👉 మోడీ పాలనపై యూరోపియన్ పార్లమెంటు కన్నెర్ర .. ఏకగ్రీవ తీర్మానం! 😱😱😱
క్రిస్టియన్లు మైనారిటీలుగా ఉన్న భారత్‌లో వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని యూరోపియన్ నాయకులు ఆరోపించారు. ప్రత్యేక విదేశాంగ విధానం తీసుకువచ్చి.. భారత దేశ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తం చేస్తున్నామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై యూరోపియన్ యూనియన్ కన్నెర్ర చేసింది. ఈ యూనియన్‌లో 27 దేశాలు ఉన్నాయి. వీరంతా ముక్తకంఠంతో ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై విరుచుకుపడ్డారు.*** ఒకరు కాదు .. ఇద్దరు కాదు.. దాదాపు 26 దేశాలకు చెందిన అధినేతలు మోడీ విధానాలను ఎండగట్టారు. ప్రత్యేకంగా 2014 నుంచి భారత దేశంలో జరుగుతున్న పరిణామాలను కూలంకషంగా వారు వివరించారు. తాజాగా యూరోపియన్ యూనియన్ సర్వసభ్య సమావేశం ఐక్యరాజ్యసమితిలో జరిగింది. ఈ సమావేశానికి యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాల్లో 26 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చలో భారత్‌లో మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలను వారు తీవ్రంగా గర్హించారు. అతి పెద్ద ప్రజాస్వామ్యమని.. ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తామని చెబుతున్న భారత్‌లో మత స్వేచ్చ లేదని అన్నారు. జర్నలిస్టులకు స్వేచ్ఛలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ”ఏం రాయాలో.. ఏం రాయకూడదో కూడా వారే నిర్ణయిస్తారు” అని వ్యాఖ్యానించారు. మహిళా నాయకులు కూడా.. మోడీ పానలపై నిప్పులు చెరిగారు. మహిళలకు కూడా భద్రత కరువైందని ఆరోపించారు. క్రిస్టియన్లు మైనారిటీలుగా ఉన్న భారత్‌లో వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని యూరోపియన్ నాయకులు ఆరోపించారు. ముస్లిం మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారని.. ఇవన్నీ 2014 తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేనని ప్రధాని మోడీ పేరును ప్రత్యేకంగా పేర్కొంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. యుద్ధ ప్రాతిపదికన, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు భారత్‌లో పర్యటించాల్సిన అవసరం ఉందని తీర్మానం చేశారు. మోడీ విధానాలతో దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మణిపూర్ విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. అదేవిధంగా ఇతర చట్టాలను కూడా ప్రస్తావించారు. అయితే.. యూరోపియన్ దేశాలకు.. భారత్ వాణిజ్య పరంగా కీలక దేశమని పేర్కొనడం గమనార్హం. కాగా.. భారత ప్రధానిపై యూరోపియన్ యూనియన్ ఇంత భారీ ఎత్తున దాడి చేయడం ఇదే తొలిసారి. ఒక రకంగా చెప్పాలంటే.. ఇది మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అని మేధావులు పేర్కొంటున్నారు. భారత ప్రధానిపై ఇంత దారుణమైన దాడి ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. భారతదేశ ముఖ చిత్రం ఇప్పుడు మతపరంగా తీవ్రవాద, అణచివేత, & అసహనంతో కూడిన దేశంలా ఉందని యూరోపియన్ నేతలు పేర్కొనడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఇది మన వృద్ధి, పురోగతి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.
👉ఆర్చరీ వరల్డ్ కప్‌లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం* .. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా :
అమెరికాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖ స్వర్ణ పతకం సాధించింది. కాంపౌండ్ మిక్స్డ్ టీం ఈవెంట్‌లో రిషబ్ యాదవ్‌తో కలిసి విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్‌లో జ్యోతి–రిషబ్ జోడి 153–151 తేడాతో చైనీస్ తైపీకి చెందిన హువాంగ్ ఐ జౌ–చెన్ చిహు లిన్ జంటపై గెలుపొందింది….
👉ED .. వై ఓన్లీ రాహుల్ ?
కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉండే నేషనల్ హెరాల్డ్ అనే సంస్థ ఆస్తులను జప్తు చేయడానికి ఈడీ రెడీ అయిపోయింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ,యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకోనుంది. మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలతో రూ. 661 కోట్ల విలువైన ఢిల్లీ, ముంబై, లక్నోలలోని స్థిరాస్తులను జప్తు చేయనున్నారు. ఏజేఎల్ , కాంగ్రెస్ పార్టీ షేర్‌హోల్డర్లు , పార్టీ దాతలను మోసం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఆయా సంస్థల ఆస్తులను చాలా తక్కువకు కొట్టేయడానికి ప్రయత్నించారని.. ఏఐసీసీ నుండి రూ. 90.21 కోట్ల రుణాన్ని వైఐకి రూ. 50 లక్షలకు బదిలీ చేశారని ఇది పెద్ద స్కామని చెబుతోంది. అయితే ఈ కేసులో ఎక్కడా మనీ లావాదేవీలు జరగలేదు. కేవలం షేర్ల మార్పిడి జరిగింది. దీన్నే అతి పెద్ద స్కాంగా ఈడీ చెబుతోంది.
🌟నిజంగా వందలు, వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగిన స్కాంలు కళ్ల ఎదుట ఉన్నాయి. కేసులు నమోదు అయినా చూసీ చూడనట్లుగా పోతున్న కేసులు లెక్కలేనన్ని ఉన్నాయి. ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నా వారంతా హాయిగా దోపిడీ చేసిన సంపదతో వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. ఆ సంపదను అనుభవిస్తూనే ఉన్నారు. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు. ప్రత్యక్ష ఆధారాలు ఉన్న వారిపై చర్యలు మాత్రం ఏళ్లకు ఏళ్లు ఆలస్యమవుతూనే ఉన్నాయి.
🌟ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడ్డారని న్యాయస్థానాలు కూడా వ్యాఖ్యానించాయి. ఆయన దోపిడీ స్టైల్ బహిరంగం. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు సంస్థకు ఆయన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు రాసిస్తే వారి వద్ద నుంచి పెట్టుబడుల రూపంలో జగన్ లంచాలు తీసుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. సీఎం అయిన తర్వాత ఆయన అతి పెద్ద లిక్కర్ స్కాం చేశారు. ఆధారాలు ఉన్నా.. రంగంలోకి దిగడం లేదు. ఇలాంటి ఆర్థిక నేరస్తుల్ని ఎదురుగా పెట్టుకుని వారిపై జాలి చూపించి..అసలు లావాదేవీలే జరగని.. ఎప్పుడో లక్షల రూపాయల విలువ ఉన్నప్పటి ఆస్తులకు ?ఇప్పటి మార్కెట్ వాల్యూ చూపించి వందల కోట్ల దోపిడీ అని ప్రచారం చేస్తే ఏం వస్తుంది?. అసలైన ఆర్థిక ఉగ్రవాదుల్ని ఎప్పుడు పట్టుకుంటారు..? దోచుకున్న సంపదను ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు?
*మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన*
అమరావతి:ఏప్రిల్ 13..
భారతదేశంలోనే మంగళ గిరి ప్రభుత్వ ఆసుపత్రిని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని, మంత్రి నారా లోకేశ్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి లో ఆదివారం అత్యాధునిక వసతులతో నిర్మించే 100 పడకల ఆసుపత్రికి మంత్రి నారా లోకేశ్ మరో మంత్రి కందుల దుర్గేష్తో కలిసి భూమి పూజ చేశారు. ఆస్పత్రి నిర్మాణ నమూనా లను మంత్రులు పరిశీలిం చారు. గత ఎన్నికల సమయంలో మంగళగిరి వాసులకు అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చానని దానిని నెరవేర్చబోతున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు. అన్ని రంగాలలో మంగళగిరి నియోజకవర్గా న్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపేంతవరకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఎన్నికల సమయంలో ఇచ్చి న హామీ మేరకు మంగళగిరి ప్రజలకు చిరకాల స్వప్నమైన 100 పడకల ఆస్పత్రికి మంత్రి లోకేశ్ నేడు భూమి పూజ చేశారు. అత్యాధునిక వసతులతో ఆస్పత్రిని కేవలం ఏడాది కాలంలోనే పూర్తిచేయను న్నారు.
సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే నెలలో టీడీపీ వ్యవస్థాపకు డు నందమూరి తారక రామారావు మంగళగిరిలో 30 పడకల ఆస్పత్రికి భూమి పూజ చేశారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఆయన మనవడు లోకేశ్ 100 పడ కల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన అనంతరం మంగళగిరి టిడ్కో నివాసాల వద్ద దివిస్ లేబరేటరీ ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి పథకా న్ని లోకేశ్ ప్రారంభించారు. ఇళ్ల పట్టాల రూపంలో వెయ్యి కోట్ల ఆస్తి పంపిణీ: మరోవైపు మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలో చేపట్టిన ‘మన ఇల్లు – మన లోకేశ్’ తొలిదశ కార్యక్రమం నేటితో పూర్తవుతుంది.
దాదాపు 3 వేల మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ తొలిదశ కార్యక్రమాన్ని నేటితో పూర్తి చేయనున్నారు. ఇవాళ మొత్తంగా 832 మంది లబ్దిదారులు నారా లోకేశ్ చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టాలు అందుకో నున్నారు.
నేటితో మొత్తం 3000 మంది లబ్ధిదారులకు ఇళ్లప ట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయనున్నారు. లబ్ధిదారులకు లోకేశ్ తన సొంత ఖర్చులతో బట్టలు, పసుపు కుంకుమ పెట్టి, భోజనాలు ఏర్పాటు చేసి ఉచితంగా పట్టాలు అందచేస్తున్నారు.
అధికారం చేపట్టిన ఏడాదిలోపే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా వెయ్యి కోట్ల ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో పేదలకు పంపిణీ చేశామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి ప్రజలు తనకిచ్చిన మెజారిటీతో విమర్శకులకు సౌండ్ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఎప్పుడూ మంగళగిరేనా రాష్ట్రం మొత్తం తిరగాలని చంద్రబాబు సూచించారని వెల్లడించారు. మంగళగిరి లో తన పరువు కాపాడి గౌరవం పెంచిన వారికే తన తొలి ప్రాధాన్యమని నాన్నకు చెప్పానన్నారు.

