👉పాక్ కు కాళరాత్రి… ఉగ్రవాదులను వణికించిన భారత్ అస్త్రాలివే! ఈ సమయంలో భారత్ అమ్ములపొదిలోని అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసి, ఉగ్రమూకలపై ఎక్కుపెట్టినట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రతికారంతో రగిలిపోతున్న భారత్.. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది. ఈ దాడులతో పాకిస్థాన్ లోని ఉగ్రవాదులకు కాళరాత్రి అంటే ఏమిటో చూపించింది. ఈ సమయంలో భారత్ అమ్ములపొదిలోని అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసి, ఉగ్రమూకలపై ఎక్కుపెట్టినట్లు తెలుస్తోంది. అవును.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రమూకలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కేవలం 25 నిమిషాల వ్యవధిలో 9 ఉగ్రస్థావరాలపై భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో విరుచుకుపడ్డాయి. ఈ సమయంలో భారత్.. ఆత్మాహుతి డ్రోన్లు, హ్యూమర్ బాంబులు, స్కాల్ప్ క్షిపణులను వాడినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో సుమారు 80 మంది ఉగ్రవాదులు మరణించారు! ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ లో భారత్ వాడిన అత్యాధునిక ఆయుధాల్లో “స్కాల్ప్ క్షిపణులు” ఒకటని చెబుతున్నారు. ఫ్రాన్స్ అభివృద్ధి చేసిన ఈ క్షిపణులు సుమారు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగి ఉంటాయి. తాజా దాడిలో భారత్.. ఫ్రాన్స్ తయారు చేసిన రఫేల్స్ యుద్ధ విమానాల నుంచి దీనిని ప్రయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. అదేవిధంగా… ఆపరేషన్ సిందూర్ లో భారత సైన్యం ఆత్మాహుతి డ్రోన్లను వినియోగించినట్లు తెలుస్తోంది. భారత అమ్ముల పొదిలో ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకుని, లక్ష్యాలను గుర్తించి, అనంతరం వాటిపై విరుచుకుపడతాయి. వీటిని కదులుతున్న లక్ష్యాలను ఛేదించేందుకు వాడతారు! ఇదే సమయంలో… భారత్ సైన్యం పాక్ ఉగ్రవాదులు ఉన్న భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యూమర్ బాంబులను వినియోగించినట్లు చెబుతున్నారు! వీటిని లక్ష్యానికి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించవచ్చు! ఇవి స్మార్ట్ బాంబ్ కోవలోకి వస్తాయని చెబుతున్నారు. జైషే మహ్మద్ కు చెందిన ప్రధాన కార్యాలయంపై వీటిని ప్రయోగించినట్లు తెలుస్తోంది! ఈ సమయంలో ప్రధానంగా అతిపెద్ద ఉగ్ర స్థావరాలుగా చెప్పే బవహల్పూర్, మురిద్కేలను ధ్వంసం చేసే బాధ్యతను వాయుసేన స్వీకరించగా.. మిగిలిన వాటి సంగతి ఆర్మీ చూసుకుందని చెబుతున్నారు. ఈ సమయంలో… తమ నిఘా వ్యవస్థలైన పీ8ఐ విమానాలు, ఎంక్యూ9 డ్రోన్లతో నౌకాదళం సహకారం అందించిందని సమాచారం!
👉గాలి జనార్దన్‌రెడ్డికి ఏడేళ్ల జైలు.. ‘పాలిటిక్స్’ ఎండేనా? ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో గాలి శాసన సభ్యత్వం రద్దు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. గాలి జనార్దన్‌రెడ్డి. ఒకప్పుడు దక్షిణాదిలో ఆయనను మించిన కుబేరుడు లేరు. కుమార్తె పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసి అందరినీ మెస్మరైజ్ చేసిన ఆయనకు తిరుమల శ్రీవారంటే అమిత భక్తి. అందుకే.. అప్పట్లోనే ఆయన నిలువెత్తు కిరీటం చేయించి శ్రీవారికి కానుకగా ఇచ్చారు. అయితే.. ఆయనపై అక్రమాలు, అవినీతి కేసులు నమోదైన తర్వాత.. తిరుమల తిరుపతి దేవస్థానం సదరు కానుకను వెనక్కి ఇచ్చింది. అయితే.. ఆయన అది తిరిగి తీసుకోలేదు. ప్రస్తుతం ఈ కిరీటం.. ఎస్ బీఐ బ్యాంకులో ఉంది. ఇదిలావుంటే.. ప్రస్తుతం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడిన నేపథ్యంలో గాలి జనార్దన్‌రెడ్డి ఫ్యూచర్ ఏంటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. Also Read – భారత దెబ్బకు కుదేలైన పాక్ స్టాక్ మార్కెట్: స్థిరంగా భారత మార్కెట్లు జనార్దన్‌రెడ్డి ప్రస్తుతం వ్యక్తి మాత్రమే కాదు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన గంగావతి నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా. ఆయన `కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష` పార్టీకి అధినేత కూడా. ఆయన పార్టీ 2023లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో 45 స్థానాల్లో పోటీ చేసింది. ఆయన సతీమణి లక్ష్మి కూడా నాయకురాలే. ప్రస్తుతం ఈ పార్టీ విస్తరణ దశలో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ప్రగతి పథంలో నడిపించేందుకు, కుదిరితే.. మరోసారి బీజేపీతో చేతులు కలిపేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా గాలికి ఏడేళ్ల జైలు పడడంతో ఆయన జైలుకు వెళ్లక తప్పదు. Also Read – మాక్ డ్రిల్ అన్నారు.. ఇదేందయ్యా ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో గాలి శాసన సభ్యత్వం రద్దు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగా ఆయనపై పెను ప్రభావం చూపించనున్నాయి. ప్రస్తుతం ఒక్క మైనింగ్ కేసు మాత్రమే కాకుండా.. కర్నాటక లోకాయుక్త గతంలోనే నమోదు చేసిన కేసుల్లో పలు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో గత కొన్నాళ్లు పార్టీని కూడా నడిపించలేక.. విరాళాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో రాజకీయాలకు ఇక, గాలి స్వస్తి చెప్పినట్టే అవుతుందని అంటున్నారు. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీలో గాలి జనార్దన్‌రెడ్డి వ్యవస్థాపకుడిగా ఉండగా.. ఆయన మిత్రుడు బి. శ్రీరాములు బీజేపీలో ఉన్నారు. ఆయన ఈ పార్టీని తునాతునకలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ ఉంది. గత ఎన్నికల్లో శ్రీరాములు.. గాలికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నిర్వహించారు. దీంతో బలమైన గాలి మాట వినే నియోజకవర్గాల్లోనూ పార్టీ పుంజుకోలేక పోయింది. ఇక, ఇప్పుడు ఆయన జైలుకు వెళ్తే.. పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని అంటున్నారు. చిత్రం ఏంటంటే.. ఈ పార్టీలో 45 మంది పోటీ చేస్తే.. ఒకే ఒక్క గాలి జనార్దన్‌రెడ్డి మాత్రం గంగావతి నియోజకవర్గం నుంచి 7 వేల మెజారిటీతో అతి కష్టంమీద విజయం దక్కించుకున్నారు. మరి భవిష్యత్తు ఏం కానుందో చూడాలి.
👉👉 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 53 వర్ధంతి సందర్బంగా పలువురు నివాళులు అర్పించారు. సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమం లో డిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
👉9 న ఒంగోలు లో APTF ధర్నా ను విజయవంతం చేయండి*
అన్ని ప్రాథమిక పాఠశాల ల్లో 1 నుండి 5 తరగతులు ఉండే విధంగా మోడల్ ప్రాథమిక పాఠశాలలు లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్స్ మాత్రమే ఉండాలని, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు ను కొనసాగించాలని, సి యస్ పురం మండలం లోని అన్ని యూపీ స్కూల్స్ కొనసాగించాలని, 1 నుండి 5 తరగతులు హై స్కూల్ కు అనుసంధానం చేసే విధానం విరమించుకోవాలనే తదితర డిమాండ్ ల సాధన కోసం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 9 వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమం లో ఉపాధ్యాయులు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని ఏపీటీఎఫ్ సి ఎస్ పురం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తోట శ్రీనివాసులు జె యస్ ఆనంద్ బాబు జిల్లా కార్యదర్శి షేక్ నాయబ్ రసూల్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత కలిగిన అన్ని యూపీ స్కూల్స్ కొనసాగించాలని,ఉన్నత పాఠశాలలో 45 మంది దాటినచోట రెండవ సెక్షన్, ఆపై ప్రతి 35 మందికి అదనపు సెక్షన్లు ఏర్పాటు చేయాలని , ప్రతి ప్రాథమిక పాఠశాల కు 2 sgt పోస్టులు మంజూరు చేయాలని, పెండింగ్ లో ఉన్న 3 DA లు విడుదల చేయాలని, 12 వ PRC ప్రకటన విడుదల చేయాలని, 30% మధ్యంతర భృతి చెల్లించాలని, 11 వ PRC ఆర్థిక బకాయిలు విడుదల చేయాలనీ, సి పి ఎస్ విధానాన్ని రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కావున పై సమస్యల పరిష్కారం కొరకు 09.05.25 ఉదయం 10 గంటలకు ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట APTF ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమం లో ఉపాధ్యాయులు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
👉 కనిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు బుధవారం ధర్నాను చేపట్టారు. సిఐటియు జిల్లా నాయకులు పిసి కేశవరావు మాట్లాడుతూ సమ్మె కాలపు 16 రోజులకు వేతనాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులను ఆప్కాస్ లో కొనసాగించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు వారాంతపు సెలవులను అమలు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20 నుంచి నీరవధిక సమ్మెను చేపట్టడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసఫ్ కు సమ్మె నోటీసును మున్సిపల్ కార్మికులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
👉 పురుగుమందు డబ్బాలతో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన..
మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పురుగుల మందు డబ్బలతో బోడపాడు రైతు కుటుంబం ధర్నా….తమ భూమిని గత వైసిపి ప్రభుత్వం లో వైసీపీ సర్పంచ్ బంధువులు అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారన్న బాధితులు…భూమి విషయం మీద అడుగుతే మా పై దాడి చేశారని ఆందోళన చేస్తున్న బాధితులు…అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న స్పందించడం లేదని బాధితుల ఆవేదన…తమకు న్యాయం జరిగే వరకు సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి పోయేది లేదని పురుగుల ముందు డబ్బాలతో బైఠాయించిన బాధితులు…వాళ్లకు నోటీసులు ఇచ్చి న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చిన తాసిల్దార్ చిరంజీవి…
👉అసంఘటిత కార్మికులకు చట్టాలపై అవగాహన -కనిగిరి:
మేడే వారోత్సవాల్లో భాగంగా బుధవారం కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి బి. రూపశ్రీ ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని పి వి ఆర్ పార్క్ నందు అసంఘటిత కార్మికులకు చట్టాలపై అవగాహన కలిగించారు.కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సయ్యద్ షాహిద్ మాట్లాడుతూ వేతన సవరణ చట్టం, హక్కులు, బాధ్యతల గురించి తెలియజేశారు.జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 15100 కు ఫోన్ చేసి న్యాయ సలహాలను పొందవచ్చునని సూచించారు.రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కార్మిక శాఖ సహకారంతో వివిధ ప్రభుత్వ శాఖలు,గుడ్ హెల్ప్,పారా లీగల్ వాలంటీర్లు, న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికులకు వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.కార్మిక శాఖ అధికారి సుబ్బారాయుడు కార్మిక శాఖలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల గురించి తెలియజేశారు.కార్యక్రమంలో న్యాయవాదుల గుమస్తాల సంఘం అధ్యక్షులు సయ్యద్ యాసిన్,పోలీస్ బాలకృష్ణ, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
👉విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 101 వర్ధంతి సందర్భంగా దర్శి లోని సుందరయ్య భవన్లో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేస్తున్న సిపిఎం నాయకులు కంకణాల ఆంజనేయులు సందు వెంకటేశ్వరరావు తాండవ రంగారావు కె.వి పిచ్చయ్య తదితరులు.
👉విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు సమ్మర్ క్యాంపులు: యుటిఎఫ్. విద్యార్థుల్లో సృజనాత్మకంగా వెలికి తీసేందుకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్ హై అన్నారు. ప్రకాశం బాలోత్సవం ఆధ్వర్యంలో బుధవారం పొదిలిలోని పి.ఎన్.ఆర్. కాలనీ నందు వేసవి వినోద ప్రారంభ కార్యక్రమం వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పొదిలి జెవివి జిల్లా కార్యదర్శి బి దేవప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం బాలోత్సవం ప్రధాన కార్యదర్శి కే .సుబ్రహ్మణ్యం మరియు యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే. అబ్దుల్ హై హాజరైనారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ మరియు టీవీలకు బానిసలు కాకుండా, వినూత్నంగా ఆలోచించేటట్లు చేయటానికి మరియు వారిలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయటానికి ఈ వేసవినోద కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం వారం రోజులు పాటు నిర్వహించబడుతుందన్నారు. ఆసక్తి కలిగిన 4వ తరగతి నుంచి10 వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ క్యాంపులో కథలు, పాటలు, పద్యాలు, సైన్స్ ప్రయోగాలు, మ్యాజిక్ అంశాలు, డ్యాన్స్ , డ్రాయింగ్, ఓరిగామి మొదలైన అంశాల గురించి నేర్పించడం జరుగుతుందన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి బాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు మీకు ఇష్టమైన అంశాలను ఎంపిక చేసుకుని వాటిలో పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి డివిజన్ యుటిఎఫ్ నాయకులు పి.వెంకటేశ్వర్లు, నాజర్ అహ్మద్ ,గోనె శీను, సంజీవరావు, కె.వెంకటేశ్వర్లు, మరియు 40 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. మొదటి రోజు విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు చేసే విధానం గురించి వివరించి పిల్లలచే చేయించడం జరిగింది. ఆసక్తికరమైన కథలను చెప్పడం జరిగింది.

