👉🏽మెహుల్ చోక్సీ లాంటి మరో నలుగురు పారిశ్రామిక వేత్తలు!.. *పెట్టింది కాల్ సెంటర్.. కానీ లోపల యవ్వారం వేరే..వీధికుక్కల దాడితో రెండేళ్లుగా కోమాలో ఉన్న చిన్నారి.. సహాయం కోసం ఎదురుచూస్తున్న తల్లి..👉కడప బిల్డప్ సర్కిల్ లో దారుణ హత్య*..రైళ్లలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన సికింద్రాబాద్ పోలీసులు..*ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కంభం ఎస్ఐ*..అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన* కంభం

👉🏽మెహుల్ చోక్సీ లాంటి మరో నలుగురు పారిశ్రామిక వేత్తలు! మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ, నితిన్ సందేసరా వీరంతా దేశం నుంచి పారిపోయిన పారిశ్రామిక వేత్తలు. దేశంలో బ్యాంకులను మోసం చేసి విదేశాలకు చెక్కేసిన పారిశ్రామిక వేత్తల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థల వేట కొనసాగుతోంది. ఎప్పుడో దేశం విడిచి వెళ్లిన వారిని తిరిగి ఇక్కడికి తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా శ్రమపడుతోంది. ప్రస్తుతం బెల్జియంలో అరెస్టు అయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఉదంతంతో దేశం నుంచి పారిపోయిన పారిశ్రామిక వేత్తలపై మళ్లీ చర్చ మొదలైంది. మెహుల్ చోక్సీ, ఆయన బంధువు నీరవ్ మోదీ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని ఎగ్గొట్టారు. ఈ కేసులోనే మెహుల్ చోక్సీ అరెస్టు అయ్యారు. ఇక ఆయనలాంటి మరో నలుగురు పారిశ్రామిక వేత్తలు కూడా బ్యాంకులను భారీగా మోసం చేసి ఉడాయించిన వైనం మరోసారి తెరపైకి వచ్చింది. మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ, నితిన్ సందేసరా వీరంతా దేశం నుంచి పారిపోయిన పారిశ్రామిక వేత్తలు. వీరిలో మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ బంధువులు కాగా, మిగిలిన ముగ్గురికి ఒకరితో ఒకరికి సంబంధం లేదు. కానీ, ఈ ఐదుగురి అరెస్టు కోసం కేంద్రం సంవత్సరాలుగా కృషి చేస్తోంది. ఎట్టకేలకు మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్టుచేసి స్వదేశానికి తీసుకువస్తుండటంతో మిగిలిన వారిని ఎప్పుడు అరెస్టు చేస్తారని ప్రశ్న వినిపిస్తోంది. 2018లో పీఎన్బీ బ్యాంకును వేల కోట్ల రూపాయల మేర ముంచేసిన వ్యక్తులుగా మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీపై కేసులు నమోదయ్యాయి. బ్యాంకు అధికారులతో కుమ్మక్కై పీఎన్బీని మోసం చేశారని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ మోసం వెలుగుచూశాక ఇద్దరూ దేశం విడిచి పారిపోగా, నీరవ్ మోదీ 2019లో లండన్ లో అరెస్టు అయ్యారు. అప్పటి నుంచి ఆయనను తిరిగి మన దేశానికి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా, ఇప్పటికీ ఆ ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఇప్పుడు చోక్సీ అరెస్టుతో నీరవ్ మోదీ అప్పగింతపై మళ్లీ చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో 9 వేల కోట్లు ఎగవేసిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా, ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలంలో అవకతవకలకు పాల్పడిన లలిత్ మోదీ, 5,700 కోట్ల మేర మనీలాండరింగుకి పాల్పడిన ఆరోపణలపై మరో పారిశ్రామిక వేత్త నితిన్ సందేసరా కూడా దేశం విడిచి పారిపోయారు. వీరిలో విజయ్ మాల్యా, లలిత్ మోదీ బ్రిటన్ లో తలదాచుకుంటున్నారు. నేరస్తుల అప్పగింతపై బ్రిటన్ తో మన దేశానికి అవగాహన ఉన్నా, నిందితులు అప్పగింతలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. బ్రిటన్ – భారత్ మధ్య నేరస్తుల అప్పగింతకు 1992లోనే ఒప్పందం కుదిరినా ఈ 33 ఏళ్లలో ఒక్కరిని మాత్రమే అప్పగించారు. దీంతో విజయ్ మాల్యా, లలిత్ మోదీ సురక్షితంగా గడిపేస్తున్నారు. ఇక నితిన్ సందేసరా కుటుంబం భారత్‌ నుంచి దుబయ్ మీదుగా నైజీరియాకు వెళ్లిపోయింది. సందేసరా కుటుంబం నైజీరియా, అల్బేనియా దేశాల పౌరసత్వం తీసుకుని అక్కడే గడిపేస్తోంది.

👉కడప బిల్డప్ సర్కిల్ లో దారుణ హత్య* వైయస్సార్ కడప జిల్లా* రవీంద్ర నగర్ లో నివాసం ఉంటున్న సాధక్ దారుణ హత్య..సంఘటన స్థలానికి చేరుకున్న తాలూకా పోలీసులు..

👉ఒడిశా నుంచి రైళ్లలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన సికింద్రాబాద్ పోలీసులు…ఒడిశా గజపతి జిల్లాకు చెందిన బెంజమిన్ గమాంగో(31) అనే వ్యక్తి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ కు రాగా అతని బ్యాగులో 4.5 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు….

👉 కడప జిల్లా చాపాడు మండలం అల్లాడు పల్లే వద్ద ముగ్గురు మోటర్ బైక్ దొంగలు అరెస్ట్.27 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్న చాపాడు పోలీసులు.వివరాలు వెల్లడించిన మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్.సమావేశంలో పాల్గొన్న మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్ చాపాడు డిఎస్పి భవాని ఎస్సై కే చిన్న పెద్దయ్య మరియు సిబ్బంది. అభినందించిన కడప ఎస్పీ కడప ఎస్పీ అశోక్ కుమార్

👉 *వామ్మో వీళ్ళు మాములోళ్లు కాదు బాబోయ్…పెట్టింది కాల్ సెంటర్.. కానీ లోపల యవ్వారం వేరే.. స్టన్ అయిన పోలీసులు* గుంటూరు….అతని పేరు లూయిస్…గుంతకల్‌లో కాల్ సెంటర్ నిర్వహిస్తుంటాడు. ఇదొక్కటే అతని వ్యాపారం కాదు. కాల్ సెంటర్ ముసుగులోనే అశ్లీల వీడియోలు రూపొందిస్తున్నాడు.వాటిని ఏకంగా నిషేధిత అశ్లీల వెబ్ సైట్లకు విక్రయిస్తున్నాడు.  వీడియోలను విక్రయించి క్రిప్టో కరెన్సీ రూపంలో ప్రతిఫలం పొందుతున్నాడు. ఇతనికి శ్రీకాకుళం జిల్లా.. పాత పట్నంకు చెందిన గణేష్, జోత్న్సలు సహకరిస్తున్నట్లు గుర్తించి వారిని సైబర్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈగిల్ వింగ్ ఐజి ఆకే రవిక్రిష్ణకు ముందస్తుగా రాబడిన సమాచారంతో ప్రత్యేక ఫోకస్ పెట్టిన అధికారులు ఈ ముఠా కార్యకలాపాలను చేధించారు. ఎవరికి అనుమానం రాకుండా లూయిస్ రెండేళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పనుల దర్వా లూయిస్ పదకొండు లక్షల రూపాయల వరకూ సంపాదించాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బులిస్తామంటూ ప్రలోభ పెట్టి యువతి యువకులను ఆకర్షిస్తున్నాడు. ఆ తర్వాత వారితో పోర్న్ వీడియోలు రూపొందించడమే కాకుండా లైవ్ షోస్ ఏర్పాటు చేస్తున్నాడు. ఇందు కోసం గుంతకల్‌లో ఏకంగా స్టూడియో సెట్ అప్ వేసినట్లు ఐజి ఆకే రవి క్రిష్ణ తెలిపారు. సైప్రస్ దేశానికి చెందిన వారితో ఒప్పందం కుదుర్చుకొని ఆన్ లైన్ లావాదేవీలు చేస్తున్నారని తెలిపారు. యువతి, యువకులు అప్రమత్తంగా ఉండాలని ఐజి రవిక్రిష్ణ హెచ్చరించారు. సైబర్ స్పేస్ దుర్వినియోగమవుతనట్లు ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. సైబర్ హైజీన్స్ మేరకు ఓటిపిలు, పాస్ వర్డ్స్ ఎక్కడ స్టోర్ చేస్తున్నారన్న అంశం కూడా ముఖ్యమే అన్నారు. సైబర్ బాధితులు 1930కు ఫోన్ చేయాలన్నారు. డిజిటిల్ అరెస్ట్‌లను నమ్మవద్దన్నారు. ఎవరైనా అలా ఫోన్ చేస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలన్నారు.

👉 నాగార్జునసాగర్ నందికొండలో హృదయవిదారక ఘటన .. వీధికుక్కల దాడితో రెండేళ్లుగా కోమాలో ఉన్న చిన్నారి.. సహాయం కోసం ఎదురుచూస్తున్న తల్లి.నల్గొండ జిల్లా నాగార్జునసాగర్, నందికొండ మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉంటున్న సిద్వంతి అనే మహిళ భర్త రెండున్నర ఏళ్ల కింద మరణించాడు, అప్పటి నుండి ఇద్దరు కుమార్తెలతో పుట్టింట్లోనే ఉంటుంది. రెండేళ్ల కిందట చిన్న కుమార్తె హారిక ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేయడంతో, నాగార్జునసాగర్ కమల నెహ్రూ ఆసుపత్రిలో చికిత్స చేయించారు.రెండో డోసు కుక్కకాటు టీకా వేసిన అనంతరం హారిక వారం రోజుల పాటు జ్వరంతో బాధ పడింది. జ్వరంతో ఉన్నప్పుడే మూడో డోసు టీకా ఇచ్చారు. జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో హారికను హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు .హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నప్పుడే హారిక కాళ్లు చేతులు స్పర్శ లేకుండా మారాయి. దీంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా హారిక పూర్తిగా కోమాలోకి వెళ్లింది .ఒకటిన్నర ఏళ్ల నుండి నల్గొండ, హైదరాబాద్‌లో పలు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేదని హారిక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది.నా కూతురు ఉలుకు పలుకు లేకుండా పడి ఉందని, అమ్మా అని కూడా పిలవట్లేదని, ప్రభుత్వం స్పందించి వైద్యానికి సహకరిస్తే రుణపడి ఉంటానని హారిక తల్లి సిద్వంతి వేడుకుంటుంది

👉 *ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కంభం ఎస్ఐ*

ప్రకాశం జిల్లా కంభం మండలం ఎస్ఐ బి.నరసింహరావు బుధవారం కంభం పట్టణంలోని స్థానిక అర్బన్ కాలనీ వాసులతో సమావేశమయ్యారు. ఇటీవల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా వేరే ప్రాంతాలకు వెళ్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని అన్నారు

👉 ప్రకాశం జిల్లా ఎస్పి ఏ.ఆర్. దామోదర్  ఆదేశాల మేరకు, నేరాలు నివారించడంలో ముందస్తు చర్యల్లో భాగంగా మార్కాపురం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్  పి. సుబ్బారావు ఆధ్వర్యంలో మార్కాపురంలోని ఏకలవ్య కాలనీలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా రౌడీలు, అనుమానితుల ఇళ్లను సోదాలు నిర్వహించి, ఐదు ఆటోలు, 18 బైకులు , మొబైల్ ఫోన్స్ మూడు స్వాధీనం చేసుకున్నాము. ఈ ఆపరేషన్ లో మార్కాపురం పట్టణ ఎస్ఐ డాక్టర్. ఎం. రాజ మోహన్ రావు, ఏ.ఎస్.ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, మార్కాపురం సర్కిల్ సిబ్బంది  పాల్గొన్నారు….

👉అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన* కంభం: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక అర్బన్ కాలనీలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆందోళన పడకుండా ఆలోచనతో అగ్ని ప్రమాదాలను అరికట్టే నైపుణ్యాలను ప్రయోగాత్మకంగా వివరించారు. గ్యాస్ సిలిండర్ వాడుకలో అప్రమత్తంగా ఉండాలని,ప్రతి 6 నెలలకు ఒకసారి గ్యాస్ కనెక్షన్ పైప్ సరిచూసుకుని మార్చాలని, పొరపాటున ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి డి.పి చౌదరి,సిబ్బంది పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..