*డిప్యూటీ సీఎం ని కలిసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, మాజీ ఎంపీపీ ప్రకాష్ గౌడ్..*విశాఖలో మహా సభలను విజయవంతం చేయాలని సీపీఐ పిలుపు*..* బెట్టింగ్ యాప్ లపై కొరడా.. కొత్త పాలసీకి లోకేష్ హామీ..*జగన్ అక్రమాస్తుల కేసులు: వ్యవస్థల వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యం !.. *పలు కార్యక్రమాలలో పాల్గొన్న తాడిపత్రి, గిద్దలూరు ఎమ్మెల్యేలు..*మానవతా స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభం( పొదిలి)*..మార్కాపురం డాక్టర్ శ్యామ్యూల్ జార్జ్ ఇంజనీరింగ్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలోని యూజీసీ స్వయం ప్రతిపత్తి👉భార్య వివాహేతర సంబంధం నేరం కాదు : హైకోర్టు సంచలన తీర్పు … 

***టీటీడీ ఛైర్మన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుబ్రమణ్య స్వామి…

టీటీడీ గోశాలలో గోవుల మృతిపై కోర్టును ఆశ్రయిస్తాను. వయసు మళ్లిన మనుషుల్లాగే.. వయసు మళ్లిన ఆవులూ చనిపోతున్నాయి అని మాట్లాడటం చాలా దారుణం.రేపు మీరు కూడా చనిపోతారు. అప్పుడు వయసు మల్లారని పట్టించుకోకుండా మీ కుటుంబ సభ్యులు వదిలేస్తారా? అని సుబ్రమణ్య స్వామి ప్రశ్నించారు.
***డిప్యూటీ సీఎం ని కలిసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, మాజీ ఎంపీపీ ప్రకాష్ గౌడ్*. హైదరాబాద్ లోని ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ నివాసంలో గురువారం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప , అయిజ మాజీ ఎంపీపీ ప్రకాష్ గౌడ్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలసి ఆయనకు బొకేతో శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో అలంపూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని అదేవిధంగా అయిజ మండలాన్ని నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని అలాగే అయిజ మార్కెట్ సబ్ యర్డను మార్కెట్ యార్డ్ గా పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎంని కోరినట్లు తెలిపారు.

***విశాఖలో మహా సభలను విజయవంతం చేయాలని సీపీఐ పిలుపు*

విశాఖపట్నం :మే 10, 11న జరిగే సీపీఐ మహా సభలను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పైడిరాజు బుధవారం జ్ఞానాపురంలో పిలుపునిచ్చారు. మూడేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ సభల్లో భాగంగా మే 10వ తేదీ సా.4 గంటలకు కంచరపాలెం మెట్టు నుంచి ఓల్డ్ ఐటీఐ జంక్షన్ వరకు ప్రజా ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. మే 11న ఉ. 9గంటల నుంచి మురళీనగర్ బీస్వేర్ ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ ఉంటుందని తెలిపారు.
* *కర్ణాటక నుంచి YS షర్మిలను రాజ్యసభ కు పంపనున్న కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యత లు స్వీకరించే ముందు కాంగ్రెస్ అధిష్టానం షర్మిల కు రాజ్యసభ కు పంపి MP పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒప్పందం లో భాగంగానే షర్మిల ను రాజ్యసభ కు పంపి MP ని చేయనున్న కాంగ్రెస్ పార్టీ*

*** బెట్టింగ్ యాప్ లపై కొరడా.. కొత్త పాలసీకి లోకేష్ హామీ..
ఏపీలో త్వరలోనే మరో కొత్త పాలసీ రాబోతోంది. యాంటీ బెట్టింగ్ పాలసీ తీసుకురానున్నట్లు మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తూ ప్రముఖులు చేసే ప్రచారాన్ని నమ్మి ఎంతోమంది యువత బెట్టింగ్ బారిన పడుతోంది. ఫలితంగా బెట్టింగ్ లో సొమ్మును అంతా ధారబోసి ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీలో కొత్త పాలసీ తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం.
ఇటీవల బెట్టింగ్ బెట్టింగ్ యాప్ లపై యూట్యుబర్ నా అన్వేష్ యుద్ధం ప్రకటించారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్ లపై అన్వేష్ చేసిన పోరాటానికి ప్రభుత్వం స్పందించి.. వీటిని అరికట్టేందుకు చర్యలు చేపడుతామని పేర్కొంది. హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై కొరడా ఝుళిపించారు. తాము స్కిల్ గేమ్స్ యాప్‌లను మాత్రమే ప్రమోట్ చేశామని వాటికి సుప్రీంకోర్టు అనుమతి ఉందని ప్రకటించారు.కొంతమందిని విచారణకు పిలిచిన పోలీసులు తర్వాత ఈ కేసును సిట్ కు బదిలీ చేశారు.ఈ నేపథ్యంలోనే గోవిందా పేరుతో ఓ బెట్టింగ్ యాప్ ఉందని, దానికి తమన్నాతోపాటు చాలా మంది ప్రముఖులు అన్ని రకాల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ప్రచారం చేస్తున్నారని లోకేష్ , పవన్ కళ్యాణ్ కోరుతూ అన్వేష్ ఓ వీడియో చేశారు. దీనిపై లోకేష్ వెంటనే స్పందించారు. ఈ బెట్టింగ్ యాప్ లపై చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో బెట్టింగ్ నిరోధక పాలసీని తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

***జగన్ అక్రమాస్తుల కేసులు: వ్యవస్థల వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యం !
జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో రూ.800కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఈడీ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. చార్జిషీట్లు దాఖలు అయి ట్రయల్స్ ప్రారంభం కాకుండా వ్యవస్థలతో ఆడుకుంటున్న నిందితులకు ఇది ఎలాంటి షాక్ ఇవ్వలేదు. ప్రజలకే అసలు షాక్ ఇస్తుంది. అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది?. అడ్డంగా ప్రజల్ని దోచుకున్న విషయం కళ్ల ముందు ఉన్నా ఎందుకు వ్యవస్థలు శిక్షించలేకపోతున్నాయి ?. ఎప్పుడో ఓ సారి ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు?. ఇదే ప్రజలకు అర్థమయ్యి.. అర్థం కానట్లుగా ఉంటోంది.

జప్తు చేస్తున్న ఆస్తులు దొంగలవి కాదు !
జగన్ అక్రమాస్తుల కేసుల్లో గతం అయినా ప్రస్తుతం అయినా ఈడీ జప్తు చేసిన ఆస్తులు ఆయా నిందితులవి కావు. ప్రజా ఆస్తులు దోపిడీ చేసిన దొంగలవి కావు. ప్రజల ఆస్తులే. ప్రజా ఆస్తుల్ని సొంత ఆస్తుల్లా అమ్ముకుని.. తమ ఖాజానా నింపుకున్న వారి ఆస్తులుకావు. తాజాగా జప్తు చేసిన సున్నపురాయి గనులు కూడా ప్రభుత్వానివి. అంటే ప్రజలవే. మరి నిందితులకు ఎలా షాక్ తగులుతుంది ?.
ఇంకెన్నాళ్లు ఈ కేసులు సాగుతాయి?
*జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ సీఎం కాక ముందు అనామకుడు. సబ్ కాంట్రాక్టులు చేసుకునేవాడు. వైఎస్ సీఎం అయిన తర్వాత ఆయన కంపెనీలకు ప్రభుత్వ వనరులు కట్టబెడితే ఆయా కంపెనీలు జగన్ రెడ్డికి ముడుపులు చెల్లించుకున్నాయి. దానికి అదనంగా సొంతగా భూదందాలు. లక్ష కోట్లకుపైగా ఆస్తుల్ని జగన్ సంపాదించుకున్నారన్నది బహిరంగరహస్యం. అధికారికంగానే ఆయన లెక్కలేనంత సంపాదన కనిపిస్తోంది. ఓ సామాన్య ఉద్యోగి రెండు లక్షలు ఎక్కువగా ఉంటే ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగే వ్యవస్థలు జగన్ వేల కోట్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో అడగరా?. ఇప్పటికే పదమూడు ఏళ్లు దాటిపోయింది. కనీసం ట్రయల్ ప్రారంభం కాలేదు. దీనికి సిగ్గుపడాల్సింది ఎవరు ?
*ఇంకెన్నాళ్లు సాగదీస్తారు ?
క్రిమినల్ మైండ్ సెట్ అదీ కూడా లార్జ్ స్కేల్ దోపిడీ మైండ్ సెట్ ఉన్న వారు..క్రూర మనస్థత్వం ఉన్న వారిని అలా వదిలేస్తే.. చట్టాలు..ఎందుకు ఇక. వారి వల్ల సమాజానికి జరిగే నష్టాన్ని ఎవరు భర్తి చేస్తారు ?. అలాంటి దోపిడీ దారుడ్ని వదిలేయడం వల్లనే సీఎం అయ్యారు.. అత్యంత ఘోరంగా మళ్లీ దోపిడీ చేశారు. ఈ వైఫల్యం ఎవరిది?. ఏ వ్యవస్థ సిగ్గుపడాలి ?. ఇప్పటికైనా ఇలాంటి నేరాలు చేసేవారికి స్పష్టమైన సంకేతం పంపాలంటే.. ఖచ్చితంగా వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షించాల్సి ఉంది.

***గాలి వాన వల్ల నష్టపోయిన రైతుకు తక్షణ పరిహారం చెల్లించేందుకు చర్యలు* –  శాసన సభ్యులు  ముత్తుముల  …ఇటీవల గిద్దలూరు మండలం బురుజుపల్లె గ్రామంలో కురిసిన గాలి వానలతో అరటి తోట తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని తెలుసుకున్న గిద్దలూరు శాసన సభ్యులు  ముత్తుముల అశోక్ రెడ్డి , తెలుగుదేశం పార్టీ గిద్దలూరు మండల అధ్యక్షులు  మార్తల సుబ్బారెడ్డి , AMC వైస్ చైర్మన్ ఓబుళరెడ్డితో కలిసి నష్టపోయిన రైతు షేక్ మాదార్ వలి తోటను సందర్శించారు.రైతు షేక్ మాదార్ వలి మాట్లాడుతూ, తాను అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన అరటి తోట గాలి వానల కారణంగా పూర్తిగా దెబ్బతినడంతో సుమారు రూ. 3 లక్షల నష్టం వాటిల్లిందని వాపోయారు.ఈ విషయము పై శాసన సభ్యులు అక్కడికక్కడే సంబంధిత అధికారులను పిలిచి మాట్లాడారు. రైతుకు తక్షణ పంట నష్ట పరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే సమయంలో ఈ విషయంలో జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.రైతులకు కూటమి ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని, ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గిద్దలూరు తహసీల్దార్ ఆంజనేయరెడ్డి , ADA బాలాజీ నాయక్ , MPDO రమణారెడ్డి , సచివాలయ ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు.

***పలు కార్యక్రమాలలో పాల్గొన్న తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి* …
తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో స్వచ్చ ఆంధ్ర – స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో మున్సిపల్ అధికారులతో కలిసి పాల్గొని వ్యర్థ పదార్థాలపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు.. పెద్ద పప్పూరు మండలం, అశ్వర్థనారాయణ స్వామి సన్నిధి యందు తాడిపత్రి నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ ఐ బ్యాంక్ నందు పాల్గొని ప్రజలకు చేస్తున్న సేవల గురించి తెలుసుకుని సంఘం సభ్యులకు అభినందనలు తెలిపారు..తాడిపత్రి రూరల్ పరిధిలోని బొజ్జయ్య కళ్యాణ మండపం నందు వివాహ మహోత్సవానికి హాజరై నవవధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

*నాణ్యత ప్రమాణాలు పెంచి ఉత్తమ బోధన చేస్తాం* *ఇక నుంచి జార్జి కళాశాలకు స్వయంప్రతిపత్తి* .*పశ్చిమ ప్రాంతంలో అటానమస్ పొందిన మొదటి కళాశాల.**మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడి.*

నాణ్యత ప్రమాణాలు ఇంకా మెరుగుపరచి ఉత్తమ బోధన ద్వారా మా విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని జార్జి కళాశాల సాంకేతిక సలహాదారు మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మార్కాపురం లోని డాక్టర్ శ్యామ్యూల్ జార్జ్ ఇంజనీరింగ్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పశ్చిమ ప్రకాశం లో ఏర్పడిన మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాలగా జార్జి కళాశాలకు గుర్తింపు ఉంటే ఇప్పుడు అటానమస్ పొందిన మొదటి కళాశాల కూడా మాదే కావటం ఎంతో సంతోషం గా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర విద్య శాఖ పరిధిలోని యుజిసి జార్జి కళాశాలకు 10 సంవత్సరాల (2025-26 నుంచి 2034-35 వరకు)అటానమస్ స్టేటస్ స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే కళాశాలకు జేఎన్టీయూ కాకినాడ శాశ్వత అనుబంధం పర్మినెంట్ అఫీలియేషన్ మరియు ఉన్నత ప్రమాణాలకు పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ సంస్థ నాక్ (NAAC) ఏ గ్రేడును ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు అటానమస్ (స్వయం ప్రతిపత్తి) కల్పించడం ద్వారా కళాశాల సిలబస్ తయారు చేసుకోవడం, నూతన కోర్సులను పెట్టుకోవడానికి ,విద్య సంవత్సరపు క్యాలెండర్ ను స్వతంత్రంగా చేసుకోవటానికి మరియు పరీక్షలు నిర్వహణ, మూల్యాంకనము ,రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తద్వారా విద్యార్థులకు నైపుణ్యత ఉద్యోగ అవకాశాలు పెంచడానికి నూతన వరవడికి శ్రీకారం చుట్టడానికి సహకారం అవుతుందన్నారు. కళాశాల 28 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మాతో మాకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులకు మరియు పత్రికా మిత్రులకు శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అటానమస్ స్టేటస్ ద్వారా మా మీద గురుతర బాధ్యత ఏర్పడిందని, యుజిసి మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశలో ముందుకు వెళ్లడానికి పునరంగితమవుతున్నామని, ఇప్పటినుంచి ఈ యొక్క నూతన బాధ్యతలలో మీ అందరి సహాయ సహకారాలతో కళాశాల ముందుకు వెళ్లడానికి మీయొక్క చల్లని దీవెనలు కళాశాల అభివృద్ధికి తద్వారా చదువుకుంటున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రాజబాబు, అకడమిక్ డీన్ డాక్టర్ మస్తానయ్య IQAC కో ఆర్డినేటర్ డాక్టర్ సయ్యద్ కాసిం, వివిధ విభాగాధిపతులు డాక్టర్ సాధు నాయక్, ఆది సత్యనారాయణ,అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ కే డానియల్ అధ్యాపక అధ్యపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
***మానవతా స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభం*..
పొదిలి మానవత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిన్న బస్టాండ్ లో, భవాని ఎరువుల దుకాణం వద్ద, కొత్తూరు లోని ముల్లా సంధాని సెల్ దుకాణం వద్ద ఏర్పాటుచేసిన చలి వేంద్రాలను శనివారం మానవత స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు దాతల సహకారంతో ఏర్పాటు చేసినట్లు మానవత స్వచ్చంద సేవా సంస్థ ఛైర్మెన్ మువ్వల పార్థసారథి తెలియచేశారు.పొదిలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానవత స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులు సామంతపుడి నాగేశ్వరరావు, శ్రావణి వెంకటేశ్వర్లు, సోమిశెట్టి చిరంజీవి, కే.ఎల్లమందరెడ్డి, కల్లం సుబ్బారెడ్డి, జి చెన్నారెడ్డి, కాటూరి నారాయణ బాబు, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, తానికొండ వెంకట్రావు, షేక్ సైదా,కొట్టు బాబు, జీసి సుబ్బారావు, డాక్టర్ మణి, వినోద్, మామిడి శీను, బాజీ, కుమార్, కొండా సుబ్రహ్మణ్యం, రంగా తదితరులు పాల్గొన్నారు.

👉భార్య వివాహేతర సంబంధం నేరం కాదు : హైకోర్టు సంచలన తీర్పు …   భార్యను ఆస్తిగా భావించే కాలం చెల్లిందని, మహాభారతంలోని ద్రౌపది ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్యను ఆస్తిగా భావించే కాలం చెల్లిందని, మహాభారతంలోని ద్రౌపది ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ.., తన భార్య ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని కోరిన భర్తకు నిరాశ ఎదురైంది. ఈ తీర్పు వివాహిత ప్రియుడికి ఊరట కలిగించగా, భార్య ప్రవర్తనతో ఆవేదన చెందిన భర్తకు షాక్‌లా తగిలింది. వివరాల్లోకి వెళితే.., ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి తన భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉండటాన్ని గుర్తించాడు. తన భార్య హద్దులు మీరి ప్రవర్తిస్తోందని, ఆమె ప్రియుడితో శారీరక సంబంధం నేరమని ఆ భర్త కోర్టును ఆశ్రయించాడు. ఒక హోటల్ గదిలో తన భార్య ప్రియుడితో కలిసి ఉన్నట్లు కూడా అతడు ఆరోపించాడు. ఈ కేసు మొదట మెజిస్ట్రేట్ కోర్టుకు రాగా, ప్రియుడిని దోషిగా చూడటం సరికాదని తీర్పు వెలువరించింది. దీంతో అతడికి ఊరట లభించింది. అయితే, భర్త సెషన్స్ కోర్టును ఆశ్రయించగా, మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును కొట్టివేస్తూ ప్రియుడికి నోటీసులు జారీ చేసింది. దీంతో తనపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వివాహిత ప్రియుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక స్త్రీని భర్త తన ఆస్తిగా చూడటం వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మహాభారతంలోని ద్రౌపది ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ, వారిలో ఒకరైన ధర్మరాజు ఆమెను జూదంలో పణంగా పెట్టాడని గుర్తు చేశారు. మిగిలిన నలుగురు భర్తలు ప్రేక్షక పాత్ర వహించడం వల్ల, ద్రౌపది తన గౌరవం కోసం నిలబడే అవకాశం కోల్పోయిందని కోర్టు పేర్కొంది. మహిళను ఒక ఆస్తిగా పరిగణించడం ఎంతటి ప్రమాదకరమో మహాభారత యుద్ధం నిరూపించిందని, దాని ఫలితంగా భారీ ప్రాణనష్టం సంభవించిందని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తెలిపారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 ప్రకారం వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్త్రీని ఆస్తిగా చూడటం సరైనది కాదని, మహాభారత కాలం నాటి ఆలోచనలకు ఇప్పుడు కాలం చెల్లిందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. వివాహేతర సంబంధం అనేది నైతికతకు సంబంధించిన విషయమని, దానిని నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు గతంలోనే తేల్చి చెప్పిందని ఆమె అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని, భర్త చేసిన ఫిర్యాదు కేసును రద్దు చేసే అవకాశం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. చివరికి, సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రియుడు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దీంతో వివాహేతర సంబంధం నేరమని వాదిస్తున్న భర్తకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. తన భార్య వివాహేతర సంబంధంపై చర్యలు తీసుకునే అవకాశం లేదా అని ఆ భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ తీర్పు సమాజంలో తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఒకవైపు వ్యక్తిగత స్వేచ్ఛ, మరోవైపు వివాహ వ్యవస్థ పవిత్రత వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ, ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రస్తుత చట్టాల ప్రకారం వివాహేతర సంబంధం నేరం కాదని స్పష్టం చేసింది.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..