👉సర్వేలపై సర్వేలు*.. ఉక్కిరిబిక్కిరవుతున్న సచివాలయ ఉద్యోగులు సంబంధం లేని శాఖల పనుల అప్పగింతతో తీవ్ర పని భారం*
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక అంశాలపై క్షేత్ర స్థాయిలో సమాచారం తెలుసుకునేందుకు సచివాలయ ఉద్యోగులతో ఉన్నతాధికారులు పలు రకాల సర్వేలు చేయిస్తున్నారు.
ఒక సర్వే పూర్తవ్వగానే మరో సర్వే బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో, ఉద్యోగులు క్షేత్ర స్థాయి సర్వేలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండడం, ఇతర ప్రాంతాల బాధ్యతలు కూడా వారికే అప్పగించడంతో పనిభారం మరింత పెరిగింది. దీంతో, వివిధ ధ్రువపత్రాలు, ఇతర పనుల కోసం సచివాలయాలకు వచ్చే వారికి వారు అందుబాటులో ఉండలేకపోతున్నారు.
🌟గ్రామీణ ప్రాంతాల్లో 11 మంది, పట్టణ ప్రాంతాల్లో పది ఉద్యోగులతో గత ప్రభుత్వం సచివాలయాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఏడుగురు, పట్టణ ప్రాంతాల్లో ఆరుగురు మంది మాత్రమే ఉంటున్నారు. బ్యాంకర్లు తమ ఖాతాదారుల ఆధార్ లింక్, ఇకెవైసి బాధ్యతలను కూడా ఇటీవల సచివాలయాల ఉద్యోగులకు అప్పగించడం వివాదస్పదమైంది. ఈ పనిని బ్యాంకు ఉద్యోగులు చేయాల్సి ఉండగా వివిధ పథకాల కింద నిధులు జమ చేసే పేరుతో అధికారులు ఈ బాధ్యతలను తమకే అప్పగించారని సచివాయాల ఉద్యోగులు వాపోతున్నారు.
🌟ఐటి శాఖ చేయాల్సిన వర్క్ ఫ్రం హోం సిటిజన్స్ గుర్తింపు సర్వేనూ తమకే అప్పగించినట్టు చెబుతున్నారు. తాజాగా పి4 సర్వే మొత్తం సచివాలయాలకు అప్పగించారు. పరిశ్రమల శాఖ నిర్వహించాల్సిన ఎంఎస్‌ఎంఇ సంస్థల గుర్తింపును తమకే అప్పగించారని సచివాలయాల ఉద్యోగులు వాపోతున్నారు. తుపాన్లు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా హౌస్ హోల్డ్ మ్యాపింగ్, వ్యక్తుల నివాసిత గుర్తింపు వివరాల నమోదుకు ఇంటి ఫొటోలు, జియోట్యాగింగ్ బాధ్యతలు ఇటీవల సచివాలయాల ఉద్యోగులు పూర్తి చేశారు.
🌟నేషనల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా చిన్నారులను గుర్తించే, ఆధార్‌లో నమోదు చేయించే బాద్యతలను కూడా వారికే అప్పగించారు. చర్మకారులకు పలు పథకాల అమలుకు లబ్ధిదారులను గుర్తించడం, పింఛనుదారుల్లో అనర్హుల గుర్తింపునకు వారికి నోటీసులు జారీ చేయడం, వికలాంగులను తిరిగి వైద్య పరీక్షలకు పంపడం తదితర పనులను సచివాలయ ఉద్యోగులతోనే చేయిస్తున్నారు. సహకార సంఘాల్లో రికార్డుల కంప్యూటీకరణలో భాగంగా రైతులకు ఇకెవైసి చేయాల్సిన సంబంధిత శాఖ ఉద్యోగులకు కాకుండా ఈ పని కూడా సచివాలయాల ఉద్యోగులకే అప్పగించారు. సిటిజన్ గుర్తింపు గుర్తింపు సర్వే మున్సిపల్, గ్రామ పంచాయతీలు చేయాల్సి ఉండగా ఈ పని కూడా సచివాలయ ఉద్యోగులతో చేయిస్తున్నారు.
🌟రైతులకు సంబంధించిన భూ ఆధార్ నమోదును సచివాలయాల్లోని వ్యవసాయ సహాయకుడికి అప్పగించారు. బియ్యం కార్డుల్లోని సభ్యులు ఇకెవైసి బాధ్యతను విఆర్‌ఒ చేయాల్సి ఉండగా, ఈ పని కూడా తమకే అప్పగించారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో వలంటీర్లు చేసిన ప్రతి పనినీ సచివాలయాల ఉద్యోగులకు అప్పగించారు. వివిధ శాఖల ఉద్యోగులు చేయాల్సిన అన్ని పనులనూ తమకే అప్పగిస్తున్నారని, దీనివల్ల సచివాలయాలకు వచ్చే ప్రజలకు ఉద్యోగులు అందుబాటులో ఉండలేకపోతున్నారని,.తద్వారా పౌర సేవల్లో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని సచివాలయాల ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.అంకమ్మరావు తెలిపారు. మున్సిపాలిటీల్లో, మండల పరిషత్తుల్లో అనేకమంది ఉద్యోగులు ఉన్నా ప్రతి పనికీ సచివాలయాల ఉద్యోగులకు అప్పగించేస్తున్నారని ఆయన చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై పని భారం తగ్గించాలని, సంబంధం లేని పనులు అప్పగించరాదని డిమాండ్ చేశారు.
👉కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. కర్ణాటకలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ జిల్లా అధ్యక్షులతో కలసి డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల ఆయనను కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులపై డీకేకు వివరించిన ఆమె… కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు. శివకుమార్‌తో సమావేశంపై ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

👉అమ్మో ఏప్రిల్ 1 వచ్చేస్తోంది.. ఇకపై వాట్సప్ సహా సోషల్ మీడియా ఖాతాలన్నీ గవర్నమెంట్ చేతుల్లోనే..😱
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 13న కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025 ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని ఇది భర్తీ చేస్తుంది. పాత నిబంధనల్లో మార్పులు చేయడంతోపాటు.. ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు.. అయితే.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఎందుకు ప్రవేశపెట్టారో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (మార్చి 27) వివరించారు. 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేసే ఈ బిల్లు, ప్రభుత్వం లెక్కల్లో చూపని డబ్బు, చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇది చాలావరకు అసలు నిబంధనలకు అనుగుణంగా.. భాషను సరళీకృతం చేయడం, అనవసరమైన విభాగాలను తొలగించడం దీని లక్ష్యం.. అక్రమార్కులను పట్టుకోవటానికి మరిన్ని డిజిటల్ ఆధారాల అన్వేషణకు ఇది మార్గం సుగమం చేయనుందని పేర్కొన్నారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025 కింద డిజిటల్ ఆస్తులను ట్రాక్ చేయడంతోపాటు.. అక్రమార్కులకు అడ్డుకట్టవేయనుంది.
*కొత్త బిల్లు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో టాక్స్ అమలును తాజాగా ఉంచడంలో సహాయపడుతుందని, క్రిప్టోకరెన్సీల వంటి వర్చువల్ ఆస్తులను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవడానికి సహాయపడుతుందని కేంద్రమంత్రి సీతారామన్ అన్నారు. డిజిటల్ ఖాతాల నుండి వచ్చే ఆధారాలు అధికారులకు కోర్టులో పన్ను ఎగవేతను నిరూపించడానికి, పన్ను ఎగవేత మొత్తాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి ఆధారాలను అందిస్తాయి. లెక్కల్లో చూపించని నల్లధనాన్ని వెలికితీయటానికి డిజిటల్ ఫోరెన్సిక్స్ కీలక పాత్ర పోషించిందని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
“మొబైల్ ఫోన్లలో గుప్తీకరించిన సందేశాల ద్వారా లెక్కల్లో లేని రూ.250 కోట్ల డబ్బు బయటపడింది. క్రిప్టో ఆస్తులకు సంబంధించిన వాట్సాప్ సందేశాల నుంచి ఆధారాలు కనుగొన్నాం. వాట్సాప్ కమ్యూనికేషన్ ద్వారా లెక్కల్లో లేని రూ.200 కోట్ల డబ్బు బయటపడింది” అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
*గూగుల్ మ్యాప్స్ హిస్టరీ నగదు దాచడానికి తరచుగా సందర్శించే ప్రదేశాలను గుర్తించడంలో సహాయపడిందని సీతారామన్ హైలైట్ చేశారు. ‘బినామీ’ ఆస్తి యాజమాన్యాన్ని నిర్ణయించడానికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను విశ్లేషించామని ఆమె తెలిపారు.
*కొత్త బిల్లు కింద అధికారులు ఏయే ఖాతాలు యాక్సెస్ చేయవచ్చు?
కొత్త బిల్లు అధికారులకు వాట్సాప్, టెలిగ్రామ్, ఇమెయిల్స్ వంటి డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేసే హక్కును కల్పిస్తుందని ఆర్థిక మంత్రి వివరించారు. అదనంగా, ఆర్థిక లావాదేవీలను దాచడానికి ఉపయోగించే వ్యాపార సాఫ్ట్‌వేర్, సర్వర్‌లను కూడా ప్రభుత్వం యాక్సెస్ చేయగలదుఈ బిల్లు వెల్లడించని ఆదాయం విషయంలో.. వర్చువల్ డిజిటల్ ఆస్తులను కవర్ చేస్తుంది. ఇందులో డిజిటల్ టోకెన్‌లు, క్రిప్టోకరెన్సీలు, క్రిప్టోగ్రాఫిక్ వంటివి ఉంటాయి.
*ఇది శోధన, స్వాధీన కార్యకలాపాల సమయంలో వర్చువల్ డిజిటల్ స్థలాలను యాక్సెస్ చేయడానికి ఆదాయపు పన్ను అధికారులకు అనుమతిని ఇస్తుంది. ఇది ఇమెయిల్ సర్వర్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ పెట్టుబడి, ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆస్తి యాజమాన్య వివరాలను నిల్వ చేసే వెబ్‌సైట్‌లను కవర్ చేస్తుంది. పన్ను దర్యాప్తులో భాగంగా డిజిటల్ ఖాతాల తనిఖీ కోసం యాక్సెస్ కోడ్‌లను ఓవర్‌రైడ్ చేసే అధికారాన్ని కూడా ఇది అధికారులకు ఇస్తుంది.
👉ఈ రోజుల్లో….ఒక వస్తువు కావాలన్న వెంటనే ఆన్లైన్ లో గుర్తుకు వచ్చేది రెండే రెండు….ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ,…అధికారులు గోడౌన్లలో తనిఖీలు చేపట్టగా. వేలాది నకిలీ వస్తువుల సీజ్….ప్రజలు కొన్న వస్తువు నకిలీ నా లేక ఒరిజినల్ నా అనేది సందేహం….! ఢిల్లీలోని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లపై బీఐఎస్ దాడులు..డిస్పాచ్‌కు సిద్ధంగా ఉన్న నాసిరకం వస్తువుల సీజ్.. నాణ్యత లేని ఉత్పత్తుల్లో గీజర్లు, మిక్సీలు, ఎలక్ట్రికల్ పరికరాలు.. గతవారం తమిళనాడులో 3 వేల ఉత్పత్తుల సీజ్.. ఈకామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లపై ఢిల్లీ బ్రాంచ్‌కు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) జరిపిన దాడుల్లో పలు బ్రాండ్లకు చెందిన నకిలీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని మోహన్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అమెజాన్ సెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గోడౌన్‌లో ఈ నెల 19న 15 గంటలపాటు కొనసాగిన ఈ తనిఖీల్లో నాణ్యత లేని వేలాది ఉత్పత్తులను అధికారులు సీజ్ చేశారు. వీటిలో గీజర్లు, మిక్సీలు, పలు రకాల ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయి. వీటికి ఐఎస్ఐ గుర్తింపు లేదని, నకిలీ లేబుళ్లతో ఉన్నాయని అధికారులు తాజాగా వెల్లడించారు.
అలాగే, ఢిల్లీలోని త్రినగర్‌లో ఉన్న ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఇన్‌స్టాకార్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ గోడౌన్‌లో నిర్వహించిన తనిఖీల్లోనూ నాసిరకం ఉత్పత్తులను గుర్తించారు. డిస్పాచ్‌కు రెడీగా ఉన్న స్పోర్ట్స్ ఫుట్‌వేర్‌లను సీజ్ చేశారు. వాటిపై తయారీ తేదీ కానీ, ఐఎస్ఐ ముద్ర కానీ లేదని అధికారులు తెలిపారు. రూ. 6 లక్షల విలువైన 590 జతల స్పోర్ట్స్ షూస్‌ను సీజ్ చేశారు. కాగా, గతవారం తమిళనాడులో 3 వేల ఉత్పత్తులను బీఐఎస్ సీజ్ చేసింది.
👉బైకుపై మృతదేహంతో నిరసన.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటకు చెందిన దార్ల హేమ దుర్గా ప్రసన్నను (31) గంగన్నగూడెం గ్రామానికి చెందిన మోదుగ సాయి బలవంతంగా లోపర్చుకొని ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం చనిపోదామని నిర్ణయించుకొని ఆమెకు పురుగుల మందు పట్టించాడు. మరొసారి పురుగుల మందు పట్టించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మహిళా మృతదేహాన్ని సాయి ఇంటికి బైకుపై తీసుకెళ్లారు.
* రెడ్బుక్ పేరెత్తితే కొందరికి గుండెపోటు వస్తోంది: లోకేశ్
తాను ఎక్కడికి వెళ్లినా రెడ్బుక్ గురించి ప్రస్తావన వస్తోందని మంత్రి లోకేశ్ అన్నారు. ‘రెడ్బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దాని పేరు చెప్పగానే కొందరికి గుండెపోటు వస్తోంది. కొందరు బాత్రూమ్లో కాలుజారి పడి చెయ్యి విరగ్గొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఇగోలు వద్దు. కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి పని చేద్దాం’ అని లోకేశ్ అన్నారు.
🌟విజయశాంతికి మంత్రి వర్గంలో చోటు?.. మే 7 నుండి తెలంగాణలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల తర్వాత తెలంగాణలో మంత్రులను మార్చనున్నట్లు సమాచారం..మంత్రి కొండా సురేఖ స్థానంలో విజయశాంతికి చోటు కల్పిస్తారని జోరుగా ప్రచారం
🌟పల్నాడు_వినుకొండ _ హత్య కేసులో నిందితులు అరెస్టు.. * పల్నాడు జిల్లా వినుకొండ లో మార్చి 17 న కొప్పవరపు సావిత్రి (69) అనే మహిళ దారుణ హత్యకు గురైంది, ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసారు..వినుకొండ పట్టణంలో మార్చి 17 న సావిత్రి అనే మహిళ దారుణ హత్యకు గురైంది… ఈ సంఘటనలో మండలంలోని పెద్దకంచర్లకు చెందిన కట్టెంపూడి సాంబయ్య, ఆవుల మంగమ్మ ను పోలీసులు అరెస్టు చేశారు… సావిత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమే ఇంటిలోకి సాంబయ్య, మంగమ్మ ప్రవేశించి చీర పైట కొంగుతో మెడ చుట్టూ చుట్టీ సావిత్రి ని హత్య చేసి ఆమే ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లారని నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ కేసు ను ఛాలెంజ్ గా తీసుకుని పది రోజుల్లోనే ముద్దాయిలను అరెస్టు చేసిన సిఐ శోభన్ బాబు, సిబ్బంది కి రివార్డు కు సిఫార్సు చేస్తామని తెలిపారు.
*నెల్లూరు జిల్లా ….కోవూరు మండలం ఆర్కే పెట్రోల్ బంక్ జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం…ఆగి ఉన్న లారీని కంటైనర్ ను వేగంగా వచ్చి ఢీ కొట్టిన మరొక లారీ….నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్టు సమాచారం… ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు…సంఘటన స్థలాన్ని స్థలానికి చేరుకుని విచారిస్తున్న కోవూరు పోలీసులు…
.
👉రాష్ట్రంలో ఆటవిక పాలన తో పాటు అప్రకటిత ఎమర్జెన్సీ అమలు లో ఉందని వైసిపి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. చిత్తూరులో తెదేపా అల్లరిమూకల దాడిలో గాయపడ్డ వైసిపి కార్యకర్త మురళీ రెడ్డిని , ఆయన కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రావణకాష్టానికి పరాకాష్ట చిత్తూరు ఉదంతమని ఉదహరించారు. ఈ అంశాన్ని తమ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నియోజకవర్గ ఇంచార్జ్ విజయానందరెడ్డి ఫోన్ లో ఆరాతీశారన్నారు. చిత్తూరులోని వైసిపి కార్యకర్తలకు విజయానందరెడ్డి తో పాటు తాను వైయస్ జగన్ గారు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఓ నాయకుడి జన్మదిన వేడుకల్లో మద్యం మత్తులో ఉన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని విమర్శించారు. నిన్న అర్ధరాత్రి అల్లరి మూకల దాడి సమయంలో ఆ ఇంటిలోని చిన్నారులు బెడ్ క్రింద దాక్కోవడం కలచివేస్తోందని ఆవేదన చెందారు. చిత్తూరు లో ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయమని అన్నారు. అంతే కాకుండా బాధితులపైనే కేసులు పెట్టడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారని, అదే జరిగితే న్యాయస్థానం మెట్లెక్కడమే కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రతిఘటిస్తామని తెలిపారు. టీడీపీ శ్రేణులు ఇలాంటివి పునరావృత్తం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు.
👉చిత్తూరులో వైసీపీ నాయకుడిపై గుర్తుతెలియని దుండగుల దాడి..మూకుమ్మడిగా ముప్పై మంది గుర్తు తెలియని వ్యక్తులు కొంగారెడ్డి పల్లిలో గల మురళీరెడ్డి ఇంటిపై దాడి చేసినట్టు స్థానికుల సమాచారం.సంఘటనా స్థలానికి చేరుకున్న వైసిపి ఇంచార్జ్ విజయానందరెడ్డి, చిత్తూరు డియస్పీ
👉బైపాస్ రోడ్డులో “గిరిజనుడి” ఇల్లు ధ్వంసం..!.. *కోర్టు ఆదేశాలు ఉన్నా రాత్రికి రాత్రే విధ్వంసం..*పోలీస్ స్టేషన్లో గిరిజనుడి ఫిర్యాదు..*షాద్ నగర్ కోర్టు ఉత్తర్వులు ఉన్నా అర్థరాత్రి విధ్వంసం*
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని 44 నెంబర్ జాతీయ బైపాస్ రహదారిపై రాత్రి ఓ ఇంటిని అదేవిధంగా కాంపౌండ్ వాల్ ను నేలమట్టం చేశారు. ఓ గిరిజనుడు తనకు సంబంధించిన 200 గజాల విలువైన భూమిలో కాంపౌండ్ వాల్, ఓ గదిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో నిర్మించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి అక్కడికి వచ్చిన కొందరు ఓ జెసిబి సహాయంతో దీనిని నేలమట్టం చేశారు. దీనికి సంబంధించిన సిసి ఫుటేజ్ విజువల్స్ కూడా వెలుగు చూస్తున్నాయి. వెలిజర్ల కాలనీ తాండకు చెందిన గిరిజనుడు బాబు నాయక్ కు సంబంధించిన 200 గజాల భూమి సర్వేనెంబర్ 649 లో గల 200 గజాల విస్తీర్ణం గల ప్లాటులో 2022 సంవత్సరంలో మున్సిపాలిటీ నుండి అనుమతి తీసుకుని మరి ఇంటి నిర్మాణం చేపట్టి కాంపౌండ్ వాల్ నిర్మించారు. దీనికి ఇంటి నెంబర్ 9 – 21/1/A/1 ప్రకారం అనుమతి కూడా తీసుకున్నారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు వచ్చి జెసిబి యంత్రం సాయంతో ఇంటి నిర్మాణాన్ని నేలమట్టం చేశారు.
*ఫిర్యాదులో బాధితుడు బాబు నాయక్ పేర్కొన్న విధంగా..*
నేను లంబాడా కులానికి చెందిన పేద గిరిజనుడిని. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం, చటన్‌పల్లి గ్రామంలో ఉన్న 200 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఓపెన్ ప్లాట్‌కు నేను పూర్తి యజమానిని. నేను 23-09-2022 తేదీతో రిజిస్టర్డ్ సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం. 12908/2022 ద్వారా ఆస్తిని కోనుగోలు చేసి నేను ఆ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాను. నేను రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మునిసిపాలిటీ కార్యాలయం నుండి TS-b పాస్ లెటర్ ఆఫ్ అప్రూవల్ నెం. 241120/SHAD/1119/2022, తేదీ: 27-12-2022 ప్రకారం పని ప్రారంభించడానికి ఆమోదం పొందాను, నా పైన పేర్కొన్న ఆస్తిలో నేను ఇప్పటికే కాంపౌండ్ వాల్ మరియు రూమ్ షెడ్ గదులను నిర్మించాను.
మామిడి జనార్దన్ రెడ్డి మామిడి జనార్దన్ రెడ్డి S/o. ఎం. గోపాల్ రెడ్డి, వయస్సు: 55 సంవత్సరాలు, ప్రాంతం: వ్యాపారం, ఇంటి స్థలం 2-10, పెంజర్ల గ్రామం, కొత్తూరు మండలం, రంగారెడ్డి జిల్లా మరియు ఇతరులు గతంలో నా స్వాధీనం ఉన్న ఇంటి స్థలంలో జోక్యం చేసుకున్నారు. ఈ విషయంలో నేను గౌరవనీయులైన ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, షాద్‌నగర్ ద్వారా 2023 యొక్క O.S. నం. 63 లో పైన పేర్కొన్న వ్యక్తి అతని అనుచరులు నా స్వాధీనంలో జోక్యం చేసుకోకుండా నిషేధిస్తూ ప్రకటన-మధ్యంతర నిషేధ ఉత్తర్వులను పొందాను. నాకు మున్సిపల్ అధికారులు డోర్ నంబర్ 9-2-1/A/1 ను కూడా కేటాయించారు. నేను పన్ను అసెస్‌మెంట్ నంబర్ 118701823 ద్వారా అధికారులకు ఇంటి పన్ను చెల్లించాను మరియు నేను చెప్పిన ఇంటి ఆస్తిలో నివసిస్తున్నాను. విషయం ఇలా ఉండగా, నిన్న 28-03-2025 అర్ధరాత్రి 1-30 గంటల ప్రాంతంలో, పైన పేర్కొన్న మామిడి జనార్ధన్ రెడ్డి మరియు అతని గూండాలు నా ఆస్తిలోకి అక్రమంగా చొరబడి, నా కాంపౌండ్ వాల్ మరియు టిన్ షెడ్ గదుల మొత్తం ఆస్తిని JCB యంత్రం ద్వారా అక్రమంగా కూల్చివేసి, నేను స్వగ్రామానికి వెళ్ళినప్పుడు నా ఆస్తిని లాక్కోవాలనే దురుద్దేశంతో ఆదేశాలను తీవ్రంగా ఉల్లంఘించారు. కాబట్టి, నా ఆస్తిని లాక్కోవడానికి పైన పేర్కొన్న చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన మామిడి జనార్ధన్ రెడ్డి మరియు అతని గూండాలపై భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు SC & ST (POA) చట్టం కింద కేసు నమోదు చేయాలని నేను మీ సార్‌ను అభ్యర్థిస్తున్నాను, దీనికి నేను కృతజ్ఞుడను.
*కోర్టు ఉత్తర్వులు ఉన్నా దౌర్జన్యం*
ఈ ప్లాటు వివాదానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుందని బాధితుడు బాబు నాయక్ తెలిపారు. షాద్ నగర్ న్యాయస్థానంలో ఐఏ నంబర్ 153/23 ప్రకారం బాబు నాయక్ ఇంజక్షన్ ఆర్డర్ కలిగి ఉన్నారు. అయినప్పటికీ రాత్రికి రాత్రి ఇతని ఇంటిని ధ్వంసం చేశారని బాధితుడు వాపోయాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తనకు న్యాయం జరగాలని కోరాడు.

