👉 భారత ఎన్నికల సంఘంపై అమెరికాలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం రాజీ పడిందని, అందుకు మహారాష్ట్ర ఎన్నికలే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బోస్టన్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతేడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో.. ఉన్న ఓటర్ల కంటే ఎక్కువ మందే ఓట్లు వేశారని రాహుల్ చెప్పారు. ‘‘మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల మధ్య 65 లక్షల ఓట్లు పోల్ అయ్యాయని ఈసీ వెల్లడించింది. కానీ ఇది అసంభవం. సగటున ఒక ఓటుకు 3 నిమిషాలు పట్టినా అన్ని ఓట్లు పోల్ అవ్వాలంటే అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగి ఉండాలి. కానీ అలా జరగలేదు. మహారాష్ట్ర పోలింగ్ గురింగి మేం వీడియో కోసం మేం అడగగా అందుకు ఈసీ ఒప్పుకోలేదు. ఇప్పుడు వీడియో గురించి అడగడానికి వీలు లేకుండా చట్టాన్నే మార్చేశారు’’ అని పేర్కొన్నారు. దీనిని బట్టి ఈసీ రాజీ పడినట్లు స్పష్ఠమవుతోందని, ఈసీ వ్యవస్థలోనే లోపం ఉందని అన్నారు. భారత్ – అమెరికా సంబంధాలపై కూడా రాహుల్ మాట్లాడారు. అమెరికాతో మనకు భాగస్వామ్యం ఉందని, ఇరు దేశాలు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నానని అన్నారు.
*రాహుల్ పౌరసత్వంపై బ్రిటన్‌కు లేఖ: కేంద్రం*
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందన్న ఆరోపణలపై సమాచారం ఇవ్వాలంటూ ఆ దేశానికి లేఖ రాశామని కేంద్రం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కేసుపై విచారణ జరుపుతున్న అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌కు సోమవారం ఈ విషయాన్ని తెలిపింది. దీనిపై పూర్తి వివరాలు ఇచ్చేందుకు మరికొంత సమయం కోరింది.
👉టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఫోన్ తీసుకొని ఇవ్వలేదని టీచర్‌ని బూతులు తిడుతూ చెప్పుతో కొట్టిన విద్యార్థిని.. విజయనగరం – రఘు ఇంజనీరింగ్ కళాశాలలో టీచర్ ఓ విద్యార్థిని ఫోన్ తీసుకుందని.. టీచర్‌తో వాగ్వాదానికి దిగిన స్టూడెంట్. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో.. ఆ ఫోన్ 12 వేలు ఇస్తావా లేదా అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ చెప్పుతో కొట్టిన విద్యార్థిని
👉త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర.. మహారాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి మూడో భాషగా చేసే నిర్ణయాన్ని రద్దు చేసింది. సీఎం ఫడ్నవిస్ మరాఠీ తప్పనిసరి అని, హిందీ ఐచ్ఛికమని స్పష్టం చేశారు. భాషా సలహా కమిటీ వ్యతిరేకత, విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
👉UPSC సివిల్స్.. తెలుగు అమ్మాయే టాపర్*
తెలంగాణలోని వరంగల్ నగరానికి చెందిన ఈటబోయిన సాయి శివాని UPSC సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 11వ ర్యాంక్ సాధించారు. ఈమె తండ్రి రాజు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నారు. TGPSC గ్రూప్స్ పరీక్షల్లోనూ ఈమె సత్తా చాటారు. తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ కింద అందజేసిన రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పొంది.. ఆ డబ్బుతోనే సివిల్స్ పరీక్షలకు ప్రిపేరై UPSC సివిల్స్‌లో ర్యాంక్ సాధించి తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చారు.
***షాద్ నగర్ వాసికి సివిల్స్ లో 739 వ ర్యాంకు* సివిల్స్ లో 739 ర్యాంకు సాధించిన ఇంద్రార్జిత* *ఇంద్రార్జిత మంజుశ్రీ హోటల్ యజమాని కీ. శే. నారాయణరావు మనువరాలు, రఘు కుమార్తె*
*ప్రస్తుత యమ్మీ బేకరీ యజమాని ప్రశాంత్ చిన్న మేన కోడలు*.. ఒకప్పుడు షాద్నగర్ పట్టణ బస్టాండు ఎదురుగా ఎందరో ఆహార ప్రియులకు పసందైన రుచులతో వంటకాలు అందించి, మంజుశ్రీ ఉడిపి హోటల్ అంటేనే ఎందరో ఆహార ప్రియులకు ఈ రోజు కూడా గుర్తుండే విధంగా పట్టణంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఈనాడు మన మధ్యలో లేనటువంటి కీర్తిశేషులు నారాయణరావు జ్యేష్ట పుత్రుడు రాఘవేంద్రరావు, మమతా దంపతుల చిన్న కుమార్తె ఇంద్రార్జిత ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో 739 వ ర్యాంకు సాధించడం షాద్నగర్ పట్టణానికి గర్వకారణం. ప్రస్తుతం టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న రాఘవేంద్రరావు మమతా దంపతుల కుమార్తె ఇంద్రార్జిత కేశంపేట మండలంలోని పాపిరెడ్డి కూడా హెరిటేజ్ పాఠశాలలో చదివి హైదరాబాదులోని సెంట్ మేరీస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఢిల్లీలో శిక్షణ తీసుకొని సివిల్స్ లో ర్యాంకును అందుకుంది. ఈ సందర్భంగా రఘుకు, వారి కుటుంబ సభ్యులకు వారి మిత్రులు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు.
👉జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. 27కు చేరుకున్న మృతుల సంఖ్య …
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రస్సులు వేసుకోవచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొదట ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలుపగా తాజాగా 27 మంది టూరిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది…
👉ప్రభుత్వ ఆసుపత్రి పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య*
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి భవనం పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది. భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ సాధువు అనారోగ్యం కారణంగా రెండు రోజుల క్రితం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. తోటి రోగులతో మాట్లాడుతూ తాను అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తోటి రోగులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
👉టీడీపీ అధికార ప్రతినిధి చౌదరిపై కత్తులతో దాడి ! ! ప్రకాశం జిల్లా..
▪️టీడీపీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరిపై కత్తులతో దాడిచేసి హత్య చేసిన నలుగురు దుండగులు. ▪️ఒంగోలులోని తన కార్యాలయంలో ఉండగా కత్తులతో దాడి. ..▪️వీరయ్య చౌదరి మృతదేహం ఒంగోలు రిమ్స్‌కు తరలింపు..▪️దాడి జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..▪️ముసుగులతో వచ్చి వీరయ్య చౌదరిపై దాడిచేసిన దుండగులు.
👉 మానుకోటలో వక్ఫ్ బోర్డు సవరణకు మద్దతుగా ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలో బహుజనవాది డాక్టర్ వివేక్ పాల్గొన్నారు. ముస్లింలకు పూర్తి మద్దతుగా నిలుస్తామని, సెక్యులర్ భారత్‌ను కాపాడతామని వివేక్ అన్నారు. ఈ కార్యక్రమంలో LHPS రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్, DSFI నేతలు శాంతి కుమార్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు..

