👉సోనియా, రాహుల్కి నోటీసులివ్వలేం: హైకోర్టు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును కోరింది. అందుకు కోర్టు నిరాకరించింది. నూతన న్యాయ చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జిషీట్ తీసుకోలేమని పేర్కొంది. కాగా, మనీలాండరింగ్ కేసు ఛార్జిషీట్లో కాంగ్రెస్ అగ్రనేతలు శామ్ పిట్రోడా, సుమన్ దూబేలను కూడా ఈడీ నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే.
👉పేదల బియ్యం అక్రముగా తరలిస్తే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని సీఎం నిర్ణయం..అక్రమ రేషన్ బియ్యం పుల్ స్టాప్ పెట్టాలి ఆనీ.అన్నారు…… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమముగా తరలిస్తున్నట్లు తెలిస్తే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని అధికారులకు ఆదేశించారు…….,,
👉రేణిగుంట: పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్ దుర్ఘటనలో అసువులు బాసిన కావలిలోని మధుసూదన్ రావు పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం విశాఖ పట్నం వెళ్ళే నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నగౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సాదర స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్.
👉విజయవాడలో ఉగ్రవాదుల కదలికలు.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కలకలం రేగింది. నగరంలో నలుగురు సిమి సానుభూతిపరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు రెండు నెలల క్రితమే పోలీసులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. తాజాగా శుక్రవారం విజయవాడ పోలీసులు గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బీపేటలో గాలిస్తున్నారు. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. వివిధ నగరాల్లో ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదుల సానుభూతిపరుల కోసం పోలీసులు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు.
👉ఉగ్రవాద దాడికి నిరసనగా కంభం లో ముస్లింల ర్యాలీ కంభం ..కాశ్మీర్ లోని పహాల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో శుక్రవారం ప్రార్థనల అనంతరం ర్యాలీ నిర్వహించారు.పట్టణంలోని జామియా మసీదు నుండి, చౌక్ సెంటర్, నాయక్ వీధి మీదుగా కంభం బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీ లో పట్టణంలోని పలు మసీదుల నుండి ముస్లిం సోదరులు పాల్గొన్నారు.ఉగ్రవాదాన్ని ఇస్లాం మతం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఏ మతానికి చెందిన వారైనా అమాయకులపై అన్యాయంగా దాడులు చేయడం ఏ మతము సహించదని ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు ఖండించారు. ఈ దాడులకు పాల్పడిన వారు ఏ మతానికి చెందిన వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కోరారు.
“👉. జమ్మూ కాశ్మీర్ ఉగ్ర దాడిని ఖండించిన ముస్లింలు”… భారతీయూల పై దాడి అమానుషం… ఇస్లాంలో హింసకు తావు లేదు…..ఇస్లాం అంటే నే శాంతి,ఉగ్రవాదుల పై చర్యకు డిమాండ్…… చింతలపూడి : జమ్మూ కాశ్మీర్ లో పహల్గాo లో జరిగిన ఉగ్ర దాడిని చింతలపూడి పట్టణ జామియా మసీదు కమిటీ ,పట్టణ జమాతే ఇస్లామీ హింద్ తరుపున గురువారం జామియా మసీదు ఆవరణలో విడుదల చేసిన ప్రకటనలో ఖండించారు.దాడుల్లో మృతి చెందిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ రహీమ్ ( బాబు) మాట్లాడుతూ భారత దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటు తుంది అని,భారత రాజ్యాంగం సూచించిన విధంగా కుల మతాలకు అతీతంగా దేశంలో అందరూ సోదరుల కలసి మెలసి ఉంటున్నారని అన్నారూ.దేశం అభివృద్ధి,మత సామరస్యం ఓర్వలేక ఉగ్ర వాద ముష్కరులు భారతీయుల పై పాశవికంగా కాల్పులు జరపడం పిరికి పంద చర్య అని అన్నారు. దీనిని పట్టణ ముస్లింలు అందరు తరు పున ముక్త కంఠంతో ఖండిస్తున్నాం అని,దాడికి పాల్పడిన వారిపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జ మాత్ ఇస్లామీ హింద్ పెద్దలు ఎండీ అక్బర్ అలి మాట్లాడుతూ ఇస్లాం అంటేనే శాంతి అని,ఇస్లాంలో హింసకు తావు లేదు అని,హింస కు పాల్పడే వారు నిజమైన ముస్లిం కాజాలరు అని మహమ్మద్ ప్రవక్త ఆనాడే తెలిపారని అన్నారు.ఏ మత గ్రంథం కూడా ఎదుట వారి ప్రాణాన్ని తీయమని చెప్పదు అని,ఎవరెన్ని కుట్రలు,దాడులు చేసినా భారత దేశంలో మత సామరస్యాన్నీ విడదీయ లేరు అని అన్నారు.ఈ సమావేశంలో మసీదు కమిటీ కార్యదర్శి ఎండీ జిలాని,కమిటీ ముఖ్య కార్యవర్గ సభ్యులు ఎండీ ఇస్మాయిల్,సయ్యద్.రజాక్,సుభాని,ఇమ్రాన్,పాషి,అబిద్,అజాద్,రహంతుల్లా,రసూల్,వహబ్,ముజీబ్,జానీ,సల్మాన్ ,మసీదు ఇమామ్.,మౌజన్ లు పాల్గొన్నారు.

