👉ఇక పాకిస్థాన్ ఖేల్ ఖతం.. సంచలన నిర్ణయం దిశగా ప్రధాని మోదీ.. అదే కానీ జరిగితే..!!_..*ముప్పవరపు వీరయ్య చౌదరి భౌతిక కాయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి..*సంఘమిత్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబును పరామర్శించిన ప్రముఖులు పరామర్శించిన ప్రముఖులు.. *పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల

👉ఇక పాకిస్థాన్ ఖేల్ ఖతం.. సంచలన నిర్ణయం దిశగా ప్రధాని మోదీ.. అదే కానీ జరిగితే..!!_*

జమ్ముకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రమూకలు జరిపిన ఘాతుకానికి దేశం ఉలిక్కి పడింది. పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమానికి అభం శుభం తెలియని 28 మంది పర్యాటకులు మృతి చెందారు.

పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. సైనిక దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కాల్పుల శబ్దం విన్న భద్రతా బలగాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రమూకల కోసం వేట మొదలు పెట్టాయి.ఈ ఘటనపై ప్రపంచ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఈ ఘటనను పిరికిపంద చర్యగా అభివర్ణించారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఘటనను అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పటికే పహల్గాం చేరుకున్న భారత హోం మంత్రి అమిత్ షా.. మృతదేహాలకు నివాళి అర్పించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి ఓదార్చారు..అయితే ఉగ్రమూకలు జరిపిన ఈ దాడిపై ప్రధాని మోదీ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉత్కంఠంగా మారింది. అతి త్వరలోనే ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకుంటారని భద్రతా బలగాలతోపాటు దేశ ప్రజలు భావిస్తున్నారు. గతంలో 2016లో భారత సైనిక స్థావరంపై ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 19 మంది సైనికులు మరణించారు. ఆ ఘటనకు ప్రతీకారంగా ప్రధాని మోదీ పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ ప్రకటించారు. “ఉరి సర్జికల్ స్ట్రైక్” 2016లో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం చేసిన ఒక సైనిక చర్య. ఇది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది. 2016 సెప్టెంబర్ లో ఉరిలో భారత సైనిక శిబిరంపై ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగింది. మళ్లీ అలాంటి సర్జికల్ స్ట్రైక్ కు ప్రధాని మోదీ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అదే కానీ జరిగితే పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఉగ్రమూకలను ఏరి పారేయవచ్చని కాశ్మీర్ కు చెందిన మాజీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ పైనా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాశ్మీర్, పీఓకే ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేతకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాశ్మీర్ పరిస్థితులను ప్రధానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ వివరించారు. మరోవైపు త్రివిధ దళాధిపతులతో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినేట్ కీలక భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

👉తెలుగుదేశం పార్టీ నాయకులు, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ  ముప్పవరపు వీరయ్య చౌదరి భౌతిక కాయాన్ని నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలోని ఆయన స్వగృహంలో పరామర్శించిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, విద్యుత్ శాఖామాత్యులు గొట్టిపాటి రవి కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి .

.       👉ఈదర హరిబాబును పరామర్శించిన మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యేలు ముత్తుముల, దామచర్ల, బి.ఎన్ విజయ్.. *ఒంగోలు:*ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో నిన్నటిరోజు గుండెపోటుకు గురై సంఘమిత్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుని రాష్ట్ర మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్ విజయ్ కుమార్ పరామర్శించి, డాక్టర్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వారికీ మెరుగైన వైద్యం అందుతుందని డాక్టర్లు తెలిపారు.

👉 ఏరువ వారి కళ్యాణంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల**అర్ధవీడు మండలం, కాకర్ల గ్రామంలో మంగళవారం రాత్రి ఏరువ రమణారెడ్డి కుమార్తె వివాహా కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధువుని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గోన్నారు.
👉దండే వారి వివాహా కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే ముత్తుముల*
*కంభం మండలం, నర్సిరెడ్డి పల్లె గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన దండే సుబ్బారావు కుమారుడు చి. నాగ జీవన్ వివాహా కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గోన్నారు.

👉*ఒంగోలులో టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య, అనంతర పరిణామాల పై చర్చించిన రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఆనం రామ నారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మ్యారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మరియు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి.
👉 దారుణ హత్య కు గురైన తెలుగుదేశం పార్టీ నాయకులు, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి భౌతిక కాయాన్ని ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్ లో సందర్శించిన సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.న్ విజయ్ కుమార్, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తదితరులు.

👉 ఏరువ వారి కళ్యాణంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల**అర్ధవీడు మండలం, కాకర్ల గ్రామంలో మంగళవారం రాత్రి ఏరువ రమణారెడ్డి కుమార్తె వివాహా కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధువుని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గోన్నారు.

👉దండే వారి వివాహా కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే ముత్తుముల*

*కంభం మండలం, నర్సిరెడ్డి పల్లె గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన దండే సుబ్బారావు కుమారుడు చి. నాగ జీవన్ వివాహా కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గోన్నారు.*

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..