👉 పిఠాపురం…కూటమి ఏం చేస్తుంది ? పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు కచ్చితంగా ఎమ్మెల్సీ దక్కుతుందని భావించారు. కానీ పది నెలల రాజకీయం చూస్తే వర్మను సైడ్ లైన్ లో చేస్తున్నారు అన్న భావన అయితే ఆయనతో పాటు టీడీపీకి కూడా వచ్చింది. ఏపీలో ఇపుడు హాట్ టాపిక్ గా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. నిజానికి ఇప్పటిదాకా ఈ నియోజకవర్గం ఎపుడూ అంతగా చర్చలోకి వచ్చేది కాదు. అక్కడ ఎవరు ఎమ్మెల్యే అన్నది కూడా తెలిసేది కాదు. అయితే 2024 ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసినది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలా ఆయన సినీ ఇమేజ్ తో పాటు రాజకీయంగా బలమైన సామాజిక వర్గం దన్నుతో పిఠాపురం అన్నది ఏపీలో వీఐపీ సీటుగా ముందుకు వచ్చింది. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. ఇక పిఠాపురంలో జనసేన నేతల జోష్ ఒక లెవెల్ లో ఉంది. సహజంగానే తమ నాయకుడు ఉన్నత పదవులు అందుకుంటే క్యాడర్ కి లోకల్ లీడర్ కి ఎంతో సంబరం. అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్. దాంతో వారంతా యమ జోరుగా ఉన్నారు. సరిగ్గా అదే టీడీపీకి ఇబ్బందిగా మారింది. పిఠాపురం టీడీపీకి కూడా కంచుకోట లాంటి సీటు. ఆ పార్టీ సైతం అనేక ఎన్నికల్లో గెలిచి వచ్చింది. పైగా పిఠాపురంలో బలమైన నాయకుడుగా ఎస్వీఎ ఎన్ వర్మ ఉన్నారు. నిజానికి సామాజిక వర్గాల పరంగా చూస్తే అది సాధ్యం కాదు కానీ ఆయన తన సమర్థతతో పనితీరుతో మంచితనంతో దశాబ్దాలుగా ప్రజలఒతో పెనవేసుకున్న అనుబంధంతో ఆ పట్టు సాధించారు. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు కచ్చితంగా ఎమ్మెల్సీ దక్కుతుందని భావించారు. కానీ పది నెలల రాజకీయం చూస్తే వర్మను సైడ్ లైన్ లో చేస్తున్నారన్న భావన అయితే ఆయనతో పాటు టీడీపీకి కూడా వచ్చింది. పైగా పుండు మీద కారం జల్లినట్లుగా వర్మకు బదులుగా అన్నట్లు నాగబాబుకు ఆ పదవి ఇచ్చారు. పైగా ఆయననే పిఠాపురం తెచ్చి పవన్ ని బదులుగా అధికార పెత్తనాలు అప్పగిస్తున్నారు. దీంతో వర్మ వర్గం ఒక్క లెక్కన రగిలిపోతోంది. నిజం చెప్పాలీ అంటే వర్మ ఈ రోజుకీ సహనంతోనే ఉన్నారని అంటున్నారు. ఆయన తనకు ఎమ్మెల్సీ సీటు దక్కకపోయినా మీడియా ముందు జాగ్రత్తగా మాట్లాడారు అనేక సమీకరణలు ఉంటాయి. అధినాయకత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా అని క్యాడర్ కి సర్దిచెప్పారు. ఇక ఆయన పర్యటనలలో ఎక్కడా జనసేనను తక్కువ చేయడం లేదు పైగా తన ఫ్లెక్సీలలో పవన్ ఫోటోని పెట్టుకునే వెళ్తున్నారు. ఆ మాటకు వస్తే వర్మకు పవన్ తో ఏమీ లేదని అంటారు. లోకల్ క్యాడర్ తోనే టీడీపీకి విభేదాలు ఉన్నాయి. అలాగ వర్మకు కూడా లోకల్ లీడర్స్ తోనే ఉంది తంటా అని అంటున్నారు. దానిని అర్ధం చేసుకుని మొదట్లోనే పరిష్కారాలు చూపించి ఉంటే బాగుండేది. కానీ అలా జరగడం లేదు, పైగా అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. దీని వల్ల కూటమి ఐక్యత పిఠాపురంలోనే భగ్నం కాదని ఇది ఒక ఉదాహరణగా చేసుకుని అన్ని చోట్లా పాకుతుందని అంటున్నారు. వర్మ వంటి నిబద్ధత కలిగిన లీడర్ విషయంలో టీడీపీ అధినాయకత్వం ఎలా వ్యవహరిస్తుంది అన్నది కూడా మొత్తం పార్టీ క్యాడర్ చూస్తోంది అని చెబుతున్నారు. పొత్తులు ఉన్నా కూడా తమ పార్టీని తమ నాయకులను సైతం కాపాడుకోవాలి కదా అన్న చర్చ ఉంది. టీడీపీ అధినాయకత్వం వర్మకు సరైన పొజిషన్ ఇచ్చి పిఠాపురంలో ఆయనతో పాటు టీడీపీ జెండాను కూడా నిలబెట్టాలని అంతా కోరుకుంటున్నారు. అదే సమయంలో వర్మకు ప్రయారిటీ ఇచ్చినా పొలిటికల్ గా టాల్ ఫిగర్ అయిన పవన్ కి కానీ జనసేనకు కానీ వచ్చిన ఇబ్బంది కూడా లేదని అంటున్నారు. అలా కాకుండా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తే మాత్రం కూటమికి పొలిటికల్ గా స్ట్రోక్ ఇక్కడ నుంచే ఉండొచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా పిఠాపురం టఫ్ టాస్క్ గా మారిగా లేక చేసుకున్నారా అంటే రెండింటిలోనూ నిజం ఉందని అంటున్నారు.
👉ట్రంప్, మస్క్ లకు మూడినట్టే.. అమెరికా వ్యాప్తంగా నిరసన జ్వాల ఇక ఎలాన్ మస్క్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు కూడా బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.* మస్క్ ఇటీవల తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు, ఆయన వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరోసారి నిరసనలతో అట్టుడుకుతున్నాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌లకు వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పారు. ప్లకార్డులు చేతబూని, నినాదాలు చేస్తూ నగరాల కూడళ్లలో భారీ ర్యాలీలు నిర్వహించారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే అతి పెద్ద ప్రజాందోళనగా భావిస్తున్నారు. ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం , నిరుద్యోగం విపరీతంగా పెరిగే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు. గతంలో ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధాల కారణంగా దేశీయ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయని, మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాలనే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్య ప్రజలపై ఈ నిర్ణయం మరింత భారం మోపుతుందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. *ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు కేవలం వారి వ్యక్తిగత జీవితాలపైనే కాకుండా ప్రభుత్వ సేవల నాణ్యతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని నిరసనకారులు వాపోతున్నారు. ఇక ఎలాన్ మస్క్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు కూడా బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మస్క్ ఇటీవల తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు, ఆయన వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ముఖ్యంగా ఆయన కంపెనీలలో ఉద్యోగుల తొలగింపు , కార్మిక చట్టాల ఉల్లంఘన వంటి ఆరోపణలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. అంతేకాకుండా, మస్క్ యొక్క కొన్ని రాజకీయపరమైన వ్యాఖ్యలు కూడా విమర్శలకు దారితీశాయి. అందుకే ఎల్బీ, క్యాచ్ లు మిస్ నిరసనకారులు తమ ఆందోళనను వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. కొందరు ట్రంప్, మస్క్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేయగా, మరికొందరు వారి విధానాలను తప్పుబడుతూ కరపత్రాలు పంచుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ నిరసనలకు భారీగా మద్దతు లభిస్తోంది. స్టాప్ ట్రంప్ ..* రెసిస్ట్ మస్క్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉండటం ఈ నిరసనల తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నిరసనల ప్రభావం రాబోయే రోజుల్లో అమెరికా రాజకీయాలపై ఏ విధంగా ఉంటుందో చూడాలి.
ఇప్పటికే దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రజాందోళనలను ఏ విధంగా పరిగణిస్తుందో, ప్రజల ఆందోళనలను తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మొత్తానికి, అమెరికాలో జరుగుతున్న ఈ భారీ నిరసనలు దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ట్రంప్ మరియు మస్క్‌ల విధానాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఈ నిరసనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ నిరసనలు మరింత ఉధృతమయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
👉 *భగవంతుడా.. క్రికెట్ బెట్టింగ్ మరొకరి ఉసురు తీసింది..*
బెట్టింగ్ మహా చెడ్డది.. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా నడిరోడ్డుపై నిలబెట్టేస్తుంది అని చెప్పినా కొందరు యువకులు పట్టించుకోవడం లేదు. ఈజీ మనీ వేటలో పావులుగా మారి.. జీవితాలను దుర్బరం చేసుకునేవారు కొందరైతే.. అర్థాంతరంగా ముగించేవారు కొందరు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌తో అప్పులపాలైన ఓ యువకుడు రైలు కింద పడి తనువు చాలించాడు.
సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపిన డీటేల్స్ ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌లోని సుచిత్ర, BHEL క్వార్టర్స్‌లో ఉంటున్న రాజ్‌వీర్‌సింగ్ ఠాగూర్(25) ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. దీంతో నాయనమ్మ, చిన్నాన్నల వద్ద పెరిగాడు. అయితే అతను ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటుపడ్డాడు. ఆపై మద్యం కూడా. ఈ రెండింటి కాంబినేషన్ ఎలాంటి మనిషిని అయినా అద:పాతాళానికి పడేస్తుంది. యథావిధిగానే అప్పలు అయ్యాయి. తిరిగి చెల్లించాలని అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలో పాలు పోలేదు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అమ్ముగూడ-సనత్‌నగర్ రైల్వేస్టేషన్ల మధ్య వస్తున్న గూడ్స్ రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

