👉కరోనా రిటర్న్స్.. 👉రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..*..మెడికవర్ ఆసుపత్రిలో దారుణం..శ్రీకాకుళం జిల్లా..*మండల స్థాయి అధికారులు టీడీపీ నాయకులకు తొత్తులుగా మారారు..* గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా.. పలు శుభకార్యాలలో పాల్గొన్న గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

👉కరోనా రిటర్న్స్.. మాస్క్ మస్ట్.హాంకాంగ్, సింగపూర్ లో విజృంభిస్తున్న కొవిడ్ వైరస్.. వారంలోనే వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు.. సింగపూర్ లో 14,200 మందికి సోకిన వైరస్.. హాంకాంగ్ లో 17, 13 నెలల చిన్నారులకు కరోనా పాజిటివ్ .. కొవిడ్ విజృంభణతో మాస్క్ లను తప్పనిసరి చేసిన సింగపూర్, హాంకాంగ్ అధికారులు.

👉రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై చర్యలకు రంగం సిద్ధమైందని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు.తమ ఆదేశాలను ధిక్కరించిన నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. గురువారం దర్భంగాలో జిల్లా ఉన్నతాధికారులు విలేకర్లతో మాట్లాడుతూ.. దర్బంగాలో అంబేద్కర్ హాస్టల్ వద్ద విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమానికి నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. స్థానిక టౌన్ హాల్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించేందుకు నిర్వాహకులకు అనుమతి ఇచ్చామని స్పష్టం చేశారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం అంబేద్కర్ హాస్టల్ వద్దే విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.ఈ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుక పోలీసు సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఆ క్రమంలో అంబేద్కర్ హాస్టల్ వద్దకు రాహుల్ గాంధీ వస్తున్న క్రమంలో ఆయన్ని యూనివర్సిటీ గేట్ వద్ద పోలీసులు ఆపే ప్రయత్నం చేశారన్నారు. పోలీసుల ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయని చెప్పారు. దీంతో యూనివర్సిటీ గేట్ తెరవక తప్పలేదన్నారు. అనంతరం ఖాన్‌కా చౌక్ వద్దకు రాహుల్ చేరుకుని.. అక్కడి నుంచి అంబేద్కర్ హాస్టల్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు కాలినడకన ఆయన చేరుకున్నారని తెలిపారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారని చెప్పారు..మీతో మాట్లాడటానికి, మీరు చెప్పింది వినేందుకు తాను ఢిల్లీ నుంచి వచ్చానని విద్యార్థులకు రాహుల్ గాంధీ వివరించారు. కానీ అధికారులు తానను ఆపేందుకు అడుగడుగునా అడ్డం పడ్డారన్నారు. అలాగే బ్యారీకేడ్స్‌ను రహదారులకు అడ్డంగా పెట్టారని చెప్పారు. కానీ తాను మరో మార్గం ద్వారా ఇక్కడికి చేరుకున్నారన్నారు.

అంతేకాదు.. తనను ఎవరు ఆపలేరన్నారు. ఎందుకంటే తన వెనుక మీ బలం ఉందని చెప్పారు. దీంతో ప్రపంచంలో ఏ శక్తి తనను ఆపలేదని తెలిపారు.అలాగే బిహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వంతోపాటు ప్రధాని మోదీలపై ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అదే విధంగా కులగణన నిర్వహించేందుకు పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకోని ప్రధాని మోదీ.. తన ఒత్తిడి కారణంగా ఈ గణనను నిర్వహించేందుకు సానుకూలంగా స్పందించారని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా గుర్తు చేశారు..ప్రధాని మోదీ ప్రభుత్వం.. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, కులగణనతోపాటు నిరుపేదలకు వ్యతిరేకంగా పని చేస్తుందని మండిపడ్డారు. ఈ మోదీ ప్రభుత్వం కేవలం అదానీ, అంబానీ సంస్థలకు అనుగుణంగా మాత్రమే పని చేస్తుందంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. మరోవైపు అంబేద్కర్ హాస్టల్ వద్ద రాహుల్ గాంధీని ప్రసంగించేందుకు అనుమతించక పోవడంపై బిహార్‌లోని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి. అదీకాక.. హాస్టళ్లలో పరిస్థితు ప్రస్తుతం ఎలా ఉన్నాయో తనకు తెలుసునన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ పరిస్థితులు మారుస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.

👉వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి లోకేష్..*అన్ని విధాల అండగా ఉంటానని భరోసా*ప్రకాశం జిల్లా*ఒంగోలులో దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్.. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేసుకున్నారు. యువగళం పాదయాత్ర సమయంలో తనతో పాటు అడుగులు వేశారని, పార్టీ పటిష్టత కోసం కృషిచేసిన వీరయ్య చౌదరి దారుణహత్య బాధాకరమని అన్నారు. హత్య నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ఉగ్ర నరసింహ రెడ్డి, బిఎన్ విజయకుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు….

👉మెడికవర్ ఆసుపత్రిలో దారుణం..శ్రీకాకుళం జిల్లా..

చనిపోయిన వ్యక్తికి చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్..ఠాగూర్ సినిమా సన్నివేశం రిపీటైందని వాపోతున్నా బాధితులు..కోండ్రు త్రినాథరావు చికిత్స పొందుతూ మృతి చెందడం తో ఆయన బందువులు హాస్పిటల్ వద్ద నిరసన..

గత నెల 29 న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ త్రినాథరావు మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేర్పించిన బందువులు..కనీసం తమకు చెప్పా పెట్టకుండా ఆపరేషన్లు చేయడంతో పాటు.. త్రినాధ మృతి చెందిన కనీసం సమాచారం ఇవ్వలేదని వాపోతున్న త్రినాధ్ కుటుంబ సభ్యులు.. త్రినాధ్ లో కదలికలు లేకపోవడంతో గట్టిగా ప్రశ్నిస్తే చనిపోయాడని చెబుతున్నారని వాపోతున్న త్రినాద్ కుటుంబ సభ్యులు ..లక్షలు రూపాయిలు బిల్లులు చెల్లించినా కనీసం చనిపోయారని కూడా చెప్పలేదని మండిపాటు.హాస్పిటల్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. చేస్తూ ఆందోళన .  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసుల మోహరింపు..

👉ప్రకాశం జిల్లా**ఒంగోలు లో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించిన పోలీసులు..ఈ హత్య కేసులో మొత్తం 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడి..

👉 సింగరేణి బొగ్గు గనిలో భారీ పేలుడు.. పలువురికి గాయాలు..పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఓసీ2 బొగ్గు గనిలో భారీ పేలుడు..ఈ పేలుడు ధాటికి చుట్టు పక్కల ఉన్న నాగేపల్లి, లద్నాపూర్, ఆదివారం పేట, రాజాపూర్, పన్నూరు గ్రామాల్లో భూమి కంపించి, ధ్వంసమైన ఇండ్లు..ఇండ్లపై రాళ్లు ఎగిరిపడి పలువురికి గాయాలు..బ్లాస్టింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని, బాధితులకు నష్ట పరిహారం అందజేయాలని ధర్నా చేపట్టిన ప్రజలు

👉పలాసలో 18.55కేజీల గంజాయి పట్టివేత..*శ్రీకాకుళం జిల్లా:*..గంజాయి రవాణాకు సుజిత్ సూర్జెయా అనే బస్సు డ్రైవర్ తో బేరం కుదిరించుకున్న గంజాయి వ్యాపారి..మహారాష్ట్రలోని పూనే చెందిన చావస్ కు గంజాయి తరలిస్తున్న వైనం..పలాస రైల్వే స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ ముద్దాయి..7 ప్యాకెట్లుగా ప్యాకెట్లుగా అమర్చుకున్న గంజాయి..18.55 కేజీల గంజాయిని స్వాధీనం పరుచుకున్న కాశీబుగ్గ పోలీసులు

*కప్పల వారి వివాహా కార్యక్రమంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..*కంభం పట్టణం, ఉదయగిరి బృందావనం కళ్యాణ మండపంలో నడింపల్లె గ్రామానికి చెందిన కప్పల శారద (SGT)  కుమారుడు చి. కాశీ జశ్వంత్ మరియు మణి సాహితీ లకు జరిగిన వివాహా కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి  ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు.. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గోన్నారు.


**నూతన దంపతులను ఆశీర్వదించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..
*కంభం పట్టణం, ఉదయగిరి బృందావనం కళ్యాణ మండపంలో నడింపల్లె గ్రామానికి చెందిన కప్పల శారద కుమారుడు చి. కాశీ జశ్వంత్ మరియు మణి సాహితీ లకు జరిగిన వివాహా కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు. కార్యక్రమంలో మండల నాయకులు పాల్గోన్నారు.

👉మండల స్థాయి అధికారులు టీడీపీ నాయకులకు తొత్తులుగా మారారు.. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు..మండల స్థాయి అధికారులు టీడీపీ నాయకులకు తొత్తులుగా మారారు.. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపించారు* అధికారులు ఆత్మ పరిశీలన చేసుకోవాలనీ..మండల స్థాయి పరిపాలనకు బాధ్యులుగా ఉన్నవారు, పర్యవేక్షణ అధికారం ఉన్నవారు తమ స్థాయిని మరచి అధికార పార్టీకి తొత్తులుగా మారడం సమంజసం కాదు..కొనకనమిట్ల తహసీల్దార్, ఎంపీడీవో ఇతర అధికారులకు మండలంలో ఇంకేం పనులు లేనట్లు, ప్రజా సమస్యలే లేనట్లుగా భావించి వెలిగండ్ల గ్రామంలో వైయస్ఆర్ సీపీ జెండా,జెండా దిమ్మెనే సమస్యగా భావించడం దుర్మార్గం.వారు ఉద్యోగం చేస్తున్నది ప్రజా సమస్యల పరిస్కారానికో లేక వైయస్ఆర్ సీపీ జెండాలను తొలగించేందుకో వారే ఆలోచించాలి.వైయస్ఆర్ సీపీ అభిమానుల సొంత స్థలంలో నిర్మించిన వైయస్ఆర్ సీపీ జెండాను, దిమ్మెను తొలగించడం అనేది అధికారుల దిగజారుడు తనానికి నిదర్శనంగా కనిపిస్తోంది.బజార్లో ఉన్న జెండా దిమ్మెను తొలగించారని, సొంత స్థలంలో జెండాను ఏర్పరచుకుంటే అక్కడ కూడా ఉంచరా? కనీసం రెండు రోజులు కూడా తట్టుకోలేని స్థితిలో ఉన్నారా? అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేది అందరూ ఆలోచించాలి. అధికారులు టీడీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తే విధంగా పనిచేయడం సిగ్గుచేటైన విషయం. ఇది సరైన పద్ధతి కాదన్నారు.

👉*కరేటి వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా..

*కొనకనమిట్ల మండలం యిరసలగుండం గ్రామంలో కరేటి రామకోటేశ్వరరావు,నాగలక్ష్మి దంపతులకుమారుడు వివాహ మహోత్సవానికి హాజరయి నూతన వధూవరులు అయిన చైతన్య బాబు,అంజలిలను ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైస్సార్సీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు..

👉దొంగరి వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*

*బెస్తవారిపేట మండలం శింగరపల్లె గ్రామంలో దొంగరి వెంకటయ్య,సుబ్బమ్మల కుమారుడువివాహ మహోత్సవానికి హాజరు అయి నూతన వధూవరులు అయిన వేణుగోపాల్, చంద్రలక్ష్మిలను ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైస్సార్సీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు..

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..