👉 నడిరోడ్డుపై శృంగారం చేసిన.. బీజేపీ నేత అరెస్టు..👉 యువతితో అడ్డంగా బుక్కైన మరో బీజేపీ లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే*👉 కగార్ ఆపరేషన్ నిలిపి వేయాలి..ఒంగోలు..👉శవం కోసం ఎదురుచూపు..*మావోయిస్ట్ భూమిక మృతదేహం అప్పగింతకు నిరాకరణ.. 👉జగన్ అరెస్టుకు నో చాన్స్?.. తెరవెనుక పెద్ద రాజకీయ వ్యూహం!..మహానాడును విజయవంతం చేద్దాం* : ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి..*మే 28 న పొదిలిలో పొగాకు రైతులకు అండగా జగనన్న పోరుబాట..👉బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన వృద్ధుడు అరెస్టు (ప్రకాశం జిల్లా కంభం)

👉 నడిరోడ్డుపై శృంగారం చేసిన.. బీజేపీ నేత అరెస్టు
ఎక్స్ప్రెస్ హైవేపై మహిళతో శృంగారం చేసిన మధ్య ప్రదేశ్ బీజేపీ నేత మనోహర్ లాల్ ధకడ్ అరెస్టయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవ్వడంతో పోలీసులు చర్యలకు దిగారు. నిన్న కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం గరోత్ జైలుకు తరలించింది. మనోహర్ భార్య మండసౌర్ పంచాయతీ వార్డు సభ్యురాలిగా ఉన్నారు. కాగా పార్టీ పరమైన చర్యలు తీసుకుంటామని బీజేపీ పేర్కొంది.
👉 యువతితో అడ్డంగా బుక్కైన మరో బీజేపీ లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే*

ఉత్తర ప్రదేశ్ బీజేపీ నేత అమర్‌కిషోర్, మహిళా కార్యకర్తతో పార్టీ ఆఫీస్‌లో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఆఫీస్ మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకొని తర్వాత గదిలోకి తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్‌లో కూడా 2 రోజుల క్రితం మరో బీజేపీ లీడర్ వీడియో లీకైన విషయం తెలిసిందే.
రెండు రోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేత మహిళతో నడిరోడ్డుపై శృంగారం చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. తాజాగా మరో బీజేపీ లీడర్ రాసలీలల వీడియో లీక్ అయ్యింది. మహిళా కార్యకర్తను రాత్రి పార్టీ ఆఫీస్‌లోకి తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లే ముందు ఆ మహిళను అతను కౌగిలించుకున్నాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బీజేపీ అధికార పార్టీగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్‌ 12న రాత్రి 9.30 గంటలకు గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్‌కిషోర్ బామ్ బామ్, ఒక మహిళా కార్యకర్తని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చాడు. ఆఫీస్ మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకొని ఆ తర్వాత ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు. దీంతో గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్‌కిషోర్ బామ్ బామ్‌ మహిళా కార్యకర్తతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
👉జగన్ అరెస్టుకు నో చాన్స్?.. తెరవెనుక పెద్ద రాజకీయ వ్యూహం!.. అరెస్టు ప్రచారంపై జగన్ కూడా రెండు రోజుల క్రితం స్పందించారు. తనను అరెస్టు చేయగలరా? అంటూ ప్రశ్నించారు.


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా ఒకటే మాట వినిపిస్తోంది.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ బాస్ జగన్ అరెస్టు ఖాయమన్న ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. లిక్కర్ స్కాంలో నిందితులు ఇచ్చిన కీలక సమాచారంతో జగన్ అరెస్టుకు సిట్ రంగం సిద్ధం చేస్తోందని కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. లిక్కర్ స్కాంలో జగన్ పాత్రపై చర్చించామని ఆయనే స్వయంగా చెప్పారు. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం జగన్ చిక్కుల్లో పడ్డారని, నేడో రేపో ఆయన అరెస్టు కావచ్చనే ప్రచారం ఉవ్వెత్తున జరుగుతోంది. అయితే ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితుల్లో జగన్ ను కూటమి ప్రభుత్వం అరెస్టు చేసే లేదన్న వాదన కూడా అంతే ఎక్కువగా సాగుతోంది. జగన్ ను అరెస్టు చేయడమంటే కూటమి ప్రభుత్వం చేజేతులా ముప్పు తెచ్చుకున్నట్లేనని అంటున్నారు. అందుకే ఎప్పటి నుంచో జగన్ ను అరెస్టు చేస్తామని లీకులు ఇస్తున్నా, ఆయనను టచ్ చేయడం లేదని అంటున్నారు.
అరెస్టు ప్రచారంపై జగన్ కూడా రెండు రోజుల క్రితం స్పందించారు. తనను అరెస్టు చేయగలరా? అంటూ ప్రశ్నించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, విజయవాడలోనే ఉన్నానని వ్యాఖ్యానించారు. అంటే తనను అరెస్టు చేయాలని అంటే తన నివాసానికి వచ్చి తీసుకుపోవాలని సిట్ కు హింట్ ఇచ్చారు. జగన్ అలా ఓపెన్ ఆఫర్ ఇచ్చినా సిట్ స్వీకరించడం లేదు. దానికి కారణం జగన్ పాత్రపై మరిన్ని ఆధారాలు సంపాదించాల్సివుందంటున్నారు. అదే సమయంలో జగన్ అరెస్టుకు కేంద్రం నుంచి అనుమతి కూడా ఉండాలని అంటున్నారు.
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. టీడీపీతోపాటు జనసేన, బీజేపీ ప్రభుత్వంలో కీలక భాగస్వాములు. ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా, మూడు పార్టీలు భవిష్యత్తును ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సివుంటుందని అంటున్నారు. ఏ పార్టీ తన సొంత అజెండా అమలు చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. ప్రధానంగా మాజీ సీఎం జగన్ ను అరెస్టు చేసి ఆయనను రాజకీయంగా దెబ్బ తీయాలనేది టీడీపీ ప్లాన్ గా చెబుతున్నారు. దీనికి జనసేన కూడా సహకరించే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. కానీ, బీజేపీ తీరుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి టీడీపీ, జనసేన మద్దతు కేంద్రంలో బీజేపీకి అవసరమైనప్పటికీ ఆ పార్టీ వైసీపీని వదులుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటున్నారు.
జగన్ ను అరెస్టు చేసి జైలుకు పంపితే ఆయనకు రాజకీయ పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుందేమోనన్న సందేహం ప్రభుత్వ పెద్దల్లో ఉందని అంటున్నారు. టీడీపీ, జనసేన క్యాడర్ మాత్రం జగన్ ను అరెస్టు చేయాలని కోరుకుంటున్నా, స్కాంలో నిందితుడిగా జైలుకు వెళ్లే జగన్ ఆ తర్వాత ప్రజల నుంచి సానుభూతి పొంది మళ్లీ ప్రధాన రాజకీయ శక్తిగా ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి చెందినా దాదాపు 40 శాతం ఓట్లు పొందడాన్ని విస్మరించకూడదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే జగన్ అరెస్టుకు కొంత సమయం వేచిచూడాలని సిట్ కు ఆదేశాలు జారీ చేసిందని అంటున్నారు.
ఇదే సమయంలో స్కాంలో పలువురు అధికారులు, వైసీపీ నేతలను అరెస్టు చేసి జగన్ ను వదిలేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయనే ప్రచారం కూడా జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ ను అరెస్టు చేసే దమ్ములేదని సొంత పార్టీ నుంచి తిరుగుబాటు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. దీంతో అన్నివిధాలుగా ఆలోచించి భవిష్యత్తు పరిణామాలపై ఓ అంచనాకు వచ్చిన తర్వాతే జగన్ అరెస్టుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించినట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని గమనించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా ప్రకటనలు జారీ చేస్తున్నారని అన్నారు.
లిక్కర్ కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకున్నట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని జగన్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా తన వద్ద పనిచేసిన సిఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి కూడా మద్యం క్రయ, విక్రయాల్లో జోక్యం చేసుకోలేదని చెప్పుకొస్తున్నారు. అయితే జగన్ వ్యాఖ్యల వెనుక అరెస్టు భయం కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ పరిణామాలను గమనించిన వారు మాజీ సీఎం జగన్ ను ఇప్పట్లో అరెస్టు చేసే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. మరికొంతకాలం సిట్ దర్యాప్తు జరిపి, జగన్ జోక్యంపై పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే ఆయన విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
👉శవం కోసం ఎదురుచూపు..*మావోయిస్ట్ భూమిక మృతదేహం అప్పగింతకు నిరాకరణ..*నారాయణపూర్‌ ఆస్పత్రికి వెళ్లిన ఆమె తండ్రి, బంధువులు*

అబూజ్‌మడ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మవోయిస్టు భూమిక అలియాస్‌ వన్నాడ విజయలక్ష్మి (38)మృతదేహాన్ని అప్పగించేందుకు ఆ రాష్ట్ర పోలీసులు నిరాకరించారు. ఆదివారం భూమిక తండ్రి వన్నాడ సాయిలుతో పాటు సమీప బంధువులు ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. అయితే భూమిక మృతదేహం అప్పగింతపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెప్పారని వారు తెలిపారు. మృతదేహాన్ని సోమవారం అప్పగిస్తారని భావిస్తున్నామని చెప్పారు.. : *మృతదేహాల కోసం ఐదు రోజులుగా బంధువుల ఎదురుచూపులు*

ఛత్తీస్‌గఢ్‌లో గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు బుర్రా రాకేష్ అలియాస్ వివేక్ మృతదేహం కోసం ఐదు రోజులుగా బంధువుల ఎదురుచూపులు చూస్తున్నారు. ఇంతవరకు మృతదేహాలను పోలీసులు వారి బంధువులకు అప్పగించలేదు. రాకేష్ స్వగ్రామం హసన్ పర్తి మండలం, చింతగట్టు. నంబాల కేశవరావు సహా మిగిలిన వారి మృతదేహాలను ఛత్తీస్ గఢ్ పోలీసులు ఇవ్వలేదు. మృతదేహాల కోసం వారి బంధువులు ఐదు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు.

*కేశవరావు మృత దేహం తరలింపులో అడ్డంకులు.. ఛత్తీస్‌గఢ్‌లో గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురానివ్వకుండా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి అడ్డుపడుతున్నారని పౌరహక్కుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.చిట్టిబాబు, చిలుకా చంద్రశేఖర్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితకు లేఖ రాశారు. కేశవరావు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఆయన బంధువులు చేస్తున్న ప్రయత్నాలకు ఎస్పీ ఆటంకాలు సృష్టిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ వెళ్లిన కేశవరావు సోదరుడిని ఎస్పీ బలవంతంగా వెనక్కి రప్పించారని తెలిపారు. అంతేకాకుండా అప్పటి నుంచి వారిపై నిఘా పెట్టడంతో పాటు గృహ నిర్బంధం విధించినట్లు తెలిపారు. కేశవరావు బంధువులు కోర్టును ఆశ్రయించారని తెలిసిన ఎస్పీ.. కిందిస్థాయి పోలీసు అధికారుల ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించారు. కాగా, అబూజ్‌మడ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మవోయిస్టు భూమిక అలియాస్‌ వన్నాడ విజయలక్ష్మి (38)మృతదేహాన్ని అప్పగించేందుకు ఆ రాష్ట్ర పోలీసులు నిరాకరించారు. ఆదివారం భూమిక తండ్రి వన్నాడ సాయిలుతో పాటు సమీప బంధువులు ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. అయితే భూమిక మృతదేహం అప్పగింతపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెప్పారని వారు తెలిపారు.

*ఎన్‌కౌంటర్‌లో కర్నూలు మహిళ మృతి

అబూజ్‌మడ్‌లో ఈ నెల 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయుస్టుల్లో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన గోనెగండ్ల లలిత (45) అలియాస్‌ సంగీత కూడా ఉన్నారు. ఆమె మృతిపై ఆలస్యంగా సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు మృతదేహం కోసం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సు ఉద్యోగం కోసం వెళ్లిన లలిత.. దళిత హక్కుల కోసం కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్‌పీఎస్‌)లో పనిచేశారు. ఆ తర్వాత మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లారు. 20ఏళ్లకు పైగా కుటుంబ సభ్యులతో ఆమెకు ఎలాంటి సంబంధాలు లేవని, మావోయిస్టు పార్టీ పిలుపుతో దండకారణ్యంలో ఆదివాసీలకు నర్సుగా సేవలు చేసేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం..

👉 కగార్ ఆపరేషన్ నిలిపి వేయాలి..ఒంగోలు..

నారాయణ్ పూర్ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు మృత దేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రకాశం భవన్ ఎదుట ధర్నా చేపట్టారు.కగార్ ఆపరేషన్ పేరుతో ఆదివాసీలను హతమార్చడం ఆటవిక చర్య అని, తక్షణమే కాగార్ ఆపరేషన్ నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేసారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కన్వీనర్ వీరాంజనేయులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో న్యూ డెమోక్రసి రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి కొండారెడ్డి, సిపిఐ నాయకులు కె వీరారెడ్డి, పౌర హక్కుల సంఘ జిల్లా అధ్యక్షురాలు క్రాంతి, ఒపిడిఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్, పిఒడబ్ల్యూ ప్రధాని కార్యదర్శి పద్మ, ఐ ఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు సుందరం తదితరులు మాట్లాడారు.*మార్కాపురం టౌన్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా.*
*మార్కా పురం టౌన్ నందు జవహర్ నగర్ కాలనీలోని వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసు లో మార్కాపురం టౌన్ కార్యకర్తల పార్టీ నాయకులు తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.*మే 28 న పొదిలిలో పొగాకు రైతులకు అండగా జగనన్న పోరుబాట కార్యక్రమం జయప్రదం చేయాలని కోరడం జరిగినది..*
👉మహానాడును విజయవంతం చేద్దాం*
_ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి_…
నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరుగనున్న మహానాడును విజయవంతం చేద్దామని *ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి* కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం వెలిగండ్ల టీడీపి కార్యాలయంలో టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించి కార్యక్రమం లో మాట్లాడుతూ. 43 ఏళ్ల తెదేపా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కడపలో మహానాడును జరుగుతుందని 25 ఏళ్ల తర్వాత ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో 7 తెదేపా కైవసం చేసుకోవడంతో మహానాడు వైభవంగా జరుగుతుంని. తొలిరోజు పార్టీ సంస్థాగత నిర్మాణంపై, రెండో రోజు అభివృద్ధి, ప్రతిపక్షాల వైఫల్యాలపై చర్చ ఉంటుందన్నారు. మూడో రోజు సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో రాయలసీమ వంటకాలు కూడా ఏర్పాటు చేశారన్నారు. కనిగిరి నియోజకవర్గం లో ఉన్న కార్యకర్తలు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.  కార్యక్రమం లో మండల అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, పాల్గొన్నారు

👉బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన వృద్ధుడు అరెస్టు ప్రకాశం జిల్లా కంభం..ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన వృద్ధుడిని అరెస్టు చేసినట్లు కంభం ఎస్సై బి నరసింహ రావు తెలిపారు. వివరాలలోకి వెళితే మండలంలోని జంగం గుంట్ల గ్రామానికి చెందిన 69 ఏళ్ల శవరయ్య అనే వృద్ధుడు అదే గ్రామంలోని దళిత కాలనీ లో నివసిస్తున్న ఓ బాలికతో నిత్యం ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఆ బాలిక ఒక్కతే ఉన్న సమయంలో ఆమె ఇంట్లోకి వెళ్లి ఆ బాలికను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బాలిక కేకలు వేయడంతో పారిపోయాడు .ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న కంభం పోలీసులు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వీయ పర్యవేక్షణలో మార్కాపురం డి.ఎస్.పి యు.నాగరాజు, సీఐ కే మల్లికార్జున రావుల ఆధ్వర్యంలో పరారీలో ఉన్న శవరయ్యను ఎస్ఐ బి నరసింహారావు కందులాపురం అడ్డ రోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..