👉రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పర్యటించారు. సంఘ్థాన్ సృజన్ అభియాన్ అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపు మేరకు ప్రధాని నరేంద్ర మోడీ లొంగిపోయారని ఆరోపించారు.
* ట్రంప్ ఫోన్ చేయగానే పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. *”డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుంచి ఫోన్ చేసి -నరేందర్.. సరెండర్ అన్నారు. ఇక్కడ మోడీ వెంటనే.. ఒకే సార్ అని లొంగిపోయారు”* అని రాహుల్ అన్నారు. *బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలపై కొంచెం ఒత్తిడి తెచ్చినా వారు భయపడి పారిపోతారని.. అది వారికి బాగా అలవాటని* ఎద్దేవా చేశారు. *స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కూడా వాళ్లకు లొంగుబాటు లేఖలు రాసే అలవాటు ఉందని* సెటైర్ వేశారు.కానీ *కాంగ్రెస్ పార్టీ అలా కాదని.. ఎవరి బెదిరింపులకు తలొగ్గదని* అన్నారు. *గాంధీజీ, నెహ్రూజీ, సర్దార్ పటేల్జీ -వీరు లొంగిపోయే వ్యక్తులు కాదని..* *అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులని* హాట్ కామెంట్స్ చేశారు.
👉 ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు…ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని..వెన్నుపోటు దినం పేరిట వైసీపీ నిరసన కార్యక్రమాలు…కడప జిల్లా పులివెందులలో ర్యాలీ, పాల్గొన్న అవినాష్..ఏడాది పాలనలో ఎన్నో విజయాలు సాధించాం-అనగాని..గత పాలనలో ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీశారు-మంత్రి అనగాని..సైకో పాలనలో వెనక్కి వెళ్లిన పరిశ్రమలను రప్పించాం..ఇప్పటికే ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించాం-అనగాని..సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం..ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్న ప్రభుత్వం మాది..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం-మంత్రి అనగాని..అన్న క్యాంటీన్‌తో పేదల ఆకలి తీరుస్తున్నాం-అనగాని..
👉ఏపీలో YCP, కూటమి పార్టీలు పోటాపోటీ నిరసనలకు పిలుపు..వెన్నుపోటు దినం పేరిట వైసీపీ నిరసన కార్యక్రమాలు… కౌంటర్‌గా విజయవాడలో ఆందోళనకు కూటమి నేతల పిలుపు.. విజయవాడలో పీడ విరగడై ఏడాది కార్యక్రమం..పాల్గొన్న నాదెండ్ల, కేశినేని చిన్ని, MLA గద్దె..పీడ విరగడై ఏడాది గడిచింది-మంత్రి నాదెండ్ల..ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజలు కూటమి వెంటే ఉన్నారు…అభివృద్దే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం-నాదెండ్ల.. ప్రజాతీర్పుతో ఉన్మాద పాలనపోయింది-చంద్రబాబు..నాలుగేళ్లలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం..జూన్ 4 ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు.. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయారు.. ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు ఇది-చంద్రబాబు..సైకో పాలనకు అంతం పలికారు-సీఎం చంద్రబాబు..ఏపీ దశదిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు..ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు నమస్కారాలు-సీఎం..
👉 జగన్ రాక్షస పాలనపై సమర శంఖంలా యువగళం…*యువగళం పుస్తకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంస.*యువగళం పుస్తకావిష్కరణ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నారా లోకేష్ యువగళం పుస్తకం అందజేశారు…*పవన్ కళ్యాణ్ ప్రశంస: “రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతమైంది” : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…*యువగళం అనుభవాలను పుస్తక రూపంలో తేవడంపై లోకేష్ ను ప్రశంసించిన పవన్ కళ్యాణ్..*అరాచక పాలన అంతమై ఏడాది.. గత ప్రభుత్వ పాలన పీడకలను జనం ఇంకా మర్చిపోలేదన్న పవన్.* క్యాబినెట్ సమావేశం సందర్భంగా పవన్, ఇతర మంత్రులకు పుస్తకం అందజేసిన లోకేష్.*యువగళం పాదయాత్ర అనుభవాలను పవన్ కళ్యాణ్ తో పంచుకున్న నారా లోకేష్.*
👉నాగబాబుకు మంత్రి పదవి లేనట్టేనా?.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి లేనట్టే అని తెలుస్తోంది. ఇంతక ముందు ప్రకటించిన విధంగా నాగబాబుకే మంత్రి పదవి ఇవ్వాలా. లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే తర్జన భర్జన సాగుతుందట. జనసేన నుంచి ఇప్పటికే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. బీసీ, ఎస్సీ వర్గాలకు జనసేన నుంచి మంత్రి వర్గంలో ప్రాధాన్యత లేదు. దీంతో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదని పవన్ ఆలోచిస్తున్నారట.
👉 చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడికి మెమో జారీ చేసిన ఉన్నతాధికారులు..సచ్చేటోళ్లకు సిరప్ ఎందుకు, ఆరు నెలలుగా మందులు లేవు అంటూ రోగులతో దురుసుగా ప్రవర్తించిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి మెమో జారీ చేసిన వైద్యాధికారి..తన కూతురికి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుందని, అర్ధరాత్రి ఆసుపత్రికి వచ్చిన తండ్రితో ఆరు నెలలుగా మందులు లేవు, సచ్చేటోళ్లకు సిరప్ ఎందుకు అంటూ దురుసుగా ప్రవర్తించిన ప్రభుత్వ వైద్యుడు కళ్యాణ్ చక్రవర్తి..ఈ ఘటనపై స్పందించి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మెమో జారీ చేసిన ఉన్నతాధికారులు
👉బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్తే ఊర్లో ఉందట్లేదని లిస్టులో నుండి ఇందిరమ్మ ఇల్లు తీసేశారు..
దీంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళ…హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం..ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన తుళ్ల రజిత లిస్టులో పేరు ఉన్నా హైదరాబాదులో పనిచేసి బతుకుతున్నందున ఊర్లో ఉండడం లేదని కాంగ్రెస్ నాయకులు అధికారులకు చెప్పి పేరు తొలగించారని ఏడ్చుకుంటూ తన ఆవేదనను వెలిబుచ్చిన మహిళ.
👉 మస్తాన్ మృతి వారి కుటుంబానికి తీరని లోటు.. సిఐటియు మండల అధ్యక్షులు.. పామూరు.
సిఐటియు మండల అధ్యక్షులు షేక్ మస్తాన్ మృతి (వయసు 50 సంవత్సరాలు) వారి కుటుంబానికి తీరని లోటని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ హనీఫ్ అన్నారు. మండలంలోని ఎల్ ఎన్ పురం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ గత కొంత కాలం నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ కడపలో వైద్య పరీక్షలు పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలము ప్రైవేట్ స్కూల్ ని పెట్టి ఉపాధ్యాయులుగా పామూరు పట్టణంలోని కందుకూరు రోడ్లో మీ సేవను అనంతరం సిఐటియులో చురుకైన పాత్ర పోషిస్తూ కార్మికులకు అండగా ఉండి ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరిష్కారం చేసి కార్మికులకు అండగా ఉంటున్నాడని అన్నారు. సానుభూతి తెలిపిన వారిలో కే మాల్యాద్రి, ఎస్కే ఖాదర్ భాష కే శంకర్, యాటా వీరనారాయణ, షేక్ కాసిం సాహెబ్, బి నాగేశ్వరరావు, ప్రజా సంఘాల నాయకులు తెలిపారు.

