👉బోర్డర్లో ఉద్రిక్తతలు.. సైబర్ నేరగాళ్ల నయా దందా స్టార్ట్ చేశారు! మరోపక్క భారత్ లోని సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు.. సుమారు 27 విమానాశ్రయాలను ప్రస్తుతానికి మూసేశారు!.. భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమార్చబడ్డారు. అందుకు ప్రతీకారంగా భారత్ పై పాకిస్థాన్ క్షిపణి దాడులకు తెగబడుతుంది. భారత్ వాటిని తిప్పికొడుతుంది. మరోపక్క నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతుంది. ఈ సమయంలో భారత్ సైన్యం గట్టిగా బుద్ది చెబుతోంది. ఇదే సమయంలో… సాధారణ పౌరులే లక్ష్యంగా సరిహద్దుల్లోని గ్రామాల్లో డ్రోన్ లను ప్రయోగిస్తూ రాక్షసానందం పొందుతుంది పాక్. ఇలా పాకిస్థాన్ చేస్తోన్న దుశ్చర్యలకు భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటుంది! మరోపక్క భారత్ లోని సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు.. సుమారు 27 విమానాశ్రయాలను ప్రస్తుతానికి మూసేశారు! ఇక సెలవుల్లో ఉన్న సైనిక, పోలీసు, రైల్వే ఉద్యోగులకు అవి రద్దు చేశారు. ఈ స్థాయిలో ప్రభుత్వ చర్యలు చేపడుతోంది.. మరోపక్క ఫేక్ న్యూస్ లపై ప్రజలను అప్రమత్తం చేస్తుంది! ఈ సమయంలో సైబర్ నేరగాళ్లు ఎంటరయ్యారు. అవును… ప్రపంచం ఏమైపోతున్నా, దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా ప్రజలను మోసం చేసుకునే విషయంలో తమ పని తమదే అన్నట్లుగా.. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారు. తాజా పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తాజా పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీజీఏస్ ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. దీనిద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను వివరిస్తూ.. సైబర్ నేరగాళ్లు విరాళాలు అడుగుతున్నరని సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా… “సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. ఆర్మీ అధికారులమంటూ సందేశాలు పంపుతూ.. అందిన కాడికి దండుకుంటున్నారు. ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండండి. డొనేషన్ సందేశాలను నమ్మి డబ్బు చెల్లిచకండి” అని సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
👉 అతి పెద్ద చర్చ : అణు యుద్ధం వస్తుందా ? అయితే అణు యుద్ధం కడు ప్రమాదకరం. అది ఏకంగా మారణ హోమమే సృష్టిస్తుంది. దానికి ఇప్పటికి 80 ఏళ్ళ క్రితం జపాన్ లోని హిరోషిమా నాగసాకీల మీద పడిన అణు బాంబులే సాక్ష్యమని అంటుంటారు.. ఈ రోజున ప్రపంచం మొత్తం ఘర్షణల్లో నిండి ఉంది. ఎవరికి వారుగా తాము అభివృద్ధి చెంది సుఖపడలేక పక్కవారిని కెలుకుతూ చాలా సులువుగా యుద్ధాలను తెస్తున్నారు. భారత్ కి పాక్ తో సమస్యలు ఈనాటివి కావు. పాక్ ఆవిర్భవించిన తర్వాత నుంచి అనుకోవాలి. భారత్ నుంచి వేరుపడిపోతామని చెప్పిందే ఒక వర్గం. వారు కోరుకున్నట్లుగానే దేశం ముక్కలు అయింది. ఆ తర్వాత ఎవరి బతుకు వారు అన్నట్లుగా ఉండాలి. కానీ పాక్ ఆగస్టులో విడిపోయి అక్టోబర్ నాటికల్లా కాశ్మీర్ మీద యుద్ధం ప్రకటించింది. అలా మూడవ వంతు భూభాగాన్ని తీసుకుని ఈ రోజుకీ అక్కడ దర్జా చేస్తోంది దానికి ఉగ్రవాదులకు స్వర్ఘధామంగా మార్చి భారత్ మీదకు ఉసిగొలుపుతోంది. ఇదిలా ఉంటే భారత్ ఎపుడూ తానుగా ఏ దేశం మీదకు యుద్ధానికి వెళ్ళదు. తన మీదకు ఎవరైనా దాడి చేస్తే ప్రతి దాడికి వెళ్తుంది. అది తెలిసి పాక్ భారత్ ని పదే పదే కవ్విస్తూ ఉంటుంది. పహల్గాం దాడి అందులో భాగమే. ఇక భారత్ ఎంతో సంయమనం పాటిస్తూ వచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్ లోని ఉగ్ర వాద శిబిరాల మీదనే దాడి చేసింది. అది కూడా ఎక్కడా ఒక పౌరుడి ప్రాణం కానీ ఆస్తి కానీ నష్టపరచుకుండా చేసింది. అయితే అదే తప్పు అయిపోయినట్లుగా భారత్ మీద పాక్ యుద్ధాన్ని ప్రకటిస్తోంది దాంతో భారత్ కూడా ప్రతి దాడులు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ చేతిలో పాక్ చావు దెబ్బ తింటోంది. ఎంత పెద్ద ఎటాక్ చేసినా దానిని భారత్ వైపు నుంచి నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు. దీంతో దాయాదిలో అసహనం అంతకంతకు పెరిగిపోతోంది. ఏమి చేయాలో తెలియక ప్రతీకారేచ్ఛతో రగులుతోంది. ఇదిలా ఉంటే తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని పాక్ పదే పదే బెదిరిస్తూ వస్తోంది. తాము వాటిని భారత్ కోసమే సిద్ధం చేసి ఉంచుకున్నామని వంకర మాటలు అనేకం మాట్లాడుతూ వస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే పాక్ ఒక్కటే అవతల వైపు నుంచి యుద్ధం లో పాల్గొంటే దాని ఆలోచనల వరకూ అయితే ఫర్వాలేదు. కానీ దానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మరో దేశం కనుక కలిసి వస్తే అపుడు యుద్ధ స్వరూపమే మారిపోతుంది అని అంటున్నారు. ఒకనాడు సంప్రదాయ పద్ధతిలో యుద్ధం జరిగేది. ఇపుడు టెక్నాలజీ సాయంతో యుద్ధం చేస్తున్నారు. ఇక ముందు ఏమిటి అంటే అణ్వాయుధాల వాడకమే అని అంటున్నారు.
కశ్మీర్ సీఎం వేదన పోస్టు అయితే అణు యుద్ధం కడు ప్రమాదకరం. అది ఏకంగా మారణ హోమమే సృష్టిస్తుంది. దానికి ఇప్పటికి 80 ఏళ్ళ క్రితం జపాన్ లోని హిరోషిమా నాగసాకీల మీద పడిన అణు బాంబులే సాక్ష్యమని అంటుంటారు. అణు బాంబులు కనుక ఏ దేశం ప్రయోగించినా దాని దుష్పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ దేశం పూర్తిగా నష్టపోతుంది. అక్కడ భూభాగం సర్వనాశనం అవుతుంది. కనీసం పచ్చని మొక్క మొలవడానికి సైతం చాలా కాలం పడుతుంది. ఇక అణు బాంబు ప్రయోగిస్తే కనుక దాని రేడియేషన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కిలోమీటర్ల దూరం వరకూ వ్యాపిస్తుంది. దానితో కూడా ప్రజలు ప్రాంతాలు పూర్తిగా నష్టపోతాయి. ఇవన్నీ ఆలోచించుకున్నపుడు ఎవరికైనా భయం కలుగుతుంది. భారత్ పాక్ ల మధ్య యుద్ధం అన్నది ఇపుడు జరుగుతోంది ట్రెడిషనల్ గా అని భావించకూడదు. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగినవే అని అంతా గుర్తు చేస్తున్నారు. అయితే గత్యంతరం లేని పక్షంలో ఏ దేశం అయినా అణ్వాయుధాలను వాడుతుంది. పైగా అణ్వాయుధాలు వాడడడం అంటే మారణహోమాన్ని కోరి ఆహ్వానించడమే. ఉన్మాద మనస్తత్వంలో ఉన్న వారు అలాగే చేస్తారు. బాధ్యతాయుతమైన వారు ఆ పరిస్థితి తెచ్చుకోరు. మరి పాక్ లో బాధ్యత ఎంత వరకు ఉంది అన్నది చూస్తే అందరికీ అక్కడే అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా భారత్ పాక్ ల మధ్య యుద్ధం ఈసారి భీకరంగానే సాగుతుంది అని అంటున్నారు. పాక్ అనే సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని భారత్ చూస్తోంది. అదే విధంగా భారత్ ని గతంలో కంటే ఎక్కువగా దెబ్బతీయాలని పాక్ తన పగతో ఆలోచిస్తోంది.. ఈ యుద్ధం ఎంతవరకూ సాగుతుంది.. ఏ పరిణామాలకు దారి తీస్తుంది అన్నది మాత్రం ఎవరూ ఊహించలేకుండా ఉన్నారు.
👉పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి అశ్రునివాళులు అర్పించారు సీఎం చంద్రబాబు గారు. వీరజవాన్ మురళీనాయక్ ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదమన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వీరజవాన్‌కు నివాళులు అర్పించారు.

👉 భారత్ ఆర్మీకి మరిన్ని అధికారాలు.. రంగంలోకి దిగిన టెరిటోరియల్ ఆర్మీ*
భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కేంద్రం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి మరిన్ని అధికారాలను అప్పగిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని పేర్కొంది. సైనిక సామర్థ్యం మరింత బలోపేతం చేసేందుకు టెరిటోరియల్ ఆర్మీ అధికారులు, సిబ్బందిని పిలిచే అధికారాన్ని ఆర్మీ చీఫ్కు కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది.
👉టెరిటోరియల్ ఆర్మీలో ఎవరుంటారో తెలుసా?*
టెరిటోరియల్ ఆర్మీ భారత సైన్యానికి సహాయక సేవలు అందించే పార్ట్-టైమ్ వాలంటీర్ల రిజర్వ్ ఫోర్స్. సాధారణ సమయాల్లో తమ పనులు చేసుకుంటూ, సైన్యానికి అవసరమైనప్పుడు సేవలు అందిస్తారు. ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్-కమిషన్డ్ ఆఫీసర్లు ఇతర సిబ్బంది ఉంటారు. వీరికి సైనికులతో సమాన ర్యాంకులుంటాయి. దేశంలో 50 వేల మంది వరకు గల ఈ సైన్యంలో సచిన్, ధోనీ, కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్, మోహన్ లాల్ వంటి ప్రముఖులున్నారు.
👉 నా జీతం.. మీ జీవితం కోసం: పవన్ కళ్యాణ్ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. తన వేతనం మొత్తాన్ని అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున రూ.2,10,000 ఆర్థిక సాయాన్ని అందించారు. తన వేతనంలో మిగిలిన మొత్తాన్ని సైతం వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
👉*తిరుమలలో హై అలర్ట్.. ఆక్టోపస్ ముమ్మర తనిఖీలు*భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ తిరుమలలో టీటీడీ శుక్రవారం హై అలర్ట్ ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాలు, వాహనాలు, భక్తులు తిరిగే ప్రాంతాల్లో ఆక్టోపస్ బలగాలు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచించారు….
👉భారత్ గగనతలంలోకి పాకిస్థాన్ ఒక్కసారిగా నిన్న రాత్రి గురువారం దాదాపు 400 డ్రోన్లతో సియాచిన్ (లద్దాక్) నుంచి కచ్(GJ) వరకు 36 ప్రాంతాల టార్గెట్ చేస్తూ వీటిని లాంచ్ చేశారని తెలిపిన విక్రమ్ మిస్రి..
👉మే 8, 9 తేదీల మధ్య రాత్రి, పాకిస్తాన్ సైన్యం సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యంతో మొత్తం పశ్చిమ సరిహద్దు వెంబడి భారత గగనతలంలోకి అనేకసార్లు ఉల్లంఘనలు చేసింది” .. – వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్..
👉ఏపీ లిక్కర్ స్కాం.. ఓ అంతు ‘చిక్కని’ కేసు.. ఎందుకో తెలుసా? అయితే, ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. ఏపీలో 2019-24 మధ్య మద్యం అమ్మకాలన్నీ కేవలం నగదు రూపేణా మాత్రమే జరిగాయి. ’లిక్కర్’.. ఏపీలో ప్రస్తుతం సంచలనంగా మారింది.. ఇందులో స్కాం ఉందని టీడీపీ కూటమి సర్కారు..
అసలు లిక్కర్ పాలసీని సమర్థంగా అమలు చేసిందే చెబుతామని వైఎస్సార్సీపీ దేనికదే గట్టిగా వాదిస్తున్నాయి. లిక్కర్ ను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.3,200 కోట్లు చేతులు మారాయంటూ కూటమి సర్కారు కస్సుమంటోంది. అసలు తాము కొత్తగా ఒక్క డిస్టలరీకీ అనుమతి ఇవ్వలేదని.. మద్యం అంతా ప్రభుత్వ దుకాణాల్లోనే అమ్మామని.. బెల్టు షాపులను నిర్మూలించామని.. పర్మిట్ రూమ్ అనే వ్యవస్థనే లేకుండా చేశామని.. ఇంకా ఎక్కడినుంచి లంచాలు ఇస్తారని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది. ఇక కూటమి సర్కారు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నెలకు రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు ముడుపులు పెద్దలకు చేరాయని.. ఈ లెక్కన ఏడాదికి రూ.600 కోట్లు, ఐదేళ్లలో రూ.3,200 కోట్లు లంచాలు మేశారని ఆరోపిస్తోంది. అయితే, ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. ఏపీలో 2019-24 మధ్య మద్యం అమ్మకాలన్నీ కేవలం నగదు రూపేణా మాత్రమే జరిగాయి. అంటే.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ పేమెంట్లు కానీ, క్రికెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కానీ జరగలేదన్నమాట. ఒకవేళ క్రెడిట్, డెబిట్, యూపీఐ ద్వారా మద్యం అమ్మకాలు సాగి ఉంటే ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది? అనేది చిరునామా దొరికేది. కానీ, నగదు చెల్లింపుల్లో డబ్బు వినియోగదారుడి నుంచి ప్రభుత్వ దుకాణంలోని అమ్మకాలు సాగించే వ్యక్తికి మాత్రమే చేరింది. కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లు లంచాలు చేతులు మారాయంటే ఈ లెక్కలను కూడా చూడాల్సి ఉంటుంది. ఇక మద్యం కేసులో ప్రధాన ఆరోపణలు చేస్తున్న వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప నివాసాలు, కార్యాలయాలకు వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరిని ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని కార్యాలయానికి విచారణకు రావాలని కోరారు. దాదాపు రూ.3,200 కోట్లకు పైగా ముడుపులు చేతులు మారాయంటున్న సిట్.. రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి మరికొందరి స్టేట్‌మెంట్ల ఆధారంగా ఇంకాస్త సమాచారం సేకరించింది. పాలసీ రూపకల్పన, ఏ స్థాయిలో ఏ అధికారిని నియమించాలనే విషయంలో ధనుంజయరెడ్డి కీలక పాత్ర పోషించారని, మద్యం పాలసీ రూపకల్పన, సరఫరాదారుల నుంచి ముడుపులు వసూలు చేసి డొల్ల కంపెనీలకు మళ్లించడంలో వీరి పాత్ర ఉందని భావిస్తోంది. పర్సంటేజ్‌లపై ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మద్యం కంపెనీ యజమానులతో హైదరాబాద్, తాడేపల్లిలో పలుసార్లు సమావేశమ య్యారని, డబ్బును షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని సిట్ చెబుతోంది.


