భారత్ పై ట్రంప్ టారిఫ్స్: ప్రభావమెంత?🌟గూడూరు లో 5kg గంజాయి స్వాదినం చేసుకొని ఇద్దరిని అదుపులోనికి తీసుకొన్న పోలీసులు….👉 అసెంబ్లీ ఆవరణలో దొంగల చేతివాటం*..👉అర్ధరాత్రి HCU లోకి JCBలు – ప్రజాసంఘాల నాయకుల వద్దకు పోలీసులు..👉 వక్స్ బిల్లులోని కీలకాంశాలు..**బేస్తవారిపేట జంక్షన్ లో అక్రమంగా తరలిపోతున్న రేషన్ పట్టుకున్న మార్కాపురం సబ్ కలెక్టర్ ……

👉మోడీ ఫ్రెండ్ అయినా.. భారత్ పై ట్రంప్ టారిఫ్స్: ప్రభావమెంత? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వాణిజ్య విధానాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వాణిజ్య విధానాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. తాజాగా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ ఆయన చేసిన ప్రకటన భారత్‌ను కూడా కలవరానికి గురిచేస్తోంది. ఈ నిర్ణయంలో భాగంగా భారత్‌పై ఏకంగా 26 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు. ఈ చర్య భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా కొన్ని కీలక రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారత్‌పై టారిఫ్ ప్రభావం ఎలా ఉండబోతోంది? ట్రంప్ విధించిన ఈ 26 శాతం సుంకం అనేక భారతీయ ఉత్పత్తులపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, వజ్రాలు, రసాయనాలు, యంత్రాలు వంటి వస్తువుల ఎగుమతులు మరింత ఖరీదైనవిగా మారతాయి. దీని కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తుల పోటీతత్వం తగ్గే అవకాశం ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ సుంకాల వల్ల భారత్‌కు సుమారు రూ. 26 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇది దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP)పై దాదాపు 0.1 శాతం ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం తక్షణమే కనిపించకపోయినా, రాబోయే రోజుల్లో భారత ఎగుమతులపై గణనీయమైన ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఉన్న ఉద్రిక్తతను స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ తన వాదనను సమర్థిస్తూ, ఈ సుంకాల వల్ల అమెరికాకు కంపెనీలు తిరిగి వస్తాయని, తద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించబడతాయని అన్నారు. అంతేకాకుండా అమెరికా మార్కెట్‌లో పోటీతత్వం పెరిగి వస్తువుల ధరలు తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ చర్యకు ప్రతిస్పందనగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా అమెరికా ఇలాంటి సుంకాలు విధించినప్పుడు భారత్ కూడా కొన్ని అమెరికన్ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధించింది. ఈసారి కూడా భారత్ అదే తరహా వైఖరిని అవలంబిస్తుందా లేదా ఇతర పరిష్కార మార్గాలను అన్వేషిస్తుందా అనేది వేచి చూడాలి. భారత ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుంది, దేశీయ పరిశ్రమలను ఎలా ఆదుకుంటుంది అనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆర్థిక నిపుణులు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. భారత ప్రభుత్వం సమయోచితంగా స్పందించి ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ట్రంప్ విధించిన ఈ తాజా సుంకాలు భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలలో ఒక కొత్త మలుపుగా చెప్పవచ్చు. ఈ చర్య భారత ఆర్థిక వ్యవస్థపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉన్నప్పటికీ, భారత ప్రభుత్వం తీసుకునే చర్యలు ఈ ప్రభావాన్ని ఎంతవరకు తగ్గిస్తాయో చూడాలి. ప్రపంచ వాణిజ్య విధానాలు మారుతున్న ఈ సమయంలో, భారత్ తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూ అంతర్జాతీయంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది

👉ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బేస్తవారిపేట జంక్షన్ లో అక్రమంగా తరలిపోతున్న రేషన్ పట్టుకున్న మార్కాపురం సబ్ కలెక్టర్ వారి బృందం… పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది

👉అర్ధరాత్రి HCU లోకి JCBలు – ప్రజాసంఘాల నాయకుల వద్దకు పోలీసులు..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU లో కొనసాగుతున్న ఆందోళనల పోరాటాలు నేటి విద్యార్థి సంఘాల చలో సెక్రటేరియట్, ఉమెన్ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం వంటి కార్యక్రమాల రిత్యా ప్రజాసంఘాల నాయకుల వాయిస్ అణచివేయడం కోసం ముందస్తు అరెస్టులు. ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర కార్యదర్శి వై గీత, AIKMS జిల్లా అధ్యక్షులు వై మహేందర్ ను వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం 3:30 కి ముందస్తు అరెస్టు చేయడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి నుండి అక్రమంగా విద్యార్థి, ప్రజా సంఘాల నాయకుల అరెస్టులు అప్రజాస్వామీకం రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చీకటి విధ్వంసాలే కొనసాగుతున్నాయి మొత్తం భూముల పైన పడటం అభివృద్ధి పేరుతో పేదల నుండి భూముల గుంజుకోవడం ప్రభుత్వ భూములు అమ్ముకోవడం వంటి చర్యలను తెలంగాణ పౌర సమాజం సహించలేక ప్రశ్నిస్తే నిర్బంధించడం ప్రశ్నించే గొంతులను, ప్రజా సంఘాలను వాణిచివేయడం సరైనది కాదు.. రాష్ట్ర లో ప్రభుత్వాన్ని నడపడానికి ఆదాయం కావాలని అడ్డగోలుగా ప్రభుత్వ భూములు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం, గ్రామాలలో బెల్ట్ షాపులతో మద్యం ఏరులై పారిస్తూ ఆదాయాన్ని పెంచుకోవడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని నడపడానికి ఒక వైపు డబ్బులు లేవని చెప్తూనే మరోవైపు అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ రాష్ట్రంలో స్త్రీల యొక్క అందాల సుందరీకరణ పోటీలు ఏ ప్రయోజనాల కోసం పెడుతున్నారని విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేయడానికి నిధులు కేటాయించకుండా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల కనీస వేతనం కోసం మాట్లాడుతున్న పట్టించుకోకుండా, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండి జూనియర్, డిగ్రీ కాలేజీలో మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి. విద్యారంగానికి నిధులు కేటాయించమని అడిగిన విద్యార్థుల మీద లాటి జులపిస్తూ ప్రజా పోరాటాలను ఉద్యమంల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల అణచివేస్తూ కాంక్షలు పెడుతూ విద్యార్థి, ప్రజా సంఘాల ఉద్యమాలను ఆపలేరు రేవంత్ సర్కార్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి యూనివర్సిటీ భూములను వేలం వేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడాలి అడవులను జీవో వైవిధ్యాన్ని కాపాడాలి అటవీ విధ్వంసక చర్యలను మానుకోవాలి.

👉 అసెంబ్లీ ఆవరణలో దొంగల చేతివాటం*

*నిన్న ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం సందర్భంగా శాసనసభ ఆవరణలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10వేలు, ఆయన గన్మన్ జేబులో ఉన్న రూ.40వేలు, హైకోర్టు లాయర్ జేబులో రూ.50వేలు, మరో వ్యక్తి జేబులో రూ.32వేలను కొట్టేశారు. మొత్తం రూ.4 లక్షలు చోరీ అయినట్లు భావిస్తున్నారు.**

🌟గూడూరు లో 5kg గంజాయి స్వాదినం చేసుకొని ఇద్దరిని అదుపులోనికి తీసుకొన్న పోలీసులు**తిరుపతి జిల్లా..గూడూరు*

గూడూరు గాంధీ నగర్ లోని ప్రశాంతి నగర్ కి చెందిన గాడిమేని సునీల్ మరియు గాంధీనగర్ టీచర్స్ కాలానికి చెందిన నక్క అవినాష్ వీరి వద్ద నుంచి మూడు గంజాయి పాకెట్లు వాటి బరువు 5kg, 2సెలఫోన్లు, స్కూటీ – 1 పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు..
నక్క అవినాష్ సూళ్లూరుపేట లోని GRP OP లో కానిస్టేబుల్ గా 2015 సంవత్సరం నుండి పని చేస్తున్నట్లు, గత సంవత్సరం నుండి ట్రైన్ లో బీట్ డ్యూటీ కి వెళ్లి నప్పుడు పోలీసులను చూసి అపరిచితులు వదిలేసి వెళ్లి పోయిన గంజాయి ని గుట్టుగా సేకరించి గాంధీనగర్ లోని తన ఇంటికి సమీపంలో ఉన్న తనకు చిననాటి నుంచి పరిచయం ఉన్న గాడిమేని సునీల్ ద్వారా 5కేజీ ల గంజాయి ని అమ్మే దానికి ప్రయత్తించగా సునీల్ అవినాష్ కి చెందిన స్క్యూటీ లో గంజాయి తీసుకొని వచ్చి గాంధీ నగర్ సమాదుల వద్ద కొనుగోలు చేసే పార్టీ కోసం వేచి ఉండగా తిరుపతి జిల్లా SP ఆదేశాల మేరకు గూడూరు DSP సూచనల మేరకు, గూడూరు 2 టౌన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి ని పట్టుకొన్నట్టు గూడూరు 2 టౌన్ CI మీడియా సమావేశం లో తెలియజేసారు
👉 వక్స్ బిల్లులోని కీలకాంశాలు..*వర్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ముస్లింలే ఉంటారు. కనీసం ఇద్దరు మహిళలకు చోటు కల్పించాలి..*

👉 వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర బోర్డుల్లో ఇద్దరు ముస్లిమేతరులను నియమించాలి..** *కొత్త చట్టం అమల్లోకొచ్చిన 6 నెలల్లో ప్రతి వక్స్ ఆస్తినీ సెంట్రల్ డేటాబేస్లో చేర్చాలి..** *వక్స్ ట్రైబ్యునల్ తీర్పులను 90రోజుల్లో హైకోర్టులో సవాలు చేసుకోవచ్చు..** *ఈ ట్రైబ్యునల్ జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఉండాలి..*

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..