👉👉దాడికి దిగితే ఎదురుదాడికి సిద్ధం… అమెరికాపై తీవ్రంగా స్పందించిన ఇరాన్*
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇరాన్ ఘాటు హెచ్చరిక చేసింది. అణు ఒప్పందానికి ఇరాన్ దిగిరాకుంటే బాంబుల మోత మోగిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూనే.. ఏం జరిగినా ఎదురుదాడి చేసేందుకు, తమ తడాఖా చూపించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ‘‘అణు ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే బాంబు దాడులు చేస్తాం. ఈ దాడులు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటాయి.’’ అని అమెరికా అధ్యక్షుడు ఆదివారం హెచ్చరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందించింది. ‘‘అయితే… మేం కూడా సిద్ధంగా ఉన్నాం. మా తడాఖా చూపిస్తాం. ఎదురుదాడులు చేస్తాం. అమెరికా బాంబులు వేస్తే చూస్తూ చేతులు ముడుచుకుని కూర్చోం. అన్ని భూగర్భ కేంద్రాల వద్ద లాంచ్ ప్యాడ్‌లపై క్షిపణులను సర్వసన్నద్ధం చేశాం. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాతో సంబంధం ఉన్న ఏ ఒక్క ప్రాంతాన్నీ వదిలి పెట్టబోం’’ అని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించినట్టు ఇరాన్ మీడియా ‘టెహ్రాన్ టైమ్స్’ పేర్కొంది. అమెరికా కాలు దువ్వితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఖమేనీ హెచ్చరించినట్టు తెలిపింది. ‘‘ఎలాంటి వైమానిక దాడులనైనా తిప్పికొడతాం. అమెరికాతో సంబంధం ఉన్న ఏ ఒక్క ప్రాంతాన్నీ వదిలిపెట్టేది లేదు’’ అని ఖమేనీ అన్నట్టు ‘టెహ్రాన్ టైమ్స్’ వెల్లడించింది. మరోవైపు, అణు ఒప్పందంపై అమెరికాతో నేరుగా చర్చించేందుకు ఇరాన్ నూతన అధ్యక్షుడు పెజెష్కియాన్ విముఖత వ్యక్తం చేశారు. అయితే, ఒమన్ ద్వారా మధ్యవర్తిత్వ చర్చలు మాత్రం కొనసాగుతాయని ఆయన సంకేతాలు ఇచ్చారు.
👉 రేవంత్.. విధ్వంసమే మీ నినాదామా?: కేటీఆర్..
నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వంపై KTR అభివృద్ధి పేరుతో జంతు ఆవాసాలపై పడి విమర్శలకు దిగారు. ‘పర్యావరణ సంరక్షణ పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చారు. తర్వాత బల్లులు కూడా గుడ్లు పెట్టవంటూ గిరిజనులను వెలివేశారు. ఇప్పుడు జంతు ఆవాసాలపై పడ్డారు’ అని దుయ్యబట్టారు. విధ్వంసమే మీ నినాదామా? అని CM రేవంతు ప్రశ్నించారు. వీకెండ్లో అర్ధరాత్రి వేళ బుల్డోజర్లు పనిచేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు.
👉 దాహం వేస్తుంది అంటే నోట్లో మూత్రం పోసి గ్యాంగ్ రేప్ చేసిన దుర్మార్గులు..
నాగర్ కర్నూల్ జిల్లాలో దైవ దర్శనానికి వచ్చిన యువతి గ్యాంగ్ రేప్ ఘటనలో విస్తుపోయే నిజాలు..తెలంగాణలో అదుపులో లేని లా అండ్ ఆర్డర్.. హోమ్ శాఖను తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి..నాగర్ కర్నూల్ జిల్లాలో ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చి రాత్రి 10 గంటల సమయంలో ఆలయ సమీపంలో బహిర్భూమికి వెళ్ళగా అక్కడే మద్యం తాగుతున్న స్థానిక ఆటో డ్రైవర్లు, స్థానికులు 7 మంది కలిసి దుస్తులు విప్పి, విచక్షణారహితంగా కొడుతూ గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.మద్యం సేవిస్తూ ఉదయం 4 గంటల వరకూ ఒకరి తరువాత మరొకరు ఈ ఘాతుకానికి పాల్పడగా దాహం వేస్తుందని అడిగిన ఆ మహిళ నోట్లో మూత్రం పోసి మరీ లైంగిక దాడికి పాల్పడి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు, పుస్తెలు, కమ్మలు దోచుకొని వెళ్లారు..🤟🏽
👉కారుతో ఎస్సై ని గుద్ది.. పారిపోయిన దుండగుడు* ..సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులు..మద్యం మత్తులో అతివేగంగ వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్సై నాగలక్ష్మి ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయిన కారు..ఆ కారును వెంబడించిన పోలీసులను గమనించి కొద్ది దూరంలో కారును వదిలి వెళ్ళిపోయిన దుండగులు. పోలీస్ అదుపులో AP12 P0003 కారు.గాయపడిన ఎస్సై నాగలక్ష్మిని ఆస్పత్రికి తరలింపు..
👉కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిది.. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది..వట ఫౌండేషన్ అనే NGO దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఆ భూములను వేలం వేయడం కుదరదు.ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోంది.చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోంది.. ఆ భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.. ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా?.. కంచె గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట..
👉కారులో జర్మనీ యువతితో అసభ్య ప్రవర్తన..😱
మీర్పేటలో కలకలం రేగింది. తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో జర్మనీకి చెందిన యువతి మందమల్లమ్మ వద్ద కారు ఎక్కింది. కొద్దిదూరం వెళ్లాక క్యాబ్ డ్రైవర్, అందులో ఉన్న వ్యక్తి పహాడిషరీఫ్ ప్రాంతంలో ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితురాలు తప్పించుకొని పారిపోయింది. మీర్పేట PSలో ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసి పహాడీషరీఫ్ పోలీసులకు బదిలీచేశారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉పాస్టర్ మృతిపై వివేకా తరహా రాజకీయం!!?
సికింద్రాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ మృతితో జరిగిన రాజకీయం అంతా ఇంతా కాదు. ఆయన ఎలా చనిపోయారో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అయితే దీన్ని ఒప్పుకునేందుకు చాలా మంది సిద్ధంగా లేరు. కళ్ల ముందు కనిపించే దృశ్యాలను కూడా వారు అంగీకరించడంలేదు. వితండవాదం చేస్తున్నారు. వారి ఇంటెన్షన్ ఏమిటో సులువుగానే అర్థమవుతుంది. పాస్టర్ ను చంపేశారని నమ్మించడానికి విచిత్రమైన వాదనలు తీసుకు వస్తున్నారు. దీని వల్ల ఎవరికి లాభం ?
క్రిస్టియన్ కమ్యూనిటిపై ఎవరికీ వ్యతిరేక భావం లేదు. ఉద్దేశపూర్వంగా ఎవరికీ వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రమాదవశాత్తూ జరిగిన ఓ మరణం అంశంలో ఇతరులే చంపేశారని టార్గెట్ చేస్తే వారిని వ్యతిరేకం చేసుకున్నట్లు కాదా ?. ఇలా మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటే ఎవరికి లాభం?. ప్రభుత్వాలను ఇలాంటి వాటితో ఇబ్బంది పెట్టడం వల్ల సహజంగానే మత రాజకీయాలకు ప్రాధాన్యం వస్తుంది. అప్పుడు జరిగే పరిణామాలకు అందరూ నష్టపోవాల్సి వస్తుంది.
దేశంలో ఇప్పటి వరకూ ఏం జరిగిందో అందరూ చూశారు. కనీసం ఎలాంటి ఉద్దేశాలు లేకుండా.. మత రాజకీయాలకు చాన్స్ లేకుండా పరిపాలిస్తున్న ప్రభుత్వాల విషయంలోనూ అయినా ఇలాంటి రాజకీయాలకు చెక్ పెట్టాలి. మత రాజకీయాలు చేయాలనుకుంటే.. హిందూ, క్రిస్టియన్ తేడాలు తీసుకు వచ్చి రాజకీయాలు చేస్తే రాష్ట్రం ఎంత ఘోరంగా మారుతుందో అంచనా వేస్తే ఇబ్బంది కరమే. అందుకే మత సంస్థలకు చెందిన వారు.. ప్రవచన కర్తలు..ఎవరూ రాజకీయ ట్రాప్‌లో పడకూడదనేది ఎక్కువ మంది చెప్పే మాట. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మత ఉద్యమకారులకు ఇది అర్థం అవుతుందా ? .. వివేకానందరెడ్డికి అత్యంత ఘోరంగా నరికి చంపేసినా గుండెపోటు అని ప్రచారం చేశారు. కుదరకపోయే సరికి ఇతర రాజకీయం చేశారు. ఇప్పుడూ అలాగే చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాల ట్రాప్‌లో పడటం రాష్ట్రానికి ప్రమాదం.
👉క్లాసులు బంద్.. HCUలో హైడ్రామా
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) విద్యార్థులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. వర్సిటీకి సంబంధించిన భూమిని ప్రభుత్వం వేలం వేయడంపై వరుసగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. నేటి(మంగళవారం) నుంచి తరగతులను బహిష్కరించి, క్యాంపస్లోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద నిరవధిక నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. వెంటనే క్యాంపస్లో మోహరించిన పోలీసులను, జేసీబీలను వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు.
👉*అనంతపురం జిల్లా..*నగరంలో చైన్ స్నాచర్ హల్ చల్*
*పింఛన్లు పంచేందుకు వెళుతున్న సచివాలయ మహిళా ఉద్యోగి శకుంతలని వెంబడించిన చైన్ స్నాచర్ .. *ద్విచక్రవాహనాన్ని కిందకు త్రోసి చైన్ లాక్కెళ్లిన దుండగుడు.. *సచివాలయం ఉద్యోగికి స్వల్ప గాయాలు..*త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు..*
👉 *రెండు తెలుగు రాష్ట్రాలలో కామాంధులకు హద్దు అదుపు లేదు*
*పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో 13 ఏళ్ల యువతి పైన యువకుడు హాత్యాచారాయత్నం*
*యువకుడు పైన పొక్సో కేసు నమోదు*.. *ఎస్ సి, ఎస్ టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలి అంటున్న భాధితులు.. తాడేపల్లిగూడెం నుండి ఏలూరు వెళ్లే రోడ్డు లో అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా వున్న ఇటుకుల బట్టి దగ్గర పని చేయడానికి వచ్చిన బాలిక .. రాత్రి 7 గంటల సమయంలో బాలిక తన అత్త ఇంటికి వెళ్తుండగా బాలికను ప్రక్కన వున్న పొలాల్లోకి లాక్కెళ్లినట్లు తెలిపిన బాలిక .. లాక్కెళ్లిన బాలికను అటుగా వెళ్తున్న స్థానికులు చూసి కేకలు వేయడంతో నిందితులు పరార్ .. నిందితుడుతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు స్థానిక పట్టణ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసిన బాలిక బంధువులు, కుటుంభ సభ్యులు .. బట్టి నిర్వాహకులకు , బాలిక తల్లిదండ్రులకు కుదరని రాజి.. మరోసారి పోలీస్ స్టేషన్ బయట బట్టి నిర్వాహకులు, బాలిక తల్లిదండ్రులతో రాజికోసం ప్రయత్నాలు చేస్తుండగా బయటకు పొక్కిన విషయం..పోలీసులు విచారణ జరిపి నిందుతులు పైన అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులు తో పాటు పోక్సో కేసు నమోదు.. నిందుతుడు తో పాటు వున్న మరో ఇద్దరు పైన కూడా కేసులు నమోదు చేయాలనీ బాలిక బంధువులు ఆరోపణ.
👉విద్యార్థిని కొట్టి గాయపరిచిన భాష్యం స్కూల్ టీచర్..పశ్చిమగోదావరి జిల్లా .. నరసాపురంలో విద్యార్థిని కొట్టి గాయపరిచిన భాష్యం విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన. భాష్యం స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బెల్లంకొండ కృష్ణ చైతన్య అనే విద్యార్థి పై క్లాస్ టీచర్ వైశాచికంగా దాడి.. విద్యార్థిని తీవ్రంగా కొట్టడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి స్కూల్ వద్ద ధర్నా.. విద్యార్థులను శారీరకంగా మానసికంగా వేధిస్తున్న భాష్యం స్కూల్ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలంటూ నినాదాలు

