👉 టీడీపీ మహానాడుపై జగన్ కామెంట్స్.. మహానాడు పెద్ద డ్రామా..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు సెటైర్లు..కలెక్టర్ ను శాలువాతో తో సత్కరించిన మంత్రి సీతక్క..👉 మీడియా ముసుగులో అమ్మాయిల జీవితాలు తాడుకుంటున్న యూట్యూబర్ “కల్లూరు హేమాద్రి”..👉ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు తీసిన పిచ్చికుక్క..👉 అక్రమార్కుల చెరలో ఆలయ భూములు..👉మారువేషంలో అనంతపురం జిల్లా కలెక్టర్.. గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీలు… 👉 రక్షణ కొనుగోళ్ల జాప్యంపై ఎయిర్ చీఫ్ మార్షల్ తీవ్ర ఆందోళన..👉 *వరంగల్‌లో నకిలీ కరెన్సీ స్కామ్*.. 👉*ఏపీ పదో తరగతి మూల్యాంకనంలో ఘోర తప్పిదాలు*👉వెన్నుపోటు రాజకీయాలు రావంటూ కవిత సంచలన వ్యాఖ్యలు*..👉గిద్దలూరు నగర పంచాయతీకి రెండవ స్థాయి మున్సిపాలిటీ హోదా*

👉పిఠాపురం వర్మ అనుచరులకు టిడిపి కార్యకర్తలకు షాక్. CBN*

👉 ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచేలా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో తన భార్యకు పంపి చేయించిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను సన్మానించిన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క కలెక్టర్ ను శాలువాతో తో సత్కరించి అభినందించారు.

👉 మీడియా ముసుగులో అమ్మాయిల జీవితాలు తాడుకుంటున్న “కల్లూరు హేమాద్రి”(యూట్యూబర్)

వివాహితను ట్రాప్ చేసి శారీరకంగా వాడుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్న కల్లూరి హేమాద్రి. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని ప్రశ్నించినందుకు నీ ఫోటోలు మెసేజ్లు “సోషల్ మీడియాలో” పెడతాను “AP-సమాచారం “గ్రూపులో పోస్ట్ చేస్తాను.. నా గ్రూపులో ఎస్పీ గారు ఉండారు అంటూ బెదిరిస్తున్నాడు. పోలీస్ స్టేషన్లన్నీ నావే “సిఐ” లు “ఎస్సై” లు నా వాళ్లే నీ దిక్కున దగ్గర చెప్పుకో, ఎస్పీ దగ్గర ఉండే ది కూడా నా బంధువులే అంటూ బ్లాక్మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడు… ఎస్పీ గారు వెంటనే స్పందించి వెంటనే కల్లూరు హేమాద్రి మీద చర్యలు తీసుకోవాలి.
👉 అస్సాం బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రాంలో బార్డర్ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో ఉండే వారికి ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలని తీర్మానించిన బీజేపీ ప్రభుత్వ కేబినెట్భారతదేశ పౌరులకు ముఖ్యంగా అస్సాం పౌరులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ప్రకటించిన అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ.
👉ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు తీసిన పిచ్చికుక్క..

మిస్ వరల్డ్ పోటీదారుల జాగ్రత్త కోసం తీసుకున్న చర్యలు సామాన్య ప్రజల జాగ్రత కోసం ఉండవా అంటూ నిలదీస్తున్న ప్రజలు..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన బానోత్ రమేష్, స్వప్న దంపతుల కుమార్తె నిహారిక గాయత్రి (5) మే 13వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటుండగా చిన్నారిపై దాడి చేసిన పిచ్చికుక్క..కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించగా వ్యాక్సిన్ చేసి పంపిన వైద్యులు..ఈ నెల 25వ తేదీన చిన్నారి వింతగా ప్రవర్తించడం, నోటినుండి నురుగు రావడంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు..పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి.

👉 టీడీపీ మహానాడుపై జగన్ కామెంట్స్..
మహానాడు పెద్ద డ్రామా.. చంద్రబాబు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారన్న వైఎస్ జగన్..కడపలో మహానాడు నిర్వహించడం, తనను తిట్టడం హీరోయిజం కాదన్న జగన్.. హీరోయిజం అంటే ఎన్నికల హామీలను నేరవేర్చడం, అది చంద్రబాబు వల్ల కాదన్న జగన్..
మహానాడు ఒక పెద్ద డ్రామా అని, చంద్రబాబు నాయుడు ఫోటోలకు ఫోజులిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డ్రామాల పార్టీ అని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారని, రాష్ట్రంలో ఏ ఇంటికైనా ఆ పార్టీ నేతలు వెళ్లి తాము ఈ పని చేశామని ధైర్యంగా చెప్పుకోగలరా అని జగన్ ప్రశ్నించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కడపలో మహానాడు నిర్వహించడం హీరోయిజం కాదని, తనను తిట్టడం అంతకన్నా హీరోయిజం కాదని అన్నారు. హీరోయిజం అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చడమేనని, వాటిని చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు.
సూపర్ సిక్స్, సెవెన్ పథకాలను గాలికి వదిలివేశారని, 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని అన్నారు. గ్యాస్ సిలెండర్లను సరిగా ఇవ్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు అటకెక్కాయని, సీబీఎస్ఈ, టోఫెల్, నాడు-నేడు, పిల్లల ట్యాబ్‌లు అన్నీ ఆగిపోయాయని మండిపడ్డారు.తమ హయాంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వగా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన సరిగ్గా లేవని, చదివించుకోలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులున్నాయని తెలిపారు. అమ్మఒడి పథకానికి మంగళం పాడారని అన్నారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని, రోగులకు ఆరోగ్యశ్రీ అందని పరిస్థితి నెలకొందని విమర్శించారు.ధాన్యానికి కనీస మద్దతు ధర లేదని, రైతుల బతుకులు దళారుల పాలయ్యాయని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో తాము రూ.2.73 కోట్లు డీబీటీ చేశామని, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారని జగన్ ప్రశ్నించారు.
👉*ఏపీ పదో తరగతి మూల్యాంకనంలో ఘోర తప్పిదాలు*
• రీవెరిఫికేషన్, రీకౌంటింగ్లో టీచర్లు, అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు• మార్కులు వేయాల్సిన చోట కూడా ఎడాపెడా ఎర్ర ఇంకుతో కొట్టివేతలు,దాటవేతలు
• ఫెయిలయ్యారని ఫలితాల్లో చూపడంతో కళాశాల్లో ప్రవేశాలు కోల్పోయిన విద్యార్థులు• పిల్లల జీవితాలతో ఉపాధ్యాయులు,అధికారులు చెలగాటం ఆడుకున్నారంటున్న తల్లిదండ్రులు
👉 *వరంగల్‌లో నకిలీ కరెన్సీ స్కామ్*.. వరంగల్ జిల్లా పర్వతగిరిలో దొంగ నోట్లు కలకలం రేపాయి. అక్కడి దుర్గశ్రీ వైన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగ నోట్లతో మద్యం కొనుగోలు చేశారు. ఈ డబ్బును బ్యాంక్‌లో జమ చేయడానికి వైన్స్ వాళ్లు వెళ్లగా.. ఒక రూ.500, రూ.100 దొంగ నోట్లను బ్యాంక్ అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దొంగనోట్ల చలామణితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
👉లొంగిపోయిన ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు*
జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు లొంగిపోయారు. ఇర్ఫాన్‌ బషీర్‌, ఉజైర్‌ సలామ్‌ లొంగిపోయారని షోపియాన్‌ పోలీసులు ప్రకటించారు. వారి నుంచి రెండు ఏకే 56 రైఫిళ్లు, 4 మ్యాగజైన్లు, 102 రౌండ్స్‌, 2 హ్యాండ్‌ గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత బలగాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి.
👉 రక్షణ కొనుగోళ్ల జాప్యంపై ఎయిర్ చీఫ్ మార్షల్ తీవ్ర ఆందోళన.. అవి రావని సంతకాలు చేసినప్పుడే తెలుస్తుందని కీలక వ్యాఖ్య.. సంతకాలు తప్ప ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడం లేదన్న అమర్ ప్రీత్ సింగ్..
తేజస్ యుద్ధ విమానాల ఆలస్యమయ్యాయని, ఒక్కటీ చేతికి రాలేదని వ్యాఖ్య..’ఆపరేషన్ సిందూర్’ ఓ జాతీయ విజయమన్న” వైమానిక దళాధిపతి”..
ఈ ఆపరేషన్‌తో భవిష్యత్ రక్షణ వ్యూహాలపై స్పష్టత వచ్చిందన్న ఐఏఎఫ్ చీఫ్..దేశ రక్షణ రంగంలో కీలకమైన సేకరణ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడంపై భారత వైమానిక దళ ప్రధానాధికారి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో చేపడుతున్న ప్రాజెక్టులు ఆలస్యం అవుతుండటం పట్ల ఆయన అసంతృప్తి వెలిబుచ్చారు. “చాలాసార్లు, కాంట్రాక్టులపై సంతకాలు చేసేటప్పుడే ఆ వ్యవస్థలు ఎప్పటికీ మన చేతికి రావని మాకు తెలుస్తుంది. కాలపరిమితులు పెద్ద సమస్య. ఒక్క ప్రాజెక్టు కూడా సమయానికి పూర్తయినట్లు నాకు గుర్తులేదు. సాధించలేని దాని గురించి మనం ఎందుకు వాగ్దానం చేయాలి?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్ ఎంకే1ఏ కార్యక్రమాన్ని ఉదాహరణగా చూపుతూ, 2021 ఫిబ్రవరిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో రూ. 48,000 కోట్ల విలువైన ఒప్పందం కుదిరినప్పటికీ, ఆర్డర్ చేసిన 83 విమానాల్లో ఒక్కటి కూడా ఇప్పటివరకు అందలేదని ఆయన తెలిపారు. వాస్తవానికి, వీటి డెలివరీ 2024 మార్చిలోనే ప్రారంభం కావాల్సి ఉంది. “తేజస్ ఎంకే1 డెలివరీలు ఆలస్యమయ్యాయి. తేజస్ ఎంకే2 నమూనా ఇంకా బయటకు రాలేదు. ‘అమ్కా’ స్టెల్త్ యుద్ధ విమానానికి సంబంధించి కూడా ఇంకా నమూనా సిద్ధం కాలేదు” అని ఎయిర్ చీఫ్ మార్షల్ వివరించారు.
“మనం కేవలం భారత్‌లో తయారు చేయడం గురించే కాదు. డిజైనింగ్ గురించి కూడా మాట్లాడాలి. దళాలకు, పరిశ్రమలకు మధ్య నమ్మకం ఉండాలి. మనం చాలా పారదర్శకంగా ఉండాలి. ఒకసారి దేనికైనా కట్టుబడితే, దాన్ని అందించాలి. మేక్ ఇన్ ఇండియా కోసం వాయుసేన తన వంతు కృషి చేస్తోంది” అని ఆయన అన్నారు. “భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలంటే, మనం వర్తమానానికి కూడా సిద్ధంగా ఉండాలి. పదేళ్లలో పరిశ్రమల నుంచి మనకు ఎక్కువ ఉత్పత్తి రావచ్చు. కానీ ఈ రోజు మనకు అవసరమైనవి ఈ రోజే కావాలి. మనం తక్షణమే కార్యాచరణను వేగవంతం చేయాలి. మన దళాలను శక్తిమంతం చేయడం ద్వారానే యుద్ధాల్లో గెలుస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.
సీఐఐ వార్షిక వాణిజ్య సదస్సులో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్న కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, “‘ఆపరేషన్ సిందూర్’ అనేది దేశానికి దక్కిన గొప్ప విజయం. దీనిని అత్యంత ప్రణాళికాబద్ధంగా, వృత్తి నైపుణ్యంతో అమలు చేశాం. మేము సత్య మార్గంలో నడిచాం. అందుకే దైవం కూడా మాకు అండగా నిలిచాడని నేను నమ్ముతున్నాను” అని తెలిపారు.
ఈ కచ్చితమైన దాడుల ద్వారా భవిష్యత్ రక్షణ అవసరాలు, వ్యూహాలపై భారత్‌కు స్పష్టమైన అవగాహన ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. “యుద్ధ స్వరూపం నిరంతరం మారుతోంది. ప్రతిరోజూ నూతన సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మన యుద్ధ తంత్రాలలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’ మనం భవిష్యత్తులో ఏ దిశగా పయనించాలో, మనకు ఎలాంటి వనరులు అవసరమో స్పష్టం చేసింది. అందువల్ల, మన ఆలోచనా విధానంలో కూడా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ఇప్పటికే కృషి జరుగుతోంది. ఇప్పటివరకు ఎదురైన సవాళ్లను విజయవంతంగా అధిగమించగలిగాం కాబట్టి, భవిష్యత్తులో కూడా దేశానికి అవసరమైన సేవలు అందిస్తామని నేను విశ్వసిస్తున్నాను” అని అమర్ ప్రీత్ సింగ్ వివరించారు.
“మనం ఎలాంటి కార్యకలాపాలు చేపట్టినా, వాయుశక్తి లేకుండా చేయలేం. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ఇది చాలా బాగా నిరూపితమైంది” అని అన్నారు. “అధునాతన మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ)లో ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యానికి కూడా అనుమతి లభించింది. ఇది చాలా పెద్ద ముందడుగు. ప్రైవేటు పరిశ్రమలపై దేశానికి ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనం. భవిష్యత్తులో మరిన్ని పెద్ద విషయాలకు ఇది మార్గం సుగమం చేస్తుందని నేను కచ్చితంగా నమ్ముతున్నాను” అని ఆయన పేర్కొన్నారు. కేవలం భారతదేశంలో ఉత్పత్తి చేయడం గురించి మాత్రమే కాకుండా, భారతదేశంలోనే రూపకల్పన చేయడం, అభివృద్ధి చేయడం కూడా ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు.
👉 ‘వీరమల్లుకి వీరతాడు’.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు ఎక్స్ లో సెటైర్లు వేశారు. ‘హామీలు ఎగొట్టి.. పాప్ కార్న్, ఐస్క్రీం, కూల్డ్రింక్స్ చవక చేసేందుకు సినిమా వాళ్లకే సినిమా చూపిస్తున్న వీరమల్లుకి వీరతాడు’ అని అంబటి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై పవన్ ఫ్యాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేయగా.. వైసీపీ అభిమానులు సెటైరికల్ మీమ్స్ కామెంట్లో పోస్ట్ చేస్తున్నారు.
👉మారువేషంలో అనంతపురం జిల్లా కలెక్టర్.. గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీలు..!!
అనంతపురం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వినోద్ కుమార్ మారువేషంలో జిల్లాలో పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ పని చేశారు..ప్రజాసేవకు నూతన మార్గంగా జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్యలతో.. అనంతపురం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాజాగా, కలెక్టర్ వినోద్ కుమార్ మారువేషంలో గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్థరాత్రి తనిఖీలు చేశారు.
అయితే, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సామాన్యుడిలా గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కలియతిరుగుతూ.. రోగుల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖానికి మాస్క్, మెడలో టవల్ కప్పుకుని ప్రభుత్వ ఆసుపత్రి మొత్తాన్నీ పరిశీలించారు. ఆసుపత్రి బయట చెప్పులు విడిచి వెళ్లి.. రోగులు, ప్రభుత్వాసుపత్రి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ వినోద్ కుమార్.
👉వెన్నుపోటు రాజకీయాలు రావంటూ కవిత సంచలన వ్యాఖ్యలు*
*ఉద్యమాలు చేయకుండా.. ట్వీట్టర్‌లో మెసేజ్‌లు పెడితే సరిపోతాయా?*
*కేటీఆర్ ను ఉద్దేశించి కవిత అంతర్లీనంగా విమర్శలు*
హైదరాబాద్, మే 29: మా నాన్నకు తాను లేఖ రాస్తే తప్పేంటి? అయినా నీకు నొప్పి ఏందిరాబయ్? అంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇంటి ఆడబిడ్డపై ఎటు పడితే అటు మాట్లాడితే సరి కాదన్నారు. గురువారం కవిత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తనకు నీతులు చెబుతోన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు.. తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలంటూ సూచించారు. కేసీఆర్ నీడలో పని చేస్తోన్న వారు.. తనపై ప్రతాపం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు.
దమ్ముంటే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీపై మీ ప్రతాపం చూపించాలంటూ ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆమె సవాల్ విసిరారు. తాను అసలే మంచి దాన్ని కాదని.. తాను నోరు విప్పితే తట్టుకోలేరంటూ బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేయకుండా.. ట్వీట్టర్‌లో మెసేజ్‌లు పెడితే సరిపోతాయా? అంటూ ఆమె ప్రశ్నించారు..

👉గిద్దలూరు నగర పంచాయతీకి రెండవ స్థాయి మున్సిపాలిటీ హోదా*

గిద్దలూరు ప్రజలకు ఇది గర్వించదగిన సమయం అని, సంవత్సరాలుగా ప్రజలు కోరుకుంటూ, నేను ఎన్నో మార్లు వేదికలపై నిలబడి హామీ ఇచ్చిన రెండవ స్థాయి మున్సిపాలిటీ (గ్రేడ్-2 మున్సిపాలిటీ) హోదా ఇప్పుడు సాకారమైందని,29-05-2025 న విడుదలైన G.O. Ms. No. 89 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ ఉత్తర్వును జారీ చేసిందని గత రెండేళ్లుగా గిద్దలూరు పంచాయతీ ఆదాయ, వ్యయ వివరాలను సమీక్షించిన అనంతరం, మున్సిపల్ పరిపాలన శాఖ ఈ నిర్ణయం తీసుకుందని, ఇది మన అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ అని శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేసారు.ఈ హోదాతో వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయని, అందులో అభివృద్ధి నిధుల పెంపు,మెరుగైన మౌలిక వసతులు (రోడ్లు, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్), మున్సిపల్ సిబ్బంది నియామకం, పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగుదల,గృహ నిర్మాణ పథకాలకు ప్రాధాన్యం,పట్టణ ప్రణాళికలో సమగ్రత వుంటాయని, ఇది కేవలం ఒక హోదా మార్పు కాదని, ఇది మన పట్టణం అభివృద్ధి దిశగా వేసిన మైలురాయి అని, గిద్దలూరును ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఇది ఒక శుభారంభం అని కొనియాడారు. ఈ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణకు అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచూ, మీరు నమ్మిన నాయకుడిగా,గిద్దలూరు నియోజక వర్గ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా మరింత కృషి చేస్తానని తెలియజేశారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..