👉ఆపరేషన్ సిందూర్ పై లేటెస్ట్ బ్రీఫింగ్… వీడియో వేరే లెవెల్! .. ఈ నేపథ్యంలో సోమవారం మరోసారి ఆర్మీ అధికారులు మీడియా ముందుకు వచ్చారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులపైనే తమ పోరు అని అపరేషన్ సిందూర్ పై బ్రీఫింగ్ ఇచ్చారు..ఆపరేషన్ సిందూర్ పై రక్షణశాఖ అధికారులు వరుసగా బ్రీఫింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే! కారణం ఏదైనప్పటికీ ఆపరేషన్ సిందూర్ కు సంబందించిన ప్రతీ విషయాన్ని వీలైనంత క్షుణ్ణంగా మీడియాకు వివరిస్తున్నారు! ఈ నేపథ్యంలో సోమవారం మరోసారి ఆర్మీ అధికారులు మీడియా ముందుకు వచ్చారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులపైనే తమ పోరు అని అపరేషన్ సిందూర్ పై బ్రీఫింగ్ ఇచ్చారు..అవును… మే7న ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జరిపిన దాడుల్లో ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు పునరుధ్గాటించారు. ఈ సందర్భంగా… పాకిస్థాన్ పై దాడుల వీడియోలను రక్షణ శాఖ అధికారులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా… పాక్ సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని.. ఈ పోరాటాన్ని తమ పోరాటంగా మలుచుకున్నాయని పేర్కొన్నారు… భారత సైన్యం దీటుగా సమధానం ఇచ్చిందని చెప్పారు. ఇక పాక్ దాడుల సమయంలో ప్రధానంగా భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రుదుర్భేద్యంగా నిలిచాయని.. వారి ఆటలు సాగనివ్వలేదని అన్నారు. ఈ క్రమంలోనే.. రహీమ్ యూర్ ఖాన్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లపై ఆర్మీ చేసిన దాడి దృశ్యాలు, అనంతరం ఆ ప్రాంత పరిస్థితులకు సంబంధించిన వీడియోలు చూపించారు. ఈ సందర్భంగా స్పందించిన ఆర్మీ ఉన్నతాధికారులు.. పాకిస్థాన్, పీవోకే ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేశామని.. ఉగ్రవాదులు, వారి శిబిరాలే లక్ష్యంగా దాడులు చేశామని తెలిపారు. ఇక పాక్ దాడుల విషయంలో… అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థతో పాక్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను తిప్పికొట్టామని అన్నారు. ఈ క్రమంలో సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం రాకుండా చూశామని తెలిపారు..పాక్ వినియోగించిన చైనా తయారు చేసిన పీఎల్-15 క్షిపణిని నేలకూల్చామని.. పాకిస్థాన్ చెందిన డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చివేశామని భారత ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ క్రమంలో నౌకాదళ అడ్వాన్స్ రాడార్ల ద్వారా పాకిస్థాన్ డ్రోన్లను గుర్తించగలిగామని వెల్లడించారు.

👉 లాజిక్ పాయింట్ పట్టుకున్న రాహుల్…మోడీతో ఢీ ! పాకిస్థాన్ తో యుద్ధం అంటే కాంగ్రెస్ సహా దేశంలోని అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. జై భారత్ అని నినదించాయి..పాకిస్థాన్ తో యుద్ధం అంటే కాంగ్రెస్ సహా దేశంలోని అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. జై భారత్ అని నినదించాయి. మీరు ఏమి చేసినా మాకు ఓకే. ఈ గడ్డ కోసం మేము మద్దతుగా నిలుస్తామని అవుట్ రేట్ గా మద్దతు ఇచ్చాయి. అయితే భారత్ మాత్రం అనూహ్యంగా కాల్పుల విరమణను ప్రకటించింది.దాంతో విపక్షాలకు మళ్ళీ నోరు చేసుకునే చాన్స్ వచ్చింది. శాంతి చర్చల కోసం ఇంతటి యుద్ధం సంరంభం ఎందుకు అని అంతా అంటున్న నేపథ్యం ఉంది. ఇక పెద్ద పార్టీ పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ అయితే చాలా విషయాల్లో బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధంగా ఉంది. అందుకే పార్లమెంట్ ప్రయ్తేక సమావేశాలు నిర్వహించాలని లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. అందులో ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు. ఏప్రిల్ 22న పహిల్గాం లో జరిగిన ఉగ్ర దాడి నుంచి మొదలు పెడితే మే 7న జరిగిన ఆపరేషన్ సింధూర్ తో పాటు అనంతర యుద్ధ పరిస్థితులు, మే 10న కాల్పుల విరమణ వరకూ చోటు చేసుకున్న అనేక అంశాల మీద కూలంకషంగా చర్చించాల్సి ఉందని ఆ లేఖలో రాహుల్ కోరారు. అంతే కాదు ఒక కీలక అంశాన్ని రాహుల్ ఆ లేఖలో లేవనెత్తారు. అందులో లాజిక్ ఉంది. దాంతోనే మోడీ సర్కార్ ని పార్లమెంట్ లో ఇరుకునపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోందని అంటున్నారు. ఆ అంశం ఏంటి అంటే పాక్ భారత్ కాల్పుల విరమణ మొదట అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎలా ప్రకటిస్తారని, భారత్ ఒక స్వతంత్ర దేశం, సర్వ సత్తాక సార్వభౌమ దేశం. భారత్ తన నిర్ణయాలను తాను ప్రకటించగలదు.. అలా కాకుండా ఎక్కడో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ ప్రకటించడం ఏమిటన్నదే కాంగ్రెస్ నిలదీతగా ఉండబోతోంది. అంతే కాదు ఈ మధ్యలో ఏమి జరిగింది అన్నది కూడా లాగే ప్రయత్నం కూడా ఉండొచ్చని అంటున్నారు. ఇలా అనేక అంశాలలో తమ సందేహాలను నివృత్తి చేసుకోవడమే కాదు అసలు యుద్ధం అంటూ పాక్ తో మళ్ళీ చర్చలకు ఎలా యూ టర్న్ తీసుకుంటారన్నదే విపక్షాల ప్రశ్న. తాము భేషరతుగా మద్దతు ఇస్తే ఈ విధంగా చేయడమేంటి అన్నది కూడా ఉంది. ఇక రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కానీ పార్లమెంట్ ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం సమావేశపరుస్తుందా అన్నది ఇక్కడ ప్రశ్న. అయితే కాంగ్రెస్ డిమాండ్ సహేతుకంగా ఉందని అంటున్నారు. పెద్ద నిర్ణయాలు అన్నీ పార్లమెంట్ వేదికగా అంతా కలసి కూర్చుని తీసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. ఇక రాహుల్ మరో డిమాండ్ కూడా చేశారు. అఖిల పక్ష సమావేశాన్ని పిలవాలని. దానికి మోడీయే అధ్యక్షత వహించాలని. ఏది ఏమైనా ట్రంప్ ఉత్సాహమా లేక ప్రోత్సహమా తెలియదు కానీ పాక్ ఇండియా కాల్పుల విరమణ అంటూ ఆయన ట్వీటిన ట్వీట్ ఇపుడు కాంగ్రెస్ కి అంది వచ్చిన అస్త్రంగా మారుతోందా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
👉 ‘యుద్ధం రొమాంటిక్ గా ఉండదు’.. మాజీ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!..
ఈ క్రమంలో తాజాగా ఆర్మీ మాజీ చీఫ్(ఈయన హయాంలోనే సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయి) జనరల్ మనోజ్ నరవాణే స్పందించారు. గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు భారత్ – పాక్ మధ్య నెలకొన్న వేళ.. వాటిని తగ్గించేందుకు ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయంలో పాక్ లో పరిస్థితి సంగతి కాసేపు పక్కనపెడితే… భారత్ లో మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తోంది! ఇంకా ఎంతకాలం ఇలా అమాయకులైన పౌరులను (పాక్) ఉగ్రవాదులకు బలిద్దాం అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.. “అయితే… ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగిసిపోలేదు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ సహా, ఉగ్రవాదులను భారత్ కు అప్పగించడం మినహా పాకిస్థాన్ తో ఇంక మాట్లాడటానికి ఏమీ లేదు అనే కామెంట్లు భారత ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ సమయంలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు..అవును… భారత్-పాక్ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు వ్యతిరేకత ఎదురవుతున్న వేళ భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే స్పందించారు. ఇందులో భాగంగా.. యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదని.. యుద్ధం రొమాంటిక్ గా ఉండదని.. ఎన్నో కుటుంబాలు తమ వారిని కోల్పోవాల్సి వస్తుందని అన్నారు..తాజాగా పూణెలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నరవణే… యుద్ధం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే పౌరుల పరిస్థితి దారుణంగా ఉంటుందని.. షెల్లింగ్ ను చూడగానే చిన్న పిల్లౌ సైతం రాత్రి పూట సురక్షిత ప్రాంతాలకు పరుగెత్తాల్సి వస్తుందని.. ఈ పరిస్థితుల్లో తమ ప్రియమైన వారిని కోల్పోతే ఆ ఆవేదన తరతరాలు వెంటాడుతుందని తెలిపారు..ఈ సందర్భంగా ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి ఎందుకు వెళ్లడం లేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారని.. సైన్యంలో పని చేసిన వ్యక్తిగా తాను యుద్ధానికి వెళ్లేందుకు సిద్ధమే కానీ.. దౌత్యాన్ని తొలి అవకాశంగా ఎంచుకోవాలని.. ప్రధాని నరేంద్ర మోడీ ఇది యుద్ధాల శకం కాదని చెప్పారని చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలోనే యుద్ధం అంత రొమాంటిక్ గా ఉండదని.. ఇదేమీ బాలీవుడ్ సినిమా కాదని.. చాలా తీవ్రమైన అంశమని.. అది మనం ఎంచుకునే చివరి ఆప్షన్ అయ్యి ఉండాలని.. చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే తెలిపారు.”
👉👉 *కేంద్రం చేతిలోకి ఉపాధి పథకం స్టీరింగ్!*
ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకునేందుకు కేంద్రం ‘యుక్తధార’ అనే కొత్త యాప్ తీసుకువచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్రాల ఆధ్వర్యంలో సాగిన పనుల నిర్వహణను ఇకపై కేంద్రమే పర్యవేక్షించనుంది. పనుల ఎంపిక, అంచనాలు, బిల్లుల చెల్లింపుల వరకూ అన్నీ యాప్ ద్వారా నడిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ మార్పుతో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర నామమాత్రంగా మారనుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్లు, కాలువలు, నిర్మాణ పనులపై ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి నివారణ పేరుతో రాష్ట్రాల హక్కులను కేంద్రీకరిస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
👉వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలబడతాయి*మురళీనాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం*..5 ఎకరాలు భూమి, ఇల్లు నిర్మించుకునేందుకు 300 గజాల స్థలం కేటాయింపు..*మురళీనాయక్ మెమోరియల్ తో పాటు జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు*..కళ్లితండాకు మురళీనాయక్ తండాగా పేరుమార్పు..*మురళీనాయక్ భౌతికకాయానికి నివాళులు అనంతరం మీడియా సమావేశంలో మంత్రి నారా లోకేష్*
పుట్టపర్తిః వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలబడతాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో మురళీనాయక్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియా సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో మానవత్వం మరిచి ఉగవాదులు జరిపిన కాల్పుల్లో అమాయక దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడిచేసి వాటిని నేలమట్టం చేసింది. దీంతో పాకిస్థాన్ రాత్రికిరాత్రి మిస్సైల్స్, డ్రోన్లతో దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో మన జవాన్లు దేశం కోసం నిలబడ్డారు. కుటుంబాలకు దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా ఉండి దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. సరిహద్దుల్లో మన జవాన్లు పోరాడుతున్నారు కాబట్టే మనమంతా క్షేమంగా ఉంటున్నాం. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ తో జరిగిన ఎదురుకాల్పుల్లో మన వీరజవాన్ మురళీనాయక్ అమరుడయ్యారు. మురళీనాయక్ చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని చెప్పేవాడు. తాను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదేపదే చెప్పేవాడు. కుటుంబానికి ఏకైక బిడ్డ, చిన్నప్పుడు వాళ్ల అవ్వా,తాతలతో కలిసి పెరిగిన వ్యక్తి.. దేశం కోసం పోరాడతానని చెప్పి చిన్నవయసులోనే చనిపోవడం బాధాకరం….*మురళీనాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం*
వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలబడతాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడారు. అదేవిధంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం కింద రూ.50 లక్షలు అందించడంతో పాటు 5 ఎకరాల భూమి, ఇల్లు నిర్మించుకునేందుకు 300 గజాల స్థలం ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. మురళీనాయక్ తండ్రి గారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అంత్యక్రియలు సొంత భూమిలో నిర్వహిస్తున్నారు కాబట్టి మెమోరియల్ కూడా నిర్మించాలని నిర్ణయించాం. జిల్లా కేంద్రంలో వీరజవాన్ మురళీ నాయక్ కాంస్య విగ్రహం కూడా ఏర్పాటుచేసి భారతీయులు మురళీ నాయక్ ను ఆదర్శంగా తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం.
*కళ్లితండాకు మురళీనాయక్ తండాగా పేరుమార్పు*
శత్రువులతో పోరాడుతూ వీరమరణం పొందిన అమరజవాన్ మురళీనాయక్ స్వగ్రామం కళ్లితండాను మురళీనాయక్ తండాగా పేరు మార్చాలని సర్పంచ్, గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. దీంతో కళ్లితండాను మురళీనాయక్ తండాగా పేరు మారుస్తామని, తామంతా సైనికులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.
👉రజినిపై పోలీసుల తీరు అమానుషం: రాజేశ్వరి
మాజీ మంత్రి విదడల రజినితో పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని వైకాపా మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏనుగుల రాజేశ్వరి అన్నారు. *రాజంపేట* వైకాపా కార్యాలయంలో ఆమె మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తల బలాన్ని తిరిగి పొందేందుకు ఉపశమనం కష్ణ క్షణానికి కల్పిస్తామన్నారు. అప్పుడే కుటుంబం వద్దకు తగిన మౌల్యం చెల్లించుకోక తప్పుడు ఆరోపణ చేస్తే… పార్టీపై మోదీ యుద్ధం చేస్తే.. రాష్ట్రంలో మహిళలపై చంద్రబాబు యుద్ధం చేస్తున్నారని మండిపడ్డారు.
👉ఈటల వ్యాఖ్యలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కౌంటర్..* బాచుపల్లి తహశీల్దార్ ఇచ్చిన నోటీసులతో హైడ్రాకు ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం.* బాచుపల్లి తహశీల్దార్ నోటీసులతో హైడ్రాకు సంబంధంలేదు.* ప్రతీ నోటీస్‌ను, కూల్చివేతను హైడ్రాకు ఆపాదిస్తూ ప్రజలను ఆందోళన, భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కబ్జాదారుల పట్ల హైడ్రా కఠినంగా ఉంటుంది..* ఈటల వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవపట్టించేలా ఉన్నాయి.* 2024 జులైకి ముందుకట్టిన ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదు..* అనుమతులు ఉన్న వాణిజ్య సముదాయాలను హైడ్రా తొలగించదన్నారు.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.
👉ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు*.. *టీజీఐఐసీ పరిధిలో లక్షా 75 వేల ఎకరాలను తాకట్టు పెట్టే కుట్రపూరిత స్కెచ్ వేసిన రేవంత్ రెడ్డి*..*నా దగ్గర నిర్ధిష్టమైన ఆధారాలు ఉన్నాయి*.. *టీజీఐఐసీని ప్రైవేటు లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసింది.. *కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచన*.. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజిలో కుదువపెట్టే కుట్ర జరుగుతోంది*.. పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారు.. కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు.. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్ లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ?.. స్టాక్ ఎక్సేంజ్ లో నష్టం జరిగితే తెలంగాణలో జమా చేసుకున్న భూముల భవితవ్యం ఏమిటి ?..తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస ఆలోచన చేయకపోవడం దారుణం.. *టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి*.. గత 16 నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రూ 1.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారు..తెచ్చిన అప్పులతో ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు, అభివృద్ధికి వెచ్చించలేదు..తులం బంగారం ఇవ్వలేదు, మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయలేదు, ఏమీ చేయలేదు..గతంలో చేసిన అప్పులకు కేవలం 80 వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం తిరిగి చెల్లించింది.. మిగిలిన లక్ష కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?..*ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నాను… లక్ష కోట్లను పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించారు*..ఇది 20 శాతం కమీషన్ సర్కార్*..*కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసి నేరుగా 20 శాతం కమీషన్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి*..*దాదాపు 20 వేల కోట్లు రేవంత్ రెడ్డి సొంత ఖజానాకు వెళ్లింది*..నేను చెప్పింది అప్పయితే ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి..ఒక మంత్రి సొంత కంపెనీకి, మెఘా కంపెనీకి బిల్లులు చెల్లిస్తున్నారు కానీ చేసిన అభివృద్ధి పనులకు కాదు..వేల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్క మంచి పని కూడా చేయలేదు..తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు..కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తాకట్టు పెట్టి రూ 10 వేల కోట్లు అప్పు తెచ్చారు..చెట్లను, ప్రకృతిని నాశనం చేసే ప్రయత్నం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలు ఆందోళన చేశారని ఆరోపించారు..

