👉మోడీని ఇరుకున పెట్టిన ట్రంప్… స్టార్ట్ చేసిన కాంగ్రెస్!…👉SSC వాల్యుయేషన్‌లో బయటపడ్డ తీవ్ర లోపాలు.. ఐదుగురు వాల్యుయేటర్లు సస్పెండ్!..కడప జిల్లా మైలవరంలో చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్…👉డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళ మృతి?..👉 వర్షాలు పడుతున్న ఆగని మట్టి మాఫియా సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులు..(పామర్రు)👉షాద్ నగర్ లో దాబాలో రూ. 3కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత..*👉 సచివాలయ ఉద్యోగిపై అనంతపురం టిడిపి చోటా నాయకుడి దూషణల పర్వం*..సైబర్‌ కేటుగాడి మాయమాటలతో భారీగా నగదు పోగొట్టుకున్న వృద్ధుడు..👉నకిలీ ఫోన్ పే యాప్ తో ఘరానా మోసం..ట్రేడింగ్ స్కాములతో వేల కోట్లు మాయం !..👉 డబ్బులు డబుల్ చేస్తామని నమ్మించి 150 కోట్లు మోసం* .👉మాదాపూర్ లో యువకుడి దారుణ హత్య?*..

👉మోడీని ఇరుకున పెడుతున్న ట్రంప్… స్టార్ట్ చేసిన కాంగ్రెస్!… పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ – పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నడిచిన సంగతి తెలిసిందే.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ – పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నడిచిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారత్ సైన్యం పాక్ ని వణికించేస్తోందనే చర్చ నడించింది. ఈ దెబ్బతో పాక్ పని అయిపోయిందని అనుకుంటున్న వేళ.. సడన్ గా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరింది అంటూ ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు. అనంతరం ఇటు భారత్ నుంచి, అటు పాకిస్థాన్ నుంచి అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. ఆ సంగతి అలా ఉంటే… ఈ సీజ్ ఫైర్ జరిగిందనే విషయం కంటే.. ఆ ప్రకటనను తొలుత ట్రంప్ చేశారనే విషయంపై తీవ్ర చర్చ నడించింది.

మరోపక్క.. ట్రంప్ ఒత్తిడికి భారత్ ఎందుకు లోంగాల్సివచ్చిందనే చర్చా నడిచింది. అయితే.. వాణిజ్యం పేరు చెప్పి ఒప్పించినట్లు ట్రంప్ చెప్పుకున్నారు.. అయితే ఆ విషయాన్ని భారత్ ఖండించింది. సీజ్ ఫైర్ చర్చల మధ్య వాణిజ్యం అనే ప్రస్థావనే రాలేదని చెప్పింది! అయితే.. ట్రంప్ మాత్రం ఈ విషయాన్ని వదలడం లేదు! భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని పదే పదే ప్రకటించుకుంటున్నారు. దీంతో… ప్రధాని మోడీపై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.  *అవును… భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకోవడంపై ప్రధాని మోడీని కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రశ్నించింది. ఇందులో భాగంగా… భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానంటూ ట్రంప్ పదే పదే ఈ విషయాన్ని ప్రస్థావిస్తున్నారని.. *గత 21 రోజుల్లో ఇది 11వ సారి అని జైరాం రమేశ్ పోస్ట్ పెట్టారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణలు తగ్గించడానికి తాము జోక్యం చేసుకున్నామని.. వాణిజ్యాన్ని ఒక సాధనంగా వాడామని చెప్తున్నారని.. చివరికి కోర్టులోనూ ట్రంప్ ఇదే వాదన వినిపించారని.. *కానీ దీనిపై ట్రంప్ స్నేహితుడు మోడీ మాత్రం పూర్తి మౌనం వహిస్తున్నారని చెబుతూ.. ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పోస్ట్ పెట్టారు.( ఆయనపై గతంలో ఎన్నో అపనిందలు వేశారు అయినా ఆయన విప్పారా ???)  కాగా… భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణకు తామే మధ్యవర్తిత్వం వహించామని.. ఉద్రిక్తతలకు ముగింపు పలికితేనే వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటామని చెప్పామని.. లేకపోతే ఎలాంటి వాణిజ్యం చేయబోమని స్పష్టం చేశామని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే!..

👉డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళ మృతి?..నిజామాబాద్ జిల్లా:మే 30..నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని ఓ ప్రవేట్ ఆసుపత్రి లో డాక్టర్ల నిర్లక్ష్యంతోశుక్రవారం ఉదయం ఓ మహిళ మృతి చెందింది, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగల్ గ్రామానికి చెందిన మహిళ గత కొద్దిరోజులుగా వెన్ను నొప్పితో బాధపడుతుం డగా ఆ మహిళను మూడు రోజుల క్రితం స్థానిక ఆసుపత్రికి తీసుకు రాగా, గురువారం రాత్రి ఆమెకు వెన్నుపూసకు సంబంధించి సర్జరీ చేశారు..ఆపరేషన్ చేసిన అనం తరం వెంటిలేటర్ పైనే ఉంచారని శుక్రవారం ఉద యం పరిస్థితి విషమించి మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. గుండెపోటుతో ఆమె మృతి చెందిందని వైద్యులు తెలపడంతో మృతురాలి బంధువులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట బైఠాయించి వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. .వైద్యుల నిర్లక్ష్యం కారణం గానే తన భార్య మృతి చెందిందని ఆమె భర్త సురేశ్ ఆరోపించాడు. మృతురా లు రాధిక కు ఐదేళ్ల పాప ఉన్నట్లు తెలిసింది. మృతురాలి బంధువుల ఆందోళనతో భారీగా పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. నగర సీఐ శ్రీనివాసరాజ్ ఆధ్వర్యంలో బరిగా పోలీసులు మోహరించారు..రాధిక మృతికి కారణమైన వైద్యులను అరెస్టు చేసే వరకు కదిలేది లేదని మృతురాలు బంధువులు పోలీసులతో వాగ్వివాదా నికి దిగారు. సుమారు 5, 6 గంటల తర్వాత గొడవ సద్దుమణిగింది. అనంతరం ప్రతిభా ఆసుపత్రి యాజ మాన్యం, వైద్యులు మీడి యాతో మాట్లాడుతూ… వెన్నపూసకు సంబంధించి ఆపరేషన్ పూర్తి చేశాక రక్తస్రావం ఎక్కువగా జరిగిందని, అది జన్యు పరమైన లోపం ఉండడం తోనే జరిగిందని తెలిపారు. చికిత్స పొందుతూ సడెన్ గా కార్డియాకు అరెస్టు అయి మృతి చెందిందని వైద్యుల ఆరోపణ.

👉షాద్ నగర్ లో దాబాలో రూ. 3కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత..* *సైబరాబాద్‌ పరిధిలో భారీగా హెరాయిన్‌ పట్టివేత* *ఒకటిన్నర కిలోల హెరాయిన్‌ స్వాధీనం* *షాద్‌నగర్‌లోని ఓ దాబాలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠా* *హెరాయిన్‌తోపాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్‌ పట్టివేత* *మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని పట్టుకున్న పోలీసులు* డ్రగ్స్‌ను ఎక్కడికి అక్కడ కట్టడి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.. కానీ గ్రామ స్థాయిల వరకు డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని అధికారులు గుర్తించ లేకపోతున్నారు.. ఏకంగా జాతీయ రహదారుల వెంబడి ఉన్న దాబాలు హోటల్స్‌లో ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది.. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని దాబాలలో డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక మార్వాడి కొన్నాళ్ల క్రితం షాద్‌నగర్ ప్రాంతానికి వచ్చి దాబా ఏర్పాటు చేసుకున్నాడు.. మధ్యప్రదేశ్ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ని తీసుకువచ్చి తన కస్టమర్లకు అమ్ముతుండేవాడు. ఇటీవల కాలంలో సదరు డాబా యజమాని చనిపోయాడు. అయితే అందులో కుక్ గా చేరి చివరికి మేనేజర్ స్థాయికి చేరుకున్నారు.. డ్రగ్స్ ను మధ్యప్రదేశ్ నుంచి తెప్పించి అమ్మడం మొదలు పెట్టాడు.. ఎవరికి ఎలాంటి డ్రగ్స్ కావాలన్నా ఈజీగా అమ్మేస్తున్నారు.. సైబరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో దాబాపై నిఘా పెట్టి డ్రగ్స్ పట్టుకున్నారు.. ఏకంగా కిలోన్నార హెరాయిన్‌తో పాటు గంజాయి, ఓపియంతో పాటు మరికొన్ని రకాల డ్రగ్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా డ్రగ్స్ సూపర్ మార్కెట్‌ను పెట్టేసి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.. దాదాపు మూడు కోట్ల పైచిలుకు విలువచేసే డ్రగ్స్ ను అధికారులు స్వాధీన పరుచుకున్నారు.. దాబాలోని డ్రగ్స్ అమ్ముతుండగానే చూసి ఒక్కసారిగా అధికారులు  ఆవాక్కు అయ్యారు. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ లో దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడిస్తున్నారు.( దేశంలో నిత్యం కోట్ల విలువైన గంజాయి డ్రగ్స్ పట్టుబడుతున్నాయని వార్తలు వస్తున్నాయి కానీ దీనికి సంబంధించిన అసలు సూత్రధారులు ఎవరో  పోలీస్ శాఖ బట్ట బయలు చేయలేక పోతుంది..)

👉 సచివాలయ ఉద్యోగిపై అనంతపురం టిడిపి చోటా నాయకుడి దూషణల పర్వం*  మహానాడుకు జనాన్ని తరలించలేదని బూతులు తిట్టిన టిడిపి నాయకుడు రాజేష్ నాయుడు .. డీఎంహెచ్వో కార్యాలయం వద్ద హోటల్ నిర్వహిస్తున్న రాజేష్ నాయుడు

కడపలో జరిగిన మహానాడుకు జనాన్ని తరలించలేదని అరవింద్ నగర్ సచివాలయ ఉద్యోగి అశ్వత్ రెడ్డి పై చెప్పలేని భాషలో దూషించిన రాజేష్ నాయుడు.. నువ్వు ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను అంటూ బెదిరింపులు ..రాజేష్ నాయుడు బెదిరింపులపై ఆందోళనలకు సిద్ధమవుతున్న సచివాలయ ఉద్యోగులు

👉 వర్షాలు పడుతున్న ఆగని మట్టి మాఫియా సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులు..పామర్రు మండలం గుడివాడ అడ్డరోడ్డు ఫ్లై ఓవర్ పక్కన స్మశానాల్లోంచి మట్టి తోలకాలు ఇంత వర్షం పడుతున్న ఆగని మట్టి మాఫియా అధికారులు కూడా దానికి సహకరిస్తున్నారు ఇది చూస్తే మీకు అంతా అర్థమవుతుంది.వర్షాలు పడుతున్న ఆగని మట్టి మాఫియా.. అన్నిచోట్ల ఇదే తంతు వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అడిగితే మీకు దిక్కున చోట చెప్పుకో అని అంటున్న వయనం.వీళ్ళ పుణ్యమా అని బురదలో పడిపోయి దెబ్బలు తగిన వాళ్ళకి దిక్కు మొక్కు లేదు అందరూ బానే సంపాదించుకుంటున్నారు అధికారులు నిద్రపోతున్నారు అంతే మన ప్రభుత్వాలు అంతే జనాల్ని పైకి రానివ్వరు ఎప్పటికీ పైకి రానివ్వరు ఉన్నోళ్లు ఉన్నోళ్లు బాగుపడాల్సిందే అంతే

👉వైయస్సార్ కడప జిల్లా మైలవరంలో చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ అన్నమయ్య జిల్లాలో ప్రెస్ మీట్…కడప జిల్లాలో మైలవరంలో ఆరు రోజుల కిందట అభం శుభం తెలియని పసిబిడ్డను కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని కోరారు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు.

కడప జిల్లాలో ఇటీవల అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారాన్ని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ తెలియజేశారు. ఈమేరకు జనసేన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ చిన్నారి మృతికి కారణమైన దోషులను కఠినంగా శించాలని, అధికారులు, పోలీసు యంత్రాంగం ఇలాంటి తప్పులు చెయ్యాలంటే బయపడేలా కొన్ని దేశాల్లో ఉన్నట్లు బహిరంగ శిక్షలు అమలు చెయ్యాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లలకు సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు తెలియజేసి వారిని చైతన్యవంతం చెయ్యాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ భాద్యతగా వ్యవహరించాలని కోరారు

👉SSC వాల్యుయేషన్‌లో బయటపడ్డ తీవ్ర లోపాలు.. ఐదుగురు వాల్యుయేటర్లు సస్పెండ్!

ఆంధ్రప్రదేశ్‌లో 2025 మార్చిలో నిర్వహించిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో వాల్యుయేషన్ లో తీవ్రమైన లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమై చర్యలకు ఉపక్రమించింది. తొలిసారిగా, ఘోరమైన తప్పిదాలకు పాల్పడిన ఐదుగురు మూల్యాంకనాధికారులను (Evaluators) సస్పెండ్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.రికార్డు స్థాయిలో RV/RC దరఖాస్తులు..ఈసారి SSC పరీక్షల ఫలితాలపై అనేక సందేహాలు తలెత్తడంతో విద్యార్థులు భారీగా రివాల్యుయేషన్ (Reverification), రీకౌంటింగ్ (Recounting) కు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 66,363 స్క్రిప్టులపై దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 64,251 రీవాల్యుయేషన్, కాగా 2,112 రీకౌంటింగ్ దరఖాస్తులు ఉన్నాయనేది స్వయంగా విద్యాశాఖ విడుదల గణాంకాలు చెబుతున్నాయి. ఈ స్క్రిప్టులలో 11,175 స్క్రిప్టుల్లో మార్కుల లోపాలు గుర్తించినట్లు తెలుస్తోంది. అంటే సుమారుగా 18% తేడాలు తేలాయి. మిగతా 55,188 స్క్రిప్టుల్లో ఎటువంటి మార్పులు రాలేదు..ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ఉదాహరణ మరింత కలకలం రేపింది. ఓ విద్యార్థిని అన్ని సబ్జెక్టులలో 90కి పైగా మార్కులు సాధించగా, సోషల్ సబ్జెక్టులో కేవలం 23 మార్కులు రావడంతో ఆమె రీవాల్యుయేషన్‌ కు దరఖాస్తు చేసింది. రీవాల్యుయేషన్ ఫలితాలలో అదే సోషల్ సబ్జెక్టులో ఆమెకు 96 మార్కులు వచ్చాయి. ఆమె మొత్తం మార్కులు 575/600గా నమోదయ్యాయి. ఈ విషయం బయటకు రావడంతో, మిగతా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. దీంతో రీవాల్యుయేషన్‌ కోసం ముందుకు వచ్చారు.తేలిన లోపాలు – విధాన పరమైన వైఫల్యాలు..రీవాల్యుయేషన్‌ ప్రక్రియలో గుర్తించిన లోపాలు: టోటలింగ్ లోపాలు: మార్కుల మొత్తాన్ని తప్పుగా లెక్కించడం.OMRలో మార్కుల నమోదు లోపం: స్క్రిప్ట్‌లో ఇచ్చిన మార్కులు OMR షీట్‌లో తప్పుగా మార్పిడి..మార్కులు ఇవ్వకపోవడం: కొన్ని సరైన సమాధానాలకు మార్కులు ఇవ్వకపోవడం లేదా శూన్యంగా ఉండిపోవడం.ఇన్ని లోపాలు ఉన్నా మూడు స్థాయిల పర్యవేక్షణ వ్యవస్థ, అసిస్టెంట్ ఎగ్జామినర్లు (AEs), స్పెషల్ అసిస్టెంట్లు (SAs), చీఫ్ ఎగ్జామినర్లు (CEs) – వాటిని గుర్తించడంలో విఫలమైంది. ఇది వ్యవస్థపై విశ్వాసాన్ని కుదిపేసింది.

RGUKT (IIIT) అడ్మిషన్ గడువు – విద్యార్థుల ఆవేదన..ఇంతలో RGUKT (IIIT) ప్రవేశాల దరఖాస్తు గడువు మే 20, 2025తో ముగిసింది. RV ఫలితాల వల్ల మార్కులు పెరిగిన అనేక మంది విద్యార్థులు తాజా మార్కులతో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో, పాఠశాల విద్యాశాఖ RGUKT యాజమాన్యానికి జూన్ 5 నుండి 10 వరకు ప్రత్యేకంగా అప్లికేషన్ విండో ప్రారంభించాలన్న విజ్ఞప్తిని పంపింది. దీని వల్ల రీవాల్యుయేషన్‌ ద్వారా అర్హత సాధించిన విద్యార్థులు కూడా IIIT ప్రవేశాలకు అప్లై చేయవచ్చు.ముందస్తు చర్యలు – వ్యవస్థలో మార్పులపై దృష్టి..విద్యాశాఖ ఈ సందర్భాన్ని శిక్షణగా తీసుకుని, ముందుకు ఈ లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది. 2026 నుండి నిర్వహించనున్న SSC పరీక్షలలో OMR డిజైన్ మార్చడం, మూడు స్థాయిల పర్యవేక్షణను మరింత కఠినతరం చేయడం, తప్పుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వంటి చర్యలను తీసుకోవాలని నిర్ణయించింది.

👉వృద్ధుడి అత్యాశే కొంపముంచింది. సైబర్‌ కేటుగాడి మాయమాటలతో భారీగా నగదు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు బాధితుడు డబ్బు సంపాదించాలని గత మార్చిలో బుల్‌ మార్కెట్‌ ద్వారా ఎక్స్‌పర్ట్స్‌ ప్రొ లిమిటెడ్‌ సంస్థలో రూ.21 వేలు మదుపు చేశాడు. తర్వాత ఆ సంస్థ ప్రతినిధినంటూ లైన్‌లోకి వచ్చిన వ్యక్తి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొచ్చేలా టిప్స్‌ చెబుతానని నమ్మబలికాడు. డాలర్లలో అంతర్జాతీయ స్టాక్‌ ట్రేడింగ్‌ గురించి చెప్పి బురిడీ కొట్టించాడు.రూ.లక్షల్లో మదుపు చేస్తే రూ.కోట్లలో లాభాలుంటాయని నమ్మించడంతోపాటు ప్రారంభంలో లాభాలు రుచి చూపించాడు. అలా రూ.61.95 లక్షలు మదుపు చేయించారు. 75 వేల అమెరికా డాలర్ల బ్యాలెన్స్‌ ఉన్నట్లు చూపి విత్‌ డ్రా చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇంకా పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడితో సైబర్‌ మోసమని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

👉నకిలీ ఫోన్ పే యాప్ తో ఘరానా మోసం..*‼️ *ఫోన్ పే  స్కానర్ ద్వారా డబ్బులు తీసుకునేవారు తమ అకౌంట్ ని తప్పకుండా చెక్ చేసుకోవాలి…* *మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది…*పూర్తి వివరాల్లోకి వెళితే….➡️కొన్ని నెలల క్రితం మందమర్రి పాత బస్టాండులో ఒక వ్యక్తి సూపర్ మార్కెట్లోకి వచ్చే నిత్యవసర సరుకులను కొనడం జరిగింది…బిల్లు వేయి రూపాయలు కాగా సరుకులు కొన్న వ్యక్తి ఫోన్ పే స్కానర్ ద్వారా పే చేసినట్లు యజమానికి చూపించి తన ఖాతాలో నుండి డబ్బులు కట్టయినట్టు ఫోన్ పే ద్వారా ఆ సూపర్ మార్కెట్ యజమానికి చూపించాడు… ఆ వ్యక్తి యజమానికి డబ్బులు వచ్చాయని చెప్పి సరుకులు తీసుకెళ్లడం జరిగింది… కొంత సమయం తర్వాత యజమానికి అనుమానం వచ్చి తన అకౌంట్లో చెక్ చేసుకోగ సూపర్ మార్కెట్ యాజమాని ఖాతాలోకి డబ్బులు రాకపోయేసరికి తను నకిలీ కేటుగాళ్ల వలలో పడి మోసపోయినానని గ్రహించారు… చుట్టు ప్రక్కల స్థానికులకు విషయం తెలిస్తే షాపు పరువు పోతుందన్న భయంతో యజమాని కొన్ని నెలల వరకు ఎవరికీ విషయాన్ని తెలియని ఇవ్వకపోవడంతో, విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది అధికారులు ప్రజలకు పదేపదే ఈ నకిలీ ఫోన్ పే యాప్ మరియు సైబర్ మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తలు వహించాలని హెచ్చరిస్తూనే ఉన్నారు…మందమర్రి పట్టణంలో నకిలీ ఫోన్ పే మోసాలకు పలుపడుతున్న కేటుగాళ్ల వలలో పడకుండా వ్యాపారస్తులు, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు… *వ్యాపారస్తులు చిన్న షాపు వారు ప్రతి ఒక్కరు తస్మాత్ జాగ్రత్త…*

👉మాదాపూర్ లో యువకుడి దారుణ హత్య?*

హైదరాబాద్:మే 31..హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. యశోద ఆసుపత్రి వెనకాల ఉన్న ప్రాంతంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడి, ఇద్దరు యువకులపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒక యువకు డు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మణికొండ ప్రాంతానికి చెందిన జయంత్ గౌడ్ అనే యువకుడి తన తల్లి పుట్టిన రోజు సెలబ్రేషన్ను స్నేహితులతో కలిసి జరుపు కోవాలని భావించాడు స్నేహితులతో కలిసి మాదాపూర్ లోని యశోద హాస్పిటల్ వెనక ఉన్న ప్రాంతంలో కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటుం డగా…. ఆ దారిలోనే వస్తున్న నలుగురు దుండగులు వారి దగ్గరికి వెళ్లి మద్యంతో పాటు..బంగారం, డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. వారు ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైన దుండ గులు వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహి తంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మణికొండ ప్రాంతానికి చెందిన జయంత్ గౌడ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడికి కూడా తీవ్ర గాయాలు కావడంతో, అతన్ని వెంటనే సమీపం లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నగర నడిబొడ్డున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

👉 డబ్బులు డబుల్ చేస్తామని నమ్మించి 150 కోట్లు మోసం* ..1530 మంది దగ్గర రూ.150 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్..

హైదరాబాద్ –చింతల్ పరిధిలోని సూర్యనగర్ లో ఉన్న రిడ్జ్ టవర్స్ లో పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే సంస్థ నిర్వహిస్తున్న మహారాష్ట్రకు చెందిన వడైగర్ బాలాజీ (35), తండ్లే చౌదరి స్వాతి (30), గతంలో ఎల్బీనగర్, అత్తాపూర్ లోనూ కార్యాలయాలను నిర్వహించిన నిందితులు..రూ.లక్ష డిపాజిట్ చేస్తే 16 నెలల్లో రెండింతలు ఇస్తామని నమ్మించి ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసిన నిందితులు..ఒక్కొక్కరు రూ.50 లక్షల నుండి రూ.కోటి వరకు డిపాజిట్ చేయగా, వీరిలో కొంతమందికి అధిక వడ్డి చెల్లించిన నిర్వాహకులు..దీంతో అధిక వడ్డీ రావడంతో వారి స్నేహితులు, బంధువులతో సైతం డిపాజిట్ చేయించిన బాధితులు..16 నెలల గడువు ముగిసినవారు గత రెండు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా డబ్బు చెల్లించని నిర్వాహకులు ..ఈ నెల 30వ తేదీన దాదాపు 100 మంది బాధితులు కర్యాలయానికి చేరుకోగా, కార్యాలయం మూసివేసి ఉండడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు..బాధితుల ఫిర్యాదు మేరకు నిర్వాహకుల్లో ఒకరైన స్వాతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

👉 మోసం గురూ : ట్రేడింగ్ స్కాములతో వేల కోట్లు మాయం !

స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తాం.. లక్షకు లక్ష వస్తాయి అని ఆశ పెడితే పోలోమంటూ వందల మంది పెట్టుబడి పెట్టారు.దాదాపుగా రూ.150 కోట్లు వసూలు చేసిన ఆ ట్రేడింగ్ మోసగాళ్లు రాత్రికి రాత్రి జెండా ఎత్తేశారు. ఈ మోసం హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో మధ్యతరగతి ప్రజలు నివాసం ఉండే కాలనీలో జరిగింది. ఓ చిన్న కాలనీని టార్గెట్ చేసుకుని చేసిన మోసంలోనే 150 కోట్లు దోచుకెళ్లిపోయారు. ఇక దేశంలో ఎన్ని ఇలాంటి మోసాలు జరుగుతున్నాయో చెప్పడం కష్టం. ఈ స్కామ్స్ పరిధి వేల కోట్లలోనే ఉంటుంది.ట్రేడింగ్ పేరుతో విస్తృతంగా ప్రచారం..ప్రతి ఒక్కరి వాట్సాప్ కు.. ఇప్పుడు ట్రేడింగ్ గ్రూపులు తయారయ్యాయి. అవసరం లేకపోయినా.. ఆసక్తి చూపకపోయినా.. ఉచిత ట్రేడింగ్ చిట్కాలంటూ వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేస్తున్నారు. ఆ మాయలో పడి చివరికి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మల్టీ బ్యాగర్ స్టాక్స్ అని.. రోజువారీ ట్రేడింగ్ లాభాలు అని ఆశ చూపి వారి సొమ్ము కాజేస్తున్నారు. మొదట్లో చిన్న మొత్తాల్లో లాభాలు ఇచ్చి భారీగా వసూలు చేశాక జెండా ఎత్తేస్తున్నారు. ఈ తరహా మోసాలు పెరిగిపోవడంతో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు..స్టాక్ మార్కెట్ లాభాలపై విస్తృత ప్రచారం..భారత స్టాక్ మార్కెట్ కొంత కాలంగా దూసుకెళ్తోంది. అప్పుడప్పుడూ ఒడిదుకుడుకులు చూసినా అంతిమంగా భారీ లాభాలను చూస్తోంది. పైగా అదే సమయంలో షేర్లు కొనడం, అమ్మడం వంటివి చేయడం చాలా ఈడీ అయిపోయింది. బ్యాంక్ అకౌంట్ల మాదిరిగా డీమ్యాట్ అకౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అదో జూదంలా కొంత మంది ప్రారంభిస్తున్నారు. చివరికి సర్వం కోల్పోతున్నారు. అలా కోల్పోయేది కాకుండా మోసాల బారిన పడుతున్నారు.స్టాక్ మార్కెట్ పై పూర్తి అవకాహన ఉంటేనే దిగడం మంచిది !.. ఇవాళ పది రూపాయలు పెట్టి కొన్న షేర్ రేపు వంద అవుతుంది.. ఒక్క రోజులోనే 90 రూపాయలు లాభం అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. కానీ మొత్తం స్టాక్ మార్కెట్ పై అవగాహన లేకుండా ఈ లాభం శాశ్వతం అనుకుంటే..అది ఓ గాలం అని తరవాత అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్లు స్థిరమైన పెట్టుబడులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటాయి. అందులోనూ ఎన్ని మోసాలు ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. స్టాక్ మార్కెట్ పై పూర్తి అవగాహన ఉంటే తప్ప అందులో పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడం.. ఇన్ ఫ్లూయన్సర్స్ మాటలు నమ్మకపోవడం మంచిది.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..