👉ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్..👉 భారత్ యూట్యూబర్లకు పాక్ తో ఇన్ని లింకులా.. తెరపైకి మరో సంచలనం!..బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగింది : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..👉పాక్ తో చర్చలు.. మావోల హత్యలు.. ఇదేం నీతి.. కడిగేసిన పీపుల్స్ స్టార్👉నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం..ఆరుగురికి కరోనా పాజిటివ్..👉చెవిరెడ్డికి ఎమ్మెల్యే పులివర్తి నాని కౌంటర్‌..

👉ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్..*ఎవరు ఏం చేస్తున్నారనే సమాచారం నా దగ్గర ఉంది..ప్రజలు మనల్ని గమనిస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి..వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా ఈ నెల 12న అమరావతిలో కార్యక్రమం..ఏడాదిలో చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించాలన్న సీఎం చంద్రబాబు….👉పేదల పాలిట వరమైన ఆర్డీటీ సేవలు ఆగవని మంత్రి లోకేష్ అభయం..మంత్రి లోకేష్ ప్రయత్నాలు త్వరలో ఫలించే అవకాశం..ఆర్డీటీ సేవలు యధావిధగా కొనసాగే అవకాశం..▪️కేంద్రంతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నాం.. కేంద్రం, సంబంధిత సంస్థలు, అధికారులతో సంప్రదింపులు : మంత్రి నారా లోకేష్.

👉మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు-లోకేష్‌.*అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధాని.. అమరావతిపై విషం చిమ్మేందుకు రాజధాని మహిళలను జగన్‌ గ్యాంగ్‌ కించపరుస్తు న్నారు.మహిళలకు జగన్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలి.-నారాలోకేష్-*

👉తిరుమల‌ లడ్డూ పేరుతో అన్ లైన్ వ్యాపారం.. టీటీడీ నోటీసులు..పుష్ మైకార్డ్ ఈ కామర్స్ సంస్థతో పాటు మరో నాలుగు సంస్థలకు నోటీసులు..అన్ లైన్ లో లడ్డూ పోటోలు తొలగించక పోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరిక….

👉పాక్ తో చర్చలు.. మావోల హత్యలు.. ఇదేం నీతి.. కడిగేసిన పీపుల్స్ స్టార్ …కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సింధూర్ చర్చనీయాంశంగా మారాయి.  కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సింధూర్ చర్చనీయాంశంగా మారాయి. చర్చలకు సిద్ధమని చెబుతున్న మావోయిస్టులను ‘ఆపరేషన్ కగార్’ పేరుతో నిర్దాక్షిణ్యంగా చంపుతున్న కేంద్రం, మరోవైపు నిత్యం పౌరుల ప్రాణాలు తీస్తున్న పాకిస్తాన్‌తో ‘ఆపరేషన్ సింధూర్’ను నిలిపివేసి చర్చలు జరపడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై టాలీవుడ్ నటుడు, నిర్మాత ఆర్. నారాయణ మూర్తి హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ట్రంప్ ఆపమన్నాడని, పాకిస్తాన్ చర్చలు జరిపాడని యుద్ధం ఆపిన మీరు.. శాంతి చర్చలకు సిద్ధమని చెబుతున్న మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరుతో ఎందుకు చంపుతున్నారు?” అని ఆర్. నారాయణ మూర్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సూటిగా ప్రశ్నించారు. హిందూ సంప్రదాయాలపై ప్రశ్నలు ఆర్. నారాయణ మూర్తి బీజేపీని ఉద్దేశించి, “హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే కర్మకాండ జరుపుతారు. అలాంటిది, ఆపరేషన్ కగార్‌లో చనిపోయిన వారి మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు చూపించకుండా, వారి చేతులతో కర్మకాండలు జరిపించకుండా చేస్తున్న మీరు ఏం హిందువులు? మీదేం హిందూ పార్టీ?” అంటూ మండిపడ్డారు. దేశ సంపద దేశ మూలవాసులకే చెందాలని పోరాటం చేస్తున్న మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్నా, వారిని ఆపరేషన్ కగార్ పేరుతో చంపడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. మావోయిస్టుల పోరాటంపై నారాయణ మూర్తి వ్యాఖ్యలు తల్లిదండ్రులను, ఇల్లు, వాకిలిని వదులుకుని, ప్రాణభయం లేకుండా పోరాటాలు చేస్తున్న మావోయిస్టులను కేంద్రం ఇలా దారుణంగా చంపడం ఏం న్యాయమని ఆర్. నారాయణ మూర్తి ప్రశ్నించారు. దాయాది దేశం పాకిస్తాన్‌తో చర్చలు జరిపిన మీరు, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్న ఈ దేశవాసులను చంపడం ఏంటన్నారు. “ఆకలి ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం అడవిలో ఉన్నవారు ఆల్ రైట్” అని ఆయన స్పష్టం చేశారు. హిందువుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నవారు, చనిపోయిన వారి కర్మకాండలు జరుపుకోవడానికి కూడా మృతదేహాలు ఇవ్వకపోవడం సరికాదని ఆయన నొక్కి చెప్పారు.

👉 భారత్ యూట్యూబర్లకు పాక్ తో ఇన్ని లింకులా.. తెరపైకి మరో సంచలనం! ..పహల్గాం ఉగ్రదాడి, అపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్ వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి, అపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్ వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పటికే పలువురు యూట్యూబర్ లను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆజాగా పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న యూట్యూబర్ జస్పీర్ సింగ్ నుంచి కీలక విషయాలు రాబట్టారు. అవును… పాకిస్థాన్ కు గూఢచర్యం కేసులో యూట్యూబర్ జస్పీర్ సింగ్ ను పంజబ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అధికారులు అతడిని విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఇందులో భాగంగా… గూఢచర్య నెట్ వర్క్ కు సూత్రధారి అయిన పాక్ కు చెందిన మాజీ పోలీస్ అధికారి గురించి జస్పీర్ పలు విషయాలు వెల్లడించాడు! ఈ సందర్భంగా… పాక్ కు చెందిన మాజీ సజ్ ఇనిస్పెక్టర్ నాసిర్ థిల్లాన్.. గూఢచర్య వ్యవహారాల్లో సూత్రధారిగా ఉన్నాడు. ఇతడు కూడా ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ.. ఐఎస్ఐ తో సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ సమయంలో జస్పీర్ సింగ్ ను థిల్లాన్.. ఐఎస్ఐ అధికారులకు పరిచయం చేశాడు అని అధికారులు వెల్లడించారు. ఇదే క్రమంలో… ఇటీవల అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో కలిసి లాహోర్ లో 10 రోజులు ఉన్నట్లు జస్పీర్ విచారణలో వెల్లడించాడని అధికారులు పేర్కొన్నారు. ఆ సమయంలోనే ఈ భారత యూట్యూబర్లను పాక్ రాయబార కార్యాలయ అధికారి డానిష్ కు థిల్లాన్ పరిచయం చేశాడు. అక్కడ ఈ భారత్ యూట్యూబర్లకు డానిష్ పాకిస్థాన్ గూఢచర్యం గురించి వివరించాడని అధికారులు తెలిపారు! మరోపక్క.. జస్పీర్ సింగ్ కు డానిష్ తో పాటు పాకిస్థాన్ కు చెందిన మరికొంతమంది అధికారులతోనూ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందని అంటున్నారు. ఇతడు 2020, 2021, 2024ల్లో పాక్ లో పర్యటించాడు. ఇప్పటికే పాక్ కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు జస్పీర్ కూడా పాక్ లో 10 రోజులు ఉన్నట్లు తేలిందని అంటున్నారు! కాగా… సుమారు 1.1 మిలియన్స్ కు పైగా సబ్ స్క్రైబర్లతో “జాన్ మహల్” ఛానెల్ ను నిర్వహిస్తున్న జప్సీర్ సింగ్.. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారతదేశంలోని పాకిస్థాన్ గూఢచారి నెట్ వర్క్ పై జరిపిన దాడుల్లో బుధవారం అరెస్ట్ చేయబడ్డాడు. విచారణలో.. అతడికి పాకిస్థాన్ అధికారులతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైందని అంటున్నారు!

👉🏽 ‘ప్రజాస్వామ్య చోరీకి ప్రణాళిక’… రాహుల్ గాంధీ సంచలన పోస్ట్! అవును… 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఎలా రిగ్గింగ్ జరిగిందనేది ఆరోపిస్తూ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ లో “మ్యాచ్ ఫిక్సింగ్ మహారాష్ట్ర” అనే తన ఆర్టికల్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిగ్గింగ్ జరిగాయని తాను ఎలా నమ్ముతున్నారో ఆయన వివరించారు. అవును… 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఎలా రిగ్గింగ్ జరిగిందనేది ఆరోపిస్తూ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా.. “2024లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడానికి ఒక బ్లూప్రింట్” అని ఆయన ఎక్స్ లో రాశారు. ఇదే సమయంలో… ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను కూడా బీజేపీ రిగ్గింగ్ చేయాలని చూస్తోందని రాహుల్ తన ట్వీట్లో పేర్కొన్నారు! మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాలను పక్కదారి పట్టించడానికి బీజేపీ వివరణాత్మక ఐదు దశల ప్రక్రియను అమలు చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 1) 2023 ఎన్నికల కమిషనర్ల నియామకం చట్ట ప్రకారం ప్రధాన మంత్రి, హోం మంత్రి 2:1 మెజారిటీతో ఎన్నికల కమిషనర్లను సమర్థవంతంగా ఎన్నుకుంటారని.. ఎందుకంటే మూడో సభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు ఓడిపోతారని తెలిపారు. ఎంపిక కమిటీలో ప్రధాన న్యాయమూర్తికి బదులుగా క్యాబినెట్ మంత్రిని ఉంచాలనే నిర్ణయాన్ని ప్రశ్నించారు. 2) 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో నమోదైన ఓటర్ల సంఖ్య 8.98 కోట్లు కాగా.. ఇది ఐదు సంవత్సరాల తర్వాత మే 2024 లోక్ సభ ఎన్నికల నాటికి 9.29 కోట్లకు పెరిగిందని రాహుల్ గాంధీ తెలిపారు. అయితే… నవంబర్ 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ సంఖ్య ఏకంగా 9.70 కోట్లకు పెరిగిందని.. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ డేటా చూపిస్తుందని తెలిపారు! అంటే… మహారాష్ట్రలో ఐదు సంవత్సారాల్లో 31 లక్షల ఓట్లు పెరిగితే… ఆ తర్వాత కేవలం ఐదు నెలల్లోనే 41 లక్షలు పెరిగారని.. ఈ పెరుగుదల ఎంత నమ్మశక్యం కానిదంటే… ప్రభుత్వం సొంత అంచలాన ప్రకారం మహారాష్ట్రలో 9.54 కోట్ల మంది వయోజన్లు ఉంటే.. అంతకంటే ఎక్కువగా 9.70 కోట్ల మంది ఓటర్లు ఉండటం గమనార్హం అని అన్నారు! .. 3) ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటలకు పోలింగ్ శాతం 58.25 గాఉంది. అనంతరం ఎక్కడా భారీ క్యూలైన్లు ఉన్నట్లు వార్తలు రాలేదు! కానీ.. పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం ఓటింగ్ మరింత పెరుగుతూ ఉందని.. ఈ క్రమంలో పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఉదయం 66.05 శాతంగా నమోదవ్వడం గమనార్హం అని రాహుల్ రాశారు! ఈ అపూర్వమైన 7.83 శాతం పాయింట్ల పెరుగుదల 76 లక్షల ఓటర్లకు సమానమని.. ఇది మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికలకంటే చాలా ఎక్కువని తెలిపారు. 4) మహారాష్ట్రలో సుమారు లక్ష బూత్ లు ఉన్నాయని చెప్పిన రాహుల్ గాంధీ.. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పేలవమైన ప్రదర్శన కనబరిచిన పార్లమెంట్ స్థానాల పరిధిలోని 85 నియోజకవర్గాల్లోని సుమారు 12,000 బూత్ లలో మాత్రమే ఎక్కువ మంది ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. ఈ క్రమంలోనే… సాయంత్రం 5 గంటల తర్వాత ప్రతీ బూత్ లో సగటున 600 మందికి పైగా ఓటర్లు ఉంటే.. ప్రతీ ఓటరు ఓటు వేయడానికి కనీసం ఒక నిమిషం సమయం అవసరమని భావిస్తే.. ఓటింగ్ కు కనీసం 10 గంటలు సమయం పట్టాలి. కానీ.. అది ఎక్కడా జరగలేదు. మరి అదనపు ఓట్లు ఎలా పోలయ్యాయి? అని ప్రశ్నించారు. ఈ 85 స్థానాల్లోనూ మెజారిటీ స్థానాలు ఎన్డీయే గెలిచిందని.. ఇందులో ఆశ్చర్యమేమీ లేదని పేర్కొన్నారు! 5) ఈ సందర్భంగా… ఈ విషయాలన్నింటిపైనా ఈసీ మౌనంగా ఉందని చెప్పిన రాహుల్ గాంధీ… 2024 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఫోటోలతో కూడిన ఓటరు జాబితాలను అందుబాటులో ఉంచాలన్న అభ్యర్థనలను ఎన్నికల కమిషన్ వెంటనే తోసిపుచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే… 2024 నవంబర్ లో మహారాష్ట్రంలో రిగ్గింగ్ ఎందుకు ఇంత దారుణంగా పెరిగిందో ఊహించడం కష్టం కాదని అన్నారు. అయితే.. రిగ్గింగ్ అంటే మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిదని.. ఫిక్సింగ్ జట్టు ఆట గెలవచ్చు కానీ.. “సంస్థ”లకు, ఫలితంపై ప్రజల నమ్మకానికి కోలుకోలేని నష్టం జరుగుతందని.. మ్యాచ్ ఫిక్స్డ్ ఎన్నికలు ఏ ప్రజాస్వామ్యానికైనా విషం లాంటివని తెలిపారు.

👉ఎంత మోసం చేసింది భయ్యా!😱😱😱

రాజస్థాన్ కోటాలో ICICI రిలేషన్షిప్ మేనేజర్ సాక్షి గుప్తా 41 కస్టమర్లకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ల నుంచి రూ.4.58 కోట్లను కాజేసింది. కస్టమర్లు ఇచ్చిన ఫోన్ నంబర్లను మార్చి తన కుటుంబసభ్యుల నంబర్లను అప్డేట్ చేసింది. దీంతో ట్రాన్సాక్షన్ల ఓటీపీలు, మెసేజులు కస్టమర్లకు చేరలేదు. ఆ డబ్బును స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి, నష్టపోవడంతో తిరిగి డిపాజిట్ చేయలేకపోయింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

👉నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం..ఆరుగురికి కరోనా పాజిటివ్..😱😱😱హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న బాధితులు..కరోనా జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు.పూర్తి సమాచారం తేలియాల్సి ఉంది.

👉లిక్కర్ వ్యాపారం చేయబోనని ఎప్పుడోచెప్పా-చెవిరెడ్డి
ఏ ఎన్నికల్లో కూడా మద్యం సరఫరా చేయలేదు-చెవిరెడ్డి
వెంకటేష్‌ నాయుడితో నాకు స్నేహం ఉంది
లిక్కర్‌ కేసుతో నాకు సంబంధం ఉందని చెప్పాలని..
వెంకటేష్‌ దంపతులను సిట్‌ టార్చర్‌ చేస్తోంది
న్యాయం నావైపే ఉంది-చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
👉చెవిరెడ్డికి ఎమ్మెల్యే పులివర్తి నాని కౌంటర్‌..
చెవిరెడ్డి చంద్రగిరి పరువు తీస్తున్నారు..
అభివృద్ధిని అడ్డుకోవాలని చెవిరెడ్డి చూస్తున్నారు..
త్వరలో దొంగ ఓట్ల కేసు మీకు చుట్టుకుంటుంది.
చెవిరెడ్డి గన్‌మెన్లకు రూ.కోట్ల సంపాదన ఎక్కడిది
గతంలో చెవిరెడ్డి ఆస్తి ఎంత.. ఎమ్మెల్యే అయ్యాక ఎంత
ప్రభుత్వ అధికారులను చెవిరెడ్డి బెదిరిస్తున్నారు
-ఎమ్మెల్యే పులివర్తి నాని

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..