👉బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడండి: కేంద్ర ఆరోగ్యశాఖ*
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడాలని, దూరం పాటించాలని ప్రజలకు సూచించింది. ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు, టెస్టింగ్ కిట్స్, ICU బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్ధం చేయాలని రాష్ట్రాలకు కీలక ఉత్తర్వులు విడుదల చేసింది.
👉🏽ధర్మవరంలో పరిటాల రాజకీయ గర్జన … ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి పాలు అయ్యారు 2024లో పొత్తులలో భాగంగా ధర్మవరం సీటు బీజేపీకి వెళ్ళింది. అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక భారీ డైలాగ్ చెబుతాడు. బయట సాఫ్ట్ కానీ లోపల ఒరిజినల్ అలాగే ఉంది అని. సేం టూ సేం అదే డైలాగ్ కొట్టారు పరిటాల శ్రీరామ్. ఆయన అనంతపురం జిల్లా యువ నేత. పరిటాల రవీంద్రకు అసలైన వారసుడు. ఇలా ఆయన పేరుకు ముందు ఎన్నో విశేషాలు ట్యాగ్స్ ఉన్నా అసెంబ్లీ ముఖం మాత్రం ఈ రోజుకీ చూడలేకపోయారు. ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి పాలు అయ్యారు 2024లో పొత్తులలో భాగంగా ధర్మవరం సీటు బీజేపీకి వెళ్ళింది. లక్కీగా సత్యకుమార్ యాదవ్ ఆ సీటు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి కూడా అయ్యారు. అలా ధర్మవరం కమలం పరం అయింది. దాంతో పరిటాలకు చోటు లేకుండా పోయింది. ఇక చూస్తే ఆయన తల్లి పరిటాల సునీత రాప్తాడు నుంచి మళ్ళీ గెలిచారు. ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోతే పరిటాల శ్రీరామ్ అదే సీటు నుంచి పోటీ చేస్తారు అన్న టాక్ ఉంది. కానీ తాజాగా ధర్మవరంలో జరిగిన మినీ మహానాడులో శ్రీరామ్ మాట్లాడుతూ ధర్మవరాన్ని తాను మరచిపోను అన్నారు. ధర్మవరం తనకు ఎంతో నేర్పింది అని అన్నారు. యుద్ధం చేస్తాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది అది చాలు అని అంటూ తనకు అయితే ఈ రోజుకీ ఓపిక కూడా ఎక్కువే అన్నారు అయినా తనలో ఒరిజినాలిటీ మాత్రం అలాగే పదిలంగా ఉందని హాట్ కామెంట్స్ చేశారు. ధర్మవరం టీడీపీ క్యాడర్ డీలా పడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తాను వారి వెంట ఉంటాను అని హామీ ఇచ్చారు. తప్పు చేసినా ఒప్పు చేసినా మీకు నేను ఉన్నానని పరిటాల శ్రీరామ్ గట్టి భరోసా ఇచ్చేశారు. మీరు ఎవరికీ భయపడాల్సింది లేదు, ధైర్యంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. అయితే పరిటాల మనసు ధర్మవరం మీద ఉందా అందుకేనా ఈ కామెంట్స్ చేశారు అని అంతా చర్చించుకుంటున్నారు. ధర్మవరంలో చూస్తే అనేక సార్లు గెలిచిన వరదాపురం సూరి బీజేపీలో ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలో చేరి టికెట్ తీసుకుంటారు అని అంటున్నారు. ఇక పరిటాల ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇవ్వకుండా వారి సొంత సీటు రాప్తాడునే శ్రీరామ్ కి ఇచ్చి సునీతకు రెస్ట్ ఇస్తారని అంటున్నారు. అయితే పరిటాల ఫ్యామిలీ ఆలోచనలు మాత్రం రాప్తాడు ధర్మవరం రెండింటిలోనూ తమ హవా చాటాలని ఉన్నట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు ఈ లెక్కన చూస్తే రాప్తాడు నుంచి మరోసారి సునీత పోటీ చేస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక బీజేపీ ధర్మవరం సీట్లో గెలిచింది మంత్రి కూడా అయిన సత్యకుమార్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేస్తారని అంటున్నారు. దాంతో పాటు బీజేపీ ఈ సీటు వదులుకునే ప్రశ్న లేదని చెబుతున్నారు. ఇక పరిటాల శ్రీరామ్ చేసిన మరో వ్యాఖ్య ఎవరికీ భయపడవద్దు అని. టీడీపీ అధికారంలో ఉన్న వేళ ఎవరికి టీడీపీ క్యాడర్ భయపడాలి ఎందుకు భయపడాలి అన్న ప్రశ్న వస్తోంది. యుద్ధం చేయడానికి అవసరం అయితే అరచేయి ఆయుధం అవుతుంది అని అంటూ ఆయన చేసిన మరో వ్యాఖ్య ఎవరి మీద అని కూడా చర్చిస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అయితే ఓటమి తరువాత నిరాశలో మునిగి స్థానికంగా ఉండటం లేదు అని అంటున్నారు. దాంతో పాటు వైసీపీ సందడి అయితే పెద్దగా లేదు అని చెబుతున్నారు. ఇక నియోజకవర్గం ఎమ్మెల్యే బీజేపీకి చెందిన వారు. సత్య కుమార్ యాదవ్ ఎవరినీ భయపెట్టి రాజకీయాలు చేసే రకం కాదు అని అంటారు. ఇలాంటి నేపధ్యంలో పరిటాల శ్రీరామ్ చేసిన హాట్ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అన్నదే అర్థం కావడం లేదు. ఒరిజినల్ అలాగే ఉంది అంటే తండ్రి రవీంద్ర తరహాలో దూకుడు రాజకీయం చేయగలను అని శ్రీరామ్ చెప్పారా అన్నది కూడా చర్చగా ఉంది ఏది ఏమైనా మహానాడు వేదికగా శ్రీరామ్ చేసిన రాజకీయ గర్జనతో అనేక అర్థాలు పరమార్ధాలను స్వపక్షంలోనూ మిత్ర పక్షంలోనూ వైసీపీలోనూ వెతుక్కుంటున్నారు.
👉 జర్నలిస్టుల సంక్షేమం భద్రత కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది మంత్రి డోలాశ్రీ..
జర్నలిస్టుల సంక్షేమం భద్రత కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, విలేఖరులు వాస్తవాలను ప్రతిబింబించే విధంగా కథనాలు రాయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు ఎం ఎన్ ఫంక్షన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభ శుక్రవారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి స్వామి మాట్లాడుతూ రాజ్యాంగం ఏర్పాటు చేసిన నాలుగవ స్తంభం మీడియా అని, ప్రభుత్వం చేసే లోపాలు ఎత్తిచూపడంలో జర్నలిస్టులదే ప్రధాన పాత్ర అన్నారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యేలు సహాయ సహకారాలు అందిస్తారన్నారు. జర్నలిస్టులను అన్ని విధాల ఆదుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీని ఆయన అభినందనలు తెలియజేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ విలువలతో కూడిన వృత్తి చేసే వ్యక్తులలో జర్నలిస్టులు ముందు వరుసలో ఉంటారన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడం సరైనదే కానీ, ఏకపక్షంగా వార్తలు రాయడం మానుకోవాలన్నారు అర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తాను కృషి చేస్తానన్నారు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలపై వార్తలు రాసే క్రమంలో ప్రజాప్రతినిధులను సంప్రదించాలని తాము స్పందించకపోతే కథనాలు రాయాలని అన్నారు. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధి వంటి వారని, అటువంటి వారి సంక్షేమానికి తాను తప్పకుండా కృషి చేస్తామన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ విలువలతో కూడిన జర్నలిజం సమాజానికి ఎంతో అవసరమని కానీ కొందరు జర్నలిస్టులు ఆ వాస్తవాలను రాస్తూ సమాజాన్ని పెడదోవ పట్టిస్తున్నారని, జర్నలిజం అనే పదానికి విలువ లేకుండా చేస్తున్నారన్నారు . ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే విజయకుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా మీడియాకు ఉన్న హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తాను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూక స్వామి బాలాజీ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒంగోలు మేయర్ గంగాధర్ సుజాత మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం జరుగుతున్న తీరును ఆనాటి పత్రికలు ప్రజలకు తెలియజేసి ఉత్తేజాన్ని రేకెత్తించి చైతన్యాన్ని ప్రజా ప్రతినిధులు అధికారులు చేసే మంచి పనులను ప్రోత్సహిస్తే మరిన్ని మంచి పనులు చేయడానికి అవకాశం ఉండేదని,ఆ దిశగా జర్నలిస్టులు ఆలోచించాలన్నారు.దర్శి నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసేది జర్నలిస్టులని, వారు నీతి నిజాయితీతో వ్యవహరించా లన్నారు. జనం నాడి తెలిసిన వారని, అక్రమాలు వెలికి తీస్తారన్నారు. జర్నలిస్టులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎలాంటి వైద్య సదుపాయాలు అవసరమైన తనను సంప్రదించాలన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్ కె మాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలు అవినీతి అక్రమాలను జర్నలిస్టులు వెలికి తీస్తారన్నారు .అటువంటి వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అవినీతి అక్రమాలు ప్రశ్నించే జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని వాటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ వెంకట్రావు జి ఆంజనేయులు, ఏపీ డబ్ల్యూ జే ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఎస్వీ బ్రహ్మం జర్నలిస్టుల సమస్యలను సభకు హాజరైన ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు . పిమ్మట సభకు హాజరైన అతిథులను, సీనియర్ పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ రియాజ్ , కే రవిశంకర్, ఏపీ కమ్మ సేవా ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, సీనియర్ పాత్రికేయులు నాతాని బ్రహ్మానందం, కోట హరిబాబు, ఆర్ రామకృష్ణ, పొన్నూరు వెంకట శ్రీనివాసులు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు సుధాకర్, మాజీ అధ్యక్షులు సిహెచ్ కాశీ విశ్వనాథ్, రాజశేఖర్ రాష్ట్ర కార్యదర్శి భక్తవత్సలం, షేక్ చిన్న కరీముల్లా,దానం సునీల్, టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ ఫైరోజ్ బెగ్ ,టీవీ5 స్టాఫర్ జనార్ధన్ ఆంధ్రప్రభ బ్యూరో ఇన్చార్జి విజయభాస్కర్ రెడ్డి, వి 9 ఎండి డి కిరణ్ కుమార్, ఎంసీఏ అధ్యక్షులు వి నాగేశ్వరరావు,ఎడిటర్స్ పబ్లిషర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
👉’కీర్తి చక్ర’ అందుకున్న సిక్కోలు ఆర్మీ మేజర్ మళ్ల రాంగోపాల్ నాయుడు*..శ్రీకాకుళం :
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ మేజర్ మళ్ల రాంగోపాల్ నాయుడు కీర్తి చక్ర పురస్కారాన్ని అందుకున్నారు. నిన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశిష్టమైన ఈ అవార్డును ఆయనకు అందజేశారు. 2023లో జమ్ము కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద ఉగ్రమూకలతో రాంగోపాల్ నాయుడు వీరోచితంగా పోరాడారు. ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టడంతో పాటు తన బృందానికి ఎలాంటి ప్రమాదం కాకుండా కాపాడుకున్నారు.
👉 ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచర్ల మొటు వద్ద లారీని ఢీకొన్న కారు…కారులో ఉన్న ఆరుగురు మృతి..ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు..
👉 ఈ నెల 28 వ తేదీ పొదిలి లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భముగా హెలిప్యాడ్ మరియు రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాట్లను పోగ్రామ్స్ కో ఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే మార్కాపురం ఇంచార్జీ అన్నా రాంబాబు ,మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాస రెడ్డి ,ఒంగోలు ఇంచార్జి చుండూరు రవి తదితరులు పర్యవేక్షించారు.
👉పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎం డి యు ఆపరేటర్లు ను విధుల్లోంచి తొలగించినందుకు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది..అనంతరం జిల్లా కలెక్టర్ కు మెమోరాండం అందజేసిన ఆపరేటర్లు..
👉కడప జిల్లా మైలవరం మండలం, ఏ కంబాలదిన్నె గ్రామంలో దారుణం…*నాలుగున్నరేళ్ళ చిన్నారిపై అత్యాచారం, ఆపై హత్యకు పాల్పడ్డ దుండగుడు…పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది*

