👉దేశం మొత్తాన్ని మోడీ సర్కార్ తప్పుదారి పట్టించింది:కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే..*రఫేల్ యుద్ధ విమానాలు నేలకూలడంపై కేంద్రం సమాధానం చెప్పాలి : బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..👉 వాజ్ పేయి చేసింది మోడీ ఎందుకు చేయడం లేదు?.. కాంగ్రెస్ కీలక పాయింట్!..మన దేశ రక్షణ రంగం ఇన్ని ఇబ్బందుల్లో ఉందా !!!

👉 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో 26 మంది సైనికులు మరణించినా కేంద్రం నిశ్శబ్దంగా ఉందని, “ట్రంప్ బెదిరింపులతో యుద్ధాన్ని మధ్యలోనే ఆపేశారని ఆరోపించారు.యుద్ధ విరమణతో 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్ ముందు తాకట్టు పెట్టారని, అఖిల పక్ష సమావేశం జరపకుండా నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు. “పీవోకేను స్వాధీనం చేసుకోవాలని, బలూచిస్థాన్‌ను విడగొట్టాలని తాము సూచించినా, బీజేపీ ప్రభుత్వానికి ధైర్యం లేదని రేవంత్ ధ్వజమెత్తారు. “రఫేల్ యుద్ధ విమానాలు నేలకూలడంపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సైనికుల ఆత్మస్థైర్యాన్ని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు. జైహింద్ ర్యాలీ ద్వారా సైనికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్ ఎన్ని రఫేల్ విమానాలను కూల్చిందనే లెక్క చెప్పాలని, “వేల కోట్ల కాంట్రాక్టులను సన్నిహితులకు కట్టబెట్టారని ఆయన విమర్శించారు. మోదీ నాయకత్వం దేశాన్ని యుద్ధంలో గెలిపించలేదని, కాలం చెల్లిన రూపాయి నోటుతో సమానమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి అవసరమని, ఆయన ప్రధానిగా ఉంటే పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేసేవారని రేవంత్ పేర్కొన్నారు..కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. “రాహుల్ నాయకత్వంలోనే పాకిస్థాన్, చైనా వంటి దేశాలను ఓడించగలమని, పీవోకేను స్వాధీనం చేసుకోగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సొంత ఇల్లు లేని నాయకుడిగా రాహుల్‌ను అభివర్ణిస్తూ, ఆయన ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తారని కొనియాడారు. “బీజేపీ ప్రభుత్వం దేశ గౌరవాన్ని కాపాడలేకపోయిందని, “యుద్ధ సమయంలో తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని బలహీనపరిచాయని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి బలమైన దిశను చూపుతుందని రేవంత్ నొక్కిచెప్పారు.

👉దేశం మొత్తాన్ని మోడీ సర్కార్ తప్పుదారి పట్టించింది: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే…. మోడీని వెంటాడుతున్న కాంగ్రెస్!

“పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ గురించి చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ మోడీ సర్కార్ ని వెంటాడుతోన్న సంగతి తెలిసిందే.. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ గురించి చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ.. మోడీ సర్కార్ ని వెంటాడుతోన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా పాకిస్థాన్ పై ఇటీవల జరిపిన దాడిలో భారత వైమానిక దళానికి కూడా నష్టం వాటిల్లిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్ లో అంగీకరించిన అనంతరం ఈ డిమాండ్ మరింత పెరింది. అవును…   పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ గురించి చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ వరుసగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు గల ఆవశ్యకతను స్పష్టంగా చెబుతోంది. ఈ సమయంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ డిమాండ్ ను మరోసారి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై (పరోక్షంగా) విమర్శలు గుప్పించారు!  *ఆపరేషన్ సిందూర్ విషయంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని ఇప్పటికే ఆరోపించిన ఖర్గే… భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రెడిట్ తీసుకోవడంపై స్పష్టత ఇవ్వడానికి బదులుగా.. సాయుధ దళాల పరాక్రమానికి వ్యక్తిగత క్రెడిట్ తీసుకొని ఎన్నికల మెరుపుదాడిలో ఉన్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. * ఈ క్రమంలో తాజాగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చీఫ్…ఈ సందర్భంగా తాజాగా మీడియాతో మాట్లాడిన ఖర్గే… “సాయుధ దళాలకు పూర్తి అధికారం ఇచ్చానని గతంలో చెప్పిన ప్రధాని.. ఇప్పుడు మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నరని ప్రశ్నించారు. “ప్రధానమంత్రి స్వీయ ప్రశంసల ప్రసంగాలు చేయకూడదని.. ఒకసారి పార్లమెంటును సమావేశపరిచి మాట్లాడుకుందామని తాము ఇప్పటికే పలుమార్లు చెప్పామని అన్నారు. పాకిస్థాన్ కూడా ఇప్పటికే అలా చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా… ఆపరేషన్ సిందూర్ అనంతరం “పాకిస్థాన్ కూడా తమ పార్లమెంటును సమావేశపరిచిందని, చర్చలు జరుపుతోందని.. “మోడీ కూడా పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలని కోరారు. మనలో ఎవరూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడరని ఖర్గే అన్నారు. మొత్తం దేశం మన సాయుధ దళాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మోడీ స్వీయ ప్రశంసల ప్రసంగాలు మానుకోవాలని పునరుద్ఘాటించారు! ఇదే సమయంలో… చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్ లో ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రస్థావించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే… “సింగపూర్ లో సీడీఎస్ చేసిన వ్యాఖ్యలపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే వీటిని అడగొచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలోనే… “దేశం మొత్తాన్ని మోడీ సర్కార్ తప్పుదారి పట్టించిందని ఖర్గే పేర్కొన్నారు! మరి.. ఇలా పదే పదే ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని.. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, సింగపూర్ లో సీడీసీ ఇంటర్వూతో పాటు పలు విషయాలపై చర్చించాల్సిన అవసరం ఉందని.. పూర్తి వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాద్యత ఉందని కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ కు అనుకూలంగా మోడీ సర్కార్ ఎప్పటికి స్పందిస్తుందనేది వేచి చూడాలి!

👉 వాజ్ పేయి చేసింది మోడీ ఎందుకు చేయడం లేదు?.. కాంగ్రెస్ కీలక పాయింట్!..పాకిస్థాన్ పై ఇటీవల జరిపిన దాడిలో భారత వైమానిక దళానికి కూడా నష్టం వాటిల్లిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ పై ఇటీవల జరిపిన దాడిలో భారత వైమానిక దళానికి కూడా నష్టం వాటిల్లిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే.. “భారత్ కు చెందిన ఆరు విమానాలను కూల్చేసినట్లు పాక్ చెప్పడం మాత్రం అసత్యమని చెప్పి ఖండించిన ఆయన.. “కచ్చితంగా ఎన్నింటిని కోల్పోవాల్సి వచ్చిందనేది మాత్రం వెల్లడించలేదు. షాంగ్రిలా డైలాగ్ లో పాల్గొనడం కోసం సింగపూర్ వెళ్లిన ఆయన బ్లూమ్ బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ఆపరేషన్ సిందూర్ లో భారత్ కోల్పోయిన యుద్ధ విమానాలపై తొలిసారి స్పందించారు. దీంతో.. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో.. “వాజ్ పేయి పాఠాలను గుర్తు చేస్తూ మోడీ సర్కార్ ను మందలించే పనికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. సింగపూర్ లో ఆపరేషన్ సిందూర్ పై సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు భారతదేశ సైనిక నష్టాలను అంగీకరించాయని.. వాటిని తీవ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని.. దీనిపై విస్తృత రాజకీయ చర్చ అవసరమని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. సైనిక అధికారి విదేశాలలో ఈ విషయాలు వెల్లడించడం ఏమిటని ప్రశ్నించారు. అంతకంటే ముందు రక్షణ మంత్రి రాజకీయ పార్టీలకు ఈ విషయాలను గురించి తెలియజేయాల్సిందని ఈ సందర్భంగా జైరాం రమేష్ నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే చెప్పిన మాటలను గుర్తు చేస్తూ.. కార్గిల్ సమీక్ష కమిటీ మాదిరిగానే స్వతంత్ర నిపుణుల కమిటీ ద్వారా భారతదేశ రక్షణ సంసిద్ధతను సమగ్రంగా సమీక్షించాలని రమేష్ పునరుద్ఘాటించారు.  ఈ సందర్భంగా “1999 జూలైలో కార్గిల్ యుద్ధం ముగిసిన మూడు రోజుల తర్వాత నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి కార్గిల్ సమీక్ష కమిటీని ఏర్పాటు చేశారని.. ప్రస్తుతం విదేశాంగ మంత్రి జైశంకర్ తండ్రి ఈ నివేదికను తయారు చేసిన నలుగురు సభ్యులలో ఒకరని కాంగ్రెస్ నాయకుడు ఎత్తి చూపారు. ఆ ఆలోచన మోడీ చేయలేకపోతున్నారని అన్నారు. ఈ సమయంలో తాము అడిగిందల్లా ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించి పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడమే అని చెప్పిన జైశంకర్… సింగపూర్ లో జనరల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యల అనంతరం తమ డిమాండ్ మరింత సందర్భోచితం చేస్తుందని అన్నారు. ఇదే సమయంలో.. 1994 ఫిబ్రవరి 22 నాటి పీఓకే తీర్మానాన్ని పునరుద్ఘాటించే తీర్మానంగా అది ఉండాలని అన్నారు.
👉మోదీ గొప్పలు సరే ..మన దేశ రక్షణ రంగం ఇన్ని ఇబ్బందుల్లో ఉందా ???..వాయిసేన చీఫ్ చెప్పారుగా..
భారత వాయుసేన అధిపతి అమర్‌ప్రీత్ సింగ్ రక్షణ రంగంలో కాంట్రాక్టుల ఆలస్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీఐఐ సమావేశంలో రక్షణ మంత్రి సమక్షంలో మాట్లాడుతూ, కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతున్నా, ఆయుధాలు సకాలంలో అందడం లేదని విమర్శించారు. సకాలంలో పూర్తయిన ఒక్క ప్రాజెక్టు కూడా గుర్తుకు రావడం లేదని, చేయలేని పనులకు వాగ్దానాలు చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. దేశ రక్షణ శక్తిని బలోపేతం చేయడానికి సమయోచిత చర్యలు కీలకమని, ఆలస్యం దేశ భద్రతను బలహీనపరుస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రక్షణ రంగంలో సమర్థత, జవాబుదారీతనం అవసరమని స్పష్టం చేశాయి.
తేజస్ ఎంకే1, ఎంకే2 ప్రాజెక్టుల ఆలస్యంపై అమర్‌ప్రీత్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తేజస్ ఎంకే1 ఇప్పటికే గణనీయంగా ఆలస్యమైందని, ఎంకే2 ప్రొటోటైప్ ఇంకా అందుబాటులోకి రాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఆలస్యాలు వాయుసేన సామర్థ్యంపై ప్రభావం చూపుతున్నాయని, యుద్ధ సన్నద్ధతకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. “రక్షణ దళాలను శక్తిమంతం చేయడం ద్వారానే యుద్ధాల్లో విజయం సాధ్యమవుతుందని, సమయానుకూల  చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు.”రక్షణ కాంట్రాక్టుల ఆలస్యం దేశ భద్రతకు సవాలుగా మారిందని అమర్‌ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. ఆయుధాల సరఫరా, ప్రాజెక్టుల అమలులో జాప్యం దేశ రక్షణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం, రక్షణ సంస్థలు కలిసి పనిచేయాలని, సమన్వయంతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు. వాయుసేన అధిపతి వ్యాఖ్యలు రక్షణ రంగంలో సంస్కరణల అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. ఈ విమర్శలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..