👉అరబ్ దేశాల సంపద చూసి ట్రంప్ అచ్చెరువు.. కొంపదీసి కన్ను పడలేదా? ప్రపంచానికి పెద్దన్న అమెరికా అన్న విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. అత్యంత ఖరీదైన.. విలాసవంతమైన జీవితం ఆ దేశంలోనే ఉంటుందన్న మాట వినిపిస్తుంటుంది. ప్రపంచానికి పెద్దన్న అమెరికా అన్న విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. అత్యంత ఖరీదైన.. విలాసవంతమైన జీవితం ఆ దేశంలోనే ఉంటుందన్న మాట వినిపిస్తుంటుంది. సహజంగానే బిలియనీర్ అయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఆశ్చర్యపోయేంతటి పరిస్థితి ఉంటుందా? అంటే.. చాలామంది లేదని చెబుతారు. కానీ.. వాస్తవం ఏమంటే.. ఆయన తాజా అరబ్ దేశాల పర్యటన సందర్భంగా ఆ దేశాల్లోని సంపద చూసి అచ్చెరువు చెందుతున్న పరిస్థితి. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థకు.. బలమైన సైన్యానికి అధిపతి అయిన ట్రంప్.. అరబ్ దేశాల సంపదను చూసి ఆశ్చర్యానికి గురి కావటమే కాదు.. ఒక దశలో ఆయన నోటి నుంచి వచ్చిన మాట చూస్తే.. ఆయన ఎంత అసూయకు గురయ్యారన్న భావన కలుగక మానదు. ఇంతకూ ట్రంప్ ఏమన్నారు? ఏ సందర్భంలో అన్నారన్నది చూస్తే.. ఖతార్ ఎమిర్ ను పొగడ్తలతో ముంచెత్తి.. ఖతారీ ప్యాలెస్ లోని పాలరాయిని చూసి అద్భుతమంటూ.. ‘‘దీనిని సొంతం చేసుకోవటం ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావొచ్చు’’ అన్నమాట చూస్తే.. పెద్దన్న పాడు కన్ను అరబ్ దేశాల మీద పడిందా? అన్న భావన రావటం ఖాయం. సౌదీ అరేబియాలోని ధగధగ మెరిసే విమానాలపైనా ఆయన ప్రశంసలు కురిపిస్తూ.. వాటితో పోలిస్తే తన ఎయిర్ ఫోర్సు వన్ విమానం ఎంతో చిన్నదని.. అకట్టుకునేదిగా లేదని పేర్కొనటం గమనార్హం. గల్ఫ్ దేశాలు అత్యాధునిక బోయింగ్ 747 లను వాడుతున్నాయని.. తాను నాలుగు దశాబ్దాల నాటి విమానాల్ని వాడుతున్నట్లుగా పేర్కొన్నారు. తన విమానాన్ని మార్చటానికి తానెంతో ఆసక్తిగా ఉన్న విషయాన్ని ఆయన తన మాటల్లో చెప్పేశారు. అంతేకాదు ఖతార్ ఆయనకు ఇచ్చేందుకు సిద్ధమైన విలాసవంతమైన విమానాన్ని తీసుకోవటానికి ఆయన ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. అమెరికా నిబంధనల ప్రకారం.. దాని భద్రత నిబంధనల వేళ.. ఇలాంటి ఖరీదైన బహుమతుల్ని స్వీకరించే విషయంలో పరిమితులు ఉన్నాయి. అంతేకాదు.. ఖతార్ రాజ కుటుంబం తనకు బహుమతిగా ఇచ్చే విమానాన్ని ఎయిర్ ఫోర్సు వన్ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే.. ఇందుకోసం కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.. అందుకు భారీగా ఖర్చు అవుతుంది. వీటికి ఇప్పుడున్న నిబంధనలు ఒప్పుకోవు. అయితే.. వాటిని పట్టించుకోకుండా ఖతార్ రాజకుటుంబం ఇచ్చే బహుమతిని తీసుకోవాలన్న ఆసక్తి ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అరబ్ దేశాల సంపద చూసి ట్రంప్ కన్ను కుడితే మాత్రం.. ఆ దేశాలకు కొత్త కష్టాలు ఖాయమని చెప్పక తప్పదు. ఎందులో అయినా సరే తాను.. తన దేశం మాత్రమే ముందు ఉండాలనే ట్రంప్ మీద అరబ్ దేశాల పర్యటన ఎలాంటి ప్రభావాన్నిచూపిందన్న విషయం రానున్న రోజుల్లో వెల్లడి కావటం ఖాయం.
👉 భారత్ పై విషం కక్కిన ట్రంప్.. యాపిల్ విస్తరించొద్దని పిలుపు నువ్వేమీ కంపెనీలు నిర్మించాల్సిన అవసరం లేదు. అమెరికా మీద దృష్టి పెట్టండి” అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సదరు కథనాల్లో పేర్కొన్నారు. దోహా వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్‌తో భారత్‌లో యాపిల్ కార్యకలాపాల విస్తరణపై పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. భారత్‌పై తనకున్న అక్కసును ఈ సందర్భంగా ట్రంప్ బయటపెట్టినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. దోహాలో జరిగిన ఒక బిజినెస్ ఈవెంట్‌లో ట్రంప్ మాట్లాడుతూ, యాపిల్ సంస్థ భారత్‌లో విస్తరించడాన్ని తాను కోరుకోవడం లేదని, అమెరికాపై దృష్టి సారించాలని టిమ్ కుక్‌కు సూచించినట్లు తెలిపారు. “ప్రపంచంలోనే ఇండియా హై టారిఫ్స్ కలిగిన దేశం. అమెరికా ఉత్పత్తులపై ఎలాంటి సుంకం విధించమని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత్ వాళ్లని వాళ్లు చూసుకోగలరు. నువ్వేమీ కంపెనీలు నిర్మించాల్సిన అవసరం లేదు. అమెరికా మీద దృష్టి పెట్టండి” అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సదరు కథనాల్లో పేర్కొన్నారు. భారత్‌లో అధిక సుంకాలు ఉన్నాయని ట్రంప్ గతంలోనూ చాలాసార్లు విమర్శించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక పన్నులు విధిస్తోందని ఆయన ఆరోపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో యాపిల్ వంటి అమెరికన్ కంపెనీలు భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని విస్తరించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. యాపిల్ ఇటీవలి కాలంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, భారత్‌లో తన ఉత్పత్తిని గణనీయంగా పెంచుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, భారత్ తమ ఉత్పత్తులపై ఎటువంటి సుంకం విధించమని అమెరికాకు హామీ ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొనడం గమనార్హం. దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ప్రస్తుతం యాపిల్ తన తయారీని భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. ఫోన్‌ల ఉత్పత్తిని పెంచుతూ, ఎగుమతులకు భారత్‌ను కీలక కేంద్రంగా మారుస్తోంది. ఈ సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి. ఇండియాలో ఇప్పటికే విస్తరణ బాట పట్టిన యాపిల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంలో పెట్టుబడులు విస్తరించవద్దని చెప్పినప్పటికీ ఆపిల్ ఇప్పటికే తన కార్యకలాపాలను నిశ్శబ్దంగా పెంచుకుంటోంది. మార్చిలో ఆపిల్ భారతదేశం నుండి అమెరికాకు 600 టన్నుల ఐఫోన్‌లను, వీటి విలువ 2 బిలియన్ డాలర్లు రవాణా చేసింది. ఇది దాని స్థానిక తయారీ భాగస్వాములైన టాటా – ఫాక్స్‌కాన్ లు అందించిన రికార్డు స్థాయి ఫోన్లు. ముఖ్యంగా ఒక్క ఫాక్స్‌కాన్ మాత్రమే 1.3 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లను అందించింది అని రాయిటర్స్ నివేదించింది. అయితే, భారతదేశంలో ఐఫోన్‌లను తయారు చేయడానికి అదనపు ఖర్చు అవుతుంది. చైనా కంటే ఉత్పత్తి ఖర్చులు 5–8% ఎక్కువగా ఉంటాయని, కొన్ని సందర్భాల్లో 10% వరకు పెరగవచ్చని రాయిటర్స్ పేర్కొంది. అయినప్పటికీ చైనాతో వాణిజ్య విధానంలో భవిష్యత్ నష్టాలను తగ్గించడానికి ఈ మార్పు ఒక లెక్కగట్టిన చర్యగా అనిపిస్తుంది. ఏప్రిల్‌లో అమెరికా ప్రభుత్వం భారతదేశం నుండి దిగుమతులపై 26% సుంకాన్ని విధించింది – ఇది చైనా వస్తువులపై విధించిన 100% పైగా సుంకంతో పోలిస్తే చాలా తక్కువ. వాషింగ్టన్ అప్పటి నుండి చైనాను మినహాయించి, ఆ సుంకాలను మూడు నెలల పాటు నిలిపివేసింది. ట్రంప్ అమెరికన్ తయారీని తిరిగి దేశంలోకి తీసుకురావాలని గట్టిగా చెబుతున్నప్పటికీ, ఆపిల్ యొక్క గ్లోబల్ సప్లై చైన్ నిర్ణయాలు రాజకీయ ఒత్తిడి, వ్యయ సామర్థ్యం మరియు మార్కెట్ యాక్సెస్ మధ్య సమతుల్యాన్ని ప్రతిబింబిస్తూనే ఉన్నాయి.
👉వైద్యాధికారులతో సమావేశమైన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*ప్రకాశం జిల్లా, గిద్దలూరు ఏరియా ఆసుపత్రి మీటింగ్ హాల్ లో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆరు మండలాల వైద్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. అంతకు ముందు ఏరియా ఆసుపత్రిలోని ఓపి గదిని, ప్రైమరీ ఔషదాలయం, రోగుల కొరకు ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కంభం, గిద్దలూరు ఏరియా ఆసుపత్రుల సమస్యలపై మాట్లాడారు. ఆసుపత్రులకు వస్తున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్లను వైద్యులను ఆయన ఆదేశించారు. అలానే రోగులు ఎంతవరకు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులను ఆరా తీశారు. సిబ్బంది కొరత కొన్ని ఆసుపత్రులలో వైద్యుల కొరత అంశాన్ని ప్రస్తావించారు. అలానే ఏరియా ఆసుపత్రి సూపరింటెంటెడ్ లు గ్రామీణ ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచనలు ఇచ్చారు..*గత పాలకులు అధికారులు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిని మరిచి వంద పడకలగా మారవలసిన ఆసుపత్రిని 40 పడకల ఆసుపత్రిగా మార్చడం పై ప్రస్తావించారు. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేవరకు విశ్రమించేది లేదని అన్నారు. ఇప్పటికే ఆసుపత్రి ప్రాంగణంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని సిమెంట్ రోడ్లు వేయడం కాంపౌండ్ వాల్ కట్టించడం వంటివి పూర్తి చేయడం జరిగిందన్నారు. 108, 104 సర్వీసులు ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నాయో రికార్డులు పరిశీలించారు. నియోజకవర్గంలో 24 గంటల పాటు తెరచి ఉండే ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు కచ్చితంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గిద్దలూరు ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ ఆదాం, గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, కమిషనర్ శ్రీనివాసులు, గిద్దలూరు, కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్లు బైలడుగు బాలయ్య, పూనూరు భూపాల్ రెడ్డి, సొసైటీ బ్యాంకు చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య, పట్టణ కౌన్సిలర్లు, మరియు ఆరు మండలాల వైద్య శాఖ అధికారులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.*
👉VRTLS ఫుడ్ కోర్ట్ ను ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల**కొమరోలు మండలం, తాటిచర్ల మోటు – మైదుకూరు జాతీయ రహదారి, గోవింద పల్లె గ్రామ సమీపంలో పొట్టిపల్లె గ్రామానికి చెందిన ఒంగోలు శ్రీనివాసులు నూతనంగా ఏర్పాటు చేసిన VTRLS ఫుడ్ కోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు ముత్తుముల సంజీవ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, సొసైటీ బ్యాంకు చైర్మన్ బీజ్జం రవీంద్రా రెడ్డి, వెంకట రామిరెడ్డి, అనప శేఖర్ తదితరులు పాల్గొన్నారు.*
👉స్టేట్ చైల్డ్ లైఫ్ కమిషన్ మెంబర్ బి పద్మావతి ఆకస్మిక తనిఖీ .. ప్రకాశం జిల్లా కంభం..
స్టేట్ చైల్డ్ లైఫ్ కమిషన్ మెంబర్ బి పద్మావతి గురువారం కంభం పట్టణంలోని అంగన్వాడీ సెంటర్లను సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ లో సక్రమంగా నిర్వహించాలని చిన్నారులకు గర్భవతులకు బాలింతలకు పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా అందించాలని తెలిపారు అలాగే అంగన్వాడీ సెంటర్లలో చదువుకున్న చిన్నారులు ప్రభుత్వ బడులలో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ కళాశాలలో ఎంతమంది చేరుతున్నారనే నివేదికలు తయారు చేయాలని, బాల్యవివాహాలు అరికట్టేందుకు, బాల వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేయాలని, ఇందుకుగాను గ్రామపంచాయతీ సర్పంచ్ ల సిబ్బంది సహకారం తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్ ఏ కిరణ్, విజయలక్ష్మి, సర్పంచ్ బోడయ్య, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, బి పేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఇంచార్జ్ సిడిపిఓ నీలోఫర్, సూపర్వైజర్ వి చెంచులక్ష్మి గ్రామపంచాయతీ మరియు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు

