👉ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించడానికే వక్ఫ్ సవరణ బిల్లన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల*
ఇది మైనారిటీలను అణిచివేసే కుట్ర..రాజ్యాంగ వ్యతిరేక బిల్లు..
దేశ వ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతీయడమే నియంత మోడీ అజెండా. పార్లమెంట్ ముందుకు సవరణ బిల్లు రావడం అంటే ఈ దేశానికి ఇవ్వాళ బ్లాక్ డే.దేశ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయే ఒక చర్య. ఈ బిల్లు ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా మరొకటి కాదు.వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడం కోసమే ఈ పన్నాగం.
దేవుడికి ఇచ్చిన ఆస్తిని కాజేసి మోడీ బినామీలకు, మోడీ దోస్తులకు వక్ఫ్ ఆస్తులను దారాదత్తం చేసే కుట్ర.
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఆందోళనలు చేస్తున్నా..
వారి వేదన వినకుండా బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య.
వారి ఆవేదనను పరిగణనలోకి తీసుకోకపోవడం మోడీ నియంతృత్వ విధానానికి నిదర్శనం.వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ కలెక్టర్లకు అప్పగించడం, వక్ఫ్ బోర్డులో అన్యమత సభ్యులను నియమించడం,వక్ఫ్ ఆస్తులు 12 ఏళ్ళుగా ఎవరి అధీనంలో ఉంటే వారివే అనడం,300 ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు ఇప్పుడు డాక్యుమెంట్ లు అడగడం, వక్ఫ్ బోర్డుకి భూములు వితరణ చేయాలంటే 5 ఏళ్లు ఇస్లాం ధర్మాన్ని ఆచరించాలని..నిబంధన పెట్టడం అంటే ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వ్యతిరేక చర్యలే..మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు టీడీపీ,జనసేన పార్టీలు మద్దతు పలకడం దారుణం..ఇది అత్యంత శోచనీయం. టీడీపీ సెక్యులర్ పార్టీ ముసుగు తొలిగింది. చంద్రబాబు మోసం బయటపడింది.ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇచ్చి, వక్ఫ్ ఆస్తులను కాపాడుతామని హామీలు ఇచ్చి,మరోపక్క పార్లమెంట్ లో సవరణ బిల్లుకు మద్దతు పలకడం పచ్చి మోసం..వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విప్ జారీచేసిన చంద్రబాబు ఒక ముస్లిం ద్రోహి..ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం..ముస్లింల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు.
👉మాపై ఆధిపత్యం వద్దు.. గల్లీలోకి రావాల్సిందే.. *ప్రధానిపై సీఎం రేవంత్ కామెంట్స్… *మా రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచితే నరేంద్ర మోదీకి వచ్చిన కష్టమేంటి? .. *ఢిల్లీలోని జంతర్ మంతర్ బీసీ పోరు గర్జన*
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: బీసీ బిల్లు ఆలోచనకు స్పూర్తి రాహుల్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ బీసీ పోరు గర్జనలో సీఎం పాల్గొని ప్రసంగించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని బీసీల లెక్కలు అడిగారని తెలిపారు. ఎక్కడ అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తామని పాదయాత్రలో రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్నారు. పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తెలంగాణలో నిలబెట్టానని తెలిపారు. తండ్రి కొడుకు ఉద్యోగం ఊడకొట్టండి మీకు ఉద్యోగాలు వస్తాయని ఎన్నికల సమయంలో పాదయాత్రలో చెప్పానన్నారు. అన్న ప్రకారమే ఏడాదిలో 59 వేల ఉద్యోగాలు నియమించామని తెలిపారు. బీసీలది ధర్మబద్ధ కోరిక అది నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. బీజేపీ అందుకు సిద్ధంగా లేదని విమర్శించారు. మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా బీజేపీ యాత్ర చేసిందన్నారు. ఇందిరాగాంధీ దళిత్ కాదని.. కానీ ఆమె అందరికీ భూములు ఇచ్చారని.. ఇల్లు కట్టించారని అన్నారు. అసైన్డ్ భూములు ఇందిరాగాంధీ ఇచ్చారన్నారు.
*రాహుల్ మాట ప్రకారం*… బీసీలకు 42% రిజర్వేషన్ల తీర్మానం ఆమోదించిన తేదీ ఫిబ్రవరి 4 అని.. ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డే గా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. జనగణనలో కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారన్నారు. అందుకే బీజేపీ కుట్రపూరితంగా జనగణన వాయిదా వేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో కులగణన చేసి బీసీల లెక్క 56.36 శాతం అని తేల్చిందని.. గుజరాత్ సహా దేశంలో ఏ రాష్ట్రంలోనూ కులగణన చేయలేదన్నారు. రాహుల్ గాంధీ మాట ప్రకారం తెలంగాణ మొట్టమొదటి సారి కులగణన చేసిందన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచమన్న డిమాండ్ మాత్రమే కాదు, ఉద్యోగ, విద్య రంగంలో కూడా ఈ పెంపు ఉండాలని నిర్ణయించామన్నారు. రిజర్వేషన్ల పెంపు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వ్యవహారమని.. అందుకే మేము తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని తెలిపారు.
‘మేము మా రాష్ట్రంలో పెంచుకుంటాం అన్నాం. మీ (మోదీ) రాష్ట్రంలో చేయమని మేము అడగలేదు. మా రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచితే నరేంద్ర మోదీకి వచ్చిన కష్టమేంటి? మా పిల్లల చదువులు, ఉద్యోగాలు, రాజకీయ అవకాశాల కోసం 42 శాతం ఇవ్వాలని మేం ప్రయత్నం చేస్తుంటే.. మీకు ఏం కష్టం వచ్చింది? మా తీర్మానం ప్రకారం రిజర్వేషన్లు పెంచమని కోరుతూ బీజేపీ నేతలను బీసీ సంఘాలు కలిశాయి. అయినా ఉలుకు లేదు. పలుకు లేదు. అందుకే ఢిల్లీలో బీసీ మహా ధర్నా చేపట్టాల్సిన పరిస్థితి బీసీ సంఘాలకు ఏర్పడింది. కురుక్షేత్ర యుద్ధంలో చెప్పినట్టు ‘అయిననూ హస్తిన పోయి రావలె’.. అన్నట్లు ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తున్నారు. మా మీద ఆధిపత్యం చెలాయించాలని చూడొద్దు. నిజాం పాలకులకు ఏ గతి పట్టిందో చూశారు. ఆంధ్రా పాలకులకు ఏం జరిగిందో చూశారు. మీరెప్పుడూ ఢిల్లీలో ఉండరు. గల్లీలోకి రావాల్సిందే. చిన్న సాయం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతులు మా బీసీ జాతులు. ఈ జాతులకు అన్యాయం చేస్తే ఎలా మర్చిపోతారు? దేశమంతటా మీరు అమలు చేస్తారా లేదా అని నేను అడగడం లేదు. మా తెలంగాణలో తీర్మానం చేసిన ప్రకారం పెంచమని మాత్రమే అడుగుతున్నాను’ అని రేవంత్ అన్నారు. రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించినా సరే అనేక బిల్లులు తెచ్చి చట్టాలు చేశారన్నారు. ట్రిపుల్ తలాఖ్ తెచ్చారని.. ఆర్టికల్ 370 రద్దు చేశారని… వ్యవసాయంపై నల్ల చట్టాలు తెచ్చారని తెలిపారు. మరి రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఏం సమస్య వచ్చిందని ప్రశ్నించారు. బీసీల కోసం ప్రాణాలు ఇస్తామని బండి సంజయ్ అంటారని.. ‘మాకు మీ ప్రాణాలు వద్దు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వండి చాలు’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ గర్జన మహా ధర్నాకు వివిధ పార్టీల ఎంపీలు మద్దు తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ, డీఎంకే కనిమొలి, ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే మహాధర్నాకు మద్దతు ఇస్తూ ధర్నాలో పాల్గొన్నారు. అలాగే ఈ ధర్నాకు ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్,కొండ సురేఖ, విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యేలు శ్రీహరి ముద్దిరాజు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, బిర్లా ఐలయ్య, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండరాం, విహెచ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ హాజరయ్యారు..
👉బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మానవత
చిన్నారి పాప దత్తత..
బాపట్ల ఎమ్మెల్య నరేంద్ర వర్మ ఐదేళ్ల చిన్నారి పట్ల మానవత చాటుకున్నారు ఉదారత తో దత్తత తీసుకొని
ఈరోజు నుండి ఆ చిన్నారి మొత్తం బాధ్యతను తీసుకుంటున్నానని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రకటించారు.
మానవత్వం పరిమళించి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తం మయింది.ఆదరించే వారు లేరు.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేదు..
చిన్నా భిన్నమైన ఆ కుటుంబంలో
ఐదేళ్ల చిన్నారి పరిస్థితిని చూసి చలించి పోయారు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. ఈ పాపను తాను దత్తత తీసుకుంటే ఎలా ఉంటుందనే విషయాన్ని ఆవిష్కృతం చేసి అక్కడికక్కడే తన ఆలోచనను అమలు చేసేశారు. ఈ రోజు నుండి ఈ పాప మొత్తం బాధ్యత తాను తీసుకుంటానని వెల్లడించారు. మానవత్వం పరిమళించి ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయంతో
ఆ ప్రాంత ప్రజలు చేతులు జోడించి నరేంద్ర వర్మ ఉదారతపై ప్రశంసల వర్షం కురిపించారు. మన వార్డు.. మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా.. బాపట్ల పట్టణంలోని ఒకటో వార్డు బేతని కాలనీలో పర్యటించిన నరేంద్ర వర్మ ఓ కుటుంబాన్ని
పలకరించిన నేపథ్యంలో ఆ చిన్నారి కుటుంబ పరిస్థితి పై స్పందించారు.
ఆ చిన్నారికి కొండంత అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చాలాసేపు ఆ పాపతో ముచ్చటించారు. ఆ పాపతో మాట్లాడించారు.ఆ పాప కుటుంబ పరిస్థితి విన్న తర్వాత నరేంద్ర వర్మ ఆవేదన చెందారు. ఐదేళ్ల మేఘ శ్రీ తోపాటు మరో ఆరేళ్ల అన్నయ్య నాయనమ్మ సమక్షంలో ఉంటున్నారు. ఈ ఇద్దరు పిల్లల్ని కన్నతల్లి సత్తెనపల్లిలో అమ్మేసింది. విషయం తెలిసిన నాయనమ్మ అక్కడికి వెళ్లి పిల్లల్ని విడిపించుకుంది. ఇది జరిగిన తర్వాత ఆ కన్న తల్లి పిల్లల్ని వదిలించుకొని వెళ్ళిపోయింది. తీవ్రమైన ఇబ్బందుల్లో ఆర్థిక పరిస్థితి సతమతమవుతున్న తరుణంలో నరేంద్ర వర్మ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ఆ కుటుంబంలో సంతోషం వ్యక్తం అవుతుంది. చిన్నారి మేఘ శ్రీ కి ఇప్పుడు కొండంత అండ లభించింది. జీవితానికి భద్రత లభించింది. కుటుంబానికి భరోసా దక్కింది. ఇవేమీ ఆ చిన్నారికి తెలియదు. ఒక చిన్న హృదయానికి
ఒక పెద్ద మనసు ఆదుకుంది. హృదయానికి హత్తుకుంది. ఇప్పుడు ఆ పెద్ద మనసుకు చేతులు జోడించి ప్రజానీకం నమస్కరిస్తోంది. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ దత్తత పుత్రికగా ఆ చిన్నారి ఇప్పుడు అడుగు ముందుకేసింది.
👉ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్ సంస్థ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఈ ప్లాంట్ల ద్వారా గ్రామీణ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు, రైతులకు ఉపాధి-ఆదాయం లభించనుందన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, రిలయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
👉మధురవాడ ప్రేమోన్మాది ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత..విశాఖపట్నం*
*విశాఖ నగర పోలీస్ కమీషనర్ శంకబ్రత బాగ్చీతో ఫోన్ లో మాట్లాడిన హోంమంత్రి అనిత*
*బాధితురాలు నక్క దివ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన హోంమంత్రి..
*దివ్యకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం..
*ప్రేమోన్మాదిని త్వరగా గాలించి పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశం..
*దివ్య తల్లి లక్ష్మి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత*
👉సుప్రీంకోర్టులో మొదలైన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ..
గత విచారణలో ముగిసిన బీఆర్ఎస్ వాదనలు..
నాలుగు వారాల్లోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరిన బీఆర్ఎస్..
నేడు కొనసాగనున్న స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి సహా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపు వాదనలు
👉వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన మద్దతు
నేడు కేంద్ర ప్రభుత్వం లోక్ సభ ముందుకు తీసుకొస్తున్న వర్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొనాలని ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించారు. విద్యావంతులు, నిపుణులతో చర్చించి ఈ బిల్లును రూపొందించారన్నారు. ఇది ముస్లింలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.
👉ట్రైన్ కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్య..
ట్రైన్ కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నఘటన ఖమ్మం జిల్లాలోమంగళవారం చోటుచేసుకుంది.
నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో
కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బండి కృష్ణ (39) మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు..
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కృష్ణ కోసం వెతకగా అప్పటికే ట్రైన్ కింద పడి మృతి చెందాడు..
మృతుడు స్వస్థలం వైరా మండలం రెబ్బవరం.
👉స్విగ్గీకి ₹158 కోట్ల జీఎస్టీ నోటీసులు
డెలివరీ ఛార్జీపై పన్నుకు సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీకి రూ.158 కోట్ల జీఎస్టీ నోటీసులు ప్రభుత్వం అందించింది. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుకు సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ నోటీసుల్లో పేర్కొంది. ఈ విషయాన్ని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది. మొత్తం రూ.158.25 కోట్ల పన్ను చెల్లించాలని డిమాండ్ చేసింది.

