🌟ఫీజుల కోసం వేధిస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి*🌟కాకినాడ జిల్లా పిఠాపురంలో భారీగా మోహరించిన పోలీసులు..👉మాజీ ఉప ఉపముఖ్య మంత్రి అంజాద్ బాషా ఇంటి ముందర మహిళల ఆందోళన… * మాజీ MP హర్ష కుమార్పై కేసు నమోదైంది..డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నైజీరియన్లు అరెస్ట్*..రైలులో బాలికపై లైంగికదాడి.. వీడియో చిత్రీకరణ*..👉హైదరాబాద్ బోయిన్పల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మిస్సింగ్*..మార్కాపురంలో దొంగల చేతివాటం..*తాడిపత్రిలో డ్రోన్ ఆపరేటింగ్ పై పోలీసులకు శిక్షణ..

👉కంచ గచ్చిబౌలి వివాదాస్పద భూమిలోకి బయటి వ్యక్తుల ప్రవేశం నిషేధం.. ఈ మేరకు పోలీస్ శాఖ కీలక ఆదేశాలు..ఆ భూముల్లోకి బయటి వ్యక్తులు, సంబంధం లేనివాళ్లు వెళ్లరాదని ఆదేశం.. ఎవరైనా ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న సైబరాబాద్ పోలీసులు
👉 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ .. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఒక వ్యక్తి భూమి FTL పరిధిలోకి రాకుండా సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.7 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఇరిగేషన్ ఏఈఈ టీ.రవి కుమార్.. రూ.1లక్ష అడ్వాన్స్ తీసుకుంటుండగా రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
👉ధరూర్ పోలీస్ స్టేషన్ నూతన భవనానికి భూమి పూజ*

జోగులాంబ గద్వాల జిల్లా (ఏప్రిల్ 04): గద్వాల జిల్లా, ధరూర్ పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి శుక్రవారం డీజీపీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గురునాథ్ రెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఏం.రమేష్, ఐపీఎస్., మల్టీ జోన్ -II ఐజిపి శ్రీ వి.సత్యనారాయణ, ఐపీఎస్, జోగుళాంబ జోన్ – 7 , డి . ఐ.జి శ్రీ ఎల్. ఎస్. చౌహాన్, ఐపీఎస్, జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఈఈ వై.బి.శ్రీనివాస రావుతో కలిసి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన శిల పలకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా డిజిపి డాక్టర్ జీతేందర్ మాట్లాడుతూ.. అత్యాధునిక అంగులతో ధరూర్ మండల కేంద్రం లో పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని 2 కోట్ల 65 లక్షలతో తొందరగా నిర్మించడం జరుగుతుందని అందుకు సంబంధించి నేడు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరికీ పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉండి పారదర్శకంగా సత్వర సేవలు అందించేలా పోలీస్ శాఖ కృషి చేస్తుందని అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..ధరూర్ మండలం కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చెయ్యడం అభినందనీయం అని,ధరూర్ మండల ప్రజల 30 ఏళ్ల కల నెరవేర బోతుందని, పోలీస్ స్టేషన్ వెళ్లాలంటే డ్యాం దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది కానీ నేటితో ఆ సమస్యను పరిష్కరించడం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నిర్మాణంకు భూమి పూజ చేయడం జరిగిందని, త్వరలోనే ప్రజలకు అందుబాటులో పోలీస్ స్టేషన్ ఏర్పాటు కావడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని గద్వాల్ టౌన్ లో మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు, ట్రాపిక్ పోలీస్ స్టేషన్, కేటి దొడ్డి పోలీస్ స్టేషన్ నిర్మాణం మరియు సర్కిల్ కార్యాలయాన్ని అప్ గ్రేడ్ చెయ్యడం గురించి ఎమ్మెల్యే డీజీపికి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్పి శ్రీ వై మొగిలయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, గద్వాల్ సిఐ టంగుటూరి శ్రీను, ధరూర్ ఎస్సై శ్రీహరి, హౌసింగ్ కార్పొరేషన్ ఏ.ఈ అనీల్ శాస్త్రి, ఆయా పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు పాల్గొన్నారు.

👉మాజీ ఉప ఉపముఖ్య మంత్రి అంజాద్ బాషా ఇంటి ముందర మహిళల ఆందోళన…కడప జీల్లా..

అంజాద్ బాషా ముఖ్య అనుచరుడు ఇబ్రహీం మియా మహిళల వద్ద అప్పుగా డబ్బులు తీసుకుని కట్టడం లేదని ఆవేదన…గత కొన్నేళ్లుగా మియా బాకీ డబ్బులు చెల్లించడం లేదని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు…వన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న మియా ను అంజాద్ బాషా విడిపించుకుని వెళ్లాడని అంజాద్ బాషా ఇంటి ముందు ధర్నా కు దిగిన మహిళలు…మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కు మహిళలు మధ్య వాగ్వాదం
👉పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎస్పీ కంచ శ్రీనివాస్  ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ లోకనాథం ఎస్సై వేణు ఎస్సై ఆదినారాయణఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు*

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ట్రాఫిక్ సీఐ లోకనాథం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ వాడకాని ప్రయోజనాలు, ప్రమాదాలను నివారించే పద్ధతులు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించబడింది.

సీఐ లోకనాథం మాట్లాడుతూ, “ప్రతి డ్రైవర్ కూడా ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని” అన్నారు. ఆటో డ్రైవర్లు వాహనాల్లో ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పలువురు ఆటో యూనియన్ సభ్యులు, డ్రైవర్లు పాల్గొన్నారు. చివరగా, ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్లకు పాంఫ్లెట్లను పంపిణీ చేసి, ట్రాఫిక్ భద్రతపై శిక్షణ ఇచ్చారు.
👉జిల్లా ఎస్పీ  ఆదేశాలతో తాడిపత్రిలో డ్రోన్ ఆపరేటింగ్ పై పోలీసులకు శిక్షణ

జిల్లా ఎస్పీ  పి.జగదీష్  ఆదేశాలతో తాడిపత్రి పట్టణంలో ఈరోజు డ్రోన్ ఆపరేటింగ్ పై ఆ సబ్ డివిజన్ పోలీసులకు శిక్షణా సదస్సు నిర్వహించారు. ముందుగా… డ్రోన్ల సేవలు పోలీసులు ఏవిధంగా వినియోగించుకోవచ్చో డ్రోన్ ఆపరేటింగ్ లో సుశిక్షితుడైన కానిస్టేబుల్ వీరేంద్రనాథ్ రెడ్డి శిక్షణలో భాగంగా వివరించారు. అనంతరం అవుట్ డోర్ శిక్షణలో భాగంగా తాడిపత్రి శివారు ప్రాంతానికి వెళ్లి డ్రోన్లు ఎలా ఆపరేట్ చేయాలి, ఏలాంటి సందర్భాలలో డ్రోన్ ఎగురవేయవచ్చో ప్రాక్టికల్ గా చూయిస్తూ తర్ఫీదునిచ్చారు. డ్రోన్ సాంకేతికతను వినియోగించుకుని నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి మరియు శాంతి భద్రతల పర్యవేక్షణలో ఎలా వాడవచ్చో శిక్షణ ఇచ్చారు.
👉ఆటో రిక్షాల నుంచి డార్జిలింగ్ లైట్ల తొలగింపు
ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ ఆదేశాల మేరకు వాహన తనిఖీ అధికారులు శుక్రవారం జంగారెడ్డిగూడెం రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించి 48 కి పైగా ఆటో రిక్షాలకు అమర్చిన 63 డార్జిలింగ్ లైట్లను తొలగింపచేసి, తదనంతరం ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.
గత నెల నుంచే వాహన తనిఖీ అధికారులు జిల్లా వ్యాప్తముగా తనిఖీలు నిర్వహించి ఆటో రిక్షాలకు మరియు ఇతర వాహనాలకు అదనంగా ఏర్పాటు చేసిన ఎల్.యి.డి. లైట్లను, లౌడ్ హారన్లను మరియు లౌడ్ స్పీకర్ల ను తొలగింపచేసి, కొన్ని వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు డిటిసి తెలిపారు.
వాహనాలకు అదనంగా ఏర్పాటు చేసిన ఎల్.యి.డి. లైట్ల వలన ఎదురుగా వచ్చే వాహనచోదకులకు ఇబ్బంది కలుగుతుందని మరియు ఆటో రిక్షాల్లోని లౌడ్ స్పీకర్ల నుంచి వెలువడే అధిక ధ్వని ప్రయాణికులు అసౌకర్యానికి గురిచేస్తుందని డీటీసీ తెలిపారు. రహదారి భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదన్నారు.
ఈ తనిఖీల్లో వాహన తనిఖీ అధికారులు పి.రమేష్ బాబు, ఎన్.నెహ్రు, పి.నరేంద్ర బాబు, డి.ప్రజ్ఞ పాల్గొన్నారు.
👉మార్కాపురంలో దొంగల చేతివాటం..మార్కాపురం పట్టణ పరిధిలోని కొండేపల్లి రోడ్లో దొంగలు చేతివాటం ప్రదర్శించారు..తాళం వేసిన ఇంట్లో చొరబడి, ఇంట్లో ఉన్న బీరువాను పగలగొట్టి 30 వేల రూపాయల నగదు, కొంత బంగారం ను దొంగతనం చేసినట్లు గుర్తించిన ఇంటి యజమాని..పట్టణ పోలీసులకు సమాచారం అందించిన బాధితులు..దొంగతనంపై విచారణ చేపట్టిన పట్టణ పోలీసులు..
👉వైన్ షాప్ లో ముందు బాబుల పైసాచికత్వం*

కృష్ణాజిల్లా: గన్నవరం మండలం కోనాయి చెరువు శివాలయం దగ్గర మద్యం షాపులో మందు బాబుల కరకసత్వం… ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన….

వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్లకు అనుమతి లేకుండా వైన్ షాప్ యజమానులే సొంత నిర్ణయంగా పర్మిట్ రూములు ఏర్పాట్లు…మందు బాబుల్ని ఈ పర్మిట్ రూములు పెట్టి స్వేచ్ఛగా వదలడం వల్ల హద్దు మీరుతున్న మందుబాబులు…వైన్ షాపుల్లో ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్నట్టు చూస్తున్న అధికారులు….అధికారులు కాసులు మత్తులో ఉన్నారా లేక మందు బాబులే కదా అని జాలి చూపడం లేదా….
👉పులివెందులలో 1.7గ్రాముల గంజాయి పట్టుకున్న డీఎస్పీ మురళి నాయక్,అర్బన్ సీఐ నరసింహులు…కడప జిల్లా…పులివెందుల…

పానపల్లి రోడ్డు లో ఉన్నటువంటి కోతి సమాధి వద్ద ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అనుమానస్పదంగా కనబడడంతో…మల్లికార్జున అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు…మల్లికార్జున ను అరెస్ట్ చేయగా తక్కువ రేటుతో కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు తెలిపాడు…

👉సికింద్రాబాద్ వస్తున్న రైలులో బాలికపై లైంగికదాడి.. వీడియో చిత్రీకరణ*

సంబల్‌పూర్ నుంచి కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వస్తున్న బాలిక కాలకృత్యాలు
తీర్చుకునేందుకు వెళ్లిన బాలికపై నిందితుడి అఘాయిత్యం..139 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి..రైలు సికింద్రాబాద్ చేరుకున్న వెంటనే నిందితుడి అరెస్ట్..కుటుంబంతో కలిసి సంబల్‌పూర్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఓ బాలికపై రక్సౌల్ ఎక్స్‌ప్రెస్‌లో లైంగిక దాడి జరిగింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు ఆ ఘటనను వీడియో తీశాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి కథనం ప్రకారం.. సంబల్‌పూర్‌కు చెందిన కుటుంబం రక్సౌల్ ఎక్స్‌‌ప్రెస్‌లో హైదరాబాద్ బయలుదేరింది. వారు ప్రయాణిస్తున్న కోచ్‌లోనే బీహార్‌లోని మంద్వాడ్ జిల్లా ఖజోలి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ (21) ప్రయాణిస్తున్నాడు.

రైలు కేల్తార్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండగా కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాలిక టాయిలె‌ట్‌లోకి వెళ్లింది. ఆమెపై కన్నేసిన సంతోష్ కుమార్ కూడా వెంటే వెళ్లాడు. బాలికను బలవంతంగా టాయిలెట్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఫొటోలు కూడా తీశాడు. తెల్లవారిన తర్వాత బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తండ్రి వెంటనే 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. రైలు సికింద్రాబాద్ చేరుకున్న వెంటనే అప్పటికే కాపు కాసిన రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, ఘటన ఇటార్సీ రైల్వే స్టేషన్‌ పరిధిలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపారు.
👉హైదరాబాద్* డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నైజీరియన్లు అరెస్ట్*..నిందితుల నుంచి డ్రగ్స్ స్వాధీనం
చేసుకున్న నార్కోటిక్ బ్యూరో.. డ్రగ్స్ తో సంపాదించిన డబ్బులు హవాల రూపంలో విదేశాలకు తరలింపు.. ఫారెక్స్, మనీ ట్రాన్స్ ఫర్ల ద్వారా డబ్బులు పంపుతున్న నైజీరియన్లు.. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న ముఠా
👉హైదరాబాద్ బోయిన్పల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మిస్సింగ్*

ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉంటున్న మహేశ్..  ఆరుగురు ఆటో బుక్ చేసుకొని ఎంజీబీఎస్కు వెళ్లినట్లు గుర్తింపు.. సీసీ కెమెరాల ఆధారంగా ఆరుగురి ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నాలు.. అఘోరీ చెర నుంచి బయటపడ్డ మంగళగిరి అమ్మాయి శ్రీవర్షిణి*

వివాదాస్పద లేడీ అఘోరీ చెర నుంచి మంగళగిరి అమ్మాయి శ్రీ వర్షిణి ని గుజరాత్ పోలీసులు విడిపించారు. గత నెలలో మంగళగిరిలో శ్రీ వర్షిణీ తల్లిదండ్రుల ఇంట్లో బస చేసిన అఘోరీ మాయమాటలు చెప్పి శ్రీ వర్షిణిని లోబరుచు కుంది. గత నెల రోజులుగా శ్రీవర్షిణి అఘోరీతో కలిసి ఉంటుంది. తమ కూతురుకి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిందని శ్రీవర్షిణి తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్దు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. తొలుత శ్రీవర్షిణి మేజర్ అని బుకాయించిన అఘోరీ శుక్రవారం గుజరాత్ పోలీసులకు చుక్కలు చూపే ప్రయత్నం చేసింది. గుజరాత్ పోలీసులు తమ స్టైల్ లో మర్యాదలు చేయడంతో అఘోరీ లొంగిపోయింది. శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు గుజరాత్ కు వెళ్లి ఆమెను విడిపించారు.
*మాజీమంత్రి విడుదల రజనికి జైలు శిక్షా?*

అమరావతి :ఏప్రిల్ 05
విజిలెన్స్ తనిఖీల పేరుతో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి సొమ్ము వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి విడదల రజిని, తదితరుల పై పదేళ్ల వరకు జైలుశిక్షకు వీలున్న ఐపీసీ సెక్షన్ 386ని చేర్చినట్లు ఏజీ దమ్మాల పాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు.

పల్నాడు జిల్లా యడ్లపాడు లోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం రజిని, ఆమె మరిది గోపి పిటిషన్లు వేశారు.కేసు నమోదు వెనుక రాజకీయ కారణాలున్నాయిని పిటిషనర్ల న్యాయవాదులు వాదించారు.

విజిలెన్స్ విచారణకు పిటిషనర్లు సహకరించారని బెయిలు మంజూరు చేస్తే దర్యాప్తునకు అవరోధం కలగదని చెప్పారు. ఏజీ వాదనల కోసం విచారణ ఈనెల 8కి వాయిదా పడింది.2020 సెప్టెంబర్ 4న పల్నాడు జిల్లా యడ్ల పాడు మండలం విశ్వనా థుని కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పీఏ దొడ్డ రామకృష్ణ సందర్శించారు.

స్టోన్‌క్రషర్‌పై దాడులు చేయకుండా, మూయించ కుండా ఉండాలంటే ఎమ్మెల్యేని కలవాలని హుకుం జారీ చేశారు. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజిని కార్యాలయానికి వెళ్లి కలిశారు.. తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడవాలంటే అడిగినంత డబ్బులి వ్వాల్సిందేనని, మిగతా విషయాలు తన పీఏ రామకృష్ణతో మాట్లాడాలని రజిని వారితో చెప్పారు. వారిద్దరూ రామకృష్ణను కలవగా ఆయన రూ.5 కోట్లు డిమాండ్‌ చేశారు..ఆ తర్వాత ఆరు రోజులకే సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు రీజనల్‌ విజి లెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారి – ఆర్‌వీ ఈవోగా ఉన్న ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువా భారీ బృందంతో శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌లో తనిఖీలకు వెళ్లి హడావుడి చేశారు.

ఆ స్టోన్‌ క్రషర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే జాషువా విచారణకు వెళ్లారు. అప్పటి విజిలెన్స్‌ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. విజిలెన్స్‌ ప్రధాన కార్యాలయానికి ఈ దాడుల సమాచారమే ఇవ్వలేదు. విచారణలో వెల్లడైన అంశాలతో నివేదిక సిద్ధం చేశారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందనేది అందులో లేదు. ఈ నివేదిక డీజీకీ సమర్పించలేదు..అప్పట్లో ఈ సోదాల్లో పాల్గొన్న మిగతా అధికా రులను ఏసీబీ విచారించగా జాషువా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని ఆ తర్వాత విచారణ ఏమైందో కూడా తెలియదని వాంగ్మూలాలి చ్చారు.
👉కాకినాడ జిల్లా, పిఠాపురంలో మరోసారి ఉద్రిక్తత పరిస్ధితులు..ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనను అడుగడుగునా అడ్డుకుంటున్న టీడీపీ కార్యకర్తలు..బలబలాలు ప్రదర్శించుకుంటున్న టిడిపి, జనసేన నేతలు..నాగబాబు కుమారపురంలో పర్యటించిన సందర్భంలో జై వర్మ.. జై టిడిపి అంటూ టిడిపి కార్యకర్తల నినాదాలుజై జనసేన.. జై కళ్యాణ్ బాబు అంటూ జనసేన కార్యకర్తల ప్రతి నినాదాలు…
👉 ప్రేమ అంటూ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న యువతి

కర్ణాటకలో మండ్య జిల్లాలో ఓ యువతి ప్రేమ, పెళ్లి పేరుతో నలుగురిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వైష్ణవి శశికాంత్‌తో 8 నెలలుగా ప్రేమలో ఉండి మార్చి 24న పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లికి ముందే అతడి నుంచి రూ.7 లక్షలు, 100 గ్రాముల బంగారం తీసుకొని, పెళ్లైన మరుసటి రోజే పరారైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆమె గతంలో కూడా ఇలాగే ముగ్గురు వ్యక్తులతో పెళ్లి చేసుకొని మోసం చేసినట్లు గుర్తించారు.
👉స్టే హోం ల మధ్య గ్యాంగ్ వార్..  తిరుపతి … ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతలచేను వద్ద నున్న రెండు హోం స్టే’ల మధ్య ఘర్షణ..’డెక్కన్ సూట్స్ హోమ్ స్టే’ నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో దాడి చేసినా గరుడ హోం స్టే యాజమాన్యం..డెక్కన్ సూట్స్ హోం స్టే నిర్వాహకులు నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణిందర్ రెడ్డికి తీవ్రగాయాలు..గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించిన స్థానికులు ..ఒక హోం స్టే కు వచ్చే కస్టమర్లను మరొకరు హోం స్టే వాళ్లు లాక్కెళుతున్నారని ఇద్దరి మధ్య చెలరేగిన వివాదం..దాడికి పాల్పడిన 7మందిని ఈస్ట్ పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం..అర్థరాత్రి జరిగిన ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన స్థానికులు, హోం స్టేలోని శ్రీవారి భక్తులు.*

🌟ఫీజుల కోసం వేధిస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి*

*ఫీజు పెండింగ్లో ఉందని రెండు గంటల పాటు 12 మంది విద్యార్థులను బయట నిలబెట్టిన కోర్ట్ రోడ్డు శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యులు*
*జిల్లాలో విద్యార్థులు మరణిస్తున్నప్పటికీ శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యులు తీరు మారలేదు*
*విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తుగా ప్రచారాలు అడ్మిషన్లు చేస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలు*
*ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎదుట ధర్నా*

*అనంతపురం అర్బన్::ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్బి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయిస్వామి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సిద్దు ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పృథ్వి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ యాదవ్ మాట్లాడుతూ అనంతపురం నగరంలో కోర్ట్ రోడ్ లో ఉన్న శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యులు 8వ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థులు ఫీజు పెండింగ్ ఉందని గత రెండు రోజులుగా రెండు గంటల పాటు తరగతి గదులలో విద్యార్థులను లేచి నిలబెట్టడం జరిగిందని మండిపడ్డారు..అలా నిలబెట్టడం వలన విద్యార్థినిల కాళ్లు వాపులు వచ్చి జ్వరం రావడం జరిగిందని పేర్కొన్నారు.. విద్యార్థుల ఫీజులు పెండింగ్లో ఉంటే తల్లితండ్రులను అడగాల్సిన యాజమాన్యులు విద్యార్థులను నిలబెట్టాల్సిన పని ఏముందని పేర్కొన్నారు. ఇటే వల్లే జిల్లాలో ఫీజుల వేధింపు కారణంగా విద్యార్థులు మరణిస్తున్నప్పటికీ శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యులు తీరు మారడం లేదు విద్యార్థుల ప్రాణాలు పోయినా కూడా మాకు ఫీజులు వసులే కావాలన్నా పద్ధతుల్లో విద్యార్థులను వేధిస్తున్నారు.ఒకవైపు జిల్లా కలెక్టర్ గారు జిల్లా విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యులకు ఫీజుల వేధింపులు ఆపాలని సర్కిలర్లు జారీ చేస్తున్నప్పటికీ శ్రీ చైతన్య విద్యా సమస్యల యాజమాన్యులు తీరు మారకుండా మాకు కేవలం ఫీజులు వసులే కావాలి ఫీజులు వసూలు చేయకపోతే మీకు ఉద్యోగాలు ఊడిపోతాయి అని శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యులు కింద స్థాయి ఉద్యోగస్తులపై ఒత్తిడి తీసుకువస్తే వారు తల్లితండ్రులను ఫీజులు అడగకుండా విద్యార్థులను బయట నిలబెట్టడం బాధాకరమన్నారు.. ఉగాది పండగకు వెళ్లిన హాస్టల్ విద్యార్థులు కూడా కొంచెం ఫీజు పెండింగ్ ఉంటే పూర్తి ఫీజు కడితేనే లోపలికి అనుమతిస్తాం లేకుంటే లేదు ఈ సంవత్సరం ఫీజు పూర్తి అయిన కూడా రేపు సంవత్సరానికి రెన్యువల్ చేసుకోవాలని పుస్తకాలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల పైన శ్రీ చైతన్య విద్యా సమస్యల యాజమాన్యులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తుగా అడ్మిషన్లు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.. ఫీజు పెండింగ్ ఉంటే విద్యార్థులను రెండు గంటలపాటు బయట నిలబెట్టారు విద్యార్థులు మానసిక స్థితికి లోనై ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలను సీజ్ చేసి విద్యార్థులను రెండు గంటల పాటు బయట నిలబెట్టిన శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యాల పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ నగర అధ్యక్ష కార్యదర్శులు మంజునాథ్ ఉమా మహేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గిరి సోము ఏఐఎస్ఎఫ్ నాయకులు సమీర్ మంజు పవన్ రాజేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు*
🌟కాకినాడ జిల్లా పిఠాపురంలో భారీగా మోహరించిన పోలీసులు.
పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు.
ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పర్యటనను అడుగడుగునా అడ్డుకుంటున్న టీడీపీ కార్యకర్తలు. బలాబలాలు ప్రదర్శించుకుంటున్న టీడీపీ, జనసేన నేతలు.
జై వర్మ అంటూ జైజై టీడీపీ, జై జనసేన అంటూ టీడీపీ, జనసేన కార్యకర్తల నినాదాలు.

* మాజీ MP హర్ష కుమార్పై కేసు నమోదైంది.

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల తీవ్ర ఆరోపణలు చేసినందుకుగాను ఆయనపై BNS సెక్షన్లు 196, 197 కింద FIR నమోదు చేశారు. ప్రవీణన్ను చంపి పడేశారని, పోలీసులు కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఇటీవల ఆయన ఆరోపించారు. దీంతో విచారణకు వచ్చి ఆధారాలు సమర్పించాలని పోలీసులు నోటీసులిచ్చారు. విచారణకు హాజరు కాకపోగా, మళ్లీ అదేస్థాయిలో కామెంట్స్ చేయడంతో తాజాగా కేసు నమోదు చేశారు.

*రామానాయుడు స్టూడియోస్కు నోటీసులు?
విశాఖలో వివాదాస్పదంగా మారిన
రామానాయుడు స్టూడియో భూముల జప్తునకు
ప్రభుత్వం సిద్ధమైంది. సురేష్ ప్రొడక్షన్స్కు షోకాజ్
నోటీసులు జారీ చేస్తున్నామని వైజాగ్ కలెక్టర్
హరేందిర ప్రసాద్ తెలిపారు. మధురవాడ సర్వే
నెంబర్ 336/Pతో పాటు మరి కొన్ని నంబర్లలో 34.44 ఎకరాలను స్టూడియో, చిత్ర నిర్మాణ
అవసరాల కోసం ప్రభుత్వం భూమిని
కేటాయించగా… అయితే, అక్కడ రియల్ ఎస్టేట్
వ్యాపారం జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది.
*లోన్ యాప్స్ వేధింపులు తాళలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య*
కామారెడ్డిలో సందీప్ అనే యువకుడు లోన్ యాప్‌లో అప్పులు తీసుకొని.. తిరిగి చెల్లించకపోవడంతో ఇంటికి వచ్చి అసభ్య పదజాలంతో హంగామా చేసి వేధించిన లోన్ యాప్స్ ఏజెంట్స్…మనస్తాపంతో ఆత్మహత్య..!

*గంజాయి విక్రయదారుల ముఠా అరెస్ట్*
*కాలేజీ యువకులు విద్యార్థులు టార్గెట్గా గంజాయి విక్రయం*
*4 గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*
*సుమారుగా 1.2 కిలోల గంజాయి, ఎండిఎంఏ సింథటిక్ డ్రగ్ గ్రాముల 8.71 స్వాధీనం*
*ఒక కెటిఎమ్ బైక్ స్వాధీనం*
*గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్న మంగళగిరి గ్రామీణ పోలీసులు*
*జిల్లా అడిషనల్ ఎస్పి రవికుమార్*
గంజాయి విక్రయించిన సేవించిన చట్ట ప్రకారం కట్టిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ హెచ్చరించారు. శనివారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గుంటూరు అర్బన్ అదనపు ఎస్పి రవికుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. మరో ఇద్దరూ పరారీలో ఉన్నట్లు చెప్పారు. త్వరలో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని అడిషనల్ ఎస్పి రవికుమార్ అన్నారు. 1.2 కేజీల గంజాయి, ఎండిఎంఏ సింథటిక్ డ్రగ్ 8.71 గ్రాములను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన సరుకు మొత్తం విలువ 1,10,000 వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి ఒక కెటిఎమ్ బైకు ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు .ఎవరైనా గంజాయి విక్రయించిన సేవించిన చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు.కేసు దర్యాప్తులో పాల్గొని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న మంగళగిరి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు, గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ లను, ఎస్పీ అభినందించారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్, శేఖర్, చలమారావు, సాగర బాబు పాల్గొన్నారు.
*ST సర్టిఫికెట్ జారీకి పేరెంట్స్ ఇద్దరూ ట్రైబల్స్ కానక్కర్లేదు: కలకత్తా హై కోర్ట్*.. వెస్ట్ బెంగాల్ :పేరెంట్స్ లో ఒకరు ట్రైబల్ కాదనే కారణంతో పిల్లలకు ST సర్టిఫికెట్ నిరాకరించడం తగదని కలకత్తా హైకోర్టు పేర్కొంది. ఓ నీట్ అభ్యర్థి ST సర్టిఫికెట్ కోసం అప్లై చేశారు. తల్లి ట్రైబల్ కాగా తండ్రి ఫార్వర్డ్ కమ్యూనిటీ వ్యక్తని అధికారులు అర్జీని తిరస్కరించారు. దీనిపై అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా కోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 24గంటల్లో సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది.

*గుంటూరు జిల్లా ఎపిడబ్యూజేఎఫ్ (APWJF) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో ఆంద్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ (APBJA ) గుంటూరు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికైయింది.
ఈ నూతన కమిటీ సమావేశంకు *రాష్ట్రా కార్యదర్శి ఆంజనేయులు,*
బ్రాడ్ కాస్టింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసు,యూనియన్ ఫౌండర్ కొండ బాబు,ఎపిడబ్యూజెఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు రత్నాకర్,జనరల్ సెక్రటరీ సాయికుమార్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నిక చేశారు.ఈ నూతన మీడియా కమిటీ *గుంటూరు జిల్లా అధ్యక్ష బోస్క సువర్ణ బాబు,* కార్యదర్శులుగా కేశంశెట్టి శ్రీనివాసరావు,ట్రజరర్ గాజుల బ్రహ్మం,ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రెటరీగా జీవై సాయికృష్ణ,గౌరవ అధ్యక్షుడిగా పోనుగుబాటి నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ ఖాజా పీర్,లింగినేని అవినాష్,లీగల్ అడ్వైజర్ గా మోపర్తి సువర్ణ రాజు లతో పాటు పలువురు ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా రాష్ట్రా నాయకులు మాట్లాడుతు జర్నలిస్టులకు ఏదైనా సమస్య వస్తే యూనియన్ లకు అతీతంగా అందరికి ఖచ్చితంగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. రాబోయే రోజుల్లో యూనియన్ ను మరింత బలోపేతం చేసి జర్నలిస్టుల ఐక్యత చాటాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అక్రిడేషన్,ఇళ్ళస్థలాల సమస్యే కాదని పలు చోట్ల జర్నలిస్టులపై జరుగుతున్న పరిణామాలపై నూతన కమిటీతో పాటుగా తాము పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.అలాగే గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు  పాల్గొన్నారు..

*24 గంటల్లో ఇంకొల్లు భారీ చోరీ కేసును చెదించిన పోలీసులు*
*పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ తుషార్ డుడి..*
*బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో లో జరిగిన చోరీ కేసులో పోలీసులు 24 గంటల్లో ముద్దాయి మొహమ్మద్ షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 55,50,000 నగదు, 24 సవర్ల బంగారం రికవరీ చేశారు. త్వరితగతిన కేసును చేదించిన చీరాల డీఎస్పీ మొహమ్మద్ మొయిన్, ఇంకొల్లు సీఐ రమణయ్య, ఇంకొల్లు ఎస్సై సురేష్ ను జిల్లా ఎస్పీ అభినందించారు..

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..