పాక్ కు గూడచార్యం చేస్తున్న జవాన్ అరెస్టు..*బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో రామలింగ మఠాధిపతి హఠయోగి లోకేశ్వరస్వామీజీ అరెస్ట్…👉బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్..👉ఆ పోటీలకు కోట్లల్లో ఖర్చు.. మరి రైతులకు.. హరీష్ సూటి ప్రశ్న* 👉మంత్రి నారా లోకేష్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలి.*..*డీ ఎస్ సి ఉర్దూ మెటీరియల్ పంపిణీ చేసిన టి. డీ. పి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్*..👉మహానాడు ఏర్పాట్లలో మరో అపశృతి..నకిలీ ఆపిల్ ఉత్పత్తుల విక్రయదారుల అరెస్ట్..డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వైయస్‌ఆర్‌సీపీ నేతల్ని అక్రమంగా అరెస్ట్‌లు చేస్తున్నారు: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్..👉పల్నాడుజిల్లా పిడుగురాళ్ల లో ఇనిస్ట్యూట్ పేరిట ఘరానా మోసం….

👉 *విద్యావకాశాలను మైనారిటీ ఉర్దూ విద్యార్థులు అందిపుచ్చుకోవాలి**విద్యతోనే ఉన్నత స్థాయి సాధ్యం*.. *ఉర్దూ భాష అభివృద్ధి కి ఎల్లప్పుడూ తొడ్వాటు అందిస్తాము*డీ ఎస్ సి ఉర్దూ మెటీరియల్ పంపిణీ చేసిన టి. డీ. పి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్*నంద్యాల.. మైనారిటీల విద్యాాభివృద్ధి కేంద్రం( సి ఈ డి ఎం) తయారుచేసిన డి ఎస్ సి ఉర్దూ మెటీరియల్ను స్థానిక ఎన్ టి. ఆర్. ఫంక్షన్ హాల్ లో జొయ ఉర్దూ కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందిన 150 మంది ఉర్దూ అభ్యర్థులకు నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, యువకులకు మార్గదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అభ్యర్థులకు పంపిణీ చేశారు. జొయ ఉర్దూ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సి. అబ్దుల్ సత్తార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు.. ఇతర అతిథులు గా జొయ ఉర్దూ కోచింగ్ సెంటర్ కొ. ఆర్డీనెటర్ ఫజ్జులూర్ రెహమాన్, ప్రముఖ బహు బాష కవి సత్తార్ ఫైజి, ఇమాముల సంఘం జిల్లా అధ్యక్షులు అంజద్ బాష సిద్ధిఖి, ఆంధ్ర ప్రదేశ్ ఉర్దూ టిచర్స్ అసోసియేషన్ ఫొండర్ ప్రసిడెంట్ కే. జి. ఖాజ హూసెన్, రాష్ట్ర కన్వీనర్ సి. అబ్దుల్ అజీజ్, అధ్యక్షురాలు షమీంబాను, తదితరులు పాల్గొన్నారు.. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్  మీద వ్రాసిన కవితల ను సత్తార్ ఫైజి చదివి వినిపించారు, హాజరైన వారు ఉల్లాసము గా, ఉత్సాహం గా విన్నారు.. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఉర్దూ విద్యార్థులకు, ఉర్దూ భాష అభివృద్ధి కి, జొయ ఉర్దూ కోచింగ్ సెంటర్ కు ఎల్లప్పుడూ తొడ్వాటు అందిస్తూ,ఉర్దూ అభ్యర్థులు డీ. ఎస్. సి లో మంచి ర్యాంకులు సాధించటకు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్. ఎమ్. డీ ఫారూఖ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ అభ్యర్థుల కు ఉచిత మెటిరియల్ పంపింపిని చేయుటకు చర్యలు తీసుకుడం తొ ఉర్దూ అభ్యర్థుల తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు..అంజద్ భాషా సిద్ధిఖి, ప్రముఖ అడ్వకేట్ ఖలీల్ మాట్లాడుతూ యువకులకు మార్గదర్శి గా ఉంటూ రాజకీయం లో రానిస్తున్న ఎన్. ఎమ్. డీ ఫిరోజ్ కు రాజకీయం లో మంచి భవిష్యత్తు ఉంటుందని, రాజకీయ ఉన్నత పదవులు పొందాలని మనస్పూర్తిగా కొరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్. ఎమ్. డీ ఫిరొజ్ మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత స్థాయి సాధ్యం అవుతుందని, సమాజంలో ఏ రంగంలో రాణించాలన్నా విద్య అవసరం, ఆవశ్యకత ఎంతో ముఖ్యమని అన్నారు. డి ఎస్ సి అభ్యర్థులు చదువును ఇష్టపడాలని, విజయం సాధించడానికి దృఢ సంకల్పంతో కష్టపడి ఫైరొజ్ సూచించారు ఉర్దూ విద్యార్థులకు విద్యా పరం గా జొయ ఉర్దూ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో చేస్తున్న అబ్దుల్ అజీజ్, అధ్యాపకులు బృందం ల కృషి ని కొనియాడారు.. తదనంతరం జొయ ఉర్దూ కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందిన అభ్యర్థుల కు ఎన్ఎండి ఫిరోజ్ చేతుల మీదుగా ఉచిత ఉర్దూ డీ. ఎస్. సి మెటీరియల్ ను పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో టి. డీ. పి నాయకుడు భీమ్ శంకర్, తోట రామయ్య పెద్దా సంఖ్య లో విద్యార్థులు పాల్గొన్నారు.

👉 హైదరాబాద్ పోలీసులు, కమిషనర్ టాస్క్ ఫోర్స్ (సెంట్రల్ జోన్)తో కలిసి, జగదీష్ మార్కెట్, అబిడ్స్‌లోని బహుళ మొబైల్ యాక్సెసరీ దుకాణాలపై దాడి చేసి, నకిలీ ఆపిల్ ఉత్పత్తులను అమ్ముతున్నందుకు నలుగురు దుకాణ యజమానులను అరెస్టు చేశారు. నిందితులు ఆపిల్ లోగోలు మరియు ప్యాకేజింగ్‌ను చట్టవిరుద్ధంగా ఉపయోగించి ఇయర్‌పాడ్‌లు, పవర్ బ్యాంకులు, USB కేబుల్‌లు మరియు బ్యాక్ కవర్లు వంటి నకిలీ ఉపకరణాలను విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్ సమయంలో ₹1.01 కోట్ల విలువైన నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.ప్రాథమిక దర్యాప్తులో ఈ వస్తువులను ముంబై నుండి మార్కెటింగ్ ఏజెంట్ల ద్వారా తీసుకువచ్చినట్లు తేలింది. తదుపరి చర్య కోసం నిందితులను అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. టాస్క్ ఫోర్స్‌కు అందిన విశ్వసనీయ నిఘా ఆధారంగా ఈ దాడి జరిగింది.

👉మహానాడు ఏర్పాట్లలో మరో అపశృతి..

చింతకొమ్మ దీన్నే మండల పరిధిలోని వైయస్ ఆర్ విగ్రహానికి టీడీపీ జెండాలు, బ్యానర్లు కడుతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్..కిరణ్ కుమార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు..పూర్తిగా పోయిన రెండు చేతులు, ఒక కాలు…రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స

👉బాలికను కిడ్నాప్‌ చేసి మూడు రోజుల పాటు లాడ్జీలకు తిప్పి అత్యాచారానికి పాల్పడిన కేసులో బెళగావి జిల్లా రాయభాగ తాలూకా మేకళి గ్రామంలోని రామలింగ మఠాధిపతి హఠయోగి లోకేశ్వరస్వామీజీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై పోక్సో, కిడ్నాప్‌ కేసులు నమోదు చేసినట్టు బెళగావి జిల్లా ఎస్పీ డాక్టర్‌ బీమాశంకర్‌ గుళేద చెప్పారు.

 వివరాల మేరకు పీయూ ప్రథమ సంవత్సరం విద్యార్థిని(17) అనారోగ్యం నేపథ్యంలో రామలింగ మఠాన్ని ఆశ్రయించింది. ఆ మఠాధిపతి హఠయోగి లోకేశ్వరస్వామిజీపై ఆమెకు నమ్మకం, భక్తిభావం ఏర్పడ్డాయి. ఈ నెల 13న తన మేనమామ ఊరికి వెళ్లిన బాలిక కాలి నడకన తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అటుగా కారులో వచ్చిన స్వామీజీ డ్రాప్‌ చేస్తానంటూ కారులో ఎక్కించుకున్నాడు. కారు తమ గ్రామం మీదుగానే వెళ్తుందని తెలిసి బాలిక కారులో ఎక్కింది. అయితే, కారును ఆ గ్రామంలో ఆపకుండా స్వామీజీ బాలికను బెదిరించి రాయచూరుకు తీసుకువెళ్లాడు. అక్కడి ఓ లాడ్జిలో రెండు రోజులపాటు ఉంచి అత్యాచారం చేశాడు. అనంతరం ఈ నెల 15న బాగల్కోటెకు తీసుకెళ్లి, అక్కడి ఓ లాడ్జిలో ఉంచి అత్యాచారం చేశాడు. ఇంటికి వెళతానని బాలిక ఏడవడంతో ఈ నెల 16న మహాలింగపుర బస్టాండ్‌లో వదిలేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం బాలిక ఇంటికి చేరుకొని జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. ఈ నెల 21న బాగల్కోటె మహిళా పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసును మూడలిగె పోలీ్‌సస్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో స్వామీజీని గురువారం అరెస్టు చేసి, శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు.

👉ఆ పోటీలకు కోట్లల్లో ఖర్చు.. మరి రైతులకు.. హరీష్ సూటి ప్రశ్న*

సిద్దిపేట, మే 26: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల పోటీలకు రూ.200 కోట్లను ఖర్చు చేసిన ప్రభుత్వం.. రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. లక్ష కోట్లకు టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారు కానీ.. పేదలు, రైతులు అడిగితే రూపాయి లేదంటున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఎవరి కడుపు నింపేందుకు అందాల పోటీలు పెడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతీ గ్రామంలో చెరువులకు నీళ్ళు ఇచ్చి ముదిరాజ్‌లకు ఉపాధి కల్పించామని గుర్తుచేశారు.

👉బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్..: బీజేపీని ఎందుకు విమర్శించటం లేదని పార్టీ మహిళా నేత.. మరో పక్క సొంత చెల్లెలైన కల్వకుంట్ల కవిత లేఖాస్త్రం ఎఫెక్టో.. మరొకటో కాని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ బీజేపీని టార్గెట్ చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్, ఢిల్లీ విమానాశ్రయం వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. హైదరాబాద్‌లో రూ.430 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన చర్లపల్లి రైల్వే స్టేషన్ అయినా, లేదా ఢిల్లీ విమానాశ్రయం పైకప్పులైనా, బిజెపి మార్క్ ‘అభివృద్ధి’ని చాటిచెప్పటానికి ఒక సాధారణ వర్షం సరిపోతుంది. అంటూ ఎద్దేవా చేశారు.గతేడాది ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఊడిపోయిన పైకప్పు ఇదే కాదా? అంటూ అప్పటి వీడియో పోస్ట్ చేసిన కేటీఆర్.. చర్లపల్లి రైల్వే స్టేషన్లో పై కప్పు రేకులు ఊడిపడుతున్న వీడియో కూడా జతచేసి కామెంట్ చేశారు. వీటన్నింటినీ కూల్చివేసేందుకు ఒకే ఒక వర్షం పట్టిందన్నారు. వాళ్లు సరిగ్గా పైకప్పును కూడా నిర్మించలేకపోవడం విచారకరం. కానీ.. కాళేశ్వరం గురించి కామెంట్లు చేయాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి ప్రవేశపెట్టిన షేప్‌షిఫ్టర్ పైకప్పుల అద్భుతమైన కొత్త మోడల్‌ను ఏ ఏజెన్సీ నిర్వహిస్తోందనని నేను ఆశ్చర్యపోతున్నాను?! అంటూ కామెంట్ చేశారు కేటీఆర్. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు..

👉పల్నాడుజిల్లా పిడుగురాళ్ల లో ఇనిస్ట్యూట్ పేరిట ఘరానా మోసం..పల్నాడుజిల్లా..విదేశాలలో టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఉద్యోగాల పేరిట విద్యార్థుల వద్ద కోట్లు కొల్లగొట్టిన ఓ ఇనిస్ట్యూట్ సంస్థ..పల్నాడుజిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన పలువురు విద్యార్థులు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో హోటల్ మేనేజ్మెంట్ ఇనిస్ట్యూట్ ఉద్యోగాల పేరుతో తమని భారీగా మోసం చేశారని ఫిర్యాదు..2022 నుండి 2024 మధ్య కాలంలో యూరప్ కంట్రీకి పంపిస్తామని ఇనిస్ట్యూట్ సంస్థ తమని మోసం చేసిందని విద్యార్థుల ఆరోపణ..ఒక్కొ విద్యార్థి నుండి ముప్పై, నలభై లక్షల చొప్పున నగదు వసూలు చేశారని బాధితుల ఆవేదన.ఉద్యోగం వచ్చిందని కొందరు విద్యార్థులను ఊటీకి దొంగ ట్రిప్పు పంపిన కేటుగాళ్ళు…ఇనిస్ట్యూట్ యజమాని తమ వద్ద సుమారు 5 కోట్లకు పైగా వసూలు చేశారని తెలిపిన బాధిత విద్యార్థులు.డబ్బులు తిరిగి అడిగితే మాపైనే కేసు పెడతానని, మీకు దిక్కున్న చోట చెప్పుకోమని ఇనిస్ట్యూట్ యజమాని బెదిరిస్తున్నారని ఆందోళన. తమకు న్యాయం చేయాలని పల్నాడుజిల్లా ఎస్పి కంచి శ్రీనివాసరావును వేడుకున్న బాధితులు…..

👉 గుంటూరు జిల్లా…తెనాలిలో కానిస్టేబుల్ పై దాడి చేసిన రౌడీషీటర్ అనుచరులకు అరికాలి కోటింగ్ ఇచ్చిన పోలీసులు.నెల రోజులక్రితం ఐతానగర్ లో కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో దాడిచేసిన రౌడీషీటర్ లడ్డూ అనుచరులు విక్టర్ , బాబూలాల్, రాకేష్.కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన తెనాలి టూ టౌన్ పోలీసులు..నిందితులను ఐతానగర్ తీసుకెళ్లి నడిరోడ్డుపై అరికాలి కోటింగ్ ఇచ్చిన పోలీసులు..వైరల్ అవుతున్న అరికాలి కోటింగ్ వీడియో.

👉 అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వైయస్‌ఆర్‌సీపీ నేతల్ని అక్రమంగా అరెస్ట్‌లు చేస్తున్నారు ..ఏనాడూ మైనింగ్ ప్రాంతానికి వెళ్లని కాకాణి గోవర్దన్ రెడ్డి గారిని మైనింగ్ కేసులో అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..కాకాణికి పార్టీ తరఫున అందరం అండగా నిలిచి.. న్యాయస్థానంలో పోరాటం చేస్తాం..అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి

👉దేశంలో విజృంభిస్తున్న కరోనా..కరోనాతో ఇప్పటివరకు నలుగురు మృతి..దేశంలో ప్రస్తుతం 1009 యాక్టివ్ కేసులు..కేరళలో 403, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, కర్నాటకలో 47 యాక్టివ్ కేసులు

👉సీఆర్ పీఎఫ్ జవాను కూడానా..!పాక్ కు గూఢచర్యం చేస్తున్న జవాన్ అరెస్టు..డబ్బు కోసం దేశ రహస్యాలు లీక్ చేసినట్లు ఆరోపణ..జవాన్‌కు ఎన్ఐఏ కస్టడీ విధించిన న్యాయస్థానం..జాతీయ భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశమని కోర్టు వ్యాఖ్య..

పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం వెలుగు చూసిన తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసి గూఢచారులను అరెస్టు చేస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో గూఢచారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొందరు డబ్బుకోసం పాక్ కు రహస్యాలు చేరవేస్తుండగా మరికొందరు హనీట్రాప్ లో చిక్కి ఈ పని చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ గూఢచారుల జాబితాలో ఓ జవాను ఉన్నట్లు తేలడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. దేశ రక్షణ కోసం పనిచేసే సీఆర్ పీఎఫ్ జవాను ఒకరు డబ్బు కోసం పాకిస్థాన్ కు అమ్ముడుపోయాడని, కీలకమైన రహస్యాలు మన శత్రు దేశానికి చేరవేశాడని అధికారులు గుర్తించారు.

సదరు జవాన్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ ఆరోపణలు “జాతీయ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని” వ్యాఖ్యానించింది. “ఈ ఆరోపణలు జాతీయ భద్రతకు, భారతదేశాన్ని సందర్శించే పౌరుల ప్రాణాలకు, అలాగే భారత పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించేవి” అని కోర్టు పేర్కొంది. నిందితుడు పాకిస్థాన్‌కు ఎలాంటి సమాచారం చేరవేశాడన్న వివరాలను రాబట్టడం అత్యంత కీలకమని అభిప్రాయపడిన కోర్టు, జవాన్‌ను జూన్ 6 వరకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. “దేశ బలానికి, భద్రతకు సాయుధ బలగాలే మూలస్తంభాలు. వాటికి కోలుకోలేని నష్టం కలిగించే ఎలాంటి ప్రయత్నమైనా దర్యాప్తు చేయాల్సిన తీవ్రమైన విషయం” అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

నిందితుడిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 15 (ఉగ్రవాద చర్యకు పాల్పడటం), సెక్షన్ 16 (ఉగ్రవాద చర్యకు శిక్ష), సెక్షన్ 18 (కుట్ర మరియు సంబంధిత చర్యలకు శిక్ష) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన ఘటన నేపథ్యంలో, పాకిస్థాన్‌కు సమాచారం అందిస్తున్న గూఢచారులు, ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలోనే తాజా అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది.

👉*కడప : టీడీపీలో ప్రస్తుతం నారా లోకేష్ నెంబర్-2.* *టీడీపీ భవిష్యత్ అంతా యువతే.* *యువగళం పాదయాత్ర ప్రభావం చాలా చూపింది.* *యువగళంపై మహానాడులో తీర్మానం చేస్తాం : టీవీ9తో మంత్రి బాల వీరాంజనేయస్వామి*

👉మంత్రి నారా లోకేష్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలి.**లోకేష్‌కు బాధ్యతలు అప్పగించాలని కేడర్ కోరుకుంటోంది.* *కేడర్ అభిప్రాయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం.* *మహానాడు ద్వారా ప్రజలకు యువమహాశక్తిని అందిస్తాం: చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు*

👉 *మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదల.. *నంబాల కేశవరావును సజీవంగా పట్టుకుని కాల్చి చంపారు.. మా నాయకుడిని కాపాడుకోవడంలో మేం విఫలమయ్యాం..*లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఎన్ కౌంటర్ 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో కేశవరావు ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసు.* *కేశవరావుని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారు.* *ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డాం.. మేం ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి కాల్పులు జరపలేదు.* *సురక్షిత ప్రాంతానికి కేశవరావును తరలించేందుకు ప్రయత్నించాం : మావోయిస్టులు*

*అంత్యక్రియలు పూర్తి..*  *మావోయిస్టుల సంచలన లేఖ.. ఎందుకంటే..*  *కేశవరావు టీమ్‌లో ఉన్న ఆరుగురు మావోయిస్టులు ఇటీవలే లొంగిపోయారు*  *ద్రోహులు ఇచ్చిన సమాచారం మేరకే నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్*  *35మంది ప్రాణాలు అడ్డుపెడితే ఏడుగురం సురక్షితంగా బయటపడ్డామని లేఖ*  *పాకిస్థాన్‌తో చర్చలు జరిపినప్పుడు తమతో చర్చలు జరిపితే తప్పేంటని ప్రశ్న*  *ఎనిమిది మంది నక్సలైట్ల మృతదేహాలకు భద్రతా బలగాలు అంత్యక్రియలు*

ఛత్తీస్‌గఢ్: మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులు తొలిసారిగా సంచలన లేఖ విడుదల చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారం మేరకే నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పారు. 6నెలలుగా మాడ్ ప్రాంతంలోనే నంబాల ఉన్నట్లు ప్రకటించారు. కేశవరావు టీమ్‌లో ఉన్న ఆరుగురు మావోయిస్టులు ఇటీవలే లొంగిపోయారని మావోయిస్టులు లేఖలో తెలిపారు.

వారు ఇచ్చిన సమాచారంతోనే ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పుకొచ్చారు. కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలిస్తామంటే ఆయన ఒప్పుకోలేదని అన్నారు. కేశవరావు కోసం 35మంది ప్రాణాలు అడ్డుపెడితే ఏడుగురం సురక్షితంగా బయటపడ్డామని తెలిపారు. 27మంది ఎన్ కౌంటర్‌లో చనిపోయారని చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపినప్పుడు తమతో చర్చలు జరిపితే తప్పేంటని ప్రశ్నించారు. స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరుతో ఈ లేఖను మావోయిస్టులు విడుదల చేశారు.

*అంత్యక్రియలు పూర్తి..* కాగా, మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు అంత్యక్రియలు ఇవాళ(సోమవారం) సాయంత్రం పూర్తి అయ్యాయి. మాడ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంబర్ల కేశవరావు చనిపోయిన విషయం తెలిసిందే. కేశవరావు మృతదేహాన్ని అప్పగించాలంటూ బలగాలని కుటుంబ సభ్యులు కోరారు. కేశవ్‌రావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా భద్రతా బలగాలు అంత్యక్రియలు పూర్తిచేశారు. అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్లకు పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. నాలుగు రోజులుగా మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నక్సల్ చీఫ్ బసవ రాజుతో సహా ఎనిమిది మంది నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు అంత్యక్రియలు పూర్తి చేశారు..

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..