👉బాలయ్యకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. టీడీపీకి కంచుకోటగా మారిన నియోజకవర్గం అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. హిందూపురంలో రోడ్ల విస్తరణ, తాగునీటి వ్యవస్థ ఏర్పాటు అలాగే ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.92.50 కోట్ల విడుదలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో నిధుల విడుదలతో నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నారు.
👉ఏపీలో ఉగ్రదాడి టెన్షన్.. వారిపై కఠిన చర్యలు: డీజీపీ.. ఆంధ్రప్రదేశ్ : పహల్గామ్ దాడిలో 26 మంది భారతీయులు చనిపోయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. కేంద్ర నిఘా సంస్థల పేరుతో కొందరు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను హైఅలర్ట్ జోన్స్ తో ప్రకటించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ప్రకటనలేవీ చేయలేదని పేర్కొన్నారు
👉సీబీఐ పేరుతో బెదిరింపులు – డబ్బు ఇవ్వకుంటే కుమారులను చంపేస్తామని వీడియోకాల్ – భయపడి ఆన్‌లైన్ ద్వారా నగదును బదిలీ చేసిన బాధితురాలు*
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. కొత్తపేటలో ఓ విశ్రాంత ఉద్యోగినిని బెదిరించి ఆమె నుంచి భారీ మొత్తంలో డబ్బు కాజేశారు. బాధితురాలు రూ.30 లక్షల నగదును బ్యాంకులో జమ చేయడాన్ని కేటుగాళ్లు గమనించారు. ఆ తర్వాత ఆమె వివరాలు తీసుకొని సీబీఐ అధికారులమంటూ ఫోన్ చేశారు. డబ్బు ఇవ్వకుంటే కుమారులను చంపేస్తామని వీడియోకాల్ చేసి బెదిరించారు. దీంతో భయపడిన ఆమె ఆన్‌లైన్ ద్వారా నగదును బదిలీ చేశారు. ఆ తర్వాత అది మోసమని గ్రహించిన బాధితురాలు కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
👉ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరి రామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు..హైదరాబాద్:ఏప్రిల్ 26
కాలేశ్వరం ఈఎన్సీ హరీ రామ్ ఇంట్లో ఏసీబీ సోదా లు చేపట్టింది హైదరాబాద్ నగరంలోని షేక్ పేట ఆదిత్య టవర్స్ లోని ఆయన నివాసంలో ఈరోజు తెల్లవారుజాము నుండి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ విచా రణ తుది దశకు చేరుకున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ప్రస్తుతం ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు.కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యహరించారు. హరిరామ్ భార్య అనిత కూడా నీటి పారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్‌సీగా ఉన్న ఆమె ప్రస్తుతం వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తుల ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. గజ్వేల్‌లో 30 ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లుగా అధికారులు పేల్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై గతేడాది సెప్టెంబర్ 27న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్న హరిరామ్‌ను విచారించిం ది. ఈ మేరకు జస్టిస్ పీసీ చంద్రఘోష్,ఆయనకు 90కి పైగా ప్రశ్నలను సంధించారు. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణ బిల్లుల చెల్లింపు లకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై సైతం కమిషన్ ఆరా తీసింది. కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు రూ.29,737 కోట్లు వరకు తిరిగి చెల్లించినట్లుగా ఆయన విచారణలో తెలిపారు.
👉ముగ్గురు ఉగ్రవాదుల ఇల్లులు కూల్చివేత
భారత్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదులపై పంజా విసురుతోంది. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లను భారత్ ఆర్మీ కూల్చివేసింది. ఈ విషయాన్ని అధికారులు శనివారం ప్రకటించారు. కాగా ఈ ఇల్లులు పుల్వామాలోని ఎసాన్ ఉల్ హక్, షోపియాన్‌లోని షబీర్ అహ్మద్ కుట్టే, కుల్గాంలోని జకీర్ గని ఇళ్లు అని తెలిపారు. అయితే శుక్రవారం ఉదయం ఆసిఫ్ షేక్, అదిల్ మహమ్మద్ ఇళ్లను కూల్చిన సంగతి తెలిసిందే.
👉 పహల్గాం ఘటనపై అంతర్జాతీయ విచారణ జరపాలంటున్న పాక్!
పహల్గాం ఘటనపై అంతర్జాతీయ విచారణ జరపాలంటున్న పాక్!
పహల్గాం ఉగ్రదాడికి తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించిన పాకిస్థాన్, ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరిపించాలని భావిస్తోంది. భారత్, ఈ దాడికి పాకిస్థాన్ మద్దతుదారులే కారణమని ఆరోపించిన నేపథ్యంలో, తమ నిర్దోషిత్వాన్ని రుజువు చేసేందుకు పాక్ ఈ దిశగా అడుగులు వేస్తోందని పాకిస్తాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్థాన్‌ని వదిలిపెట్టమని తేల్చి చెప్పింది.
👉పాకిస్థాన్కు షాక్, 10 మంది సైనికులు హతం😲
భారత్తో యుద్ధం తప్పదన్న వేళ పాకిస్థాన్కు షాక్ తగిలింది. నిన్న ఆ దేశంలోని క్వెట్టాలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) జరిపిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు మృతి చెందారు. మార్గట్ ఏరియాలో రోడ్డు పక్కన బాంబు పెట్టి, రిమోట్ కంట్రోల్తో పేల్చేశారు. ఆ దాడి వీడియోను BLA విడుదల చేసింది. కాగా మార్చిలో BLA జరిపిన దాడుల్లో 60 మంది హతమైన సంగతి తెలిసిందే. పాక్ నుంచి స్వాతంత్ర్యం కోసం BLA పోరాడుతోంది.
👉మీ మౌనం దేనికి సంకేతం.. రాహుల్‌కు కవిత సూటి ప్రశ్న.. హైదరాబాద్, ఏప్రిల్ 26: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పర్యటనకు సంబంధించి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కవిత పలు ప్రశ్నలు సంధించారు. దారి తప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం అంటూ ఎమ్మెల్సీ ఎద్దేవా చేశారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారంటూ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ పర్యటనలో లాఠీ దెబ్బలు తిన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను రాహుల్ గాంధీ పరామర్శించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల పాలనలో ప్రజలను రాచిరంపాన పెట్టిందంటూ వ్యాఖ్యలు చేశారు. హైడ్రా, మూసీ పేరుతో ప్రజల మీదికి బుల్డోజర్లు పంపిందని.. లగచర్ల బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఒడిగట్టిందంటూ ఫైర్ అయ్యారు. సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని బంజారా యువతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగించిన ఈ రాక్షసకాండను జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్దారించిందని తెలిపారు. కరెంట్ పోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు.. వేధింపులు.. బెదిరింపులకు గురిచేశారన్నారు. పచ్చని అడవిని సర్వనాశనం చేస్తున్నారని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగితే వారిపై లాఠీల మోతలు, అక్రమ కేసులు, అరెస్టులతో ఇబ్బందులకు గురిచేశారన్నారు. తెలంగాణ ప్రజలు సోనియాగాంధీని, ప్రియాంకా గాంధీని, రాహుల్ గాంధీని నమ్మి అధికారమిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తీవ్ర నిర్బంధం, అణచివేతను బహుమతిగా ఇచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు.
బీహార్‌లో గ్రూప్ -1 బాధితుల గోడు వినాలని వారి పక్షాన గళమెత్తిన మీరు.. తెలంగాణలో గ్రూప్ -1 అభ్యర్థుల ఆందోళనలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీల పరిస్థితి ఏమిటని నిలదీశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని సగానికే పరిమితం చేశారని అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతుబంధు పథకానికి తూట్లు పొడిచి ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారని… అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీయరెందుకని ప్రశ్నించారు. ‘కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైంది? మహిళలకు నెలకు రూ.2500 ఏమయ్యాయి? 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారు ? ఆరు గ్యారంటీలు, 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారు? ఎర్ర బుక్కు పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవ హక్కులను మంటకలుపుతూ.. దమనకాండ కొనసాగిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు.. ? మీ మౌనం దేనికి సంకేతం?’ అంటూ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు..
👉చెల్లి అని పిలిచి పక్కింటి వివాహితపై అత్యాచారయత్నం😱😱😱
ప్రతిఘటించడంతో కొడవలితో నరికి వివాహితను హత్య.. భయంతో తానూ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో రేఖ అనే వివాహితను నరికి చంపి, ఆత్మహత్య చేసుకున్న ఉల్లి శ్రీకాంత్..రేఖ ఒంటిపై పంటి గాట్లు.. రేఖ భర్త ఉద్యోగ నిమిత్తం దుబాయ్ లో ఉండగా.. ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ ఇంట్లోకి వెళ్లిన రేఖ..శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్లడంతో, రేఖపై అఘాయిత్యానికి పాల్పడిన శ్రీకాంత్..చెల్లి అని పిలిచే శ్రీకాంత్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్తత..పోస్ట్ మార్టం నిమిత్తం రెండు మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
👉దాతల పేరుతో టీటీడీపై సంపన్నుల పెత్తనం.. విఐపి అతిధి భవనాలకు దేవుడి పేర్లు మాత్రమే ఉండాలన్న సీఎం ఆదేశాలు బేఖాతర్..బోర్డు తీర్మానించినా.. పట్టించుకోని అధికారులు..నోటీసులు ఇచ్చి నెలల తరబడి వేడుక చూస్తున్న వైనం..సొత్తు టీటీడీది.. సోకు ప్రైవేటు వారిది..
తిరుమల కొండపై విఐపి లు బస చేసే ప్రత్యేక సౌకర్యాలు ఉన్న అతిధి భవనాలు అన్నింటికీ ఖచ్చితంగా దేవుడు పేర్లు మాత్రమే ఉండాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినప్పటికీ టిటిడి అధికారులు మాత్రం ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదట్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం సమీక్ష సమావేశంలో ఈ అంశాన్ని స్పష్టంగా చెప్పారు. కొండపై విఐపి లు బస్ చేసే పద్మావతి అతిథి గృహాల ప్రాంతం మొత్తం దాదాపు 56 అతిథి గృహాలు నిర్మించబడి ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న అధునాతనమైన భవనాలను మరిపించేలా అలరారుతుంటాయి. వీటన్నింటినీ ఆధునీకరణ పేరుతో పారిశ్రామికవేత్తలకు దాతలుగా టీటీడీ అవకాశం కల్పిస్తూ కొన్ని ప్రత్యేక సౌకర్యాలను వాళ్లకి కల్పించారు. అయితే ఈ సౌకర్యాల పేరుతో దాతలు టిటిడి పై పెత్తనం చెలాయించేలా అధికారాన్ని ప్రదర్శిస్తున్నారు. టీటీడీ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. అతిథి గృహాల నిర్వహణ పేరుతో ప్రైవేటు పిఆర్ఓ లను ఏర్పాటు చేసుకొని టీటీడీకి సమాంతర వ్యవస్థను నడుపుతున్నారు. అతిథి గృహాల కేటాయింపులు వాటిపై సర్వహక్కులు టీటీడీకి ఉన్నప్పటికీ దాతలు వాటి నిర్వహణను పరోక్షంగా తమ చేతుల్లోకి తీసుకొని కొండపై ఈ అతిధి భవనాలను తమ సొంత ఆస్తులుగా భావించుకుంటూ అధికార దర్భాన్ని ప్రదర్శిస్తున్నారు. కొండపై ప్రతి అణువణువు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినది మాత్రమే. ఈ విఐపి అతిథి భవనాలను ఆధునీకరణ పేరుతో కొన్నేళ్లపాటు ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది. పలుకుబడి పైరవీలు ఉన్నత స్థాయిలో ఒత్తిడిల ద్వారా ఈ అతిధి భవనాల ఆధునీకరణ పనులు చేజిక్కించుకున్న అనంతరం పారిశ్రామికవేత్తలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పాత భవనాల స్థానంలో నూతనంగా ఆధునీకరిస్తున్నారు. టీటీడీ నిబంధనలకు అతిక్రమించి అదనపు స్థలాన్ని ఆక్రమించి కూడా నిర్మాణాలు చేపట్టారు. ఇందుకుగాను దాతలకు ఏడాదిలో కొద్ది రోజులు వసతి సౌకర్యం కల్పించడం, అలాగే నిర్మించిన భవనంలో ఒక గదిని దాత తమకోసం ఉంచుకోవడం లాంటి కొన్ని మినహాయింపులు కల్పించారు. సరిగ్గా ఈ అంశాలనే తమకు అనుకూలంగా మార్చుకుంటున్న దాతలు ఈ అతిధి భవనాలన్నింటికీ పవిత్రమైన తిరుమలలో దేవుడు పేర్లు కాకుండా తమ కుటుంబ సభ్యుల పేర్లు, తమ సంస్థల పేర్లు పెట్టుకుని ఈ సొత్తు అంతా తమదే అన్నట్లుగా అర్థం వచ్చేలా అధికారాన్ని చలాయిస్తున్నారు. తిరుమల వెంకన్నకు వారి భక్తుల సౌకర్యాల కోసం తాము దాతలుగా సహాయపడుతున్నామనే సూక్ష్మాన్ని వారు విస్మరిస్తున్నారు.
ఈ పరిస్థితిని మార్పు చేసేందుకు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా టిటిడిని ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు ఈ అతిధి భవనాల పేర్లు మార్చకపోవడం పట్ల పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుడి పేర్లు కాకుండా ఇతరత్రా పేర్లు ఉన్న అతిథి భవనాల దాతలకు టిటిడి పాలకమండలిలో ఒక తీర్మానం చేసి వారందరికీ పేర్లు దేవుడు పేర్లు మాత్రమే మార్చుకోవాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. గత అక్టోబర్లో ఈ నోటీసులు జారీచేసిన టిటిడి అధికారులు అటు తరువాత దాన్ని పట్టించుకోవడం మానేశారు. మళ్లీ ఇటీవల ఇదే అంశం తెర మీదకు వచ్చి తాజాగా నెల రోజుల క్రితం రెండవసారి ఇదే అంశంపై నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ పారిశ్రామికవేత్తలు ఎవరు టీటీడీ నోటీసులకు స్పందించే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఇక తప్పని పరిస్థితుల్లో టి. ఎస్.ఆర్. ఇందిరా గెస్ట్ హౌస్, రాజేంద్రప్రసాదం, రచన టెలివిజన్, ఊట్ల, వికాస్, సుధా కృష్ణ, తదితర 26 విఐపి గెస్ట్ హౌస్ కు టిటిడి స్వయంగా దేవుడు పేర్లు వచ్చేలా 150 పేర్లను సూచించింది.ఈ నెలాఖరులోగా దాతలు స్పందించకుంటే తామే స్వయంగా అతిధి భవనాలకు ఉన్న సంస్థలు వ్యక్తుల నేమ్ బోర్డులు తొలగించి, దేవుడు పేర్లతో ఉన్న నేమ్ బోర్డులను ఏర్పాటు చేయాలని టిటిడి యాజమాన్యం భావిస్తోంది. ఇప్పటికే అధికారులు సమీక్ష జరిపి దీనిపై ఒక నిర్ణయానికి రావడం జరిగింది.
*విరాళం ఇవ్వకుండానే రచన టెలివిజన్ సంస్థ టిటిడి కి దాత గా ఎలా అయ్యారో..!?
ఈ అతిధి భవనాల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి ఆదేశాలతో పరిశీలిస్తున్న టిటిడి అధికారులకు ఆశ్చర్యకరమైన వ్యవహారాన్ని కనుగొన్నారు. అసలు విరాళం ఇవ్వకుండానే రచన టెలివిజన్ పేరుతో మీడియా సంస్థ కొండపై విఐపి అతిథి భవనాల ప్రాంతంలో ఒక గెస్ట్ హౌస్ ఆధునికరణ పనులను దక్కించుకుంది. 2018లో ఐదు కోట్ల విరాళం ఇస్తామని చెప్పి అతిధి భవనం నిర్మాణ పనులను దాత హోదాలో దక్కించుకున్న ఈ సంస్థ నింపాదిగా 2022లో అతిథి భవనం నిర్మాణ పనులను పూర్తి చేసింది. అయితే ఐదు కోట్లు కాదు కదా కనీసం ఐదు లక్షలు కూడా చెల్లించకుండానే ఈ నిర్మాణం అతిధి భవనాన్ని స్వాధీనం చేసుకుంది. దాతలకు కల్పిస్తున్న సౌకర్యాలలో కూడా తమకు మినహాయింపు కావాలని శ్రీవారి దర్శనం తదితర ప్రివిలేజ్ తమకు అవసరం లేదని పేర్కొంటూ గత ప్రభుత్వ హయాంలో అదే అతిధి భవనంలో టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా కింది ఫ్లోర్ మొత్తం తమ ఆధీనంలో ఉంచేసుకుంది. పొందినప్పటి నిబంధనలు కాకుండా గత ప్రభుత్వ హయాంలో అసలు ఏమాత్రం డబ్బులు చెల్లించకుండానే తోలుతగా చెప్పిన నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ఉచితంగానే టీటీడీకి ఏమాత్రం డొనేషన్ ఇవ్వకుండా… అతిధి భవనం నిర్మాణం మాత్రమే చేపట్టింది. దీన్ని అప్పటి కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి అధికారికంగా పాలకమండలిలో తీర్మానం చేసి మరీ ఆమోదింప చేశారు. ఈ అతిధి భవనం కూడా దేవుడి పేరు కాకుండా ఇప్పటికీ రచన టెలివిజన్ అనే సంస్థ పేరుతో కొనసాగుతుండడం గమనార్హం.
👉తెలంగాణలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు*
హైదరాబాద్: తెలంగాణలో ఏసీబీ అధికారులు ఇవాళ(శనివారం) ఏకకాలంలో రైడ్స్ చేయడం సంచలనంగా మారింది. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరీరామ్‌కు చెందిన హైదరాబాద్‌లోని నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎన్టీఎస్‌ఏ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఏక కాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం డిజైన్‌లో హరీరామ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హారీరామ్ విచారణకు హాజరయ్యారు. కాగా.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లోపాలు ఉన్నాయని ఎన్టీఎస్ఏ రిపోర్టులో వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌లో అనేక లోటుపాట్లు ఉన్నాయని రిపోర్టులో పేర్కొంది. ఈ రిపోర్టు ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహారించిన అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు ఖండిస్తునే ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న(శుక్రవారం) మీడియాలో ఈ ప్రాజెక్ట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్‌లో అవినీతి చేసిన వారిని వదలబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈక్రమంలో ఏసీబీ అధికారుల సోదాలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి..
👉తెలంగాణలో బయటపడ్డ అతి పెద్ద కుంభకోణం..చట్టవిరుద్ధంగా భూదాన్ భూములు కొన్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పలువురు ఉన్నతాధికారులు..పేదల కోసం కేటాయించిన భూదాన్ భూములను కొనుగోలు చేసి తమ పేర్ల పైకి, తమ కుటుంబ సభ్యుల పేర్ల పైకి మార్చుకున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పలువురు ఉన్నతాధికారులు.. భూదాన్ భూముల వ్యవహారంలో ఉన్నతాధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..భూదాన్ భూముల వ్యవహారంపై ఈడీ, సీబీఐల దర్యాప్తు చేయాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు..మేడ్చల్ జిల్లా నాగారంలోని సర్వే నెంబర్లు 181,182,194,195 లోని భూదాన్ బోర్డుకు చెందిన భూములను కొనుగోలు చేసిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పలువురు ఉన్నతాధికారులు..పేదలకు సాగు నిమిత్తం, ఇళ్ల నిర్మాణాల కోసం కేటాయించిన భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పలువురు ఉన్నతాధికారులు..భూములు కొనుగోలు చేసిన అధికారుల పూర్తి జాబితా
1) బత్తుల హేమలత (C/o బత్తుల శివధర్ రెడ్డి IPS-20 గుంటలు)
2) ప్రియాంక రతన్ (C/o దివంగత రాజీవ్ రతన్ IPS-16 గుంటలు)
3) రవి గుప్త (IPS-16 గుంటలు)
4) ముదిరెడ్డి నితీష్ రెడ్డి (S/o మహేందర్ రెడ్డి IPS-20 గుంటలు)
5) తాటిపర్తి పావని రావు (C/o T. ప్రభాకర్ రావు IPS-16 గుంటలు)
6) రేఖ షరాఫ్ (C/o ఉమేష్ షరాఫ్ IPS-16 గుంటలు)
7) రాజర్షి సాహా (IPS-8 గుంటలు)
8) స్వాతి లక్రా (IPS-16 గుంటలు)
9) మిట్టీ సతితి సుహానా (C/o మిట్టీ శ్రీనిబసు-8 గుంటలు)
10) నందిని మాన్ (C/o విక్రమ్ సింగ్ మాన్ IPS-8 గుంటలు)
11) డాక్టర్ జ్ఞాన్ ముద్ర (C/o సోమేష్ కుమార్ IAS-20 గుంటలు)
12) బి.కె. రాహుల్ హెగ్డే (స్వయం-8 గుంటలు)
13) సవ్యసాచి ప్రతాప్ సింగ్ (C/o గోవింద్ సింగ్-8 గుంటలు)
14) జి. ఓం అనిరుధ్ (C/o సుధీర్ బాబు IPS-నాట్ స్పెసిఫైడ్)
15) ఇందు రావు కావేటి (C/o లక్ష్మీనారాయణ రావు కావేటి-16 గుంటలు)
16) న్యాలకొండ సింధు రెడ్డి (C/o న్యాలకొండ ప్రకాష్ రెడ్డి-20 గుంటలు)
17) ఐశ్వర్య రాజ్(C/o వికాస్ రాజ్-20 గుంటలు)
18) వెన్నవెల్లి రాధిక(C/o కమలాసన్ రెడ్డి-16 గుంటలు)
19) రీతా సుల్తానా (C/o సందీప్ కుమార్ సుల్తానా-20 గుంటలు)
20) వసుంధర సిన్హా (C/o అంజనీ కుమార్-20 గుంటలు)
21) ముత్యాల వినీల (C/o స్టీఫెన్ రవీంద్ర IPS-8 గుంటలు)
22) అజిత్ కుమార్ మొహంతి (C/o ఖేస్త్రబాసి మొహంతి-20 గుంటలు)
23) నవీన్ మిట్టల్ (సెల్ఫ్-20 గుంటలు)
24) సౌమ్య మిశ్రా (సెల్ఫ్-16 గుంటలు)
25) రాహుల్ బుసి రెడ్డి (S/o బి. జనార్దన్ రెడ్డి IAS-16 గుంటలు)
26) తరుణ్ జోషి(సెల్ఫ్ IPS-16 గుంటలు)
27) పీర్ల వరుణ్ (పీర్ల విశ్వ ప్రసాద్-16 గుంటలు)
28) తోట శ్రీనివాసరావు (S/o తోట సాయిబాబా IPS-నాట్ స్పెసిఫైడ్)
29) కొండూరు శ్రీనాథరాజు (S/o కొండూరు సత్యనారాయణ-20 గుంటలు)
30) మహేష్ భగవత్ (సెల్ఫ్-16 గుంటలు)
31) రేణు గోయల్ (కమాండర్ జితేందర్ కుమార్ గోయల్-20 గుంటలు)
32) అజయ్ జైన్ (సెల్ఫ్-20 గుంటలు)
33) అమిత కుమార్ (C/o అనిల్ కుమార్-20 గుంటలు)
👉పాకిస్తాన్ జెండాను కాల్చివేసిన ముస్లింలు..ధర్మపురిలో ముస్లిం కమ్యూనిటీ సదర్ అంజద్ నేతృత్వంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసిన ర్యాలీలో పాకిస్తాన్ కు చెందిన జెండాను కాల్చివేసిన ముస్లిం నేతలు..
*💥సైదాపురం ఉక్కు మహిళ రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్ పర్సన్ పొట్టేళ్ల శిరీష..అక్రమ మైనింగ్ పై నిరంతర పోరాటం..👉నెల్లూరు జిల్లా…సైదాపురం మండలం..
*💥సైదాపురం మండలం లో లీజులు ముగిసిన మైన్ లలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని పిర్యాదు చేయడానికి వస్తే మైనింగ్ DD బాలాజీ నాయక్ ఎదురు దాడి చేస్తున్నారు.💥*
*👉సైదాపురం మండలంలోనీ శోభారాణి మైన్ సిద్ధి వినాయక మైన్,జయలక్ష్మి మైన్ ల లీజులు ముగిసిపోయాయి,GNT(గ్రీన్ ట్రిబ్యునల్)లో కేసులు నడుస్తున్నాయి,GNT సూచనలతో పొల్యూషన్ బోర్డు వారు ఇటీవలే తనిఖీలు చేశారు అయినా పేలుడు పదార్థాలు ఉపయోగించి మైనింగ్ చేస్తున్న మాఫియా మైనింగ్ DD కి కనిపించడం లేదు…*
*👉సిద్దివినాయక్ మైన్ లో అక్రమ బ్లాస్టింగ్ లు,జెలటిన్ స్టిక్స్ లు తో పేలుళ్ళు*
*👉లీజులు ముగిసిన మైన్లో 12 – 1 GG రూల్ ప్రకారం స్టాక్ వున్న మెటీరియల్ తరలించుకోవచ్చు అని మైనింగ్ డిడి అనుమతులు ఇవ్వడం చట్ట రీత్యా నేరం,ఆ అనుమతులు ముసుగులో అక్రమ మైనింగ్ చేస్తూ,బ్లాస్టింగ్ లు చేస్తున్న మైనింగ్ మాఫియా*
*👉బాలాజీ నాయక్ AD గా వున్నప్పుడు శోభారాణి మైన్ కు 32 కోట్లకు డిమాండ్ నోటీసులు ఇచ్చి ఉన్నారని అప్పుడు స్టాక్ 32వేల మెట్రిక్ టన్నులు ఉందని కానీ బాలాజీ నాయక్ DD గా వచ్చాక 1 లక్షా 26 వేల మెట్రిక్ టన్నుల నిల్వ ఉందని చూపిస్తున్నారని ఇక్కడే బాలాజీ నాయక్ తీరు తెలుస్తుంది*
*👉మైనింగ్ మాఫియా అక్రమ మైన్ లలో నిషేధిత పేలుడు పదార్థాలు,జలిటన్ స్టిక్స్ తో పేలుళ్ళు,వణికిపోతున్న సమీప గ్రామాలు,ప్రాణాలు పోగొట్టుకుంటున్న మూగజీవులు*
*👉జిల్లా కలెక్టర్ సూచన మేరకు అక్రమ మైనింగ్ పై పిర్యాదు చేసేందుకు మైనింగ్ DD కార్యాలయానికి వెళితే బాలాజీ నాయక్ అడ్డగోలు వాదనలు*
*👉తన పేరు ఎందుకు సంబోధిస్తారు అంటూ చిందులు, మైనింగ్ DD బాలాజీ నాయక్ ను బాలాజీ నాయక్ అని పిలవక ఇంక వేరే పేరుతో ఏమన్నా పిలవాల?*
*👉బాధ్యతగల డిప్యూటీ డైరెక్టర్ హోదా లో ఉండి పిర్యాదు చేసేందుకు మహిళ వస్తే బ్లాస్టింగ్ లతో తనకు సంబంధం లేదు,అక్రమ మైనింగ్ తో తనకు సంబంధం లేదు అంటూ సమాధానం చెప్పడం పిర్యాదు దారులపై ఎదురు దాడి చేయడం బాలాజీ నాయక్ తీరుకు నిదర్శనం ..👉కోట్ల రూపాయలు ముడుపులు తీసుకునే మాఫియాకు వత్తాసు..*👉ప్రజా సమస్యలతో మైనింగ్ డిడి బాలాజీ నాయక్ కు సంబంధం లేదు,అక్రమ మైనింగ్ మాఫియాతో నే సంబంధం*.. *👉కోట్ల రూపాయలు దోచుకుంటున్న అవినీతి అధికారిని ఏమని పిలవాలి*
ఈరోజు సైదాపురం మండలానికి చెందిన రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీష సైదాపురం మండలంలో లీజులు ముగిసిన మైన్ లలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై, నిషేధిత పేలుడు పదార్థాలతో పేలుళ్లు జరపడంపై జిల్లా మైనింగ్ డిడి బాలాజీ నాయక్ కు ఫిర్యాదు చేశారు, ఈ సందర్భంగా బాలాజీ నాయక్ అడ్డగోలు సమాధానాలు అనవసర ఎదురుదాడితో ఫిర్యాదుదారులపై చిందులు వేయడం గమనార్హం…
రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్ పర్సన్ పొట్టేలు శిరీష మీడియాతో మాట్లాడుతూ సైదాపురం మండలంలోని శోభారాణి మైన్, జయలక్ష్మి మైన్, సిద్ధి వినాయక మైన్ లు లీజులు ముగిసి చాలా కాలమైందని వీటి పైన గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు నడుస్తున్నాయని గ్రీన్ ట్రిబ్యునల్ సూచన మేరకు ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా ఈ మైన్ లలో తనిఖీలు చేసి వెళ్ళారని అయినా కూడా కొందరు ఈ మైన్ లలో జెలటిన్ స్టిక్స్ ఉపయోగించి బ్లాస్టింగ్ లు చేస్తూ మైనింగ్ కొనసాగిస్తున్నారని నిషేధిత జలటిన్ స్టిక్స్ తో బ్లాస్టింగ్ లు చేస్తున్నారని ఈ బ్లాస్టింగ్ ల వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రాణభయంతో వణికి పోతున్నారని మూగ జీవాలు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి అని ఈ విషయాలు జిల్లా కలెక్టర్ తెలుపుగా మైనింగ్ డిడి కి ఫిర్యాదు చేయాలని సూచించారని కలెక్టర్ సూచన మేరకు మైనింగ్ డిడి బాలాజీ నాయక్ ను కలిసేందుకు వచ్చామని కానీ మైనింగ్ డిడి బాలాజీ నాయక్ తన పేరు ఎందుకు వాడుతున్నారని ఎదురు దాడి చేస్తున్నారనీ డిడి బాలాజీ నాయక్ ను బాలాజీ నాయక్ అని పిలవక ఇంక ఏమని పిలవాలని ప్రజా సమస్యలు పై పిర్యాదు చేసేందుకు వస్తె ఎదురు దాడి చేస్తున్నారని సమాధానం లేకనే ఎదురుదాడి చేస్తున్నారని, డిడి మా మీద పెత్తనం చేస్తున్నారనీ అదే అక్రమ మైనింగ్ మాఫియా పై దాడి చేయొచ్చు కదా అని మైనింగ్ మాఫియా మొత్తం డిడి బాలాజీ నాయక్ సూచనల మేరకే అక్రమ మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని ప్రజా సమస్యలతో మైనింగ్ డిడి బాలాజీ నాయక్ కు సంబంధం లేదని మైనింగ్ మాఫియా తోనే సంబంధం అని కోట్ల రూపాయలు ముడుపులు అందుకున్నారు కాబట్టే లీజులు ముగిసిన మైన్లలో ని స్టాక్ తరలించుకోవచ్చు అని అనుమతులు ఇచ్చారని ఇది నిబంధనలుకు పూర్తి విరుద్ధం అని పొట్టేళ్ల శిరీష మైనింగ్ డిడి పై బాలాజీ నాయక్ పై విరుచుకుపడ్డారు…

