👉 రైతు డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పంజాబ్ రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆదివారం విరమించారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి పలు డిమాండ్ల సాధన కోసం గతేడాది నవంబరు 26న ఆయన ఈ నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, రైల్వే శాఖ సహాయ మంత్రి రన్‌వీత్ సింగ్ బిట్టు శనివారం జగ్జీత్‌ను కలిసి దీక్ష విరమించాల్సింగా కోరగా, మర్నాడే ఆయన దీక్ష విరమించారు. ఆదివారం పంజాబ్ ఫతే్‌హగఢ్ సాహిబ్ జిల్లాలో నిర్వహించిన ‘కిసాన్ మహాపంచాయత్’లో దల్లేవాల్ దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, మే 4న రైతులతో చర్చలు జరుగుతాయని దల్లేవాల్‌ను కలిసిన అనంతరం శివరాజ్ చౌహన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

👉వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా సోదరుడు అహ్మద్ బాషాను కడప తాలూకా పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. 2022లో నగరంలోని వినాయకనగర్‌లో మినిస్టరు కాలనీ పేరిట అంజద్ బాషా కుటుంబ సభ్యులు లేఅవుట్ వేశారు. దీనికి అనుమతులు లేవని ఆరోపణలు వచ్చాయి. ఈ లేఅవుట్‌కు ఆనుకునే అప్పటి టీడీపీ నేత, ఇప్పుడు వైసీపీలో ఉన్న జమీల్‌కు స్థలం ఉంది. దీని విషయమై అహ్మద్‌బాషా జమీల్, అతడి వర్గంపై దాడి చేశారు. ఈ దాడిలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తికి కాళ్లు విరిగాయి. అహ్మద్‌బాషాపై కడప తాలూకా పోలీసుస్టేషన్‌లో నాన్ బెయిల్‌బుల్ కేసు (క్రైం నం.402/22) నమోదైంది. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు. ఇది కాకుండా ఆయనపై కడప చిన్నచౌకులో ఒకటి, టూ టౌన్‌లో మరో నాలుగు కేసులు ఉన్నాయి. అప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో వీరి జోలికి ఎవరూ పోలేదు. ఇక.. ఎన్నికల సమయంలో ఇప్పటి హోంమంత్రి అనిత, అచ్చెన్నాయుడుపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా బాషా పోస్టులు పెట్టారు. వీటిపైనా కేసు నమోదైంది. ఎన్నికలకు ముందు అహ్మద్ బాషా ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్.మాధవిని, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డిని తీవ్ర పదజాలంతో దూషించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై కూడా కేసు నమోదైంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక అహ్మద్‌బాషా సైలెంట్ అయిపోయారు.ఎక్కువ కాలం గల్ఫ్‌లో ఉంటూ హోటల్ బిజినెస్ చేస్తున్నారు. ఇంకోవైపు.. ఆయనపై చిన్నచౌకు పోలీసులు లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు. రంజాన్ పండక్కి కడపకు వచ్చిన ఆయన తిరిగి గల్ఫ్ వెళ్లేందుకు ఐదురోజులుగా ముంబైలో ఉంటున్నారు. శనివారం రాత్రి గల్ఫ్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ముంబై ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని అక్కడ సహారా పోలీసుస్టేషన్‌లో అప్పగించి కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం అక్కడకు ఆయన్ను అదుపులోకి తీసుకుని బాంద్రా కోర్టులో హాజరుపరచింది. అక్కడి కోర్టు అనుమతితో సోమవారం కడపకు తీసుకురానున్నారు. ఇక్కడి న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. ఈ విషయం తెలియడంతో టీడీపీ కార్యకర్తలు ఆదివారం కడపలో సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆర్.శ్రీనివాసరెడ్డిని నాడు బాషా తీవ్ర పదజాలంతో దూషించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘అయిపాయ్.. పాపం పండింది’ అంటూ వైరల్ చేశారు. 
👉వైఎస్ జగన్ కు బిగ్ షాక్.. విశాఖలో వైసీపీ సీనియర్ నేత గుడ్ బై!* *వైసీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత*
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విశాఖపట్నం కి చెందిన సీనియర్ నేతగా ఉన్న చొక్కాకుల వెంకటరావు వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. నిన్న రాత్రి తన రాజీనామా పైన ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన రాజీనామా లేఖను వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపినట్టు పేర్కొన్నారు.
*విశాఖలో వైసీపీకి షాక్* అయితే త్వరలోనే ఆయన ప్రస్తుత అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీలలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపైన ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు.
2013లో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన చొక్కాకుల ఓటమిపాలయ్యారు. అప్పుడు బిజెపి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం బిజెపిలో చేరారు.
*జగన్ పాలనలో వీకేపీసీపీసీఐఆర్‌యూడీఏ చైర్మన్ గా అవకాశం* బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేసిన ఆయన బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకట్రావు భార్య లక్ష్మికి విశాఖపట్నం, కాకినాడ పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గా జగన్ అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత చొక్కాకుల కూడా అదే సంస్థకు చైర్మన్ గా పనిచేశారు.
👉 బాలిక కిడ్నాప్ కలకలం..!!! అమలాపురం పట్టణంలో కొంకాపల్లికి చెందిన బాలిక కిడ్నాప్ కల కలం సృష్టించింది. మెయిన్ రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల తన కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసినట్లు బాలిక తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్యూషన్ కు వెళ్లి వస్తుండగా ఈ కిడ్నాప్ జరిగిందని, అమలాపురం శుభ కలశం సెంటర్ వద్ద ట్రాఫిక్ కారు చిక్కుకోవడంతో అందులోని వ్యక్తి చేతిని కొరికి కిందికి దిగిపోయినట్టు బాలిక తెలిపింది. సీఐ వీరబాబు దర్యాప్తు చేస్తున్నారు.
👉 *అయినవిల్లి జనసేన లో భగ్గుమన్న విభేదాలు.. జనసేన నాయకుడు పై మండల అధ్యక్షుడు దాడి, పోలీసుల అదుపులో మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్..*
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా..అయినవిల్లి జనసేన నాయకుడు తొలేటి ఉమ పై రాత్రి మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ దాడి..అర్ధరాత్రి మండల అధ్యక్షుడు రాజేష్ తోటు పలువురు వ్యక్తులు ఇంటిలోకి చొరబడి కర్రలతో దాడి.. దాడిలో తీవ్రంగా గాయపడిన జనసేన నాయకుడు ఉమ , అతని భార్య.. తలపై బలంగా కొట్టడంతో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలింపు.. మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ కారును ధ్వంసం చేసిన దాడిలో గాయపడిన ఉమ అనుచరులు.. పోలీసుల అదుపులో జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ .. ఈ సంఘటనలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిన్న మధ్యాహ్నం పి.గన్నవరం పార్టీ ఆఫీసులో జరిగిన మండలం మీటింగ్ లో ఇద్దరి మధ్య జరిగిన ఒక వాగ్వాదం దాడికి కారణం..
👉బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి SMలో ప్రకటన చేశాడు..*
*HYD పాతబస్తీలోని తన ఫ్రెండ్ షాపుకు రావాలని చెప్పాడు. వకీల్ ఒక్కొక్కరి దగ్గర రూ. 100 తీసుకుని గుండు కొట్టి, కెమికల్స్ రాసి పంపించాడు. గుండు ఆరిపోకుండా ఉంచాలని షరతు కూడా పెట్టి వెళ్లిపోయాడు. కొంతమందికి రియాక్షన్ అయి బొబ్బలు వచ్చాయి. బట్టతల ఏమో కాని ఉన్న వెంట్రుకలూ పోయాయని వందలాది మంది యువకులు లబోదిబోమంటున్నారు..
👉శ్రీ ఉపదేశ రామస్వామివారి 61వ వార్షిక కళ్యాణమహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*
*కంభం మండలం లింగోజిపల్లె గ్రామంలో శ్రీ ఉపదేశ రామస్వామి వారి 61వ వార్షిక కళ్యాణమహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు…

