గాడ్సే సిద్ధాంతాలను మోడీ ప్రోత్సహిస్తున్నాడు: సీఎం రేవంత్ రెడ్డి! ..👉కేంద్ర మంత్రి అమిత్‌షాకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ.. *నరసరావుపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారులు..👉సాక్షి తప్పుడు కథనాలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు.👉ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు.. ఉత్తర్వులు జారీ*..👉 ప్రొద్దుటూర్ పట్టణం లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 23 మంది అరెస్ట్…👉మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై పోలీస్ సంఘం సీరియస్..👉అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేయడానికి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు.. 👉కువైట్‌లో కాకినాడ మహిళపై దారుణం..

గాడ్సే సిద్ధాంతాలను మోడీ ప్రోత్సహిస్తున్నాడు: సీఎం రేవంత్ రెడ్డి! ..హైదరాబాద్:ఏప్రిల్ 09
కులాలు,మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చుపెడు తున్నారని, గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ అహ్మదాబాద్, వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాడ్సే సిద్ధాంతాన్ని మోడీ ప్రోత్సహిస్తున్నారని దేశాన్ని విభజించాలని క‌మ‌ల‌ నాధులు చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బిజెపిని అడుగుపెట్టనీయబోమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిం చారు .
తెలంగాణలో కులగణన చేసి రాహుల్‌ గాంధీ కి ఇచ్చిన మాట నిలబెట్టు కున్నట్లు తెలిపారు. అధికా రంలోకి వచ్చిన అనతి కాలంలోనే రైతులకు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. మోడీ, బీజేపీ నేతలు గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అహ్మదాబాద్ లో జ‌రుగుతున్న ఎఐసిసి స‌మావేశాల రెండో రోజైన నేడు రేవంత్ మాట్లాడు తూ..దేశంలో కుల గణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే అని గర్వంగా తెలిపారు. రాష్ట్రంలోని కుల గణనను తాము విజయవంతంగా పూర్తి చేశామని, అదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా జనాభా గణనతో పాటు కుల గణన జరగాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం 21 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశామని వెల్లడించారు. రైతులపై భారం తగ్గించేందుకు ప్రభు త్వం చేపట్టిన ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుం దని చెప్పారు.
పార్లమెంట్‌లో రాహుల్ గాంధీకి మైక్ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల గొంతుక అయిన ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి హానిక రమని విమర్శించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని, కానీ వాస్తవంగా దేశ యువత నిరుద్యోగంతో తల్లడిల్లు తుందని వ్యాఖ్యానించారు. ఆయన పాలనలో దేశానికి అభివృద్ధి కన్నా మోసం ఎక్కువగా జరిగిందని ఆరోపించారు.
రాహుల్ గాంధీతో కలిసి గాంధీ పరివారమంతా పనిచేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ప్రజాస్వా మ్యం, సమానత్వం, నైతికత కోసం పోరాడే నాయకుడిగా రాహుల్ గాంధీని ఆదరించాలని కోరారు. కాగా మోడీ పరివారాన్ని గాడ్సే పరివారంగా అభివర్ణించి తీవ్ర విమర్శలు చేశారు.
👉 పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో బుధవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు వివిధ హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ మరియు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు నరసరావుపేట పట్టణంలో వివిధ హోటల్స్ లో తనిఖీలు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. హోటల్స్ లో ఫుడ్ కలర్ మరియు టెస్టింగ్ సాల్ట్ నిషేధమని తెలిపారు. వివిధ హోటల్స్ లో శాంపిల్స్ ను తీసుకొని హైదరాబాద్ లేబర్ కి పంపిస్తామని తెలిపారు. ల్యాబ్ లో రిజల్ట్ ప్రకారం ఎవరైతే టెస్టింగ్ సాల్ట్ కలర్స్ వాడుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
👉సాక్షి తప్పుడు కథనాలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు*
* *టీడీపీ క్యాడర్ ను కించపరిచేలా..సమాజంలో విధ్వేశాలను రెచ్చగొట్టేలా తప్పుడు కథనాలు రాస్తున్న సాక్షి పై చర్యలు తీసుకోవాలంటూ వినతి*

టీడీపీ, టీడీపీ క్యాడర్ మీద సాక్షిలో వస్తున్న అసత్య కథనాలపై నేడు డీజీపీ కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీఎమ్మెల్సీ అశోక్ బాబు, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాంప్రసాద్, చిట్టిబాబు లు నేడు జగతి పబ్లికేషన్ ఎడిటర్స్ & డైరెక్టర్ల పై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. సాక్షి పత్రికలో వచ్చిన అసత్య కథనాలను చూపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ..
అవినీతి అక్రమార్జన సొమ్ముతో పుట్టిన సాక్షి అప్పటి నుండి నేటి వరకు అబద్దపు రాతలతో అసత్యాలతో సమాజంలో విషాన్ని నింపడమే పనిగా పెట్టుకుంది.. నాడు బాబాయిని గొడ్డలివేటుకు బలి చేసి సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అంటూ అసత్యాలు రాశారు. రాష్ట్రం లో ప్రతి పక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీ నేతలను, జగన్ ను జనం ఇంట్లో కూర్చో బెట్టినా వారికి సిగ్గు రావడంలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు.
👉మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై పోలీస్ సంఘం సీరియస్*    రామగిరి: ఏప్రిల్ 09
రామ‌గిరి ప‌ర్య‌ట‌న‌లో మాజీ ముఖ్య‌మంత్రి,వైసిపి అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది.
పోలీసులను బట్టలూడదీసి నిలబెడతామనడం గర్హనీయమని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు.
మాజీ సిఎంగా జగన్ చేసిన‌ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలన్నారు. బట్ట లూడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? తీవ్ర ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. అన్నారు.
ఈ వ్యాఖ్యల్ని జగన్ తక్షణమే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి. లేదంటే న్యాయపోరాటం చేస్తాం” అని శ్రీనివాసరావు హెచ్చరించారు.
👉అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేయడానికి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు* స్పెషల్ కోర్టు ఏలూరు వారి ఉత్తర్వులను అనుసరించి అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయడానికి ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర స్థాయి కమిటీకి చైర్మన్ గా చీఫ్ సెక్రటరీ వ్యవహరించనున్నారు.
*జిల్లా స్థాయి కమిటీలు విధులు:*
▪️అగ్రిగోల్డ్ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో పరిశీలించాలి.
▪️సంబంధిత సబ్ రిజిస్ట్రార్ల నుండి భూముల విలువ సేకరించాలి.
▪️అధీకృత సంస్థల నుండి సరసమైన మార్కెట్ ధర సేకరించాలి
▪️అగ్రిగోల్డ్ భూములు రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేయాలి.
👉 ప్రొద్దుటూర్ పట్టణం లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 23 మంది అరెస్ట్*
రూ.3,10,000-00 నగదు. 23 సెల్ ఫోన్ లు స్వాధీనం..
Online website ద్వారా నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు.. క్రికెట్ బెట్టింగ్ ద్వారా వ్యవస్థీకృత ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ముఠా
అందరి పైనా నాన్ బెయిలబుల్ కేసులు.
ఒక సారి వ్యవస్థీకృత నేరము నమోదైతే యువకుల బంగారు భవిష్యత్తు అంధకారమే..
ప్రొద్దుటూరు డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి పూతి భావన..*సిఐలు సదాశివయ్య, రామకృష్ణారెడ్డి, బాల మద్దిలేటి, గోవిందరెడ్డి, ఎస్సైలు సంజీవరెడ్డి శ్రీనివాసులు..*
👉ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు.. ఉత్తర్వులు జారీ** *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం*
*విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి పేద కుటుంబాల పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం చేసే ఖర్చు ఆధారంగా వ్యయాన్ని అంచనా వేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. అది నిర్ణయించిన ఫీజును ప్రభుత్వమే భరించనుంది..*
👉కువైట్‌లో కాకినాడ మహిళపై దారుణం.. యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్చిన యజమానులు*
రెండు నెలల క్రితం కువైట్ వెళ్లిన కాకాడ లక్ష్మి..
వేతనంగా 150 దీనార్లకు బదులు 100 దీనార్లు ఇచ్చిన యజమానులు..
ప్రశ్నించినందుకు యాసిడ్ పోసి పిచ్చాసుపత్రిలో చేర్చిన వైనం..లక్ష్మిని వెనక్కి తీసుకురావాలని కోరుతున్న కుటుంబ సభ్యులు..
భర్త మరణించడంతో జీవనోపాధి కోసం కువైట్ వెళ్లిన ఓ మహిళ యజమానుల చేతిలో యాసిడ్ దాడికి గురైంది. ఆసుపత్రి సిబ్బంది ఫోన్ ద్వారా బాధిత కుటుంబానికి సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త మృతి చెందాడు. దీంతో పొట్ట కూటి కోసం కువైట్ వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం వైఎస్సార్ జిల్లాకు చెందిన ఒక ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లింది. అక్కడ ఓ ఇంట్లో పనిచేస్తే 150 దీనార్లను వేతనంగా ఇస్తారని ఒప్పందం కుదిరింది.
అయితే, ఉద్యోగంలో చేరిన తర్వాత 100 దీనార్లు మాత్రమే ఇవ్వడంతో యజమానులను లక్ష్మి ప్రశ్నించింది. దీంతో వారు కోపంతో లక్ష్మిపై యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్పించారు. పది రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. బాధితురాలు కోలుకున్న తర్వాత జరిగిన విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి చెప్పింది. దీంతో వారు ఆమెతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. అలాగే, కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు.
కాగా, లక్ష్మి పాస్‌పోర్టు యజమానుల వద్ద ఉండిపోవడంతో, తమపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటేనే దానిని తిరిగి ఇస్తామని వేధిస్తున్నట్టు లక్ష్మి తెలిపింది. దీంతో ఏం చేయాలో తెలియక ఆసుపత్రిలోనే మగ్గిపోతోంది. లక్ష్మిని కువైట్‌కు పంపిన ఏజెంట్‌ను సంప్రదిస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి లక్ష్మిని ఆదుకోవాలని కోరుతున్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..