👉 ఉగ్రవాదులతో పాక్ (అక్రమ) బంధం… క్లారిటీ ఇచ్చిన చిత్రం!… ఉగ్రవాదానికి అతిపెద్ద అడ్డాగా.. ఉగ్రవాదులకు అతి సేఫ్ జోన్ గా.. ఉన్న దేశాల్లో పాకిస్థాన్ ఫస్ట్ లిస్ట్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే. ఉగ్రవాదానికి అతిపెద్ద అడ్డాగా.. ఉగ్రవాదులకు అతి సేఫ్ జోన్ గా.. ఉన్న దేశాల్లో పాకిస్థాన్ ఫస్ట్ లిస్ట్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు పాకిస్థాన్ అత్యంత అనువైన స్థలంగా చెబుతారు. అయితే పాక్ నేతలు మాత్రం… తాము కూడా ఉగ్రవాద బాధితులమే అని నిస్సిగ్గు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ సమయంలో ఓ ఫోటో పాక్ వైఖరిపై ప్రపంచానికి మరోసారి క్లారిటీ ఇచ్చింది. అవును… పాకిస్థాన్ కు ఉగ్రవాదులకు ఉన్న అవినాభావ (అక్రమ) సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు! ప్రపంచంలో ఉగ్రవాదం ఇంకా మనగ గలుగుతుందంటే అందుకు పాక్ కూడా ఓ ప్రధాన కారణం అని చెబుతారు. ఇక ప్రధానంగా పాక్ లో ఉన్న ఉగ్రమూకలకు భారత్ ఓ టార్గెట్! ఇటీవల పహల్గాంలో జరిగిన పాశవిక దాడి అందుకు ఓ తాజా ఉదాహరణ. డోవల్ వ్యూహంతో సక్సెస్ అయిన ‘ఆపరేషన్ సింధూర్’! ఈ సమయంలో ఉగ్రవాదులతో అవిభక్త కవలగా ఉన్న పాక్ ఆర్మీతో.. ఈ విషయంలో మాటలు కంటే చేతలతో చెప్పే సమాధానమే సరైంది అని భావించిన భారత్… ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. సుమారు 80 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. నేరుగా పాక్ లోని పంజాబ్ లో ఉన్న స్థావరాలను నేలమట్టం చేసింది. ***ఈ సమయంలో మరణించిన ఉగ్రవాదులకు బుధవారం అంత్యక్రియలు జరిగాయి. ఇందులో భాగంగా… లాహోర్ సమీపంలోని మురిద్కేలోని ఉగ్రవాద సంబంధిత ప్రదేశంలో భారత సైనిక దాడుల్లో మరణించిన ముగ్గురు వ్యక్తుల అంత్యక్రియల్లో ప్రార్థనలకు లష్కరే తోయిబా (ఎల్.ఈ.టీ) ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ నాయకత్వం వహించాడు. ఇలా అతడు నాయకత్వం వహించిన ఉగ్రవాదుల అంత్యక్రియల కార్యక్రమంలో పాకిస్థాన్ ఆర్మీ సిబ్బంది, పోలీసులు పాల్గొనడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటో పాక్ కి ఉగ్రవాదులకు ఉన్న బంధాన్ని చెప్పకనే చెబుతుందనీ అంటున్నారు. ఇదే సమయంలో మురిడ్కేలో మరో ఉగ్రవాది శవపేటికలను పాక్ జెండా చుట్టి మరీ ఆ దేశ ఆర్మీ సిబ్బంది మోస్తూ కనిపించారు. దీంతో… దీనికి సంబంధించిన ఫోటోలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పాకిస్థాన్ లో ఉగ్రవాదులు ఓ అంతర్భాగమని ఒకరంటే.. పాక్ సైన్యంతో ఉగ్రవాదులది అక్రమ సంబంధం అని మరొకరు స్పందిస్తున్నారు. ఇదే సమయంలో… ఈ ఫోటోలు ప్రపంచం ముందు పెట్టాలని, ఐరాసలో ప్రదర్శించాలని మరికొంతమంది సూచిస్తున్నారు.
👉జైష్-ఎ-మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సంచలన ప్రకటన..!!!
ఆపరేషన్ సిందూర్’ లో భాగంగా బవహల్పూర్ లోని జైష్-ఎ-మహమ్మద్ ప్రధాన స్థావరం అయిన సుభాన్ అల్లా కాంప్లెక్స్‌పై ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో జైష్-ఎ-మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతమయ్యారు. అందులో అతడి అక్క, బావ, మేనల్లుడు, భార్య కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ పై విషం కక్కతూ.. మసూద్ అజార్ తాజాగా ఓ సంచలన లేఖ విడుదల చేశాడు. అందులో తాను కూడా చనిపోయి ఉంటే బాగుండేదని మసూద్ అజార్ ప్రస్తావించాడు. ప్రధాని మోడీ కశ్మీర్ విషయంలో అన్ని నియమాలను ఉల్లంఘించారని ఆక్రోశం వెల్లగక్కారు. భారత్‌పై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశాడు. ఇండియాపై ఏమాత్రం జాలి చూపబోమని బీరాలు పలికాడు. భయం లేదు.. నిరాశ లేదు.. దుఖం లేదంటూ చనిపోయాడని అనుకున్న మసూద్ అజార్ రాసిన లేఖ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది
👉ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం : పాక్ ప్రధాని సంచలన ప్రకటన..!!!
ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, POK లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి 100 మంది ముష్కరులను అంతం చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం అయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పాక్ ప్రధాని షెహబాజ్ సంచలన ప్రకటన చేశారు…జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మాట్లాడుతూ.. ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం అని భారత్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా బదులు ఇవ్వాలో పాక్ కు బాగా తెలుసునని అన్నారు. భారత దాడుల్లో చనిపోయిన దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తుందని అన్నారు. పాక్ ప్రధాని చేసిన ప్రసంగం అనంతరం ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరగనున్నాయో అని ఆందోళనలు మొదలయ్యాయి.
👉మా తాతల నుంచి ఆర్మీ లోనే..కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి తాజ్ ఖురేషి ఆసక్తి కర కామెంట్స్ !!!
కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి తాజ్ ఖురేషి ఆసక్తి కర కామెంట్స్ చేశారు. నా కూతురిని చూసి గర్విస్తున్నా.. కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి తాజ్ ఖురేషి అంటూ వ్యాఖ్యానించారు. మా తాతల నుంచి ఆర్మీలోనే ఉంటున్నామని తెలిపారు. దేశం కోసం నా కూతురు చేసిన మంచి పనికి నేను ఎంతో గర్విస్తున్నానని పేర్కొన్నారు. ఒకవేళ నాకు ఇప్పుడు అవకాశం వస్తే.. ఆ పాకిస్తాన్‌ను నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చారు కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి తాజ్ ఖురేషి….అసలు ఈ భూమి మీద ఉండే అర్హత ఆ దాయాది దేశానికి లేనే లేదన్నారు. మా తాత, తండ్రితో పాటు నేను కూడా భారత ఆర్మీలో సేవలు అందించామని గుర్తు చేశారు. ఇప్పుడు నా కూతురు ఆర్మీలో ఉందంటూ గర్వంగా చెప్పారు తాజ్ ఖురేషి. దింతో మతం కాదు.. దేశ భద్రతే కర్తవ్యమని దేశభక్తిని ఖురేషి ఫ్యామిలీ చాటిందని అంటున్నారు. కాగా పాకిస్తాన్ పై జరిగిన ఆపరేషన్ సిందూర్ లో ముస్లిం మహిళ సైనిక్ అధికారి సోఫియా ఖురేషి కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా, ఆపరేషన్ సిందూర్ లో 100 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు మృతి చెందారు.

