👉మాజీ మంత్రి అంబటి రాంబాబు పై కేసు నమోదు😲
అమరావతి:జూన్ 05..మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు,మరోసారి రెచ్చిపోయారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ‘నీ అంతు చూస్తాను’ అంటూ పరుషపదజాలంతో విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబుకు పోలీసు అధికారి అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. జిల్లాలో బుధవారం వైసీపీ వెన్ను పోటు దినం కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో వెన్నుపోటు దినం కార్యక్రమానికి బయలుదేరిన అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రెచ్చిపోయి ప్రవర్తించారు. అంబటి రాంబాబు, పోలీసు అధికారి నరహరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఇరువురి ఘర్షణ చూసిన జనం షాక్ అయ్యారు. నేటితో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి అయిన సందర్భంగా వైసీపీ నిరస నలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి తన ఇంటి వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వద్దకు ర్యాలీగా బయలుదేరారు అంబటి. మార్గ మధ్యలోనే మాజీ మంత్రిని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా వెళ్లేందుకు వీలులేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులపై అంబటి తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే తమ విధులకు ఆటంకం కలిగించారని అభియోగం మేరకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లోగురువారం మాజీ మంత్రి అంబటి రాంబాబు తో సహా కొంతమంది వైసీపీ నేతలపై బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 353 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
👉సూట్ కేసులో గుర్తు తెలియని మహిళ మృతదేహం?
హైదరాబాద్:జూన్ 05.. బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం సూట్ కేసులో గుర్తుతెలియని మహిళా మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం..
బాచుపల్లిలోని విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ , డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ గోడను ఆనుకొని ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఓ బ్యాగ్ లో నుంచి దుర్వా సన వస్తున్నట్లు స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు..సూట్ కేసులో సుమారు 25 నుంచి 35 ఏండ్ల మధ్య వయసున్న మహిళ మృతదేహం కుళ్లిన స్థితిలో బయటపడింది. ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
👉కార్పొరేట్ కబంద హస్తాల నుంచి తల్లిదండ్రులను రక్షించాలి..*నిబంధనలు తుంగలో తొక్కుతూ అనుమతులు లేకుండా సీబీఎస్ఈ నడుపుతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలను సీజ్ చేయాలి..*విద్యాసంస్థల పేరుతో పుస్తకాలను ముద్రించి ఆన్లైన్లో అమ్ముతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి..
*కార్ట్ బుకింగ్ పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి 50,000 వసూలు చేస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలు..*నగరంలో విచ్చలవిడిగా ఇంటర్నేషనల్ పేరుతో విద్యాసంస్థలు నడుపుతున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న డీఈవో* *జిల్లా విద్యాశాఖ సంబంధించి కార్పొరేట్ విద్యాసంస్థలపై వేసిన త్రిమన్ కమిటీ ఎటు పోయింది??*
*ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం దగ్గర ధర్నా..*అనంతపురం అర్బన్:: అనంతపురం జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలని పుస్తకాల పేరుతో వేల రూపాయల వ్యాపారం చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్బి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయిస్వామి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్ ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పృద్వి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి సురేష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో శ్రీ చైతన్య విద్యాసంస్థలు సిబిఎస్సిఈ అనుమతి లేకపోయినా విద్యార్థుల తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ తల్లితండ్రులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు, పుస్తకాలను విద్యాసంస్థలు అమ్మకుండా ఆన్లైన్ ద్వారా జొమాటో స్వీగి రూపంలో ఇంటికి శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యాల పుస్తకాలను పంపుతున్నారు. అనుమతులు లేకుండా రెండు మూడు బ్రాంచ్లకు అనుమతులు తెచ్చుకొని విచ్చలవిడిగా జిల్లా వ్యాప్తంగా నడుపుతున్న కార్పొరేట్ విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, జిల్లాలో విచ్చలవిడిగా సీబీఎస్సీ ఇంటర్నేషనల్ పేరుతో రెండు లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్న విద్యా దోపిడి విద్య మాఫియా చేస్తున్న విద్యాశాఖ అధికారులు విద్యాసంస్థల వైపు కన్నెత్తి కూడా చూడడం కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి మామూళ్ల మత్తులో మునిగితేలుతున్నారని పేర్కొన్నారు, జిల్లా డీఈఓ నెల క్రితం కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ పుస్తకాల వ్యాపారం ముందస్తు అడ్మిషన్లు అనుమతులు లేకుండా నడుపుతున్న వాటిపైన త్రీ మాన్ కమిటీ నియమించి వాటిని అరికడతామని హామీ ఇచ్చినప్పటికీ ఆ త్రీ మాన్ కమిటీ ఎటువైపు పోయిందని ప్రశ్నించారు. కార్పొరేట్ విద్యాసంస్థలలో సి బ్యాచ్ ఐకాన్ ఐపీఎల్ ఒలంపియాడ్ టెక్నో రకరకాల గ్రూపులు ఏర్పాటు చేసే లక్షల రూపాయల ఫీజుల దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీనీ అరికట్టకపోతే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు హనుమంతు రాయుడు కోశాధికారి ఆంజనేయులు ఆఫీస్ బేరర్స్ నరసింహ వంశీ చందు మంజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఆఫీస్ బేరర్స్ శివ గిరి శివ ఏఐఎస్బి విజయ్ ఇందు మనోజ్ వరుణ్ ఏఐఎస్ఎఫ్ నగర నాయకులు నాని సమీర్ బాబ్జాన్ హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు*
👉తుడా నిధుల్ని కొట్టేసిన చెవిరెడ్డి – నోటీసులు!
జగన్ కోటరీలో కీలక వ్యక్తిగా చెలామణి అవుతున్న చెవిరెడ్డి బాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పని చేశారు. కాంగ్రెస్ హయాం నుంచి ఆయన వైఎస్ కుటుంబీకులు ఎవరు అధికారంలోకి వచ్చినా తుడా చైర్మన్ పదవి ఆయనే తీసుకుంటారు. దీనికి కారణం ఎక్స్ ఆఫీషియో హోదాలోల టీటీడీ బోర్డులోనూ ఆయన సభ్యుడిగా ఉంటారు. ఇక చేయాల్సిన అక్రమాలకు కొదవ ఉండదు. తుడా చైర్మన్ గా ఆ సంస్థ ఆదాయాన్ని సొంత అవసరాలకు విచ్చలవిడిగా వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తన సొంత గ్రామంలో పనులు చేయించడానికి , వ్యక్తిగత పనులు, ప్రయాణాలకు కూడా తుడా నిధుల్ని వాడినట్లుగా లెక్కలు బయటకు వచ్చాయి. మొత్తం నిధుల్లో 90 శాతం చంద్రగిరిలో పనులు చేయించడానికే వాడుకున్నారు. అవి కూడా వ్యక్తిగతంగా చేయించినట్లుగా పేర్లు వేయించుకున్నారు…*ఇంకా విచిత్రం ఏమింటటే ఏ మాత్రం సిగ్గుపడకుండా.. దొరికిపోతామన్న భయం లేకుండా.. ఆ పనులన్నీ తన కంపెనీ పేరు మీదనే చేసేశారు. డబ్బులన్నీ తన కంపెనీ ఖాతాలోనే జమ చేసుకున్నారు. అన్నింటిపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణ చేపట్టింది. సమాధానాలివ్వాలని నోటీసులు పంపింది. చెవిరెడ్డి ఇచ్చే వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
👉పోలీస్ స్టేషన్ సాక్షిగా ప్రేమ జంట పై దాడి!*
వరంగల్ జిల్లా:జూన్ 05. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ప్రేమ జంటపై దాడి జరిగింది. హనుమకొండ జిల్లాలోని నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రేమ పెళ్లి వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన నితీషా, శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన పల్లెబోయిన మణిరాజ్, గత నెల 24న వడాల నితీషా ను ప్రేమ వివాహం చేసుకున్నాడు, పెళ్లి అనంతరం శనిగరంలోని తన చిన్నమ్మ ఇంట్లో వారు కొంత కాలం తలదాచుకు న్నారు.. విషయం తెలుసుకున్న యువతి బంధువులు వారిపై దాడికి యత్నించా రు. దీంతో వారు అక్కడి నుంచి బయటపడి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే యువతి బంధువులు యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. యువకుడిపై పిడిగుద్దులతో దాడి చేసి యువతిని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు యువతి బంధువులను అడ్డుకొని పలువురిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఆ తరువాత ప్రమ జంటకు పోలీసులు ఆశ్రయం కల్పించారు.నితీషను పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. తను తన భర్తతోనే ఉంటానని పోలీసులకు నితీష తేల్చి చెప్పింది. దీంతో పోలీసులు నితీష తల్లిదండ్రులను, బంధువులను అక్కడి నుంచి పంపించేశారు.
👉పట్టపగలే దోపిడీ. తిరుపతి..50 గ్రాముల బంగారం తో పాటు వెండి సామాగ్రి అపహరణ.వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిరిపురంలో ఘటన. మూడవ అంతస్తు లో నివాసం ఉన్న గిరిజ, బాలచంద్ర భార్యాభర్తల ఇంటిలోకి ప్రవేశించిన చోరుడు.భర్త బాత్రూం లో ఉండగా బయట గొళ్ళెం పెట్టి ,భార్య చేతులు, కాళ్ళు కట్టి నోటిలో గుడ్డముక్క కుక్కి చోరీ.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని కి చేరుకొని విచారణ. ఫింగర్ ప్రింట్ క్లూస్ టీం అధికారులు చేరుకొని ఆధారాలు సేకరణ. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్న వెస్ట్ సిఐ మురళీమోహన్.
👉తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్‌కి జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు..గత నెల 13 రాజేంద్రనగర్ పోలీసుల వేధింపులతో ఆటో డ్రైవర్ మృతి..ఆటో డ్రైవర్ మృతిని సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవహక్కుల కమిషన్..ఆటో డ్రైవర్ మృతి పట్ల విచారణ చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారి చేసిన
👉*కోర్టు ఆవరణలో ఖైదీ దారుణ హత్య?*హైదరాబాద్:జూన్ 05
దేశ రాజధాని ఢిల్లీ లో ఈరోజు ఉదయం దారుణ ఘటన చోటు చేసుకుంది, ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఆవరణలో ఓ ఖైదీని సహచార ఖైదీలు దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. విచారణ కోసం తీహార్ జైలు నుంచి ఖైదీలను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు అక్కడ లాకప్ లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది ఈ ఘర్షణలో ఇద్దరు ఖైదీలు తోటి ఖైదీ పై దాడి చేసి గొంతు కోశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం….ఈ హత్య పాత కక్షలే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తు న్నారు.ఈ ఘటన జైలు శాఖ మరియు న్యాయ వ్యవస్థల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.ఈ ఘర్షణలో అమన్ అనే ఖైదీ తీవ్రంగా గాయపడిన ట్లు చెప్పారు. అధికారులు వెంటనే అతన్ని సమీపం లోని ఆసుపత్రికి తరలించ గా అక్కడ మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను విచారిస్తున్నారు.ఈ ఘటన జైలుశాఖ మరియు కోర్టు భద్రతా వ్యవస్థలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి. ప్రస్తుతం, ఈ ఘటనలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

