👉🏼 పదేళ్లలో గులాబీ సర్కారు వేలం వేసింది ఎన్ని ఎకరాలంటే?👉 రూ.170 కోట్ల లంచం.. రేవంత్-బీజేపీ ఎంపీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు..👉వక్ఫ్ సవరణ చట్టం 2025 కి వ్యతిరేకిస్తు  శనివారం “తెనాలి” లో మహా ధర్న..🌟అన్నా రాంబాబు ని సన్మానించిన స్టేట్ ఇంటలెక్చల్స్ ఫోరమ్ సెక్రెటరీ గా నియమితులైన మేడ బాదరినారాయణ*

👉 రూ.170 కోట్ల లంచం.. రేవంత్-బీజేపీ ఎంపీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలోని సుమారు 400 ఎకరాల భూమి కొన్నాళ్లుగా వివాదాస్పదంగా మారింది. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలోని సుమారు 400 ఎకరాల భూమి కొన్నాళ్లుగా వివాదాస్పదంగా మారింది. ఈ భూమిని తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ భూమి అటవీ ప్రాంతంలో ఉందని, దీనిని వేలం వేయడం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని విద్యార్థులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు సైతం స్పందించి ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశించాయి. ప్రస్తుతం పనులు నిలిచిపోయినా, విచారణ కొనసాగుతోంది. ఈ వివాదం నడుస్తుండగానే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ భూముల వ్యవహారంలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని, హెచ్‌సీయూకు చెందినవి కావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, కేటీఆర్ మాత్రం ఈ భూములు అటవీ భూములని గట్టిగా వాదిస్తున్నారు. కేటీఆర్ సంచలన ఆరోపణలు కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక బీజేపీ ఎంపీతో కలిసి ఈ భూ కుంభకోణాన్ని నడిపారని సంచలన ఆరోపణ చేశారు. త్వరలోనే ఆ బీజేపీ ఎంపీ పేరును బయటపెడతానని కూడా ఆయన అన్నారు. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో ‘క్విడ్‌ ప్రో క్వో’ (పరస్పర ప్రయోజనాల కోసం ఒప్పందం) జరిగిందని కూడా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు. – అటవీ భూములనేది కేటీఆర్ వాదన ఈ భూములు అటవీ భూములని, వాటిని అమ్మడం చట్టవిరుద్ధమని కేటీఆర్ స్పష్టం చేశారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, అడవికి ఉండాల్సిన 0.4 క్యానపీ లక్షణాలు ఉంటే అది ఎవరి భూమి అయినా అటవీ భూమిగానే పరిగణించాలని ఆయన గుర్తు చేశారు. ఈ భూములను వేలం వేయడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. Also Read – మోడీ టీంలో మాజీ ఐపీఎస్.. త‌మిళ‌నాడుపై పెద్ద స్ట్రాట‌జీ! – RBI నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు కేటీఆర్ తన ఆరోపణలను మరింత తీవ్రంగా చేస్తూ, రేవంత్ రెడ్డి ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీకి రూ.170 కోట్ల లంచం ఇచ్చారని ఆరోపించారు. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గైడ్‌లైన్స్‌ను కూడా ఉల్లంఘించారని విమర్శించారు. రేవంత్ రెడ్డి భూముల రేట్లను మార్చి, లేని విలువను ఉన్నట్లు చూపించి RBIని తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు. తనది కాని భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC)తో తాకట్టు పెట్టి రూ.10,000 కోట్లు తెచ్చుకున్నారని కూడా కేటీఆర్ ఆరోపించారు. TGIICకి బదిలీ, మ్యుటేషన్ లేకపోవడం..
మరో ఆరోపణలో కోర్టు తీర్పు వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి ఈ భూములను అమ్మడానికి TGIICకి బదిలీ చేశారని, కానీ ఇంకా మ్యుటేషన్ (భూమి యాజమాన్య రికార్డుల మార్పు) చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఈ ప్రక్రియలో పారదర్శకత లేదని ఆయన విమర్శించారు. – కేంద్ర సంస్థలకు కేటీఆర్ లేఖ ఈ కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, కేటీఆర్ ఆధారాలతో సహా RBI, CBI, CVC, SFIO, SEBI వంటి కేంద్ర సంస్థలకు లేఖ రాశారు. ఈ లేఖలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను వివరిస్తూ, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే, ఈ ఆరోపణలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక విచారణ ప్రారంభం కాలేదు. కేటీఆర్ ఆరోపణల్లో ఆ బీజేపీ ఎంపీ పేరు బయటకు వస్తే ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని, అది రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషఖులు భావిస్తున్నారు. – అనేక ప్రశ్నలు.. కేటీఆర్ చేస్తున్న ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఎప్పుడు బయటకు వస్తాయి? హెచ్‌సీయూ భూముల విషయంలో కేంద్ర సంస్థలు విచారణ ప్రారంభిస్తాయా? ఈ వివాదం తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. కేటీఆర్ లేదా ఇతర నాయకులు ఈ ఆరోపణలకు సంబంధించిన బలమైన ఆధారాలతో ముందుకు వస్తే, ఈ వివాదం కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. అప్పటివరకు ఇది రాజకీయంగా ఒకరిపై ఒకరు చేసుకునే ఆరోపణలుగానే కనిపిస్తుంది.

👉🏼 పదేళ్లలో గులాబీ సర్కారు వేలం వేసింది ఎన్ని ఎకరాలంటే? కంచ గచ్చిబౌలిలో టీజీఐఐసీ (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ)కు చెందిన 400 ఎకరాల భూముల్ని అమ్మే విషయంలో జరుగుతున్న రచ్చ తెలిసిందే. కంచ గచ్చిబౌలిలో టీజీఐఐసీ (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ)కు చెందిన 400 ఎకరాల భూముల్ని అమ్మే విషయంలో జరుగుతున్న రచ్చ తెలిసిందే. ఈ భూముల వేలాన్ని అడ్డుకునేందుకు విపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఒకవేళ ఈ భూముల్ని ప్రభుత్వం వేలం వేస్తే.. తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాన్ని రద్దు చేస్తామని.. అందుకే వాటి జోలికి ఏ సంస్థ రావొద్దంటూ బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ చేసిన హెచ్చరిక పెను సంచనలంగా మారింది. తెలంగాణలో ఈ తరహా హెచ్చరికలు ఇదే తొలిసారి. కేటీఆర్ వార్నింగ్ కొత్త చర్చకు తెర తీసినట్లైంది. పదేళ్ల కేసీఆర్ సర్కారులో ఇదే సంస్థకు చెందిన భూముల్ని వేలం వేశారా? వేస్తే ఎంత వేశారు? ఎంత ఆదాయం వచ్చింది? లాంటి ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. ఇదే సమయంలో టీజీఐఐసీ యాజమాన్యంలో ఉన్న భూములు ఎన్ని అన్న అంశంపైనా చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికినప్పుడు వచ్చే సమాచారం ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యానికి కలిగించేలా ఉండటం విశేషం. దేశంలోనే అత్యధిక పారిశ్రామిక ల్యాండ్ బ్యాంక్ ఈ సంస్థ సొంతంగా చెప్పొచ్చు. దేశంలోని ఇతర సంస్థలతో పోలిస్తే.. టీజీఐఐసీ వద్ద అత్యధికంగా 1.5 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్నట్లుగా తేలింది. ల్యాండ్ బ్యాంక్ పరంగా చూస్తే తెలంగాణ తర్వాత స్థానంలో మహారాష్ట్ర వద్ద 48,437 ఎకరాలు.. తమిళనాడు వద్ద 48,198 ఎకరాలు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో ఏపీ.. గుజరాత్..కర్ణాటక.. ఉత్తరప్రదేశ్.. రాజస్తాన్.. మధ్యప్రదేశ్.. హర్యానా రాష్ట్రాల పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థల వద్ద గణనీయమైన ల్యాండ్ బ్యాంక్ ఉన్నట్లుగా చెప్పొచ్చు. ఇక.. టీజీఐఐసీ వద్ద ఉన్న భూముల్ని పదేళ్ల కేసీఆర్ సర్కారు అమ్మిందా? అంటే.. ఎందుకు అమ్మలేదన్న సమాధానం వెంటనే వస్తుంది. నిధులు అవసరమైన ప్రతిసారీ పారిశ్రామిక అభివ్రద్ధి పేరుతో వేలం వేసిన వైనం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏర్పడిన గులాబీ సర్కారు తాను పాలించిన మొత్తం పదేళ్ల కాలంలో (తొమ్మిదిన్నరేళ్లు అనుకోండి) టీజీఐఐసీ భూముల వేలం ప్రక్రియ ద్వారా సమకూర్చుకున్న ఆదాయం అక్షరాల రూ.21వేల కోట్లుగా చెప్పాలి. కోట్లాది మందికి చుక్కలు టీజీఐఐసీ సంస్థ కొన్నిసార్లు సొంతంగా.. మరికొన్ని సందర్భాల్లో హెచ్ఎండీఏ తో కలిసి భూముల వేలాన్ని వేసింది. 2014 నుంచి 2023 మధ్య కాలంలో ఈ సంస్థలు వివిధ సందర్భాల్లో 811 ఎకరాల్ని వేలం వేసింది. ఇందులో కొన్ని ప్రైవేటు సంస్థలకు కేటాయింపులు జరిపింది. కోకాపేట..
ఖానామెట్ లో భూముల్ని వేలం ద్వారా కేసీఆర్ సర్కారు అప్పట్లో రూ.10వేల కోట్లు సమకూర్చుకోవటం తెలిసిందే. ఇదే బాట పట్టింది రేవంత సర్కారు. కంచ గచ్చిబౌలి సర్వే నెంబరు 25(పి)లో ఉన్న 400 ఎకరాల్ని తనఖా పెట్టిన సర్కారు రూ.10వేల కోట్ల రుణ సమీకరణ చేపట్టింది. రైతు భరోసా ఇచ్చేందుకు ఈ నిధుల్ని ఖర్చు చేయనున్నట్లుగా ప్రకటించింది. ఆ తాకట్టులో ఉన్న భూముల్ని డెవలప్ చేసి వేలం ద్వారా రూ.20 వేల నుంచి రూ.30వేల కోట్ల మేర నిధులు సమకూర్చుకోవాలన్న ఆలోచన చేసింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు జరిగిన పోరాటం గురించి అందరికి తెలిసిందే. ఇక్కడో పాయింట్ ప్రస్తావించాలి. పదేళ్ల పాలనలో 811 ఎకరాల్ని ఎలాంటి వివాదం తెర మీదకు రాకుండా అమ్మేసిన కేసీఆర్ సర్కారు.. అందుకు భిన్నంగా రేవంత్ సర్కారు వేలాన్ని అడ్డుకుంటున్న తీరు.. చేస్తున్న హెచ్చరికలు చూస్తే.. ఇది కదా రాజకీయం అని అనుకోకుండా ఉండలేం.

👉వక్ఫ్ సవరణ చట్టం 2025 కి వ్యతిరేకిస్తు  శనివారం “తెనాలి”  జామియా మస్ జిద్ వద్ద మహా ధర్న నిర్వహించటం జరిగింది. ఈ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకమని దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చెయ్యటం జరిగింది.

🌟అన్నా రాంబాబు ని సన్మానించిన స్టేట్ ఇంటలెక్చల్స్ ఫోరమ్ సెక్రెటరీ గా నియమితులైన మేడ బాదరినారాయణ*

*మార్కాపురం టౌన్ స్థానిక జవహర్ నగర్ కాలనీ అన్నా రాంబాబు  స్వగృహంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలలో స్టేట్ ఇంటలెక్చల్స్ ఫోరమ్ సెక్రటరీగా నియమితులైన మేడ వెంకట బాదరినారాయణ  గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు ని మర్యాదపూర్వకంగా కలసి సన్మానించడం జరిగింది…*

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..