👉 విశాఖ స్టీల్ ప్లాంట్‌లో విధుల నుంచి తొలగించిన 2,000 మంది కాంట్రాక్టు కార్మికులను 24 గంటల్లోగా విధుల్లోకి తీసుకోవాలి. లేకుంటే కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా 21 నుంచి ఆమరణ దీక్షకు దిగుతా’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అల్టిమేటమ్ ఇచ్చారు. ‘ఇప్పటికే రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికుల పొట్టగొట్టిన యాజమాన్యం… మరో 3,000 మందిని రోడ్డున పడేసేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం. అన్యాయాన్ని ప్రశ్నించిన కార్మికులను సైతం ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడం దారుణం. తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి. రెగ్యులర్ ఉద్యోగులకు 8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని సెయిల్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలి. లేకుంటే కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా 21 నుంచి స్టీల్ ప్లాంట్ బయటే ‘ఆమరణ దీక్ష’కు దిగుతాం’ అని ఓ ప్రకటనలో తెలిపారు.
👉చంద్రబాబును అభినందిస్తూ బిల్ గేట్స్ లేఖ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ కోసం గేట్స్ ఫౌండేషన్తో ఒప్పందం చేసుకున్నందుకు CM చంద్రబాబును బిల్ గేట్స్ అభినందిస్తూ లేఖ రాశారు. ‘CM చంద్రబాబు నాయకత్వంలో గేట్స్ ఫౌండేషన్-AP ప్రభుత్వ భాగస్వామ్యంతో అద్భుతమైన పురోగతి సాధిస్తాం. టెక్నాలజీ, ఇన్నోవేషన్ పట్ల CM ఆసక్తి చూపారు. విద్య, ఆరోగ్యంపై ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నా. ఈ భాగస్వామ్యం ఇలాగే కొనసాగాలి’ అని లేఖలో పేర్కొన్నారు.
👉ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరం: పవన్…‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని Dy.CM పవన్ అన్నారు. అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎస్, డీజీపీలకు ఆయన లేఖ రాశారు. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. దేశ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని లేఖలో ఆదేశించారు.
👉పాక్ గూఢచారిణి జ్యోతి మల్హోత్రా: విచారణలో విస్తుపోయే నిజాలు!..
పాక్‌కు గూఢచర్యం: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్..విచారణలో పశ్చాత్తాపం లేదన్న జ్యోతి!..పాక్ అనుకూల ప్రచారానికి ఆదేశాలు..పహల్గామ్ దాడి ముందు ఆ ప్రాంతంలో జ్యోతి పర్యటన..ఢిల్లీ పాక్ ఎంబసీ అధికారితో జ్యోతికి సంబంధాలు..
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా… పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిందన్న ఆరోపణలపై అరెస్టయిన విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో పలు కీలకమైన, ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణ సమయంలో జ్యోతి ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం గానీ, తాను చేసిన తప్పునకు బాధపడుతున్న ఛాయలు గానీ కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపినట్లు ‘ఇండియాటుడే’ ప్రచురించిన కథనం పేర్కొంది. అంతేకాకుండా, తాను కేవలం తన వాక్ స్వాతంత్ర్యాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నానని ఆమె దర్యాప్తు అధికారులతో చెప్పినట్లు సమాచారం. పాకిస్థాన్‌కు అనుకూలంగా ప్రచారం విస్తృతంగా వ్యాప్తి చేయాలని జ్యోతి మల్హోత్రాకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని, ఇది ఒక సరికొత్త తరహా యుద్ధమని కూడా దర్యాప్తు వర్గాలు తెలిపాయి.ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత, జ్యోతి తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ దాడి ఘటనకు ఏ ఒక్క పాకిస్థాన్ పౌరుడు కూడా బాధ్యుడు కాదని ఆమె అందులో పేర్కొన్నట్లు సమాచారం. జ్యోతితో సన్నిహితంగా ఉన్న కొందరు పాకిస్థానీయులు ఆమెకు మరికొన్ని అదనపు పనులు కూడా అప్పగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో కూడా అధికారులు విచారణ ముమ్మరం చేశారు.గతవారం హర్యానా పోలీసులు జ్యోతి మల్హోత్రాను గూఢచర్యం ఆరోపణల కింద అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆమె గురించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గామ్ దాడి జరగడానికి ముందు ఆమె పలుమార్లు పాకిస్థాన్‌లో పర్యటించినట్లు, ఒకసారి చైనాకు కూడా వెళ్లి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా, ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో, జ్యోతి ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న డానిష్ అనే అధికారితో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. డానిష్ ఆమెను ఉద్దేశపూర్వకంగా ట్రాప్ చేసి, తమ కార్యకలాపాలకు వాడుకున్నట్లు గుర్తించారు..పహల్గామ్ ఘటన జరగడానికి కొద్ది రోజుల ముందు జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్లిందని, అక్కడ పలు వీడియోలు చిత్రీకరించిందని కూడా పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారాన్ని ఆమె పాకిస్థాన్ ఏజెంట్లకు చేరవేసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్ బ్లాగర్‌గా, యూట్యూబర్‌గా పేరున్న జ్యోతి మల్హోత్రా ‘ట్రావెల్ విత్ జో’ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా భారత్‌లో అధికారులు నిలిపివేశారు.
👉షాద్ నగర్ నూతన ఎసిపి ఎస్ లక్ష్మీ నారాయణ..
షాద్ నగర్ నూతన ఎసిపిగా ఎస్ లక్ష్మీ నారాయణను నియమిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ సిసిఎస్ విభాగంలో డిఎస్పీగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ బదిలీపై ఇక్కడకు వస్తున్నారు.. *కేపి*
👉ఏపీ ప్రభుత్వంతో ఉపాధ్యాయ ఐక్యవేదిక చర్చలు విఫలం..ఆందోళన కొనసాగిస్తామన్న ఉపాధ్యాయ సంఘాలు..8 గంటలకు పైగా కొనసాగిన చర్చలు.. ప్రభుత్వానికి రేపటి వరకు సమయం ఇస్తున్నాం..లేదంటే 21న డీఈవో కార్యాలయాలు ముట్టడిస్తాం..ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక.
👉 *గుంటూరు*అల్పపీడనం కారణంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం.. పలు చోట్ల కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం..పలు సిటీలలో పొంగి పొర్లుతున్న మురుగు కాలువలు.. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వలన ఇబ్బందులకు గురి అవుతున్న ప్రజలు.. పలు చోట్ల నడవడానికి కూడా వీలు లేని దుస్థితి
👉నకిలీ నోట్లు అంటకట్టిన వ్యక్తితో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్… వ్యాపార భాగస్వామికి నకిలీ నోట్లు అంటకట్టిన వ్యక్తితో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ విజయవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. బెంగుళూరుకు చెందిన మనీషా సావంత్.. ఆమె తండ్రి స్నేహితుడైన రామ్‌పటేల్‌తో కలిసి వ్యాపార లావాదేవీలు సాగించేది. తనకు అర్జంట్‌గా బ్యాంక్ ఖాతాలో రూ.18.5 లక్షలను జమ చేయాల్సి ఉందని, వాటిని తనకు ఇస్తే వెంటనే ఇచ్చేస్తానని మనీషాసావంత్‌కు రామ్‌పటేల్ చెప్పాడు.దీంతో ఆమె ఈనెల 17న అతడి ఖాతాకు రూ.18.5 లక్షలను ట్రాన్స్‌ఫర్ చేసింది. డబ్బులు తిరిగి ట్రాన్స్‌ఫర్ చేయాలని అతడిని అడిగితే ఆదాయ పన్ను శాఖ అధికారులతో ఇబ్బందులు ఉన్నాయని, నగదు ఇస్తానని చెప్పాడు. ఆమెకు నగదుతో కూడిన బ్యాగును అప్పగించాడు. ఆమె ఓపెన్ చేసి చూడగా అందులో చిన్నపిల్లలు ఆడుకునే నకిలీ నోట్లు ఉన్నాయి.ఇదేంటని ప్రశ్నించేలోపే అతడు కారుతో ఆమెను ఢీకొట్టి పరారయ్యాడు. దీంతో బాధితురాలు పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నారు. రాంపటేల్‌తో పాటు అతడి స్నేహితులైన రాజ్ కిషోర్ సాహూ, దేవెందర్ కుమార్ పటేల్‌ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
👉 సైనికుల దుస్తులలో ఉగ్రవాదుల సంచారం..భారత సైనికుల దుస్తులను ధరించి పహల్గామ్ అమాయక ప్రజలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా అదే పంథాను ఉగ్రవాదులు అనుసరిస్తున్నారు. దీంతో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య తేడాను గుర్తించలేక జమ్మూకశ్మీర్లో స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో సైనికుల దుస్తులను పోలిన యూనిఫామ్లు విక్రయించకూడదని దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు.
👉విజృంభిస్తున్న కోవిడ్.. ఇద్దరు మృతి!*
2020లో కోవిడ్ ప్రపంచ దేశాలను వణికించింది. ఇప్పుడు మరోసారి కోవిడ్ కేసులు దేశంలో నమోదు అవుతున్నాయి. ఇప్పటికే దేశంలో 257 కేసులు నమోదైనట్లు భారత్ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే క్యాన్సర్తో బాధపడుతున్న మహిళ (59), కిడ్నీ సమస్యతో బాధపడుతున్న 14 ఏళ్ల బాలుడు చనిపోయారు. వీరిద్దరికి కోవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
👉రాజ్‌భవన్‌లో చోరీ కేసులో మరో ట్విస్ట్..!
హెల్మెట్‌తో ఓ వ్యక్తి రాజ్‌భవన్‌లోకి వచ్చినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. పంజాగుట్ట పోలీసులకు రాజ్‌భవన్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈనెల 14వ తేదీన రాత్రి చోరీ జరిగినట్లుగా నిర్ధారణకు వచ్చారు. కీలక ఫైల్స్ చోరీ అయినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.తెలంగాణ రాజ్‌భవన్‌లో జరిగిన చోరీ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజ్‌భవన్ వంటి అత్యంత భద్రతా ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రభుత్వ భద్రతా వ్యవస్థపై సందేహాలను కలిగిస్తోంది. రాజ్‌భవన్‌లో జరిగే కీలక సమావేశాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ఇతర సున్నితమైన సమాచారం ఈ హార్డ్‌డిస్క్‌ల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ డేటా మాయం కావడం వల్ల ప్రభుత్వ రహాస్యాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దొంగను గుర్తించారు. కంప్యూటర్ హార్డ్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
చోరీ చేసిన హార్డ్ డిస్క్‌లో ఎలాంటి కీలక సమాచారం లేదని తెలిపిన పోలీసులు ..రాజ్‌భవన్‌లో పని చేసే శ్రీనివాస్ అనే ఉద్యోగి, ఓ మహిళా ఉద్యోగి ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో ఆ కేసులో గతంలోనే శ్రీనివాస్ అరెస్ట్.. బెయిల్‌పై బయటకి వచ్చాక రాజ్‌భవన్‌లోకి హెల్మెట్‌తో వచ్చి.. తాను వాడిన సిస్టమ్‌లోని మహిళ మార్ఫింగ్ ఫొటోలు ఉన్న హార్డ్ డిస్క్‌ను తీసుకుని వెళ్లిపోయాడని వెల్లడించిన పోలీసులు.. ఈ మేరకు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
👉కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు .. నోటీసులు పంపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈటెల రాజేందర్‌కు నోటీసులు..జూన్ 5వ తేదీ లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశం ..కేసీఆర్ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్ రావు.. కేసీఆర్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటెల.
👉అనంతపురం తెలుగుదేశం పార్టీ మహానాడులో కలకలం..
*ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతుండగా కార్యకర్త ఆత్మహత్యాయత్నం*..సభలోనే విషద్రావకం తాగి అత్మహత్యాయత్నం చేసిన వెంకటేశులు..ఎస్సీ సెల్ నగరాధ్యక్షుడిగా ఉన్న వెంకటేశులు.. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టించుకోవడం లేదని ఆవేదన… పార్టీలో కష్టపడ్డ వారికి ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని ఎన్నిసార్లు కలిసినా పట్టించుకోలేదని ఆరోపణలు… నోటి నుంచి నురుగ రావడంతో ఆసుపత్రికి తరలించిన టీడీపీ నాయకులు
👉కిలోల కొద్దీ బంగారం ఎందుక్కొన్నారు రెడ్డిగారు???
ఏపీలో ఇప్పుడు మద్యం కుంభకోణంపై పెద్ద చర్చే నడుస్తోంది. అన్ని కేసుల కంటే కూడా ఈ కేసే ఇప్పుడు ప్రదాన కేసుగా మారిపోయింది. రాజకీయ నేతల అరెస్టులు తప్పించి… దాదాపుగా అన్ని రకాలుగా ఈ కేసు సంచలనాలకే కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఇలాంటి ఈ కేసు ఓ కీలక అదికారి అత్యుత్సాహం, హైరానా, ఆదుర్దా కారణంగా బయటపడిపోయిందన్న విషయం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీబీసీఎల్) ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి అతి జాగ్రత్త వల్లే ఈ కుంభకోణం బయటపడిపోయిందని తాజాగా తేలింది…వాస్తవంగా ఓ పార్టీ ప్రభుత్వం అదికారం నుంచి దిగిపోతే… ఆ సమయంలో తన అక్రమాలు బయటపడకుండా ఉండేలా పలు పత్రాలను మాయం చేస్తూ ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ తరహా యత్నాలు బాగానే పెరిగిపోయాయి. అయితే ఏదో గుట్టు చప్పుడు కాకుండా జరగాల్సిన కార్యక్రమాలను వాసుదేవరెడ్డి హైరానా పడిపోయి… దాదాపుగా తన కార్యాలయాన్నే ఆయన ఊడ్చేసే యత్నం చేశారు. అప్పటికే మద్యం విక్రయాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించిన కూటమి పార్టీలు అదికారంలోకి వచ్చాక ఇంత జరుగుతూ ఉంటే ఊరకే కూర్చోవు కదా.
ఏపీబీసీఎల్ లో కీలక పత్రాలను మాయం చేస్తున్నారంటూ వాసుదేవరెడ్డిపై కూటమి సర్కారు కేసు నమోదు చేసింది. అప్పటికే వాసుదేవరెడ్డి పత్రాలను మాయం చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు వాసుదేవరెడ్డి కారు, ఇల్లు, కార్యాలయం తదితరాలను సోదా చేశారు. ఈ సోదాల్లో కిలోల కొద్దీ బంగారం కొనుగోలు చేసిన రషీదులు కొన్ని బయటపడ్డాయట. అదేంటీ… బంగారం అయితే ఏ గ్రాముల లెక్కనో, తులాల లెక్కనో కంటారు గానీ… వీళ్లేంటీ ఏకంగా కిలోల లెక్కన కొన్నారంటూ మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మద్యం కుంభకోణం జరిగిన మాట వాస్తవమే అని ఆధారాలతో సహా బయటపడిపోయింది.
వాస్తవానికి వాసుదేవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ అదికారి కాదు. కేంద్ర సర్వీసు అయిన ఐఆర్టీఎస్ కు చెందిన అదికారి. వైసీపీ అదికారంలోకి రాగానే… జగన్ ఆయనను డిప్యూటేషన్ మీద ఏపికి తీసుకువచ్చి ఏపీబీసీఎల్ ఎండీగా కీలక పోస్టింగ్ ఇచ్చారు. ఇంకేముంది పిలిచి మరీ ఇంతటి కీలక పోస్టు ఇస్తే… జగన్ చెప్పినట్టు చేయక చస్తారా? అందులోనే తన సామాజిక వర్గానికి చెందిన నేత తనను నమ్మారంటూ మరింత జోరుగా దందాను సాగించారు. తీరా ప్రభుత్వం పడిపోయాక తన గురువును రక్షించేందుకు ఆయన పడరాని పాట్లు పడ్డారు. ఆ పాట్లతోనే ఆయన మొత్తం ముఠాలోని సభ్యులను అడ్డంగా బుక్ చేసి పారేశారు.
👉ఆడుదాం ఆంధ్ర’ అవినీతిపై విజిలెన్స్… *రోజా ఇలాకాపై ప్రత్యేక దృష్టి*
వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి ఆర్కే రోజా సారధ్యంలో జరిగిన ‘ఆడుదాం.. ఆంధ్ర’ క్రీడల కార్యక్రమాల్లో జరిగిన అవినీతి తీగ లాగుతున్నారు. తిరుపతి జిల్లాలో ముఖ్యంగా రోజా ప్రాతినిథ్యం వహించిన నగరి నియోజకవర్గంలో చోటుచేసుకున్న అవకతవకల చిట్టాను సేకరించే పనికి తిరుపతి ప్రాంతీయ విజిలెన్స్ అధికారులు సోమవారం శ్రీకారం చుట్టారు. 2023-24 సంవత్సరంలో హడావుడిగా ప్రారంభించిన ‘ఆడుదాం-ఆంధ్ర’ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధుల్లో గోల్‌మాల్ జరిగిందంటూ అనేక ప్రాంతాల నుంచీ విజిలెన్సు డీజీ భరీ్‌షకుమార్ గుప్తాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. దీంతో విజిలెన్సు ఎస్పీ కరీముల్లా షరీఫ్ జిల్లా క్రీడాప్రాధికార సంస్థ నుంచి అవసరమైన రికార్డులు తెప్పించి పరిశీలించారు. జిల్లాలో ఆట స్థలాలే లేని చోట్ల కూడా ఆటలు జరిగినట్లుగా పేర్కొన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నగరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు రావడంతో విజిలెన్సు డీఎస్పీ మల్లికార్జున రావు, సీఐ చంద్రశేఖర నాయక్, సిబ్బంది విచారణ చేస్తున్నారు. మరో మూడ్రోజులపాటు ఇది కొనసాగనుంది. జిల్లాకు ‘ఆడుదాం-ఆంధ్ర’ కింద నిధులు ఎంత వచ్చాయి? ఎంత ఖర్చు చేశారు? ఆటలకు సంబంధించి ఎన్ని కిట్లు కొనుగోలు చేశారు? వీటిని ఎక్కడ నుంచి తెప్పించారు? వాటి నాణ్యత ఏమిటి.. వంటి వివరాలను ఆరా తీస్తున్నారు. దీంతో పాటు క్రీడాకారులకు భోజన సదుపాయాలు, తదితర విషయాల మీద కూడా వివరాలు సేకరిస్తున్నారు
👉 *ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావం తెలుపుతూ ఎమ్మెల్యే ముత్తుముల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ.*
*ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలో “ఆపరేషన్ సిందూర్” విజయవంతం కావడం పై సంఘీభావం తెలుపుతూ స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా గాంధీ బొమ్మ సెంటర్ లో గాంధీ మహాత్ముడికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ ర్యాలీ కొనసాగించారు. ర్యాలీలో మాజీ ఆర్మీ ఉద్యోగులతో పాటు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ… పహల్ గామా లో 26 అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని మన దేశంతో పాటు కాశ్మీర్ అభివృద్ధి చెందుతుందని ఓర్వలేక పాకిస్తాన్ ప్రభుత్వం, ఉగ్రవాదులతో చేతులు కలిపి దాడులు చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దాడులకు భారతదేశం భయపడదని ఆపరేషన్ సింధూర్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను ఎరివేసి పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావటానికి కృషి చేసిన త్రివిధ దళాలకు నా సెల్యూట్ అని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. జై సింధూర్ జై భారత్ అని నినాదాలతో గిద్దలూరు పట్టణం మారుమోగింది. కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భారీగా పాల్గొన్నారు.*
👉 కార్యకర్తే పార్టీకి అధినేత :కార్యకర్తల కృషి ఫలితమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ విజయం..* కడపలో జరిగే మహానాడు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేద్దాం…*గిద్దలూరు మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల*
*కార్యకర్తే టీడీపీకి అధినేత అని, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ అని తెలుగుదేశం అని, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం పట్టణంలోని విట్టా సుబ్బరత్నం కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అండతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అధికారంలో ఉన్న లేకపోయినా కార్యకర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని, గతంలో పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద భీమా ద్వారా రూ. 2 లక్షలు అందిస్తే, ప్రస్తుతం రూ. 5 లక్షలకు పెంచడం జరిగిందని అన్నారు. ఇటీవల నియోజకవర్గలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు పరిహారం అందించడం జరిగిందన్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు…*రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి పెద్ద దిక్కుల సీఎం చంద్రబాబు 2014లో నిలబడ్డారని రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రస్తుత మాజీ సీఎం జగన్ మోసపూరితమైన హామీలు ఇచ్చి 2019లో అధికారంలోకి వచ్చారని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరించారాని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాలా తీసేలా చేశారన్నారు. తిరిగి రాష్ట్రాన్ని చంద్రబాబు బాగు చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల వారిని ఆదుకుంటూ ఇచ్చిన హామీలన్నిటిని నిలబెట్టుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ఈనెల 27, 28, 29 తేదీలలో కడపలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, మార్కెట్ యార్డ్, నగర పంచాయతీ, సొసైటీ బ్యాంకు చైర్మన్లు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రధాన కార్యదర్శులు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గోన్నారు.*

