారి ఆంజనేయులు కూడా పాల్గొన్నారు.ఈసందర్భంగా తల్లిదండ్రులు రషీద్, పర్వీన్ బాబీ,కళాశాల యాజమాన్యం,సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
👉ఎన్డీయే కూటమి పాలనలో గిద్దలూరు నియోజక వర్గంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి**అర్ధవీడులో కోటి యాభై తొమ్మిది లక్షలతో అప్గ్రేడ్ జూనియర్ కళాశాల..**నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*..అర్ధవీడు మండల కేంద్రంలోని కస్తూరి బా పాఠశాల ప్రాంగణంలో రూ. 1, 59,00000-00 అక్షరాల ఒక కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న అప్గ్రేడ్ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు మరియు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గోని పూజ కార్యక్రమంలో పాల్గోని శంకుస్థాపన శిలాఫలకాన్ని ప్రారంభించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి పాఠశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు, గ్రామ నాయకులు మేళాతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నియోజకవర్గంలో అభివృద్ధి అన్నీ రంగాల్లో పరుగు పెడుతుందని, విద్యారంగంలో సమూల మార్పులకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు..ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ నరసయ్య, తహసీల్దార్ నాగార్జున రెడ్డి, పంచాయతీ రాజ్ డీఈ సుబ్బారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బండ్లమూడి ఆంజనేయులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి, మండల అధికారులు, పాఠశాల సిబ్బంది,మండల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు..*
👉కలెక్టర్ చేతులమీదుగా ప్రతిభ అవార్డులు అందుకున్న రాచర్ల మండల కేంద్రం లోని స్పందన విద్యాసంస్థల విద్యార్థినీ విద్యార్థులు* .. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఇచ్చే ప్రతిభ అవార్డులలో రాచర్ల మండలం తరపున స్పందన హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులైన జి.వి.లయ, కంచర్ల ధరణి మరియు షేక్.ఆరీఫ్ లు (ముగ్గురు) కలెక్టర్ తమీమ్ అన్సారియ మరియు ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ చేతులమీదుగా ప్రతిష్టాత్మక “షైనింగ్ స్టార్” అవార్డులను అందుకున్నారు.పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించినందున ఈ అవార్డ్ కు ఎంపిక అయిన వీరు, సోమవారం నాడు ఒంగోలులో జరిగిన ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అవార్డ్ అందుకున్నారు. షైనింగ్ స్టార్ అవార్డు అందుకుని, తల్లితండ్రులకు మరియు విద్యాసంస్థకు మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థినీ విద్యార్థులను మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని స్పందన విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల.సుధీర్ కుమార్ రెడ్డి అభినందించారు.

