👉మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ ,ఈడీ కేసులలో సిబిఐ కేసులలో ప్రాథమిక ఆధారాలు అనేవి లేవట..😲
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈడి భయం కొంతమేరకు తగ్గబోతోందట. సిబిఐ ,ఈడీ కేసులలో సిబిఐ కేసులలో ప్రాథమిక ఆధారాలు అనేవి లేవట.
తన కేసులకు సంబంధించి ఉన్న ప్రధానమైన అంశం ఏమిటంటే.. పారిశ్రామికవేత్తలు లబ్ది పొందారు. అలా లబ్ది పొందిన వారే జగన్ సంస్థలు పెట్టుబడి పెట్టారు. ఆ పారిశ్రామికవేత్తలు కూడా అవును మేము పెట్టుబడి పెట్టాము.. మేము లబ్ధి పొందాము.. లబ్ధి పొందిన వాటికి లంచంగా పెట్టలేదు. వ్యాపారం కాబట్టి పెట్టుబడి పెట్టామని తెలిపారు. ఆ పెట్టుబడికి లాభాలు కూడా తీసుకున్నామని తెలిపారట…అలాగే అలాంటి ప్రయోజనాలు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుందని.. సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలంటూ తెలిపారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇస్తూ ఉంటుంది.. సబ్సిడీలను కుంభకోణం అని ఎట్లా అంటారు అన్నవాదన పారిశ్రామికవేత్తలు తెలియజేస్తున్నారు. కాబట్టి సిబిఐ కూడా అక్కడ ఏమీ చేయలేదు. ఏదైనా కూడా ఈడీ ద్వారానే చేయాలి. అయితే ఈడి కేసులు ఉన్నవి..ఈడికి ఇదివరకు ఏమిటంటే కాస్త కోర్టులో రిలయబిలిటీ ఎక్కువగా ఉండేది.. వీటిని ఎక్కువగా కోర్టు నమ్ముతూ ఉండేది.అయితే ఇప్పుడు తమిళనాడుకు సంబంధించినటువంటి కేసుల్లో టాస్క్మార్క్ విషయంలో ఈడిని తప్పు పట్టిందో అలాగే ఈ మధ్యన 8సార్లు ఈడిని తప్పు పట్టిందట సుప్రీంకోర్టు. రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారా అంటూ ఫైర్ కూడా అయ్యిందట. ఇలా ఎన్నిసార్లు తప్పు పట్టడంతో .. ఇక సుప్రీంకోర్టు కూడా మైండ్లో అలాగే ఫిక్స్ అవుతుంది. అప్పుడు ఈడి చేసే వాదనలకి తమ చేతిలో ఉన్న పత్రాలు సరిపోవు.. ఆర్గ్యుమెంట్ కెపాసిటీ పెరగాలి.. కానీ ఇక్కడ ఈడి అటాచ్ చేసింది సిబిఐ కేసులు ఆధారంగే.. దీని ఆధారంగా చేసినప్పుడు ఏం చూపించాలి అంటే.. ఆ కంపెనీలే తప్పుడువని చూపించాలి. అని అక్కడ కంపెనీలన్నీ కూడా ఒరిజినల్ అని తేలింది. రాబోయే రోజుల్లో జగన్ కేసులు కంటిన్యూ అయితే. పేరు లేనటువంటి కంపెనీల నుంచి 20 కోట్లు 30 కోట్ల వరకు డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు విషయంలో మాత్రమే శిక్ష పడే అవకాశం ఉంటుందట.. అది పెనాల్టీ వేయవచ్చు.. లేకపోతే జైలు శిక్ష అయిన వేయవచ్చు.. మరి ఏం జరుగుతుందో చూడాలి.
👉ఉర్సా సంస్థకు ఎకరా భూమి 99 పైసలకు ఇచ్చినట్లు జగన్ నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు.
జగన్ ఇంకా అబద్ధాలే మాట్లాడుతున్నారని అన్నారు. మంగళవారం కడప మహానాడు ప్రాంగణంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఉర్సాపై జగన్ చేసిన ఆరోపణలపై లోకేశ్ స్పందించారు. ఉర్సాకు 99 పైసలకు భూములు కేటాయించలేదని స్పష్టం చేశారు. విశాఖలో టీసీఎస్‌కు ఎకరా 99 పైసలకు కేటాయించిన మాట వాస్తవమని, విశాఖలో 5లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఐటీ సంస్థలకు భూకేటాయింపులు జరుపుతున్నామని, ప్రపంచంలో టాప్-100 ఐటీ కంపెనీలు విశాఖలో తమ సంస్థల స్థాపనకు ముందుకొస్తే వాటికి 99 పైసలకే భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తోందన్నారు. ఇకపై రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ఉంటుందే తప్ప గత ప్రభుత్వంలో మాదిరి పోవడం ఉండదన్నారు. జగన్‌ను అరెస్టు చేస్తారన్న ప్రచారంపై స్పందిస్తూ.. అది తనకు తెలియదని హోం మంత్రి, ముఖ్యమంత్రిని అడగాలన్నారు.
👉మహానాడు వేదికగా కోవర్టులకు బాబు ఘాటు వార్నింగ్‘నేరస్థులూ ఖబడ్దార్.. నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను ’ అంటూ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
రెండో రోజు మహానాడు ప్రారంభమవగా.. సీఎం మాట్లాడుతూ.. నేరస్థులకు అల్టిమేటం జారీ చేశారు. కొంతమంది టీడీపీలో ఉండి కోవర్టులుగా పని చేస్తున్నారని.. వారి ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మన వేలుతో మన కన్ను పొడిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ వారు సొంత పార్టీ వారినే చంపుకుంటారంటూ పార్టీకి చెడ్డపేరు తెచ్చి.. సులభంగా వారి టార్గెట్‌లను హత్య చేస్తున్నారని కోవర్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది నేరస్థులు చేసే కనికట్టు మాయ అని అన్నారు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా.. ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. కోవర్టులను టీడీపీలోకి పంపించి.. ఆ కోవర్టుల ద్వారా మీ అజెండా నెరవేర్చుకోవడం సాధ్యం కాదన్నారు.ఇప్పుడు తాను ఎవరినీ నమ్మడం లేదన్నారు. వలస పక్షులు వస్తుంటాయ్.. వెళుతూ ఉంటాయని… కానీ నిజమైన కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారని అన్నారు. పార్టీ బలోపేతం కావాలని.. అదే సమయంలో కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఇంకా పకడ్బంధీగా కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
👉*ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముంది?.. * నారా లోకేష్ చిట్ చాట్.. తదుపరి సీఎం మీరేగా అన్న మీడియా ప్రశ్నకు లోకేశ్ సమాధానం..*చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు.. ఆయన ఇంకా యువ నాయకుడే.. *దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరం.. ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదు.*అధికారంలోకి వచ్చాం కాబట్టి అంతా బాగుందనే భావన సరికాదు.. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తేనే వాస్తవాలు తెలుస్తున్నాయి.* *వీరయ్య చౌదరికి నివాళులర్పించేందుకు వెళ్తే పొగాకు రైతుల సమస్యలు తెలిశాయి.*వెంటనే అధికారులను, మంత్రుల బృందాన్ని అప్రమత్తం చేశాం.. పార్టీకి నిరంతరం ఫీడ్‍బ్యాక్ అవసరం అనటానికి ఇదో ఉదాహరణ..కింది స్థాయి అభిప్రాయాలపై నిరంతరం చర్చ జరగాలి.. పార్టీ బలంగా ఉండాలి.. సంస్థాగతంగా బాగుండాలి : మంత్రి నారా లోకేశ్*
👉ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.. ఎల్బీనగర్..పూజల పేరుతో ఒక మహిళను నమ్మించి మోసం చేసిన నాగోల్ కి చెందిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి సాయి రాజ్…కుటుంబ సమస్యలు తీరుస్తానని చెప్పి పూజల పేరుతో 32000 నగదు, 5 తులాల బంగారు ఆభరణాలు తీసుకున్న పూజారి…సాయి రాజ్ పై నాగోల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బాధితురాలు…పూజారి సాయిరాజ్ 316, (2) 318(4) BNS సెక్షన్ కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో నిందితుడు సాయిరాజ్
👉 వై నాట్ పులివెందుల?: చంద్రబాబు ‘మహా’ప్లాన్
వచ్చే ఎన్నికలకు టీడీపీ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతుందా ? కడప గడపలో వైసీపీని ఖాతా తెరవకుండా చేయాలని ఫిక్స్ అయిందా? పులివెందుల సీటును కూడా టీడీపీ కైవసం చేసుకోబోతుందా? జగన్ జైల్లో ఊచలు లెక్క పెట్టడం ఖాయమని మహానాడు సాక్షిగా చంద్రబాబు ఇండికేషన్స్ ఇచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.జగన్ రెడ్డి సొంత జిల్లా మహానాడులో మొదటిసారి మహానాడును టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇక్కడ మహానాడు ఏర్పాటు చేయడం వెనక పెద్ద ప్లానే ఉంది. మొన్నటి ఎన్నికల్లో కడపలోని 10అసెంబ్లీ స్థానాలకు కూటమి ఏకంగా ఏడు కైవసం చేసుకుంది. బలంగా ఉండే కడప జిల్లాలో వైసీపీ కేవలం మూడంటే మూడు స్థానాలకే పరిమితమైంది. అంటే కూటమి వేవ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే చంద్రబాబు ఇంకాస్త కష్టపడితే వైసీపీకి మూడు స్థానాలు కూడా దక్కేవి కావన్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో పులివెందులలోనూ పాగా వేస్తామని ఆయన చెప్పకనే చెప్పేశారు అన్నమాట.జగన్ ఇలాకాలో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యల వెనక కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. జగన్ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఈ కామెంట్స్ చేసి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ పై ఇప్పటికే చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో జగన్ ఎప్పుడైనా జైలుకు వెళ్ళవచ్చు.ఇదీ ఒక్కటేనా లిక్కర్ స్కామ్ కేసు కూడా రెడీగా ఉంది. ఈ కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. జగన్ జైలుకు వెళ్తే గతంలో లాగా చెల్లి, తల్లి పార్టీని మోసే అవకాశం లేదు. భార్య అన్ని తానై నడిపించినా, ఆమెకు ప్రజల పల్స్ ను పసిగట్టెంత సీన్ లేదనేది ఓపెన్ సీక్రెట్. మిగిలిన నేతల్లో ఎవరికైనా పార్టీని నడిపించే సామర్ధ్యం ఉందా అంటే ఎవరికీ లేదు. దీంతో వైసీపీ ఫ్యూచర్ ని అంచనా వేసే చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో కడపలో స్వీప్ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది.
👉ISI ఏజెంట్లతో సీక్రెట్ చాట్.. 12GB డాటా డిలీట్: జ్యోతి ఫోన్‌లో సంచలనాలు !
*పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని సంచలనాలు బయటపడ్డాయి. ISI ఏజెంట్లతో సీక్రెట్ చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా తన ఫోన్‌లో 12GB డాటా డిలీట్ చేసినట్లు వెల్లడించారు. డాటా రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు జ్యోతికి ఏమాత్రం భయం లేకుండా ఉగ్రవాదులతో పరిచయాలు పెంచుకుందని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సందర్శన సందర్భంగా ఆమె వాళ్లను కలిసినట్లు వెల్లడించారు. జ్యోతి పర్సనల్ డివైజ్‌లు ఫోన్లు, ల్యాప్‌ట్యాప్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇందులోని 12 జీబీ డాటా డిలీట్ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ డాటాను రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. పాక్, చైనాలో పర్యటనలతో పాటు పాక్‌లో జరిగిన హైప్రొఫైల్ ఈవెంట్లకు ఆమె హాజరైనట్లు గుర్తించారు. కేవలం 4 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఆమె విచ్చలవిడిగా ఖర్చులు చేయడం, గన్‌మెన్లతో వీవీఐపీ ట్రీట్‌మెంట్ పొందిన అంశాన్ని పరిశీలిస్తున్నారు. డిలీట్ చేసిన డాటాలో కీలక సమాచారం ఉంటే జ్యోతికి మరింత ఉచ్చు బిగిసే అవకాశం ఉంది.
👉ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి..హైదరాబాద్: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
👉అమరావతిలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ (కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికలు) కోసం ఒక సర్టిఫికేషన్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరామని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తమ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) గవర్నింగ్ కౌన్సిల్ 9వ సమావేశం జరిగింది. అనంతరం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో మత్స్య, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను విస్తరించి, ఫుడ్ కంట్రోలింగ్ ల్యాబ్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర మంత్రిని కోరామని తెలిపారు.
👉కడప మహానాడులో తెలుగుదేశం పార్టీకి సోమవారం రూ.22.28 కోట్లు విరాళంగా వచ్చాయని పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. విరాళాలు ఇచ్చిన వారి పేర్లను మహానాడు వేదికపై చంద్రబాబు చదివి వినిపించారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రూ.5కోట్లు, పి.నారాయణ రూ.కోటి, టీజీ భరత్ రూ.కోటి, సానా సతీశ్ రూ.1.16కోట్లు, ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రాజగోపాల్ రూ.50లక్షలు, లక్ష్మీ వెంకటేశ్వర మెటల్ ఇండస్ర్టీస్ రూ.50లక్షలు, దామచర్ల జనార్దన్ 25లక్షలు, వేమన సతీశ్ 25లక్షలు, రవీంద్ర 25లక్షలు ఇచ్చారన్నారు. మొత్తం రూ.22.53కోట్లు పార్టీకి విరాళంగా వచ్చాయన్నారు. విరాళాలు ఇవ్వాలనుకునేవారు ‘తెలుగుదేశం పార్టీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, జూబ్లీహిల్స్ బ్రాంచి, అకౌంట్ నంబరు 18090200001238’’కు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయాలన్నారు.
👉మహిళల భద్రతకు “శక్తి వాట్సప్ నంబర్” 79934 85111*గుంటూరు జిల్లా..మంగళగిరి.. మహిళలు మరియు చిన్నారుల భద్రతకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తీసుకొచ్చిన “శక్తి” యాప్ అత్యంత ప్రజాదరణ పొందిన సంగతి విదితమే.మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ “ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్” శక్తి వాట్సప్ నంబర్ *79934 85111* అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. నేడు మంగళగిరి రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శక్తి వాట్సప్ నంబర్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలు శక్తి వాట్సప్ నంబరు కాల్ (వీడియో, నార్మల్ కాల్), మేసేజ్ చేసినా సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ కు సంకేతాలు వెళ్లిన వెంటనే శక్తి టీమ్స్ సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. 24/7 ఈ నంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. సాంకేతికత సహాయంతో మహిళలు మరియు చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు చెక్ పెట్టడం జరుగుతుందని తెలిపారు. మహిళలు విధిగా తమ మొబైల్ లో ఈ శక్తి వాట్సప్ నంబర్ ను సేవ్ చేసుకోవలసిందిగా ఐజీపీ శ్రీమతి బి. రాజకుమారి కోరారు. కార్యక్రమంలో “ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఐజీపీ బి. రాజకుమార్, ఎస్పీ శ్రీదేవి రావు తదితరులు పాల్గొన్నారు.
👉తెనాలి పోలీసులు చేసిన దౌర్జన్య ఖాండను ప్రజా సంకల్ప వేదిక తీవ్రంగా పరిగణిస్తుంది.అందులో భాగంగా జాతీయ మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.. ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మదురై రంగసాయిరెడ్డి..

