👉పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్!😱😱😱
భారత్- పాక్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చు అంటున్న తరుణంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ మిస్సింగ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓవైపు భారత్ దూకుడు ప్రదర్శిస్తుంటే.. ఆసిమ్ మున్నీర్ మాత్రం ప్రజల ముందుకు రావట్లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబంతో సహా విదేశాలకు పారిపోయి ఉంటారని కొందరు, యుద్ధ భయంతో బంకర్లో దాక్కుని ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
👉రూ.2.46 కోట్లు కాజేసిన కేటుగాళ్లు – భరతం పట్టిన పోలీసులు*
సైబర్ కేటుగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా మోసపోతున్నవారు పెరుగుతూనే ఉన్నారు.వీటిపై కేసులు నమోదు అవుతున్నా, గుర్తించడం అనేది అరుదుగా జరుగుతుంది.అయితే నెల్లూరు పోలీసులు ఇలాంటి కేటుగాళ్ల భరతంపట్టారు.
2.46 కోట్ల రూపాయల నగదు కాజేసిన సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు.
ఈ కేటుగాళ్ల బారి నుంచి బాధితులను కాపాడారు. నిందితుల నుంచి 2 లక్షల నగదు, 50 మొబైల్స్, 57 ఏటీఎం కార్డులు, ల్యాప్‌టాప్, ప్రింటర్, 1 వైఫై రూటర్, 1 కార్డ్ కటింగ్ మెషిన్, 1 లామినేషన్ మెషిన్, పాస్‌బుక్‌లు, సిమ్ కార్డులు, డైరీలు, ఆధార్ కార్డులు, తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.నెల్లూరు జిల్లా పోలీసులు పక్కా ప్రణాళికతో సైబర్ కేసును చేధించారు.
రాజస్థాన్‌కి చెందిన ఐదుగురు, హైదరాబాద్‌కి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. రాజాస్థాన్కు చెందిన గంగారామ్, హెమంత్ కుమార్, కైలాష్, నగారామ్, రమారామ్, హైదరాబాద్‌కి చెందిన రామిశెట్టి వీరేశ్వరరావు, రవిని అరెస్ట్ చేశారు. మరి కొందరి కోసం గాలిస్తున్నారు. వారి బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 39 లక్షల నగదును ఫ్రీజ్ చేయాలని బ్యాంకు అధికారులకు సూచన చేశారు. వీరు నకిలీ ఐడీలతో 236 బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో అదనపు ఆదాయం ఆశచూపి మోసాలు చేశారు. ట్రేడింగ్ చేసే వారిని లక్ష్యంగా చేసుకుని మోసం చేశారు.
ఆన్లైన్లో నగదు పెడితే 10 నుంచి 15% ఆదాయం సంపాదించవచ్చంటూ కొత్త పంథాలో నేరాలకు పాల్పడ్డారు. జల్సాలకు అలవాటుపడి నగదు కోసం ముఠాగా ఏర్పడి సైబర్ నేరానికి పాల్పడుతున్న ముద్దాయిలందరూ యువకులేనని నెల్లూరు చిన్నబజార్ పోలీసులు తెలిపారు. బయోమెట్రిక్ ధ్రువీకరణ అవసరం లేని రోడ్‌సైడ్ సేల్ పాయింట్ల నుంచి సిమ్ కార్డులను పొందుతారు. తద్వారా అకౌంట్‌కు సిమ్ కార్డును లింక్ చేశారు.
ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే నిర్బయంగా వచ్చి పోలీసు వారిని ఆశ్రయించాలని, ఆందోళన చెందకుండా సకాలంలో స్పందిస్తే పూర్తి న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. మోసం జరిగిన వెంటనే http://cybercrime.gov.in కు లేదా 1930 లేదా దగ్గరలోని పోలీస్ వారికి పిర్యాదు చేయాలని కోరారు.
*మహబూబాబాద్ టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ కు రివార్డు…*డీజీపీ చేతులు మీదుగా రివార్డు అందుకున్న పెండ్యాల దేవేందర్*
వరంగల్ టాస్క్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహించిన సీఐ పెండ్యాల దేవేందర్ కు మాదకద్రవ్యాలు నిర్మూలన లో భాగంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా రివార్డు ….ఈ సందర్భంగా సిఐ పెండ్యాల దేవేందర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు నిర్మూలనలో భాగంగా నాకు అవార్డు రావడం అవార్డుని తెలంగాణ రాష్ట్ర డిజిపి చేతుల మీద నుంచి అందుకోవటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.అలాగే యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి వారి భవిష్యత్తుకు బాటలు వేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఈ సందర్భంగా సిఐ పెండ్యాల దేవేందర్ యువతకు సందేశం ఇచ్చారు. సి ఐ పెండ్యాల దేవేందర్ మాదకద్రవ్యాల నిర్మూలన రివార్డు అందుకున్నందుకు పలువురు ఉన్నత అధికారులు శుభాకాంక్షలు తెలిపారు…
👉 గిద్దలూరు లోని సబ్ జైల్ ను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఏ.ఓంకార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలను ఉంచే రూములను , అందులోని సదుపాయాలను పరిశీలించారు . సరుకుల నాణ్యతను పరిశీలించి , అందుచున్న సదుపాయాలను విచారణలో ఉన్న ఖైదీలతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. వారిపై ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంతంగా న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని వారికి ,వారి కేసును వాదించడానికి ఉచితంగా న్యాయవాదిని , న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పొందవచ్చునన్నారు. అందుకు ఆర్జి పెట్టుకోవాలన్నారు .వారికి అరెస్టు ,బెయిల్ ,ఉచిత న్యాయ సహాయం గురించి తెలియజేశారు .తప్పులు చేస్తే అవి నేరాలు అవుతాయని, ఆవేశం అనర్ధదాయకమని, తరువాత పశ్చాత్తాప పడితే ప్రయోజనం ఉండదన్నారు. చట్ట ప్రకారం శిక్షకు అర్హులు అవుతారన్నారు .ఈ కార్యక్రమంలో సబ్ జైల్ సూపరిండెంట్ యు .లింగారెడ్డి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ sk.ఫాజిల్ , పారా లీగల్ వాలంటీర్ అద్దంకి. మధుసూధనరావు , సబ్ జైలు సిబ్బంది మరియు విచారణలో ఉన్న ఖైదీలు పాల్గొన్నారు.
*ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య – టిప్పర్ లారీతో ఢీకొట్టి, కత్తులతో దాడి*.. అనంతపురం జిల్లా..ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. గుంతకల్ నుంచి చిప్పగిరి గ్రామానికి వెళ్తుండగా గుంతకల్లు రైల్వే వంతెన వద్ద వారు ప్రయాణిస్తున్న ఇనోవా వాహనాన్ని టిప్పర్ లారీతో ఢీకొట్టి ఆ తర్వాత లక్ష్మీనారాయణపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో 8 నుంచి 9 మంది పాల్గొన్నట్లు ఆయన కుమారుడు వినోద్ గోవిందు తెలిపారు. ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీనారాయణను గుంతకల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
*పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామ సమీపంలో టైర్ పేలి స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తాపడ్డ లారీ.. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు, క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు…

