👉 భారత్లోని 15 నగరాల్లో దాడులకు పాక్ యత్నం!.. పాక్ పై విరుచుకుపడుతున్న భారత సైన్యం..జైషే ఉగ్రవాది, మసూద్ అజర్ సోదరుడు, అబ్దుల్ రవూఫ్ అజర్ హతం..👉 ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ కు ఎంపికైన  పొదిలి క్రీడాకారుడు కె.కొండారాజు.. 👉‘ఆపరేషన్ సింధూర్’లో కశ్మీరి ముస్లిం కీలక పాత్ర?..👉 ఫ్యాక్ట్ చెక్ : ముస్లింలపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. అసలు వాస్తవం ఏమిటి?.. 👉 భిన్నత్వంలో ఏకత్వం… ‘ఆపరేషన్ సింధూర్’ తో మరోసారి నిరూపితం! ..👉ఏపీలోని ప్రైవేటు బడుల్లో ఆర్టీఈ ప్రవేశాలకు రేటింగ్ ఆధారంగా ఫీజులు*..👉మాజీ మంత్రి కొండపి వైసీపీ ఇంచార్జి ఆదిమూలపు సురేష్ ని సన్మానం చేసిన వైస్ ఎంపీపీ సామంతుల..👉ఏపీలో గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనాలు పెంపు*

👉 భారత్లోని 15 నగరాల్లో దాడులకు పాక్ యత్నం!

భారత్లోని 15 నగరాల్లోని మిలటరీ స్థావరాలపై పాకిస్థాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. చైనాకు చెందిన BVR మిస్సైల్స్తో దాడులు చేసేందుకు యత్నించగా, భారత్లోని S400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది. జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్ కోట్, బటిండా, లుధియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, ఫలోడి పాటు పలు నగరాలపై దాడులకు పాక్ యత్నించింది.

👉పాక్ పై విరుచుకుపడుతున్న భారత సైన్యం.. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్..భారత్‌లోని 15 మిలటరీ స్థావరాలపై పాకిస్థాన్ దాడులు చేసేందుకు యత్నం ..లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లతో పాక్ దాడి..పాక్ దాడులను తిప్పికొట్టిన భారత్ బలగాలు.. పాక్ మిస్సైల్స్‌ను గగనతలంలోనే పేల్చేసిన భారత్..జమ్మూ, శ్రీనగర్, అమృత్‌సర్, పఠాన్ కోట్, బటిండా, లుథియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, ఫలోడి పాటు పలు నగరాలపై దాడులకు యత్నించిన పాక్..చైనాకు చెందిన BVR మిస్సైల్స్‌తో దాడులు చేసేందుకు యత్నించగా.. వాటిని సమర్థంగా అడ్డుకున్న భారత్‌లోని S400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ..

👉ఆపరేషన్ సిందూర్‌లో జైషే ఉగ్రవాది, మసూద్ అజర్ సోదరుడు, అబ్దుల్ రవూఫ్ అజర్ హతం..నిన్న పాకిస్తాన్ లోని బహవల్పూర్‌లో జైషే కార్యాలయంపై భారత్ దాడి చేసిన విషయం తెలిసిందే.. ఈ దాడిలో పది మంది మసూద్ కుటుంబ సభ్యులు మృతి..ఈ దాడిలోనే తీవ్రంగా గాయపడిన అబ్దుల్ ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి..1999 లో IC- 814 ఫ్లైట్ హైజాక్ లో అబ్దుల్ రవూఫ్ అజర్ కీలక పాత్ర పోషించాడు.

👉 కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్…*పాక్ దాడులను తిప్పికొడుతూ భారత్ ఎదురుదాఢులు.. *పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ పై భారత్ డ్రోన్ దాడి.. *పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసిన భారత్.. *రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్ పైనా డ్రోన్ దాడి.. *రూ.1600 కోట్ల పాక్ ఆస్తులు ధ్వంసం చేసిన భారత్… *పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న భారత్.. పాకిస్తాన్ లోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు .. లాహోర్, కరాచీ, రావల్పిండి, గుజ్రాన్వాలా, చక్వాల్, బహల్వాపూర్, మైనివాలి, చోర్ ప్రాంతాల్లో దాడులు.. భారత్ డ్రోన్ దాడులు చేశాయని ప్రకటించిన పాక్ ఆర్మీ డీజీ.. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం ను ధ్వంసం చేసిన భారత్.. సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి దూసుకెళ్లిన డ్రోన్లు .. అర్దరాత్రి నుంచే కొనసాగుతున్న దాడులు

👉జమ్ము ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడి..జమ్ములో ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం.. జమ్ము నగరం మొత్తం బ్లాక్‌అవుట్‌.. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరిక.. పలుచోట్ల పాక్‌ డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం

👉 ఫ్యాక్ట్ చెక్ : ముస్లింలపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. అసలు వాస్తవం ఏమిటి? …సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ తప్పుడు ప్రకటనలో, పవన్ కళ్యాణ్ ‘ముస్లింలందరినీ ఉగ్రవాదులుగా అభివర్ణించారని, ఇస్లాం మతంపై ద్వేషాన్ని వెళ్లగక్కారని’ వీడియోను వైరల్ చేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై, అలాగే జాతీయ ప్రాధాన్యత కలిగిన విషయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, దేశంలో చోటుచేసుకుంటున్న ఉగ్రవాద దాడులు, వాటి తదనంతర పరిణామాలపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ పేరుతో ఒక తప్పుడు ప్రకటన సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది, ఇది పెద్ద దుమారానికి దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ తప్పుడు ప్రకటనలో, పవన్ కళ్యాణ్ ‘ముస్లింలందరినీ ఉగ్రవాదులుగా అభివర్ణించారని, ఇస్లాం మతంపై ద్వేషాన్ని వెళ్లగక్కారని’ వీడియోను వైరల్ చేస్తున్నారు.. ఇది అసలు ఆయన చేసిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధమైనది. ఈ తప్పుడు ప్రచారం ఆధారంగా, ముస్లింలందరినీ ఉగ్రవాదులుగా పేర్కొన్నారంటూ పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదులు అందినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. వాస్తవానికి గతంలో ఒక సందర్భంలో పహల్గామ్ దాడి ఘటనపై వ్యాఖ్యానిస్తూ, పవన్ కళ్యాణ్ ఇలా అన్నారు: “పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులందరూ ఇస్లాం మతాన్ని అనుసరించేవారని, వారు మతం పేరుతో అధికారాన్ని దుర్వినియోగం చేశారని. అయితే, దీనికి విరుద్ధంగా ఇస్లాం మతాన్ని అనుసరించే ఎంతోమంది కాశ్మీరీ ముస్లింలు గాయపడిన పర్యాటకులను రక్షించారని” ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఉగ్రవాదులకు, సామాన్య శాంతి కాముకులైన ముస్లింలకు మధ్య ఉన్న తేడాను ఆయన స్పష్టంగా వివరించారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, జనసేన పార్టీకి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను ప్రజలతో పంచుకున్నాయి. ఈ అసలు వీడియో ద్వారా, పవన్ కళ్యాణ్ గారు ఇస్లాంలో ఉన్న తీవ్రవాద గ్రూపులకు, సంప్రదాయ శాంతి కాముకులైన ముస్లింలకు మధ్య గల వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా చూపారని రుజువైంది. కొందరు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆయన వ్యాఖ్యలను స్పష్టంగా వక్రీకరించి ప్రచారం చేశాయని తేలింది. ఆయన ముస్లింలందరినీ ఉగ్రవాదులుగా పేర్కొనలేదని, తీవ్రవాద చర్యలకు పాల్పడే కొద్దిమందిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడారని అసలు వీడియో స్పష్టం చేస్తోంది. పహల్గామ్ దాడిలో గాయపడినవారిని కాశ్మీరీ ముస్లింలే మానవతా దృక్పథంతో కాపాడారని ఆయన స్వయంగా చెప్పడం ద్వారా, ఆయనకు ముస్లింలందరిపై ద్వేషం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి, పవన్ కళ్యాణ్ ముస్లింలందరిపై ద్వేషాన్ని చూపారని, వారిని ఉగ్రవాదులుగా అభివర్ణించారని జరిగిన ప్రచారంలో ఎటువంటి నిజం లేదని ఫ్యాక్ట్ చెక్‌లో నిర్ధారణ అయింది. అసలు వీడియో క్లిప్‌ను పరిశీలించకుండా, వక్రీకరించిన సమాచారాన్ని కొందరు కావాలనే ప్రచారం చేశారని స్పష్టంగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నిర్ధారించుకోకుండా షేర్ చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

👉 భిన్నత్వంలో ఏకత్వం… ‘ఆపరేషన్ సింధూర్’ తో మరోసారి నిరూపితం! అవును… పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను చేపట్టిన సంగతి తెలిసిందే.. భారత్ చాలా గొప్పదేశం! ఎన్నో మతాలు, వందల భాషలు, జాతులు.. అయినప్పటికీ ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య భారతంలో అవన్నీ ఒకేతాటిపైకి వస్తుంటాయి. అదే భిన్నత్వంలో ఏకత్వం.. ఇది భారత్ సొంతం చేసుకున్న సిద్ధాంతం! ఈ విషయంలో తాజాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో మరోసారి నిరూపితమైందనే చర్చ తెరపైకి వచ్చింది. అవును… పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. సుమారు 80 మంది వరకూ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. మతం పేరు అడిగిమరీ మారణహోమానికి పాల్పడినవారికి గట్టి బుద్ది చెప్పింది.. దాని ప్రాముఖ్యత ఇదే! ఈ సమయంలో భారత్ లో హిందువులు, ముస్లింలు అంతా ఒకటేనని.. కొంతమంది రాజకీయ నాయకులు, పార్టీలు ప్రజలను మతాలుగా, కులాలుగా విభజించి పబ్బం గడుపుకుంటారే తప్ప.. తామంతా ఒకటేనని చాటిచెప్పే సంగతులు తాజాగా జరిగాయి.. ఈ సమయంలో ముస్లిం మతానికిక్ చెందిన భారతీయుల పనులు, వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూర్చాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ గురించి ప్రపంచానికి వివరించింది మైనార్టీ వర్గానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి. 1990ల్లో సైన్యంలో చేరిన ఈమె… ఐక్యరాజ్య సమితి పీస్ మిషన్ లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వర్తించారు. ఆమెలోని నాయకత్వ లక్షణాలు, కీలక సమయాల్లో ప్రదర్శించే ఓర్పు వల్లే ఈ ఎంపిక జరిగింది!.. ఇక ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ ఓ ప్రచారానికి తెరలేపింది. ఇందులో భాగంగా.. పాక్, పీవోకే లోని స్థావరాలపై భారత్ జరిపిన దాడిని పాక్ సైన్యం గట్టిగా తిప్పికొట్టిందని.. భారత్ కు చెందిన 5 ఫైటర్ జెట్ విమానాలను కూల్చేసిందని చెప్పుకొచ్చింది. ఈ విషయాలను నేరుగా పాక్ ప్రధాని, పాక్ రక్షణ మంత్రి కూడా నిస్సిగ్గుగా ప్రచారం చేసుకున్నారు! ఈ సమయంలో ఫ్యాక్ట్ చెకర్ మహ్మద్ జుబైర్.. సమాచార యుద్ధం చీఫ్ గా ఉద్భవించాడు. వాస్తవాన్ని కల్పితం నుంచి వేరు చేసి, పాత ఫుటెజీలను తిరిగి ఉపయోగించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రపంచానికి చూపించారు. నకిలీ వార్తను చూసినప్పుడల్లా మతం, దేశంతో సంబంధం లేకుండా దాన్ని తాను ఖండిస్తానని తెలిపారు. అదేవిధంగా… పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కు దేశంలోనే అతిపెద్ద ముస్లిం పార్టీ అయిన మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మద్దతు పలికారు. మరోసారి అమాయక పర్యాటకులపై దాడికి పాల్పడకుండా పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం నేర్పించామని ఒవైసీ ఎక్స్ వేదికగా అన్నారు. ఇదే సమయంలో… పాక్ లోని ఉగ్రమూకలకు మౌలిక సదుపాయాలు అందకుండా చర్యలు తీసుకోవాలని.. ఉగ్రవాద మూకల శిబిరాలను సమూలంగా నాశనం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా… ఉగ్రమూకల శిబిరాలపై భారత రక్షణ దళాలు నిర్వహించిన దాడులను స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

👉సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్‌ ఓర్వలేకపోతున్నాడని, రాష్ట్రంపై, కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి సవిత విమర్శించారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆమె మాట్లాడారు. జగన్‌కు త్వరలోనే గాలి జనార్దనరెడ్డి గతే పడుతుందన్నారు. మహిళలు ఉచిత కుట్టు శిక్షణ పథకంపై వైసీపీ నేతలు చర్చకు రావాలని మంత్రి సవాల్‌ విసిరారు.

👉 ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, ప్రియాంక గాంధీ, జైరాం రమేష్‌, పార్టీ సీనియర్‌ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్థాన్‌కు దీటైన సమాధానం ఇచ్చిన భారత దళాలను చూసి కాంగ్రెస్‌ గర్విస్తోందని ఖర్గే చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత విధానం స్పష్టంగా, దృఢంగా ఉందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టే చర్యలకు సీడబ్ల్యూసీ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. భారత భద్రతా బలగాలకు తమ పూర్తి మద్దతు ఉందన్నారు. రక్షణ దళాలకు పూర్తి మద్దతు ఇవ్వాలని సీడబ్ల్యూసీ భేటీ నిర్ణయించినట్లు రాహుల్‌ తెలిపారు.

👉పాకిస్థాన్‌ కనుక ఉద్రిక్తతలు పెంచితే మరింత గట్టిగా బదులు చెప్పేందుకు సిద్ధమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ స్పష్టం చేశారు. అమెరికా, బ్రిటన్‌, రష్యా, చైనా, సౌదీ అరేబియా, జపాన్‌, ఫ్రాన్స్‌ దేశాల భద్రతా సలహాదారులకు ఆయన ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వివరించారు. ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్‌కు లేదని, పరిస్థితులను తీవ్రతరం చేసేందుకు పాక్‌ యత్నిస్తే మరింత తీవ్రంగా ప్రతిస్పందన ఉంటుందన్నారు. రానున్న రోజుల్లోనూ ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటామని వారికి వివరించారు.

👉పాక్‌ సైన్యం కాల్పుల్లో భారత జవాన్‌ మృతి.. పూంచ్‌ సెక్టార్‌ దగ్గర పాక్‌ బలగాల కాల్పులు..ఈ కాల్పుల్లో దినేష్‌కుమార్‌ అనే జవాన్ మృతి

👉పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుండి మేము పాకిస్తాన్ లో విలీనం కాము మేము భారతదేశంలోనే విలీనం అవుతామని బలుచిస్తాన్ ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు.. పాకిస్తాన్ వారి పైన ఉక్కు పాదం మోపుతూ వచ్చింది ఇంతకాలం.. తాజాగా భారత్ ఒకపక్క పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల పైన దాడులు చేస్తూ ఉన్న క్రమంలో. . ఇదే అదనుగా భావించిన బలూచ్ రెబల్స్ పాకిస్తాన్ సైనికుల పైన దాడులకు దిగారు. . దాన్లో భాగంగా తాజాగా నిన్న పాకిస్తాన్ సైనికులు ప్రయాణిస్తున్న ఒక వాహనాన్ని బాలుచ్ రెబల్స్ ఐఇడి బాంబు ను రిమోట్ కంట్రోల్ తో పేల్చివేశారు ఈ ఘటనలో 14 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు బలూచ్ రెబల్స్ తెలియజేశారు.. దానికి సంబంధించిన వీడియోను కూడా బలూచ్ రెబల్స్ ప్రపంచ దేశాలకు విడుదల చేశారు..

👉‘ఆపరేషన్ సింధూర్’లో కశ్మీరి ముస్లిం కీలక పాత్ర?

ఆపరేషన్ సింధూర్ విజయానికి ఓ కశ్మీరి ముస్లిం కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. అనంతనాగ్‌కు చెందిన ఎయిర్ వైస్ మార్షల్ హిలాల్ అహ్మద్ రఫేల్ జెట్స్ ఆపరేషన్‌లో నిపుణుడు. రఫేల్ ఫ్లైట్ తొలిసారిగా నడిపిన భారతీయుడిగా ఆయన పేరొందారు. రఫేల్‌ను దేశానికి తీసుకురావడం, ఎయిర్ డిఫెన్స్‌ను మెరుగుపరచడంలో అతని పాత్ర కీలకం. తాజాగా పాక్‌లో ఉగ్ర స్థావరాలపై దాడులకు IAF రఫేల్ జెట్స్‌ను ఉపయోగించినట్లు సమాచారం.

👉ఏపీలోని ప్రైవేటు బడుల్లో ఆర్టీఈ ప్రవేశాలకు రేటింగ్ ఆధారంగా ఫీజులు*

అమరావతి :ఏపీలో విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా కల్పించే ప్రవేశాలకు ఫీజులను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఇటీవల వేసిన కమిటీ సదుపాయాల ఆధారంగా స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఒక స్టార్ ఉన్న బడులకు సగటున రూ.8వేలు, రెండు స్టార్లు ఉన్నవాటికి రూ. 9వేలు, మూడు స్టార్లు ఉంటే రూ.10వేలు, నాలుగు స్టార్లు ఉన్నవాటికి రూ. 12 వేలు.. ఐదు స్టార్లు ఉంటే రూ.15వేలు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు.

👉ఏపీలో గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనాలు పెంపు*

అమరావతి :ఏపీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల (గెస్ట్ ఫ్యాకల్టీ) వేతనాల పెంపునకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం గంటకు రూ.150 చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.10,000 ఇవ్వాలనే నిబంధన ఉంది. దాన్ని గంటకు రూ.375 చొప్పున గరిష్ఠంగా నెలకు రూ.27,000 ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది.

👉ఎల్‍వోసీ వెంబడి పాక్ సైన్యం కాల్పుల్లో 12 మంది మృతి…*పాక్ సైన్యం కాల్పుల్లో మరో 42 మందికి గాయాలు..* నియంత్రణరేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాకిస్థాన్..*కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి విచక్షణారహితంగా కాల్పులు.*  *పూంఛ్, రాజౌరి, బారాముల్లా జిల్లాల్లో పాక్ సైన్యం కాల్పులు..

👉భారత్-పాక్ ల దాడులు చాలా భయంకరంగా ఉన్నాయి.**నాకు రెండు దేశాలతోనూ మంచి సంబంధం ఉంది.. భారత్-పాకిస్థాన్ దేశాలు నాకు బాగా తెలుసు.*  *సమస్యను పరిష్కరించుకొని దాడులు ఆపాలని కోరుకుంటున్నా.. తక్షణమే ఈ దాడులు ఆపగలరని ఆశిస్తున్నా.* *రెండు దేశాలూ పరస్పరం దెబ్బకు దెబ్బ తీసుకున్నాయి.* *నేను ఏదైనా సహాయం చేయగలిగితే అందుబాటులో ఉంటా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్*

👉టంగుటూరు మండలం జయవరం గ్రామం లో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన నీటి తొట్టిల ను కలెక్టర్ తమీంమ్ అన్సారీయా, డ్యూమా పిడి జోసెఫ్ కుమార్.. పరిశీలించినారు. అనంతరం త్రోవగుంటలోని పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించినారు

👉 ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ కు ఎంపికైన  పొదిలి క్రీడాకారుడు కె.కొండారాజు.

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 6 వ తేదీన కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర బీచ్ సెపక్ తక్రా జట్టు ఎంపికలో పొదిలి క్రీడాకారుడు కె. కొండారాజు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టు కి ఎంపిక అయ్యాడని , ఎంపికైన జట్టు ఈ నెల 19 నుండి 24 వరకూ గుజరాత్ రాష్ట్రంలో జరగబోయే ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 లో పాల్గొంటుందని పొదిలి వ్యాయామ ఉపాధ్యాయులు M.ప్రసాద్ తెలిపారు.

👉మాజీ మంత్రి కొండపి వైసీపీ ఇంచార్జి ఆదిమూలపు సురేష్ ని సన్మానం చేసిన వైస్ ఎంపీపీ సామంతుల రవికుమార్ రెడ్డి. వైసీపీ నుండి సస్పెండ్ అయి. మల్లి వైసీపీ లో సస్పెండ్ తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలో లో ఆదిమూలపు సురేష్ ని ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

👉 టెన్త్ మెరిట్ విద్యార్థులకు పురస్కారం!

గత మార్చిలో జరిగిన, ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలందు, అత్యధిక మార్కులు సాధించిన, కంభం, బేస్తవారిపేట, ఆర్టివీడు మండలాల కాపు సామాజిక వర్గానికి చెందిన 9 మంది మెరిట్ విద్యార్థులను, శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం వారు, తమ సంఘ కార్యాలయంలో దుశ్శాలువ, మెమొంటోలతో సత్కరించారు. ఏబీసీ మండలాలకు చెందిన, కాత్వా యూనిట్ వారు, ఒక్కో విద్యార్థికి, 500 రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో, పలువురు మాట్లాడుతూ, ఇదే తరహాలో, ఇంటర్మీడియట్ నందు కూడా, మరిన్ని ఉత్తమ మార్కులను సాధించి, తల్లిదండ్రులకు సామాజిక వర్గానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం అధ్యక్షులు తోట కోటేశ్వరరావు, కార్యదర్శి. రఘువీర్, కాసుల పాండు, ఉపాధ్యక్షులు సురే ప్రసాద్, కురంగి మల్లికార్జున, సిరిగిరి కొండలరావు, ఓ సి హెచ్ నరసింహులు, మామిళ్ల చంద్రశేఖర్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

👉ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరు కావాలి*.. కంభం:ప్రభుత్వ పాఠశాల మనుగుడను ప్రశ్నార్థకంగా మారుస్తున్న పాలకుల విధానాలను వ్యతిరేకిస్తూ,9 రకాల బడులతో విద్యా వ్యవస్థ అతలాకుతలం అవుతుందని,ప్రభుత్వ విధానాల వల్ల ప్రాథమిక విద్య దెబ్బ తింటదని దీనిని ప్రతిఘటిoచాలని ఏపీటిఎఫ్ నాయకులు పగడాల పాండు,అబ్దుల్ కలాం,భాస్కర్ నాయుడు, మల్లికార్జునరావు,రంగస్వామి, అంకిరెడ్డి బృందం తెలిపారు.ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 9న ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమానికి కంభం మండలం నుంచి అధిక సంఖ్యలో ఉపాద్యాయులు పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలన్నారు.

👉టైర్ల వ్యాపారం పేరుతో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్*

కడప జిల్లా యర్రగుంట్ల లో ఓ టైర్ల కంపెనీ ద్వారా పలువురి వద్ద ఆర్డర్లు తీసుకొని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు యర్రగుంట్ల సీఐ నరేష్ బాబు తెలిపారు.నిందితుడు భరత్ కుమార్ (29) ఓ ప్రైవేట్ టైర్ల కంపెనీలో పనిచేస్తూ అక్రమ మార్గంలో ఎటువంటి బిల్లులు లేకుండా తన స్వలాభం కోసం టైర్లను కనుగోలుదారులకు ఇవ్వకుండా బ్లాక్ లో అమ్ముకుంటూ వచ్చిన మొత్తాన్ని నిందితుడు జల్సాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలిందని సీఐ వివరించారు..నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..