👉🏽మోడీకి సింధూర్ ఇవ్వడానికి భార్య లేదు కాబట్టి అతనికి సింధూర్ విలువ తెలియదు! .. ఈ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంతే దీటుగా స్పందించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై మోదీ చేసిన వ్యాఖ్యలపై దీదీ తీవ్ర స్థాయిలో స్పందించారు.ఈ ఆపరేషన్‌ను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని ఆరోపిస్తూ, ప్రధాని తన భార్యకు ఎందుకు సిందూర్ పెట్టరంటూ సూటి ప్రశ్న సంధించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
* అలీపుర్‌దుర్‌లో మోదీ వ్యాఖ్యలు ఇటీవలే పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దుర్‌లో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో హింస జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సభలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి సుకాంతా మజుందార్‌లు ‘ఆపరేషన్ బెంగాల్’ను చేపట్టి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బంగాళఖాతంలో కలిపేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని కూడా చెప్పుకొచ్చారు. మమతా బెనర్జీ దీటుగా సమాధానం అయితే, ఈ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంతే దీటుగా స్పందించారు. ప్రధాని మోదీ సహా బీజేపీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం ఘటనపై దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’తో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడామని పేర్కొన్నారు. “తామంతా ఒక్కటే, ఉగ్రవాదాన్ని సహించేది లేదు, ఐక్యతే మా బలం” అనే సందేశాన్ని తెలియజేయడానికి అఖిలపక్ష ప్రతినిధులు విదేశాల్లో పర్యటిస్తున్న సందర్భంలో ప్రధాని మోదీ ఇలా మాట్లాడటం చాలా బాధాకరమని అన్నారు.
*అసెంబ్లీ ఎన్నికల సవాల్..రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగలరా అంటూ బీజేపీ సర్కారును మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఇది బీజేపీ రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఆరోపించారు. -‘సిందూర్’ వివాదం మోదీ తనను తాను మొదట ‘చాయ్‌వాలా’ అని చెప్పుకున్నారని, ఆ తర్వాత ‘గార్డు’ అన్నారని, ఇప్పుడు ‘సిందూర్’ అమ్మడం ప్రారంభించారని మమత ఎద్దేవా చేశారు. సిందూర్ మహిళలకు గర్వకారణమని, ప్రతి మహిళ తన భర్త నుంచి సిందూర్ తీసుకుంటుందని పేర్కొన్నారు. “సిందూర్‌ను ఇలా అమ్మకూడదు. అంతేకాకుండా, ప్రధాని మోదీ తన భార్యకు సిందూర్ ఎందుకు పెట్టడం లేదు?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీదీ ఈ స్థాయిలో చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
👉🏽రాఫెల్ పై రేవంత్ వ్యాఖ్యలు.. బీజేపీ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్! ఇందులో భాగంగా… సీఎం రేవంత్ రెడ్డి వాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడిన నిరాధారమైన ఆరోపణలని అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఆపరేషన్ సిందూర్ వల్ల భారత్ కు జరిగిన నష్టాన్ని, కోల్పోయిన ఆయుధాల వివరాలను వెల్లడించాలంటూ కాంగ్రెస్ నేతలు.. నరేంద్ర మోడీ అండ్ కో ను డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆపరేషన్ సిందూర్ లో పాక్ చేతిలో ఎన్ని రాఫెల్ విమానాలు కూలిపోయాయనే విషయంపై మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ నేతలు ఫైరవుతున్నారు.
మే 29న హైదరాబాద్ లోని “జై హింద్” ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు! ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ లో పాక్ చేతిలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కూలాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కచ్చితమైన సమాధానం చెప్పాలని కోరారు. దీంతో.. ఈ విషయంపై తెలంగాణ బీజేపీ నేతలు వరుసగా తగులుకున్నారు. ఇందులో భాగంగా… సీఎం రేవంత్ రెడ్డి వాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడిన నిరాధారమైన ఆరోపణలని అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఆపరేషన్ సిందూర్ పేరుతో రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు ఆర్మీ మనోభవాలను గాయపరచడంతో పాటు దేశాన్ని అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో… కాంగ్రెస్ నేతలు మోడీ, బీజేపీపై ఉన్న అక్కసును ఆర్మీ మీద, దేశంపైనా వెల్లగక్కుతున్నారని ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడటం దేనికి సంకేతం అని ప్రశ్నించిన లక్ష్మణ్… ఉగ్రవాదాన్ని మోడీ ఉక్కుపాదంతో అణిచివేస్తున్నరని అన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భారత పౌరులంతా తీవ్రంగా పరిగణించాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. అదేవిధంగా రేవంత్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ… వారి నాయకుడు రాహుల్ గాంధీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకూ.. మన ధైర్య సాయుధ దళాలను కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ కించపరుస్తోందని.. వారు సర్జికల్ దాడులను ప్రశ్నించడం ఇదే తొలిసారి కాదని.. శత్రువుల భాష మాట్లాడమూ వారికి ఇదే మొదటిసారి కాదని అన్నారు. కాగా… హైదరాబాద్ లోని “జై హింద్” ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ట్ సైనికులు యుద్ధంలో పాల్గొన్నారని.. తెలంగాణలో తయారైన విమానాలు దేశ గౌరవాన్ని నిలబెట్టాయని.. కానీ, మోడీ తెచ్చిన రాఫెల్ విమానాలను మాత్రం పాకిస్థాన్ కూల్చివేసిందని.. అలా కూలిన విమానాల లెక్కలు చెప్పాలని అన్నారు. ఇదే సమయంలో నాలుగు రోజుల యుద్ధం తర్వాత.. ఎవరు ఎవరిని బెదిరించారో, ఎవరు ఎవరికి లొంగిపోయారో తెలియదు కానీ.. అకస్మాత్తుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బయటకు వచ్చి యుద్ధాన్ని ఆపేసినట్లు చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు! దక్షిణాసియా పటాన్ని మార్చడానికి వచ్చిన అవకాశాన్ని మోడీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని తెలిపారు.
👉🏽కులమతాలను డ్రగ్స్ తో పోల్చిన హీరో.. సంచలన వ్యాఖ్యలు! వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరోపక్క తొలిసారి ఎన్నికల్లో పోటీ పడబోతున్న “తమిళగ వెట్రి కళగం” దూకుడు పెంచుతోంది. ఈ సమయంలో.. 10, 12 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు టీవీకే అధినేత, ప్రముఖ హీరో విజయ్.
అవును… తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలో 10, 12 తరగతుల్లో అత్యధిక మార్కులు సధించిన విద్యార్థులను సత్కరించే కార్యక్రమం నిర్వహించింది టీవీకే! ఈ కార్యక్రమంలో మాట్లాడిన విజయ్… ప్రజాస్వామ్యం అందరికీ సమాన అవకాశాలు ఇచ్చిందని.. ప్రజాస్వామిక విలువలను పాటించాలని మీ కుటుంబ సభ్యులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. ఇదే సమయంలో.. అవినీతి కార్యకలాపాలకు దూరంగా ఉండే, విశ్వసనీయత కలిగిన వ్యక్తులకు ఓటు చేయాలని కోరాలని సూచించిన విజయ్… కులం, మతం ఆధారంగా జరిగే విభజనను తోసిపుచ్చాలని కోరారు. ఈ సందర్భంగా… సూర్యుడు, వరుణుడు.. వంటి వాటితో నెలవైన ఈ ప్రకృతికి కుల మత బేధం ఉందా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే.. డ్రగ్స్ ను దూరం పెట్టినట్లుగా కులం, మతం వంటి వాటినీ దరిచేరనీయొద్దని కోరారు. కులం, మతం ఆధారంగా భావజాలం దగ్గరకు వెళ్లవద్దని కోరారు. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడే ఈ ప్రపంచంలో స్వేచ్ఛ ఉంటుంది అని సూచించారు. నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులు ఎంపిక!: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ విజయ్.. అటు అధికార డీఎంకేతో పాటు బీజేపీపైనా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా 2026 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేయడానికి టీవీకే పని ప్రారంభించింది. ఇందులో భాగంగా.. ప్రతీ నియోజక వర్గం నుంచి ముగ్గురిని ఎంపిక చేయనుంది. చివర్లో వారిలో ఒకరిని ఫైనల్ చేయనున్నారు! అవును… రాష్ట్రం లోని 234 నియోజకవర్గాల్లో ముగ్గురు చొప్పున అభ్యర్థులను టీవీకే ఎంపిక చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నేతల వివరాలను టీవీకే కార్యదర్శి ఆనంద్ స్వయంగా ఫోన్ చేసి సేకరిస్తున్నారని తెలుస్తోంది.
👉 పొగాకు రైతులను ఆదుకునేందుకు – ఎస్ టిసిని రంగంలోకి దించాలి..సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీని వాసరావు..
పొగాకు రైతును ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఎస్ టిసి ని రంగం లోకి దించి కొనుగోలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేసారు. శుక్రవారం నాడు ఎ పి రైతుసంఘ ప్రతితినిధి బృందం తో కలసి ఒంగోలు -2 ( త్రోవగుంట) వేలం కేంద్రాన్ని సందర్శించారు. వేలం నిర్వహణ తీరు, మార్కెట్ స్థితిగతులు తదితర అంశాలపై అక్కడ రైతులను అడిగి తెలుసుకున్నారు. కినుగోళ్ల ప్రక్రియ, మార్కెట్ ధరల గురించి వేలం నిర్వహణ అధికారి, ఐటీసి, ఇతర కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ ఐటిసి వంటి కంపెనీల గుత్తాధిపత్యం పత్యం వల్ల పొగాకు ధరలు రోజురోజుకుపతనం అవుతున్నాయని, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. రైతులు దివాలా తీసే పరిస్థితి వచ్చిందన్నారు. గిట్టుబాటు ధర లభించేందుకు రైతులు ఐక్యమై పోరాటం చేయాలని, రైతులకు తాము అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.రైతుల సమస్యలపై తాము ప్రభుత్వంతో చర్చించనున్నట్లు ఈ సందర్బంగా ప్రకటించారు. వేలం కేంద్రం సందర్శించినవారిలో సిపి ఎం జిల్లా కార్యదర్శి ఎస్ కె మాబు, కౌలు రైతుసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు, రైతు సంఘ అధ్యక్ష కార్యదర్శులు జుజ్జూరు జయంతి బాబు, పమిడి వెంకటరావు, జిల్లా ఉపాధ్యక్షులు పెంట్యాల హనుమంతరావు, కిలారి పెద్దబ్బాయి, అబ్బూరి వెంకటేశ్వర్లు, కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి వి బాలకోటయ్య, ఉపాధ్యక్షులు టి శ్రీకాంత్ ఉన్నారు.
👉 దర్శిలో స్థానిక సుందరయ్య భవన్ లో శుక్రవారం బాలోత్సవం చిల్డ్రన్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా ఝాన్సీ నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ బి కోటిరెడ్డి ప్రారంభించారు అనంతరము రాష్ట్ర నాయకులు కంకణాల రమాదేవి సిహెచ్ వినోద్ తో పాటు స్థానిక యుటిఎఫ్ మండల నాయకులు ఉపాధ్యాయులు నాగ స్రవంతి ప్రజానాట్యమండలి నాయకులు ఉప్పు మోహన్ రావు పాల్గొని విద్యార్థులకు దేశభక్తి గీతాలు తో పాటు మ్యాథ్స్ ట్రిక్స్ కథలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో పిచ్చయ్య సిఐటి నాయకులు నాగేశ్వరరావు నారాయణ తదితరులు పాల్గొన్నారు

