👉తమ్ముళ్లకూ ‘సూపర్ సిక్స్’.. చంద్రబాబు కీలక నిర్ణయం ..!*
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికలకు ముందు.. ప్రజల కోసం ఆయన ‘సూపర్ సిక్స్’ పేరుతో ఆరు కీలక పథకాలను ప్రకటించారు. వీటిలో దీపం-2 పథకాన్ని అమలు చేస్తున్నారు. మిగిలిన వాటిని త్వరలోనే అమలు చేయనున్నారు. వీటికి ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. సూపర్ సిక్స్ పథకాలు మహిళలను మంత్ర ముగ్ధులను చేశాయి. వారిలో టీడీపీపై ఇమేజ్‌ను కూడా పెంచాయి. ఇదిలావుంటే.. ఇప్పుటు టీడీపీ కార్యకర్తల కోసం.. వారిని పార్టీలో మరింత ఉత్తేజం చెందేలా తీర్చి దిద్దడం కోసం.. చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ఎలా అయితే.. సూపర్ సిక్స్ పేరుతో పథకాలను ప్రకటించారో.. అలానే.. ఇప్పుడు పార్టీలో నాయకుల కోసం, కార్యకర్తల అభ్యున్నతి కోసం కూడా.. ‘సూపర్ సిక్స్’ను ప్రకటించనున్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే మహానాడు వేదికగా.. ఈ సూపర్ సిక్స్‌ను వెల్లడిస్తారు.
ఏంటా సూపర్ సిక్స్.. తెలుగుజాతి.. విశ్వఖ్యాతి: తెలుగువారు ఎక్కడున్నా ఏ రంగంలో ఉన్నా నంబర్-1గా ఎదగాలనే లక్ష్యంతో ‘నా తెలుగు కుటుంబం’ ఐడియాలజీని ప్రతిపాదించనున్నారు. దీనిలో టీడీపీ కార్యకర్తలను ఇన్వాల్వ్ చేయనున్నారు.
స్త్రీ శక్తి: మహిళా సాధికారత, మహిళా శక్తిని చాటేలా స్త్రీ శక్తి పేరుతో మద్దతు ఇవ్వనున్నారు. రానున్న రోజుల్లో టీడీపీలోని మహిళా నాయకులతో దీనిని అనుసంధానం చేయనున్నారు. ‘స్త్రీ శక్తి’ని మరింత బలోపేతం చేసి పార్టీని నమ్ముకున్న వారిని ఉన్నతస్థాయికి తీసుకెళ్లనున్నారు.
సోషల్ రీఇంజనీరింగ్: టీడీపీలోని అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు సమన్యాయం చేయనున్నారు. అంటే.. పదవులు , బాధ్యలను అందరికీ కేటాయించనున్నారు. ఇలా ‘సోషల్ రీఇంజనీరింగ్’ చేయనున్నారు.
యువగళం: పార్టీలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. యువత అభ్యున్నతే లక్ష్యంగా ఐడియాలజీపై చర్చించనున్నారు. పార్టీలో పనిచేస్తున్న యువతకు అవకాశాలు సృష్టించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు నిరంతర ప్రణాళిక అమలు చేస్తారు.
అన్నదాతకు అండ: అమరావతిలో భూములు ఇచ్చినట్టుగా.. రైతులు చాలా మంది పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నారు. వీరిని సాంకేతికంగా బలోపేతం చేయడం, సబ్సిడీలు ఇచ్చి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పంటలు పండించేలా చేయడంపై దృష్టి పెట్టనున్నారు.
కార్యకర్తే అధినేత: ‘కార్యకర్తే’ అధినేత అనేది తెలుగుదేశం పార్టీ నినాదం, విధానంగా ఉండబోతోంది. సీనియర్లను గౌరవించడం, యువతను ప్రోత్సహించడం, కష్టపడేవారికి మద్దతుగా నిలవడం వంటి కార్యక్రమాలు మహానాడు వేదికగా శ్రీకారం చుట్టనున్నారు.
👉లీజ్ మాఫియాపై పవన్ ఉక్కుపాదం*
రిటర్న్ గిఫ్ట్ కి థ్యాంక్స్’ అంటూ పవన్ కల్యాణ్ పంపిన సందేశం టాలీవుడ్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా ఇదే హాట్ డిస్కర్షన్..జగన్ హయాంలో తెలుగు చిత్రసీమకు అన్యాయం జరిగింది.అగౌరవం ఎదురైంది.అలాంటప్పుడు.. నిర్మాతల తరపున మాట్లాడింది కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే. ‘నా సినిమాని ఆపుకోండి.. మిగిలినవాళ్లని వదిలేయండి’ అనే స్టేట్ మెంట్ ఇచ్చి – తన తెగింపు, త్యాగం నిరూపించుకొన్న వ్యక్తి…అసలు సిసలు సినిమా ప్రేమికుడు..అలాంటి పవన్ కల్యాణ్‌నే కెలకడానికి ప్రయత్నించారు.హరి హర వీరమల్లు సినిమా విడుదల ముందు ఆడిన ఈ థియేటర్ల బంద్ నాటకం… పవన్ కి తిక్క రేగేలా చేసింది.ఇప్పుడు లెక్కలు బయటకు తీయడానికి ఆయన రెడీ అవుతున్నాడు.
థియేటర్ల బంద్ వెనుక ఓ పెద్ద స్కామ్ దాగుందన్నది నూటికి నూరుపాళ్లు నిజం.తెలుగు చిత్రసీమ గురించీ, ఇక్కడి వ్యవస్థ గురించి తెలిసిన వాళ్లెవరికైనా ఈ సంగతి సులభంగా అర్థం అవుతుంది.పైకి.. థియేటర్ వ్యవస్థని కాపాడడానికీ, థియేటర్ యజమానుల ఆర్థిక ప్రయోజనాల కోసమే ఇదంతా అని అనిపిస్తుంది కానీ, అసలు థియేటర్లన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? పర్సంటేజీ విధానం అమలు చేస్తే ఎవరికి లాభం? అనే విషయాలు తెలిస్తే ఈ కుట్రదారులెవరో అర్థం అవుతుంది..ఏపీ, తెలంగాణల్లో ఉన్న థియేటర్లలో సగానికి పైగా అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, ఏసియన్ సునీల్ చేతుల్లో ఉన్నాయి. కొన్ని సొంతం.. చాలామట్టుకు లీజ్. మిగిలిన థియేటర్లపై కూడా వీళ్ల ఆధిపత్యం ఉంది.ఏ థియేటర్లో ఏ సినిమా ఆడించాలి? అనేది వీళ్లే డిసైడ్ చేయగలరు. వీళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాట.ఇప్పుడు థియేటర్లకు పర్సంటేజీ విధానం అమలు చేస్తే లాభం వీళ్లకే. అందుకే వెనుకుండి ఈ తతంగం అంతా నడిపించారు. ఈ బంద్ కు ఉసిగొల్పింది వీళ్లే.
అయితే యాక్టీవ్ నిర్మాణ సంస్థల్లో ముఖ్యమైన మైత్రీ మూవీస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, వైజయంతీ లాంటి పెద్ద సంస్థలు వీటిని వ్యతిరేకించాయి. దాంతో అసలు గొడవ మొదలైంది..అద్దె, పర్సంటేజీ ఈ రెండు విధానాల వల్ల లాభాలూ ఉన్నాయి, నష్టాలూ ఉన్నాయి. అద్దె అంటే నికరమైన ఆదాయం. సూపర్ హిట్ సినిమాకూ, ఫ్లాప్ సినిమాకూ థియేటర్ల యజమానులకు వచ్చే ఆదాయంలో మార్పేం ఉండదు..కానీ పర్సంటేజీ అలా కాదు. ఓ సూపర్ హిట్ సినిమా వస్తే, నిర్మాత రాబడిలో కొంత థియేటర్ యజమాని పర్సంటేజీ రూపంలో లాక్కెళ్లిపోతాడు.
కాకపోతే ఆ అంతరం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకు అద్దె రూపంలో రూ.5 లక్షలు చెల్లించాల్సిన చోట, పర్సంటేజీ విధానం వల్ల రూ.10 లక్షలు ఇవ్వాల్సివస్తుంది. ఇదంతా నిర్మాత, డిస్టిబ్యూటర్ లాభాల్లో కోత అన్నమాట..అలాగని ప్రతీ సినిమాకీ ఇదే పద్ధతి ఉండదు. చిన్న సినిమా విడుదలైతే లీజు దారులకు అద్దెలే కావాలి. పర్సంటేజీలు వద్దు. ఎందుకంటే చిన్న సినిమాలకు కలక్షన్లు ఉండవు కాబట్టి. అంటే హిట్ సినిమా నుంచి దోచుకోవడానికి రెడీ అయిన లీజు దారులు, ఫ్లాప్ సినిమా బాధల్ని పంచుకోవడానికి మాత్రం ముందుకు రారన్న మాట. ఒకవేళ చిన్న సినిమా కూడా పర్సంటేజీ విధానంపై ఆడించాలంటే థియేటర్‌కు వాటా ఎక్కువ ఇవ్వాల్సివస్తుంది. కలక్షన్ రూపంలో వంద రూపాయలు వస్తే, అందులో 60 శాతం థియేటర్ కి, మిగిలిన 40 శాతం నిర్మాతకీ. అంటే ఓ నిర్మాత సినిమాలు తీస్తోంది థియేటర్ లీజు దారుల కోసమని సర్దుకుపోవాలన్నమాట. ఇదెక్కడి న్యాయం?
ఎగ్జిబీటర్లంతా ఛాంబర్‌లో చాలా దఫాలుగా సమావేశమయ్యారు. తమ డిమాండ్లేంటో వినిపించారు. ఆ సమావేశాలకు పట్టుమని వంద మంది కూడా హాజరవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో వెయ్యిమందికి పైగా ఎగ్జిబీటర్లు ఉంటే, సమావేశాల్లో కనిపించింది అందులో పది శాతం మాత్రమే. అంటే.. నిజానికి ఎగ్జిబీటర్లకు ఈ పర్సంటేజీ విధానంపై ఎలాంటి ఆసక్తీ లేదన్నమాట. ఎందుకంటే అద్దె అయినా, పర్సంటేజీ అయినా వాళ్లకు ఒరిగేది ఏం ఉండదు. ఎందుకంటే వాళ్ల థియేటర్లన్నీ ఎప్పుడో లీజులకు ఇచ్చేశారు. సొంత థియేటర్లు ఉన్నా, వాటిపై లీజు ఫీజు తీసుకొంటూ గడిపేస్తున్నారు. థియేటర్లు వాళ్లవైనా వాటిపై పెత్తనం లీజు దారులవే. ఇదంతా కేవలం లీజు దారులు ఆడిస్తున్న డ్రామా కాబట్టే, వీటితో ఎగ్జిబీటర్లకు ఎలాంటి లాభం లేదు కాబట్టి వాళ్లంతా సైలెంట్ అయిపోయారు..నిర్మాతల్లో 90 శాతం మంది ఈ పర్సంటేజీ విధానానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటికే నిర్మాతలు కుంగిపోతున్నారు. అన్ని రకాలుగా వాళ్లపై అదనపు భారం పడుతోంది. ఇప్పుడు పర్సంటేజీ అంటూ రాబడిలో వాటా అడిగితే – నిర్మాత అనేవాడు కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. నిర్మాత ని కాపాడాలి అంటే.. అసలు ఈ వ్యవస్థనే సరిదిద్దాలి. అందుకే ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆ దిశగా అడుగులు వేయబోతున్నట్టు అర్థం అవుతోంది…థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు, అందుకే ఆదాయాలు తగ్గుతున్నాయి అనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. అటు ఎగ్జిబీటర్లకూ, ఇటు డిస్టిబ్యూటర్లకూ, నిర్మాతకూ డబ్బులు మిగలాలంటే, ఈ మూడు వ్యవస్థలూ బాగు పడాలంటే ప్రేక్షకులు థియేటర్లకు రావాలి. అలా రావాలంటే థియేటర్లలో మౌళిక సదుపాయాలు సరిగ్గా ఉండాలి. ప్రేక్షకులు టికెట్ రేట్ చూసి భయపడడం లేదు. థియేటర్లో జరుగుతున్న దోపిడీకి భయపడుతున్నాడు. రూ.150 లకే టికెట్ కొనొచ్చు. కానీ థియేటర్లో పాప్‌కార్న్ రేట్ అంతకంటే ఎక్కువ. బయట ఇరవై రూపాయలకు దొరికే వాటర్ బాటిల్.. థియేటర్లలో 60 రూపాయలకు అమ్ముతున్నారు. పార్కింగ్ ఫీజు తో అదనపు భారం పడుతోంది. ఇదంతా థియేటర్ యజమానులకు వెళ్తుందా అంటే అదీ లేదు. ఈ డబ్బులు కూడా లీజు దారుల జేబుల్లోకే చేరుతున్నాయి. అందుకే ఈ అడ్డగోలుతనానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కల్యాణ్.
ఓటీటీ, పైరసీ.. వీటిపై కూడా పరిశ్రమ దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఓటీటీ చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయింది చిత్రసీమ. సినిమా విడుదలైన మూడు వారాలకు ఓటీటీలోకి వచ్చేస్తే, ఇక థియేటర్లకు ఎందుకు వెళ్తారు? సినిమా అనేది చవకైన వినోదం. దాన్ని అత్యంత ఖరీదుగా మార్చేసి థియేటర్లకు రానివ్వకుండా చేస్తోంది ఎవరు? ఈ సంక్షోభానికి బాధ్యులు ఎవరు? ఈ లెక్కలు బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కూడా అదే చేయబోతున్నారు..ఇక నుంచి టాలీవుడ్ గేమ్ మారబోతోంది. లీజు దారుల అక్రమాల్ని, అడ్డగోలుతనానికీ చెక్ పెట్టి, ఎవరి కష్టానికి తగ్గ ప్రతిఫలం వాళ్లు అనుభవించేలా ఈ కూటమి ప్రభుత్వం చేయగలిగితే – టాలీవుడ్ కు మంచి రోజులు వచ్చినట్టే.
👉జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో పోలీస్ పరేడ్ మైదానంలో సామూహిక యోగాసనాల సాధన
* అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని “యోగాంధ్ర” వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి *. యోగా విశిష్టతను తెలియజేసేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్న జిల్లా పోలీసు శాఖ..అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో ఈరోజు యోగా సాధన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్న యోగాంధ్ర వేడుకలలో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి పాల్గొని యోగాసనాల సాధనతో పాటు ప్రసంగించారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని… మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి నియంత్రణకు కూడా ఎంతగానో దోహదపడుతుందన్నారు. నిత్యం విధుల్లో తలమునకలై ఒత్తిడికి లోనయ్యే పోలీసు సిబ్బందికి యోగా బాగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులలో యోగా అత్యంత ప్రాధాన్యత సంచరించుకుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాను గుర్తించి ఆచరిస్తున్నారన్నారు. ఒత్తిడి, ఆందోళనల నుండీ ఉపశమనం కల్గిస్తుందని… ప్రతీ ఒక్కరు మానసికంగా, భౌతికంగా దృఢత్వం కల్గి ఉంటారన్నారు.కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నెల రోజులపాటు నిర్వహించనున్న ఈ “యోగాంధ్ర” కార్యక్రమంలో భాగంగా యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు శాఖ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా ప్రజలు మరియు యువత ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఈ.బి.దేవి, సి.ఐ లు ధరణీకిశోర్, హరినాథ్, రాజు, ఆర్ ఐ లు పవన్ కుమార్, బాబు, ఎస్పీ సిసి ఆంజనేయ ప్రసాద్, పలువురు ఎస్సైలు, ఆర్ ఎస్ ఐ లు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్ విభాగాల అధికారులు, యోగా ఇన్స్ట్రక్టర్లు కృష్ణవేణి, గురురాజారావు, చలపతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
👉ఫలించిన దర్యాప్తు బృందం ప్రయత్నాలు..*
*హైదరాబాద్*..తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామంచోటు చేసుకుంది. రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభాకర్ రావు ను అమెరికా నుంచి డిపోర్ట్ చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఆయనను అమెరికా నుంచి భారత్‌కు పంపించేందుకు యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు చేపట్టింది. దర్యాప్తు బృందం ప్రయత్నాలు ఫలించాయి. ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని భారత్ తిరిగి పంపొద్దని పిటీషన్ వేశారు. దీనిపై స్పందించిన దర్యాప్తు బృందం.. ప్రభాకర్ రావును రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా ఫోన్ ట్యాపింగ్ అక్రమాలను నివేదిక రూపంలో పంపింది. కాగా ఇప్పటికే ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు జూన్ 20వ తేదీ లోపు హాజరుకావాలని.. లేకుంటే ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
జూన్ 20వ తేదీ వరకు గడువు..కాగా ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ (ప్రకటిత నేరస్థుడు) నోటీసులు జారీ అయ్యాయి. ప్రభాకర్‌రావు పోలీసు విచారణకు హాజరుకానందున ఆయనను ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించాలని కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు అనుమతించింది. అయితే, ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు న్యాయస్థానం జూన్ 20వ తేదీ వరకు గడువు ఇచ్చింది. జూన్ 20లోగా ప్రభాకర్‌రావు దర్యాప్తు అధికారి ముందు హాజరు కాని పక్షంలో ఆయనను ప్రకటిత నేరస్థుడిగా ప్రకటిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు తారామతిలోని ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు.. అక్కడి గోడకు నోటీసు అంటించారు.
గడువులోగా విచారణకు హాజరు కాకపోతే..గడువులోగా ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాకపోతే.. ప్రకటిత నేరస్థుడిగా గుర్తించి ప్రభాకర్‌రావుకు చెందిన స్థిర, చర ఆస్తులను దర్యాప్తు అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది. కాగా, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రభాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ప్రభాకర్‌రావును అమెరికా నుంచి రప్పించడం కోసం దర్యాప్తు అధికారులు ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయించారు. ప్రభాకర్‌రావు తప్పనిసరిగా విచారణకు హాజరుకావాల్సిందేనని లేకపోతే ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు ద్వారా అమెరికా అధికారులతో మాట్లాడి ఆయనను స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తామని సిట్ అధికారులు పేర్కొన్నారు.
👉పొగాకు కొనుగోళ్లపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన*..అమరావతి :
ఏపీలో పొగాకు రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్యూస్ చెప్పారు. బ్లాక్ బర్లీ పొగాకు రైతులు, బయ్యర్లుగా ఉన్న కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిన ఆయన బ్లాక్ బర్లీ పొగాకును రెండు గ్రేడ్లతో కొనుగోలు చేస్తామన్నారు. ప్రాసెసింగ్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అవసరమైతే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు ప్రారంభిస్తామని అన్నారు. కామన్ వెరైటీ క్వింటా ధరరూ.12,000, లో గ్రేడ్ రకాన్ని రూ. 6,000లుగా నిర్ణయించారు.
👉మానవబాంబులుగా 20 మంది యువకులు.. దేశంలో ఐదుచోట్ల భారీ పేలుళ్లకు కుట్ర..
మాతృభూమిలో మారణహోమానికి బడా ప్లాన్‌లే ఉన్నాయి. విజయనగరంలో పట్టుబడిన సిరాజ్, హైదరాబాద్‌లో దొరికిపోయిన సమీర్- బద్మాష్ స్కెచ్‌లను కూపీలాగుతుంటే, షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. దేశంలో ఐదుచోట్ల భారీ పేలుళ్లకు సిరాజ్, సమీర్ కుట్రలు చేశారని.. NIA దర్యాప్తులో సంచలన కుట్రకోణాలు బయటపడ్డాయి. ఎన్‌ఐఏ అధికారులు విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా ఇవాళ మూడోరోజు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్‌లో నిందితులను ఎన్‌ఐఏ విచారించనుంది.. అయితే.. నిన్నటి విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజయనగరం, హైదరాబాద్, ముంబైతో పాటు.. ఢిల్లీ, బెంగళూరులలో పలుమార్లు నిందితులు ఉగ్రకుట్రకు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈకుట్రలో కీలక సూత్రధారిగా వరంగల్‌కు చెందిన ఫర్హాన్ వ్యవహరించారు. యూపీకి చెందిన బాదర్‌తోనూ సిరాజ్‌కు సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. బాదర్, ఫర్హాన్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అహీం అనే సంస్థను స్థాపించిన సిరాజ్.. మానవబాంబులుగా 20 మంది యువకులను సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది. అహీం సంస్థ సభ్యులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.. అయితే.. వీరికి ఒమన్, సౌదీ నుంచి నిందితులకు ఆర్థిక సాయం అందినట్లు తెలుస్తోంది. అయితే.. సిరాజ్, సమీర్లు ఎక్కడెక్కడ బాంబు బ్లాస్ట్ కి పన్నాగం పన్నారనే అంశం పై ఎన్ఐఏ ఆరా తీస్తోంది.. అంతేకాకుండా.. వారి నెట్ వర్క్ తదితర అంశాలపై వివరాలను సేకరిస్తున్నారు.

