👉 పాకిస్తాన్ ఐఎస్‌ఐ వ్యూహం.. ‘మేడమ్ ఎన్’ వలలో భారతీయ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు👉నేను లేకపోతే ట్రంప్ ఓడిపోయే వారు: మస్క్ ఘాటు వ్యాఖ్యలు*పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి..

👉 పాకిస్తాన్ ఐఎస్‌ఐ వ్యూహం.. ‘మేడమ్ ఎన్’ వలలో భారతీయ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ISI) కొత్త ఎత్తుగడలకు పాల్పడుతోంది.  భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ISI) కొత్త ఎత్తుగడలకు పాల్పడుతోంది. సోషల్ మీడియాలో (Social Media) ప్రభావం చూపే భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్లను (Indian Influencers) తమ వలలోకి లాక్కుంటున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చెందిన వ్యాపారవేత్త నౌషాబా షెహజాదా మసూద్, ఐఎస్‌ఐ ఆధ్వర్యంలో పనిచేస్తూ, భారతీయ ప్రముఖులను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఐఎస్‌ఐ ఆమెకు ‘మేడమ్ ఎన్’ అనే సీక్రెట్ పేరును పెట్టింది.  ‘మేడమ్ ఎన్’ ట్రావెల్ కంపెనీ షెహజాదా మసూద్, జాయానా ట్రావెల్స్ అండ్ టూరిజం అనే కంపెనీని లాహోర్‌లో నడుపుతున్నారు. ఆమె భర్త పాకిస్తాన్ పౌర సేవల్లో పనిచేసి పదవీ విరమణ చేశారు.

షెహజాదాకు ఐఎస్‌ఐతో చాలా బలమైన సంబంధాలు ఉన్నట్లు సమాచారం. జ్యోతి మల్హోత్రా వంటి భారతీయ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు పాకిస్తాన్‌కు వెళ్లడానికి ఆమె సహాయం చేస్తున్నారు. షెహజాదా కంపెనీ పాకిస్తాన్‌లో హిందూ, సిక్కు భక్తులకు పర్యటనలను ఏర్పాటు చేసే ఏకైక సంస్థ. ఇది అక్కడి ప్రభుత్వానికి చెందిన ఎవాక్యుయీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డుతో కలిసి పనిచేస్తుంది. ఇది దేశ సైన్యంతో, ఐఎస్‌ఐతో ఆమెకు ఉన్న బలమైన సంబంధాలను స్పష్టం చేస్తుంది. ఆమె కంపెనీ ఢిల్లీ వంటి భారతదేశంలోని ప్రదేశాలలో ట్రావెల్ ఏజెంట్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. 500 మందితో స్లీపర్ సెల్ ఏర్పాటుకు ప్రయత్నం ఇటీవల గూఢచర్యం ఆరోపణలతో భారతదేశంలో పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లు అరెస్ట్ అయ్యారు. వారిని విచారించగా షెహజాదా పాత్ర బయటపడింది. ఆమె భారతదేశంలో సుమారు 500 మందితో స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో ఆమెకు పాకిస్తాన్ ఐఎస్‌ఐ, సైన్యం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. పాకిస్తాన్ మిలిటరీ అధికారులతో పరిచయాలు షెహజాదా పాకిస్తాన్‌కు వచ్చిన భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్లను పాకిస్తాన్ సైనిక అధికారులకు, ఐఎస్‌ఐకి పరిచయం చేస్తున్నారు. మన దేశంలో సుమారు 3,000 మందికి ఈ కంపెనీ ద్వారా సహాయం అందిందని తెలుస్తోంది. వీరిలో సుమారు 1500 మంది భారతీయేతరులు గత ఆరు నెలల్లో పాకిస్తాన్‌ను సందర్శించారు. ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వీసా విభాగంలో ఆమెకు ప్రత్యేక ప్రభావం ఉంది. ఆమెకు మొదటి కార్యదర్శి (వీసా) సుహైల్ కమర్, కౌన్సెలర్ (వాణిజ్యం) ఉమర్ ష్రైయర్ లతో బలమైన సంబంధాలున్నాయి. పాకిస్తాన్ వీసా కావాలంటే.. ఆమె ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు వీసా లభించేది. అదే కార్యాలయంలో వీసా అధికారిగా పనిచేసే ఎహసాన్ ఉర్ రెహ్మాన్ అలియాస్ డానిష్ తో కూడా ఆమెకు సంబంధం ఉంది. ‘మేడమ్ ఎన్’ నుండి సిఫార్సు లేదా స్పాన్సర్‌షిప్ ఉంటే, భారతీయులకు సందర్శకుల వీసా సులభంగా వచ్చేది. జ్యోతి మల్హోత్రా వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత డానిష్‌ను భారతదేశం నుంచి బహిష్కరించినట్లు తెలిసింది.ఈ మొత్తం వ్యవహారం భారత భద్రతకు ఒక పెద్ద సవాలుగా మారింది.

👉నేను లేకపోతే ట్రంప్ ఓడిపోయే వారు.. మస్క్ ఘాటు వ్యాఖ్యలు ఈ విమర్శలకు బదులిస్తూ మస్క్ ట్రంప్‌పై మరింత ఘాటుగా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్‌ను కృతజ్ఞత లేనివాడని అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉండి.. ఒకరికొకరు మద్దతుగా నిలిచిన ఈ ఇద్దరు ప్రముఖులు, అమెరికా కేంద్ర బడ్జెట్ బిల్లు విషయంలో పరస్పర విమర్శలకు దిగారు. ఎలాన్ మస్క్ తనపై చేసిన విమర్శలపై ట్రంప్ చాలా ఆశ్చర్యం, నిరాశ వ్యక్తం చేశారు. ఎలాన్‌ మస్క్ తో తనకు గొప్ప బంధం ఉండదని ట్రంప్ వ్యాఖ్యానించారు. పన్నులు తగ్గించడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం వంటి ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మస్క్ చేపట్టిన లాబీయింగ్ ప్రయత్నాలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మస్క్ ఈ చర్యను కొందరు రిపబ్లికన్లు కూడా విమర్శించారు. ఈ విమర్శలకు బదులిస్తూ మస్క్ ట్రంప్‌పై మరింత ఘాటుగా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్‌ను కృతజ్ఞత లేనివాడని అభివర్ణించారు. “నేను లేకపోతే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారు” అని మస్క్ అన్నారు. ఇది వారిద్దరి మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని స్పష్టం చేస్తోంది. మస్క్ గత వారం ఇంధన శాఖలో 129 రోజులు పనిచేసిన తర్వాత తన పదవి నుంచి వైదొలిగారు. ట్రంప్ మే 30న జరిగిన అభినందనల వార్తా సమావేశంలో మస్క్‌కు గోల్డ్ కీని బహూకరించారు. అయితే, ఆ తర్వాత రోజుల్లో ట్రంప్ బడ్జెట్ బిల్లును పదే పదే విమర్శించారు. ఈ బిల్లుకు ఓటు వేసిన వారికి సిగ్గు లేదని, వారు తప్పు చేశారని ఆయన సోషల్ మీడియాలో సోస్ట్ చేశారు. ట్రంప్ పార్టీకి చెందిన కొద్దిమంది ప్రతినిధులతో పాటు, డెమొక్రాట్లందరూ ఈ బిల్లును వ్యతిరేకించారు. అయితే, చాలా మంది రిపబ్లికన్ల మద్దతుతో, వైట్ హౌస్ కేంద్ర బడ్జెట్ బిల్లును ఆమోదించింది. ఈ పరిణామం ట్రంప్, మస్క్ మధ్య రాజకీయ, వ్యక్తిగత విభేదాలను మరింత పెంచిందని స్పష్టమవుతోంది. మస్క్ తనను ‘రుణ బానిసత్వ బిల్లు’ అని అభివర్ణించిన ఈ బడ్జెట్ బిల్లు, ట్రంప్ దృష్టిలో మాత్రం అమెరికా అభివృద్ధికి కీలకమైనది. ఈ విభేదాలు భవిష్యత్తులో అమెరికా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి

*పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి..

👉ఒంగోలు పట్టణంలోని తాతా లక్ష్మి ప్రసాద్ కళ్యాణ మండపంలో పట్టణానికి చెందిన తాతా వెంకటా చలపతిరావు కుమార్తె చి.ల.సౌ శ్రావిక మరియు చి. అఖిల్ కుమార్ లకు జరిగిన వివాహా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించిన గిద్దలూరు శాసనసభ్యులు “ముత్తుముల అశోక్ రెడ్డి”*గిద్దలూరు పట్టణం, నరవ రోడ్డులోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో కొమరోలు మండలం, హసనాపురం గ్రామానికి చెందిన బోనేని శ్రీనివాస కుమార్ కుమార్తె చి.ల.సౌ దివ్య మరియు చి. రవికుమార్ లకు జరిగిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ..*గిద్దలూరు పట్టణం, నల్లబండబజారులో ముగ్గు శంకరయ్య గారి కుమారుడు చి. దుర్గాప్రసాద్ మరియు చి.ల.సౌ లక్ష్మి సాలమ్మ” లకు జరిగిన వివాహా కార్యక్రమంలో ..గిద్దలూరు పట్టణంలోని యాదవ బజారులో కటారు పుల్లయ్య ( వాటర్ మెన్) కుమారుడు చి. పెద్దిరాజు మరియు చి.ల.సౌ లక్ష్మి అశ్విని లకు జరిగిన వివాహా కార్యక్రమంలో ..గిద్దలూరు పట్టణంలోని శ్రీ విట్టా సుబ్బరత్నం కళ్యాణ మండపంలో జరిగిన చీమకుర్తి వారి వివాహా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..