👉 నోటీసులు ఇస్తే అందరి జాతకం బయటపెడుతా – రాజాసింగ్😲…👉డ్రగ్స్ దందా చేస్తున్న ఏపీ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు..* జగన్ పర్యటనకు వ్యతిరేకంగా దళిత, ప్రజా సంఘాల రాస్తారోకో…*అక్రమ మట్టి రవాణా విషయంలో టిడిపి కు చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ…👉 JEE అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన షాద్‌నగర్ విద్యార్థిని త్యారాల హాసిని.. 👉 కూకట్‌పల్లిలో రూ. 2 కోట్ల విలువైన డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్.. ఆంధ్రా కానిస్టేబుల్ హస్తం!

👉 నోటీసులు ఇస్తే అందరి జాతకం బయటపెడుతా – రాజాసింగ్😲😲😲బీజేపీ నిత్య అసంతృప్త ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల కారణంగా రాష్ట్ర నాయకత్వం నోటీసులు జారీ చేసేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం ఉందన్న రాజాసింగ్..తనకు నోటీసులు ఇవ్వడం కాదు.. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హాట్ కామెంట్స్ చేశారు..ఇటీవల బీఆర్ఎస్ అసంతృప్త ఎమ్మెల్సీ కవిత… బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసేందుకు కుట్రలు జరిగాయని చెప్పారు. దీనిని సమర్థిస్తూ రాజాసింగ్ ఆ పార్టీ నేతల గురించి ఘాటుగానే స్పందించారు. కొంతమంది బీజేపీ నేతలు మంచి ప్యాకేజ్ ఇస్తే బీఆర్ఎస్ లో చేరుతారని వ్యాఖ్యానించారు. ఇది పార్టీలో పెను దుమారం రేపింది. దీంతో ఆయనకు నోటీసులు ఇవ్వాలని జాతీయ అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.తనకు నోటీసులు ఇస్తారనే అంశంపై తాజాగా స్పందించిన రాజాసింగ్..నాకు నోటీసులు ఇస్తే పార్టీలో అందరి జాతకం బయటపెడుతానని ప్రకటించారు. ఎవరి వలన పార్టీకి నష్టం జరుగుతుందో అన్ని విషయాలను బహిరంగం చేస్తానని వ్యాఖ్యానించారు. తనకు నోటీసులు కాదు..సస్పెండ్ చేయాలన్నారు.

👉డ్రగ్స్ దందా చేస్తున్న ఏపీ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు*..ఏపీలోని తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకొస్తుండగా ఆరుగురు ముఠా సభ్యులు అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులకు పట్టుబడ్డ కానిస్టేబుల్ నుండి 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్ మరియు నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపిన ఎస్‌ఓటీ అధికారులు..తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్(40), తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర(31), బాపట్ల జిల్లా కర్ల పాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతి రెడ్డి హరిబాబు రెడ్డి (38), అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫియాడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్(34), షేక్ మస్తాన్వలీ(40), దేవరాజు యేసుబాబు(29) కలిసి డ్రగ్స్ దందా చేస్తున్న ముఠా.

👉తెనాలి: జగన్ పర్యటనకు వ్యతిరేకంగా దళిత, ప్రజా సంఘాల రాస్తారోకో…*తెనాలి మార్కెట్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నిరసనకారులు..*నూతక్కి కిరణ్ హత్యపై జగన్ పరామర్శించకపోవడంపై ఆగ్రహం…*రౌడీ షీటర్లకు జగన్ మద్దతు దారుణం: దళిత, ప్రజా సంఘాలు*…జగన్ రెడ్డి మీద తెనాలిలో నిప్పులు చెరిగిన దళిత, ప్రజా సంఘాలు: రౌడీ షీటర్లకు మద్దతా? నూతక్కి కిరణ్ హత్యకు సమాధానం ఏది?!..తెనాలి మార్కెట్ సెంటర్ నిప్పుల గుండమైంది! ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా దళిత, ప్రజా సంఘాలు నిర్వహించిన రాస్తారోకో, మానవహారం జగన్ అహంకారానికి, అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహాన్ని ప్రతిబింబించాయి.

“రౌడీ షీటర్లకు మద్దతు ఇస్తున్నారా? నూతక్కి కిరణ్ హత్యపై మీకు పరామర్శ ఎందుకు లేదు?” అంటూ నిరసనకారులు సంధించిన ప్రశ్నలు గర్జనలా మారుమోగాయి.నాలుగేళ్లు గడిచినా, నూతక్కి కిరణ్ మృతదేహం లభ్యం కాక, అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా, జగన్ రెడ్డికి వారి ఆవేదన కనిపించలేదా? ఒక యువకుడి జీవితం అంధకారంలోకి నెట్టబడినప్పుడు, ఆ కుటుంబానికి న్యాయం జరగనప్పుడు, మాజీ ముఖ్యమంత్రిగా మీరు రౌడీ షీటర్లను పరామర్శించడం దారుణం కాదా?..”మీ పరామర్శలు క్రిమినల్స్‌కా? అమాయకులకు కాదా?” అని ప్రశ్నిస్తూ దళిత, ప్రజా సంఘాలు చేసిన నిరసన జగన్ అన్యాయాన్ని ఎత్తిచూపింది. ఈ రాస్తారోకో కేవలం ఒక నిరసన కాదు, అది అణగారిన వర్గాల ఆవేదన, న్యాయం కోసం వారి ఆక్రందన. తెనాలిలో రగులుకున్న ఈ నిప్పురవ్వ, రాష్ట్రవ్యాప్తంగా అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహాన్ని రాజేస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఘటన జగన్ రెడ్డికి ఒక స్పష్టమైన హెచ్చరిక పంపింది. సంఘవిద్రోహులకు, గంజాయి బ్యాచీల కోసం పోరాడే జగన్ రెడ్డిని రోడ్లల్లో నిలదీస్తూ కడిగిపారేస్తున్నారు.

👉అక్రమ మట్టి రవాణా విషయంలో టిడిపి కు చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ…*చేరువులో మట్టి హక్కు తమకంటే తమకే ఉన్నాయని అక్రమ మైనింగ్, అక్రమ రవాణా కోసం ఇరువర్గాలు ఒకరిపై మరోకరి దాడి.*కంచాలమ్మ గండి లో అక్రమ మైనింగ్ చేసేందుకు జేసిబి పెట్టిన టిడిపి నాయకుడు సుబ్బారెడ్డి…*జేసిబి తో మట్టి తరలించడం నచ్చని గంగిరెడ్డి అనే ట్రాక్టర్ డ్రైవర్ కోడవలితో జేసిబి వద్దకు వెళ్లి సుబ్బారెడ్డి కు బెదిరింపు…*సుబ్బారెడ్డి, గంగిరెడ్డి ల మధ్య జరుగుతున్న వివాదం నప్పక సుబ్బారెడ్డి జేసిబి దగ్గర నుండి నిష్క్రమించిన పవన్ అనే ట్రాక్టర్ డ్రైవర్ కమ్ ఒనర్..* ఇంటిదగ్గర వున్న పవన్ పై కోడవలితో దాడికి వెళ్ళిన గంగిరెడ్డి..*పవన్ అమ్మపై గంగిరెడ్డి దాడి ఇరువర్గాల మధ్య దాడితో ఉద్రిక్తత వాతావరణం*

రాయచోటి, జూన్ 03:తేలుగు పార్టీకి చేందిన ఇరువర్గాలు వారు వారు గోడవపడి గోడవకు సంబందమే లేని వైఎస్ఆర్ సిపి ని, తనను ఇందులో లాగి తెలుగుదేశం పార్టీ పబ్లిసిటీ స్టంట్ మొదలు పేట్టిందని మాజీ కౌన్సిలర్ అనంద్ రెడ్డి తేలిపారు. అన్నమయ్య జిల్లా, రాయచోటి పట్టణ పరిధలోని ఎగువ అబ్బవరం లో నిన్న జరిగిన దాడి సంఘటన పై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. గంగిరెడ్డి, సుబ్బారెడ్డి లు ఇరువురు తెలుగుదేశం పార్టీ కి చెందిన వారేనని తేలిపారు సుబ్బారెడ్డి కంచాలమ్మ గండి లో జేసిబి పెట్టి మట్టి ని ట్రాక్టర్లు నింపుతుంటే గంగిరెడ్డి కోడవలితో సుబ్బారెడ్డి జేసిబి వద్దకు వెళ్లి బేదిరించాడని అనంద్ రెడ్డి స్పష్టం. అక్కడే వున్న ట్రాక్టర్ డ్రైవర్ పవన్ మనకేందుకలే ఈ గోడవలు అని అక్కడ నుంచి ఇంటికి వెళ్లిపోతే పవన్ ఇంటిదగ్గరకి కేళ్ళి పవన్ అమ్మపై గంగిరెడ్డి దాడి చేశాడని, దింతో వారు కూడ ఏదురుదాడి చేస్తే ఇరువర్గాలకు గాయాలయ్యాయని అనంద్ రెడ్డి తెలిపారు. దాడి జరిగిన సంఘటన స్థలాన్ని బట్టి ఎవరు దాడి చేశారో అర్దం కావడం లేదా అని ప్రశ్నించారు. పవన్ ఇంటి దగ్గరకు కోడవలితో దాడి దిగాల్సిన అవసరం ఏముందని, పవన్ గంగిరెడ్డి ఇంటిదగ్గరకి వెళ్లి దాడి చేశాడా? అని ప్రశ్నించారు. పవన్ తల్లి గోడవ జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిందని, ఆ ఫిర్యాదు నుంచి తప్పించుకోవడానికి టిడిపి నాయకులు రాజకీయ డ్రామా నడిపారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు విని అభం శుభం తెలియని చదువుకోనే విద్యార్థులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం టిడిపి నాయకులనే ప్రశ్నించారు. మీరు మీరు తగువులాడుకోని అమాయక విద్యార్థులపై కేసులు పెట్టడం తగదని సూచించారు.

👉 JEE అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన షాద్‌నగర్ విద్యార్థిని త్యారాల హాసిని..*OBC కేటగిరీలో 5749వ ర్యాంక్* ..*షాద్ నగర్ పద్మశాలీ సంఘం తరఫున ఘన సత్కారం*JEE అడ్వాన్స్‌డ్ 2025 ఫలితాల్లో, షాద్‌నగర్‌కు చెందిన విద్యార్థిని త్యారాల హాసిని OBC-NCL కేటగిరీలో 5749వ ర్యాంక్ సాధించి తన ప్రతిభను మరోసారి నిరూపించుకుంది.హాసిని 10వ తరగతిని షాద్‌నగర్‌లోనే చదివి, ఇంటర్మీడియట్‌ను హైదరాబాద్‌లోని ప్రైవేట్ కళాశాలలో పూర్తి చేసింది. ఇప్పటివరకు ఆమె EAMCETలో 880వ ర్యాంక్, JEE Mainsలో 17,558 ర్యాంక్ సాధించగా, ఇప్పుడు JEE Advanced పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరచింది..ఈ గర్వకారణమైన విజయాన్ని గుర్తించి, షాద్‌నగర్ పద్మశాలీ సంఘం మహిళా అధ్యక్షురాలు శ్రీమతి బాస వరలక్ష్మి, హాసినిని మరియు ఆమె తల్లిదండ్రులను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “చదువులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారు భవిష్యత్తులో ఉన్నత విద్యాస్థాయులు చేరుకుంటారు. హాసినిలాంటి విద్యార్థులు మరెందరోకి స్ఫూర్తిగా మారాలి. ఆమె దేశానికి సేవ చేసే స్థాయికి ఎదగాలి,” అని అన్నారు.హాసినికి అఖిల భారత స్థాయిలో ఐఐటీ ప్రవేశానికి మార్గం సుగమమవ్వడంతో, షాద్‌నగర్ ప్రజల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఆమె ఈ విజయంతో మరిన్ని విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందన్నది ఖాయం అని అన్నారు.

👉 కూకట్‌పల్లిలో రూ. 2 కోట్ల విలువైన డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్.. ఆంధ్రా కానిస్టేబుల్ హస్తం ..హైదరాబాద్‌ నగరం మళ్లీ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కూకట్‌పల్లిలో జరిగిన పోలీసుల మెరుపు దాడుల్లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడి నగరాన్ని కుదిపేసింది. హైదరాబాద్‌ నగరం మళ్లీ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కూకట్‌పల్లిలో జరిగిన పోలీసుల మెరుపు దాడుల్లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడి నగరాన్ని కుదిపేసింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, డ్రగ్స్ సరఫరాలో దూకుడు చూపుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. విచారణలో అరెస్టైన వారంతా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. ఈ కేసులో తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్ కూడా ముఠాతో సంబంధాలు కలిగి ఉండటంతో అతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.  అరెస్టుల్లో ఉన్న వ్యక్తుల వద్ద నుంచి దాదాపు 800 గ్రాముల హెరాయిన్, ఎపిడ్రిన్ మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ముఠాలో పోలీస్ సిబ్బంది కూడా కలిసిపోవడం అధికారులను ఆందోళనకు గురి చేసింది. పరారీలో ఉన్న కానిస్టేబుల్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు మే 30న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్‌లో ఉన్న ఓ దాబా వద్ద నిర్వహించిన తనిఖీలో ఒకటిన్నర కిలోల హెరాయిన్‌తో పాటు గంజాయి, ఓపీఎం వంటి ఇతర మత్తు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్వోటీ పోలీసులు తెలిపారు. పట్టుబడిన డ్రగ్స్ మార్కెట్ విలువ రూ. 3 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా. ఈ వరుస ఘటనల మధ్య సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా తీసుకున్న నిశ్చయాన్ని మరింత బలంగా అమలు చేస్తూ, మత్తు పదార్థాల పై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు. యువతను మత్తు పదార్థాల నుంచి రక్షించేందుకు పోలీసులు నగరమంతా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాల విక్రయంపై, నేరంగా భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పోలీసులు యువత, తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేస్తూ డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌ను డ్రగ్ స్మగ్లింగ్ కేంద్రంగా మలచే ప్రయత్నాలను ప్రభుత్వం,పోలీసులు సమూలంగా అణచివేయాలని నిశ్చయించారు. ఒకవైపు పోలీసులు దాడులు జరుపుతూ నేరగాళ్లను పట్టుకుంటుండగా, మరోవైపు ముఠాలు నిత్యం మారు మారు రూపాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ దృష్టిలో ఇప్పుడు ఇదొక అత్యవసర సమస్యగా మారింది. ఇలాంటి దందాలకు సమూలంగా తెరదించాలంటే ప్రజల సహకారం, సమాచారాన్ని పంచుకోవడం కీలకం.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..