👉ట్రంప్ జోక్యం.. మన దౌత్య వైఫల్యం కాదా?’..ట్రంప్ జోక్యం.. మోదీ క్లారిటీ ఏమైంది?..👉 పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం: సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..అఖిలపక్షం, పార్లమెంట్ భేటీ జరపాల్సిందే.. సిద్ధ రామయ్య.. . 👉 ఏంటీ కిరానా హిల్స్.. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత దానిపై ఎందుకు చర్చ?..👉కర్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..👉కొందరు హైకోర్టు జడ్జిల ‘అనవసర విరామాల’పై సుప్రీంకోర్టు అసంతృప్తి..👉తెలంగాణలో పోలీస్ వాహనాలకు మరోసారి పెట్రోల్, డీజిల్ కరువు..👉ఏపీ లిక్కర్ కేసులో రంగంలోకి ఈడీ

👉ట్రంప్ జోక్యం.. మోదీ క్లారిటీ ఏమైంది?.. భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీ నిన్న(సోమవారం) రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ స్పందిస్తూ.. మోదీ తన ప్రసంగంలో ట్రంప్ జోక్యం గురించి ఎందుకు ప్రస్తావించలేదని మండిపడ్డారు. కాల్పుల విరమణపై కుదిరిన అవగాహన గురించి కూడా ప్రధాని వివరణ ఇవ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు..

*ట్రంప్ జోక్యం.. మన దౌత్య వైఫల్యం కాదా?’..పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఏర్పడిన పరిస్థితులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ మండిపడింది. 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఘటనకు సంబంధించి భద్రతా వైఫల్యానికి బాధ్యులెవరని నిలదీసింది. హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేస్తున్నారో లేదో చెప్పాలని అడిగింది..భారత్-పాక్ కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మన దౌత్య వైఫల్యం కాదా అని నిలదీసింది.

👉సిమ్లా ఒప్పందం మరిచిపోయారా?..సీజ్ఫైర్ విషయంలో ట్రంప్ జోక్యంపై NCP అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. ‘మన దేశానికి సంబంధించిన అంశంపై అమెరికా బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఇరుదేశాల ప్రధానుల సమక్షంలో సిమ్లా ఒప్పందం జరిగింది. దాని ప్రకారం కశ్మీర్ విషయంలో మూడో పక్షానికి చోటులేదు. మిలటరీ అనేది సున్నిత అంశం. ప్రభుత్వం అఖిలపక్షం నిర్వహించాలి’ అని పవార్ పేర్కొన్నారు.

👉ఏంటీ కిరానా హిల్స్.. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత దానిపై ఎందుకు చర్చ?.. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న కిరానా హిల్స్.. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా దానిపై దాడిచేసినట్టు వార్తలు.. ఖండించిన భారత ఎయిర్ మార్షల్ ఏకే భారతి.. సోషల్ మీడియా.. ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి..కిరానా హిల్స్‌ను అణ్వాయుధాలు నిల్వచేసేందుకు పాక్ ఉపయోగించుకుంటోందని ప్రచారం..పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఈ నెల 7న భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కిరానా హిల్స్‌పై భారత సైన్యం దాడి చేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను భారత వాయుసేన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి సోమవారం తీవ్రంగా ఖండించారు. ‘ఆపరేషన్ సిందూర్‌’పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు.‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్థాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోధ జిల్లాలో ఉన్న కిరానా హిల్స్ ప్రాంతంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, దట్టమైన పొగలు కమ్ముకున్నాయని పేర్కొంటూ పలు ఎక్స్ ఖాతాల్లో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వైమానిక స్థావరాలతో పాటు కిరానా హిల్స్‌పైనా భారత్ దాడి చేసిందా? అని ఎయిర్ మార్షల్ భారతిని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ “కిరానా హిల్స్‌లో కొన్ని అణు వ్యవస్థాపనలు ఉన్నాయని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. మాకు ఆ విషయం తెలియదు” అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

*కిరానా హిల్స్ ప్రాముఖ్యత..పాకిస్థాన్‌లోని కిరానా హిల్స్ ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కీలక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ కొండల్లోని గుహలను పాకిస్థాన్ సైన్యం తమ అణ్వాయుధాలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తోందని భావిస్తున్నారు. “ఇస్లామాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉన్న ఖుషాబ్‌లో ఆయుధాల తయారీకి అవసరమైన ప్లూటోనియం ఉత్పత్తి కోసం నాలుగు భారీ రియాక్టర్లు ఉన్నాయి” అని వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ఫిబ్రవరి 2025 నాటి నివేదికలో పేర్కొంది. కిరానా హిల్స్ అనేది భూగర్భ అణు మౌలిక సదుపాయాలకు పేరుగాంచిన అత్యంత పటిష్టమైన సైనిక జోన్ అని కల్నల్ వినాయక్ భట్ (రిటైర్డ్) నవంబర్ 2017లో ‘ది ప్రింట్’ కోసం రాసిన కథనంలో వివరించారు..శాటిలైట్ చిత్రాల ప్రకారం సర్గోధలోని ముషఫ్ వైమానిక స్థావరం రన్‌వేపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఈ వైమానిక స్థావరానికి, కిరానా హిల్స్‌కు మధ్య దూరం 19.9 కిలోమీటర్లు. అయితే, భారత వాయుసేన మాత్రం కిరానా హిల్స్‌ను లక్ష్యంగా చేసుకోలేదని అధికారికంగా ధ్రువీకరించింది.

👉 పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం: సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..అఖిలపక్షం, పార్లమెంట్ భేటీ జరపాల్సిందన్న సిద్ధరామయ్య.. సైనిక చర్యల ఘనత కేవలం సాయుధ బలగాలదేనని స్పష్టం..కర్ణాటకలో ముగ్గురు పాకిస్థాన్ పిల్లలు తల్లితోనే ఉంటున్నారని వెల్లడి..పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ విషయంలో ఒక అవగాహనకు వచ్చే ముందే కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి, పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాల్సిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులపై సైన్యం చేపట్టిన కార్యకలాపాల ఘనత పూర్తిగా సాయుధ బలగాలకే చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.ఇవాళ మైసూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాల్పుల విరమణ ఒప్పందం చాలా కీలకమైన, తీవ్రమైన అంశమని సిద్ధరామయ్య అన్నారు. అందువల్ల, దీనిపై పాకిస్థాన్‌తో ఒక అంగీకారానికి రావడానికి ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, పార్లమెంటులో చర్చించి ఉండాల్సిందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయి అధికారుల మధ్య చర్చలు జరగనున్నాయని, వారు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.కర్ణాటకలో నివసిస్తున్న పాకిస్థాన్ పౌరుల గురించి అడిగినప్పుడు, ప్రస్తుతం రాష్ట్రంలో ఆరేళ్ల లోపు వయసున్న ముగ్గురు పాకిస్థానీ పిల్లలు మాత్రమే ఉన్నారని సిద్ధరామయ్య తెలిపారు. వారి తల్లి భారతీయురాలు కాగా, తండ్రి పాకిస్థానీ అని తెలిపారు. ఆ పిల్లలను సరిహద్దు వరకు తీసుకెళ్లినా, వారిని స్వీకరించడానికి పాకిస్థాన్ వైపు నుంచి ఎవరూ ముందుకు రాలేదని, ఫలితంగా ప్రస్తుతం వారు తమ తల్లితోనే ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు.

👉ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు: నాదెండ్ల మనోహర్ ..జాతీయ ఆహార భద్రత చట్టం కింద సరుకులు పంపిణీ చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కోటి 46 లక్షల 21 వేల రైస్ కార్డులు అందించాం..ఆంధ్రప్రదేశ్ 95 శాతం ఈ-కేవైసీ పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది.. ఇప్పటివరకు 72,500 మంది స్మార్ట్ కార్డులు పొందారు..నూతనంగా 10,747 మంది కార్డులు పొందారు.. మంత్రి నాదెండ్ల మనోహర్….

👉ఏపీ లిక్కర్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది*ఇటు సిట్‌.. అటు ఈడీ పోటు మీద పోటు.. మనీలాండరింగ్‌ కేసుకూడా నమోదైంది..నిందితుల వివరాలు ఇవ్వాలని సిట్‌కు ఈడీ లేఖరాసింది.. ఇక డొంక కదలడమే మిగిలి ఉంది-మంత్రి అనగాని****ఏపీలో కొనసాగుతున్న లిక్కర్ కేసు విచారణ.* ..*సజ్జల శ్రీధర్‌రెడ్డిని 5 రోజుల కస్టడీకి కోరిన సిట్.* ..*లిక్కర్ కేసులో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి.

👉భారత్ జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్న పాకిస్తాన్ గూఢచారులు .. భారత – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ రహస్యాలను తెలుసుకునేందుకు భారత జర్నలిస్టులకు కాల్స్ చేస్తున్న పాకిస్తాన్ గూఢచారులు… రక్షణ శాఖ అధికారులమంటూ ఆపరేషన్ సిందూర్ కి సంబంధించిన విషయాలను సేకరించేందుకు పాకిస్తాన్ గూఢచారులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్న భారత నిఘా వర్గాలు

👉పాక్‌ అనుకూల పోస్టులపై హోంమంత్రి అనిత ఆగ్రహం.. కొందరు పాక్‌కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.. అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.. మతఘర్షణలకు కొందరు ప్రయత్నిస్తున్నారు..అలాంటివారిపై దృష్టిసారిస్తున్నాం-హోంమంత్రి అనిత

[‘

[ సిమ్లా ఒప్పందం మరిచిపోయారా?..

సీజ్ఫైర్ విషయంలో ట్రంప్ జోక్యంపై NCP అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. ‘మన దేశానికి సంబంధించిన అంశంపై అమెరికా బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఇరుదేశాల ప్రధానుల సమక్షంలో సిమ్లా ఒప్పందం జరిగింది. దాని ప్రకారం కశ్మీర్ విషయంలో మూడో పక్షానికి చోటులేదు. మిలటరీ అనేది సున్నిత అంశం. ప్రభుత్వం అఖిలపక్షం నిర్వహించాలి’ అని పవార్ పేర్కొన్నారు.

👉 ఏంటీ కిరానా హిల్స్.. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత దానిపై ఎందుకు చర్చ?..

పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న కిరానా హిల్స్..

‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా దానిపై దాడిచేసినట్టు వార్తలు..ఖండించిన భారత ఎయిర్ మార్షల్ ఏకే భారతి

సోషల్ మీడియా.. ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడి..కిరానా హిల్స్‌ను అణ్వాయుధాలు నిల్వచేసేందుకు పాక్ ఉపయోగించుకుంటోందని ప్రచారం..పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఈ నెల 7న భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కిరానా హిల్స్‌పై భారత సైన్యం దాడి చేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను భారత వాయుసేన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి సోమవారం తీవ్రంగా ఖండించారు. ‘ఆపరేషన్ సిందూర్‌’పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు.

‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్థాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోధ జిల్లాలో ఉన్న కిరానా హిల్స్ ప్రాంతంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, దట్టమైన పొగలు కమ్ముకున్నాయని పేర్కొంటూ పలు ఎక్స్ ఖాతాల్లో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వైమానిక స్థావరాలతో పాటు కిరానా హిల్స్‌పైనా భారత్ దాడి చేసిందా? అని ఎయిర్ మార్షల్ భారతిని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ “కిరానా హిల్స్‌లో కొన్ని అణు వ్యవస్థాపనలు ఉన్నాయని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. మాకు ఆ విషయం తెలియదు” అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కిరానా హిల్స్ ప్రాముఖ్యత

పాకిస్థాన్‌లోని కిరానా హిల్స్ ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కీలక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ కొండల్లోని గుహలను పాకిస్థాన్ సైన్యం తమ అణ్వాయుధాలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తోందని భావిస్తున్నారు. “ఇస్లామాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉన్న ఖుషాబ్‌లో ఆయుధాల తయారీకి అవసరమైన ప్లూటోనియం ఉత్పత్తి కోసం నాలుగు భారీ రియాక్టర్లు ఉన్నాయి” అని వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ఫిబ్రవరి 2025 నాటి నివేదికలో పేర్కొంది. కిరానా హిల్స్ అనేది భూగర్భ అణు మౌలిక సదుపాయాలకు పేరుగాంచిన అత్యంత పటిష్టమైన సైనిక జోన్ అని కల్నల్ వినాయక్ భట్ (రిటైర్డ్) నవంబర్ 2017లో ‘ది ప్రింట్’ కోసం రాసిన కథనంలో వివరించారు..శాటిలైట్ చిత్రాల ప్రకారం సర్గోధలోని ముషఫ్ వైమానిక స్థావరం రన్‌వేపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఈ వైమానిక స్థావరానికి, కిరానా హిల్స్‌కు మధ్య దూరం 19.9 కిలోమీటర్లు. అయితే, భారత వాయుసేన మాత్రం కిరానా హిల్స్‌ను లక్ష్యంగా చేసుకోలేదని అధికారికంగా ధ్రువీకరించింది.

👉భారత్-పాక్ యుద్ధం ముగిసినట్లేనా?

పహల్‌గామ్ దాడికి భారత్ ‘ఆపరేషన్ సిందూర్’తో ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అయితే సరిహద్దుల్లో పాక్ జరిపిన కాల్పుల్లో భారత పౌరులు మరణించారు. దాంతో దాయాది దేశానికి గుణపాఠం చెప్పాలంటూ యావత్ భారతదేశం గళమెత్తింది. కేంద్ర దూకుడుతో భారత సైన్యం పాక్ స్థావరాలను నాశనం చేసింది. దాంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా బోర్డర్‌లోనూ ప్రశాంతత నెలకొని ఉంది. దాంతో యుద్ధం ముగిసినట్లు సమాచారం.

👉 *గిఫ్ట్‌ డీడ్‌ రద్దు చేయాలని ఇతర వారసులు కోరలేరు: హైకోర్టు*..హైదరాబాద్ :దాత చనిపోయిన అనంతరం ఒక వారసుడికి ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేయాలని ఇతర వారసులు కోరలేరని హైకోర్టు స్పష్టం చేసింది.సీనియర్‌ సిటిజన్స్‌ చట్టం కింద ఇలాంటి వినతి చేసే అవకాశం అసలే లేదని తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న పి. రోహిత్‌ సూర్య అనే వ్యక్తికి, ఆయన తాత సుబ్బారావు కొండాపూర్‌లోని జాగృతి ఫౌండేషన్స్‌లో 3, 4 అంతస్తులను రిజిస్టర్డ్‌ గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా అందజేశారు. అయితే రోహిత్‌ తండ్రికి, సుబ్బారావు మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో గిఫ్ట్‌ డీడ్‌ రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని సుబ్బారావు రాజేంద్రనగర్‌ ఆర్డీవోను సంప్రదించారు. విచారణ జరిపిన ఆర్డీవో… సీనియర్‌ సిటిజన్స్‌ చట్టం ప్రకారం దాన్ని రద్దు చేయాలని సబ్‌ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా రద్దు చేయడం చెల్లదని పేర్కొంటూ రోహిత్‌ హైకోర్టును ఆశ్రయించారు. సీనియర్‌ సిటిజన్స్‌ చట్టంలోని సెక్షన్‌ 23 (1)లో పేర్కొన్న విధంగా వృద్ధుల బాగోగులను చూసుకోవడం వంటి షరతులను గిఫ్ట్‌ డీడ్‌లో పేర్కొనలేదని తెలిపారు. అదీకాకుండా ఆర్డీవో ఆదేశాలు ఇచ్చిన తర్వాత తమ తాత చనిపోయారని తెలిపారు. అందువల్ల ఇతర వారసులు కూడా గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేయాలని కోరలేరని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం.. దీంతో ఏకీభవించింది.. వృద్ధులు జీవించి ఉన్నంత వరకే సీనియర్‌ సిటిజన్స్‌ చట్టం వర్తిసుందని తెలిపారు. తాత చనిపోయిన దృష్ట్యా గిఫ్ట్‌ను రద్దు చేస్తూ ఆర్డీవో ఇచ్చిన ఆదేశాలను కొట్టివేశారు.

👉తెలంగాణలో పోలీస్ వాహనాలకు మరోసారి పెట్రోల్, డీజిల్ కరువు..పోలీస్ వాహనాలు, స్టేషన్ మెయింటెనెన్స్‌కు కూడా డబ్బులు రాక తిప్పలు ..చేతి నుంచి ఖర్చు చేసి ఇబ్బంది పడుతున్న పోలీసులు ..జనవరి నుంచి పెట్రోల్, డీజిల్ బిల్లులు పెండింగ్..కరీంనగర్ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లో రూ. కోటికిపైగా బిల్లులు పెండింగ్ ..సిరిసిల్ల, రామగుండంలో రూ.40 లక్షలకు పైగా పెండింగ్ ..వాహన మెయింటెనెన్స్ బిల్లులు కూడా కరువు..మూడు నెలలుగా రాని స్టేషన్ నిర్వహణ బడ్జెట్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రెండు కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లు, రెండు ఎస్పీ కార్యాలయాల్లో స్టేషన్ మెయింటెనెన్స్ డబ్బులు మూడు నెలలుగా రావడం లేదని సమాచారం..దీంతో చాలాసార్లు తామే తొలుత చేతి నుంచి ఖర్చు చేసి, బిల్లులు వచ్చాక సర్దుబాటు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న పోలీసులు

👉 INS విక్రాంత్ ఎక్కడుందో చెప్పండి.. PMO ఉద్యోగినంటూ కాల్!.. PM ఆఫీస్ అధికారినని, తనకు INS విక్రాంత్ గురించి సమాచారాన్ని అందించాలని నావల్ కమాండ్ కార్యాలయానికి కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని కోజికోడ్కు చెందిన ముజీబ్ రెహమాన్ PMO ఆఫీసర్ అంటూ నేవీ అధికారులకు కాల్ చేసి INS విక్రాంత్ ఎక్కడుందో తెలపాలని కోరాడు. అధికారులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెహమాన్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

**గంజాయి సప్లయ్ చేస్తూ పట్టుబడిన నిందితుడు…*అరెస్ట్ రిమాండ్ కు తరలింపు.. గద్వాల వ్యవసాయ మార్కెటింగ్ సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతున్న బషీర్ ను తనిఖీ చేయగా 680 కేజీల గంజాయి పట్టుబడినట్లు టౌన్ ఎస్సై కళ్యాణ్ కుమార్ తెలిపారు.వివిధ రాష్ట్రలకు ఇతను సప్లయ్ చేస్తున్నట్లు సమాచారం ఇతని స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా చింతలపేట కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

👉తిరుపతి జిల్లా..గూడూరు రూరల్*.. *💥గూడూరు మండలం చెన్నూరు లో నాలుగేళ్ల పాప పై అఘాయిత్యం చేయబోయిన వ్యక్తి*💥

*👉విషయం గమనించి నిందితుడిని అడ్డుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు*.. *👉నిందితుడు చిల్లకూరుకు కు చెందిన వ్యక్తిగా అనుమానం*.. తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామం లోని బిసి కాలనీ లో సుమారు 50 ఏళ్ళు పై బడిన వ్యక్తి(మస్తాన్ అని సమాచారం) నాలుగేళ్ల చిన్నారిని ఓ గదిలోకి తీసుకెళ్లడం ఆలస్యంగా గమనించిన స్థానికులు గది వద్దకు వెళ్ళే సరికి లైంగిక దాడికి ప్రయత్నం చేసే క్రమం లో వున్న మస్తాన్ ను పట్టుకుని దేహశుద్ధి చేసి నట్టు సమాచారం,వయసు దృష్ట్యా దేహశుద్ధి చేసి అక్కడ నుండి వెళ్ళిపోవాలని ఆదేశించినట్టు సమాచారం….

👉కర్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. పాకిస్థాన్తో దాడులకు సంబంధించి వివరాలు చెప్తున్న సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఉగ్రవాదులు భారత మహిళలను వితంతువులుగా మార్చారని, అటువంటి వారి మతానికి చెందిన మహిళను మోదీ పాక్కు పంపించి బుద్ధి చెప్పారని ఆయన పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై స్పందించిన బీజేపీ మంత్రికి చీవాట్లు పెట్టింది.

👉కొందరు హైకోర్టు జడ్జిల ‘అనవసర విరామాల’పై సుప్రీంకోర్టు అసంతృప్తి.. హైకోర్టు జడ్జీల తీరుపై సుప్రీం సీరియస్!.. న్యాయమూర్తుల పనితీరుకు ఆడిట్.. అవసరమన్న అత్యున్నత న్యాయస్థానం.. ప్రజల సొమ్ముతో న్యాయమూర్తులకు జీతభత్యాలు, సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడి..దానికి తగినట్లుగా వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు.. కొందరు హైకోర్టు న్యాయమూర్తులు తరచూ అనవసరంగా కాఫీ బ్రేక్‌లు తీసుకోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, తీర్పుల వెల్లడిలో తీవ్ర జాప్యం చేయడం వంటి అంశాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన విషయమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం నాడు వ్యాఖ్యానించింది.న్యాయమూర్తుల పనితీరు, వారిపై వెచ్చిస్తున్న ఖర్చులకు మధ్య పొంతన ఉందో లేదో సమీక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది..ప్రజల సొమ్ముతో న్యాయమూర్తులకు జీతభత్యాలు, సౌకర్యాలు కల్పిస్తున్నామని, దానికి తగినట్లుగా వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. కొందరు న్యాయమూర్తులు అంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ, మరికొందరు తరచూ విరామాలు తీసుకోవడం, కేసుల విచారణలో జాప్యం చ

👉పాకిస్తాన్ హై కమీషన్ అధికారి దేశ బహిష్కరణ* ..

భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న సమయంలో, దౌత్యపరంగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఒక అధికారిని తక్షణమే దేశం విడిచి వెళ్లాల్సిందిగా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. ఆయన కార్యకలాపాలు దౌత్య హోదాకు అను గుణంగా లేవన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి, తన అధికారిక హోదాకు తగని కార్యకలా పాల్లో నిమగ్నమైనట్లు భారత ప్రభుత్వం గుర్తించింది.. దౌత్యపరమైన నిబంధ నలను ఉల్లంఘిస్తూ, కార్యాలయ పరిధిని దాటి వ్యవహరించినందున ఆయనను దేశం నుంచి బహిష్కరించాలని నిర్ణయించినట్లు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకట నలో తెలిపింది. సదరు పాకిస్థానీ అధికారి 24 గంటల్లోగా భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.. ఈ నిర్ణయాన్ని భారత్‌లోని పాకిస్థాన్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అత్యున్నత అధికారికి అధికారికంగా తెలియజేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, బహిష్కరణకు గురైన ఉద్యోగి పేరును, ఆయన హోదాను మాత్రం ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పం దం అమల్లో ఉన్నప్పటికీ, దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసే ఈ చర్య ప్రాధా న్యత సంతరించుకుంది.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..