*కేజ్రీవాల్‌పై మరో కేసు నమోదు!
👉ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 2019లో దాఖలైన ఫిర్యాదు ప్రకారం, పెద్ద ఎత్తున హోర్డింగ్లు ఏర్పాటుకు ప్రజా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసు విచారణను ఏప్రిల్ 18న చేపట్టనుంది. *తహశీల్దారు రాక ఇన్ చార్జి లేక ఇబ్బందులు…*
👉నిలిచిన కులదృవికరణ పత్రాలు… ఇబ్బందులు పడుతున్న విద్యార్దులు…* *భూ సమస్యలపై వచ్చే ప్రజలకు తీరని కష్టాలు…*దీర్ఘ కాలిక శెలవులో తహశీల్దారు!!!!..*గత 10 రొజులుగా దుస్దితి…* ప్రకాశంజిల్లా పొదిలి మండల తహసిల్దార్ గత 10రొజులుగా కార్యాలయానికి రాక పొవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..ఇంటర్మీడియట్ విద్యార్దులు పరిక్షలు ముగయడంతో ఆదాయ,కులదృవీకరణ పత్రాలకొసం కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేయవలసిన పరిస్థితి నెలకొంది..భూ సమస్యలపై ప్రజలు కార్యాలయం వద్దకు వచ్చి వెనుదిరిగి పొవలసిన పరిస్థితి నెలకొంది..తహసిల్దార్ దీర్ఘకాలిక శెలవులోకి వెళ్ళినట్లు రెవెన్యూ సిబ్బంది సమాచారం..ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే ఇన్ చార్జ్ ని నియమించి విద్యార్దులకు ఇబ్బంది లేకుండా చేయాలని పలువురు కొరుతున్నారు.
🌟 కొండపి నియోజకవర్గం సింగరాయకొండలో రంజాన్ మాసం సందర్భంగా మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు ముస్లిం సోదరులు,పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .

👉విడుదల రజనీ ఆమె మరిది గోపి పై మరో కేసు రెడీ..
వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజిని కష్టాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. ఇటీవల స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. రజనీపై నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఢిల్లీ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగదని తాను ముందుకు తీసుకువెళ్తానంటూ లావు కృష్ణదేవరాయులు విడుదల రజనీకి వార్నింగ్ ఇచ్చారు.
స్టోన్ క్రషర్ యజమాని నుంచి ఆమె రెండు కోట్ల రూపాయలు రాత్రి 11 గంటల సమయంలో తీసుకున్నట్లుగా సాక్షాలను కూడా పోలీసులు సేకరించారు. వాటి ఆధారంగానే గవర్నర్ అనుమతితో ఆమెపై కేసు నమోదయింది. ఇక తాజాగా ఆమె మరిది గోపి వ్యవహారం మరోసారి రజనీకి తలనొప్పిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా రజిని ఆమె మరిది గోపి పై జిల్లా ఎస్పీకి ఒక ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వీరిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2022 ఏప్రిల్ లో రజనీ అక్రమాలను తాను ప్రశ్నించినందుకు తన ఇంటిపై ఆమె దాడి చేయించారని అందులో ప్రస్తావించారు..దాదాపు 100 మంది వచ్చి తనపై దాడి చేశారని తన కారుని ఇంట్లో ఫర్నిచర్ ని నాశనం చేశారని అలాగే మూడు రోజులపాటు విధ్వంసం సృష్టించి తనను తన కుటుంబ సభ్యులను చిత్రహింసల గురి చేశారని సుబ్రహ్మణ్యం ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సరే పట్టించుకోలేదని నామమాత్రంగా కేసు నమోదు చేసినట్టు ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజనీపై ఆమె మరిదిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎఫ్ఐఆర్ లో వారిద్దరి పేర్లు చేర్చాలని కోరారు.
👉9కేజీల గంజాయి పట్టివేత.. *మహబూబాబాద్ జిల్లా:*
తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్టీసి బస్టాండ్ సెంటర్లో గంజాయి పట్టివేత.. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుండి సుమారు 9కేజీల గంజాయి పట్టివేత.. ఒడిశా రాష్ట్రం నుండి మహారాష్ట్ర కు వయా తొర్రూరు నుండి తరలిస్తుండగా పట్టుకున్న తొర్రూరు ఎస్సై ఉపేందర్.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని,గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై ఉపేందర్..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉పోదిలిలో డి ఆర్ డి ఏ పి డి ఆకస్మిక తనిఖీ*
వెలుగు డిఆర్డిఏ ఆధ్వర్యంలో జరుగుతున్న _వార్షిక రుణ జీవనోపాదుల ప్రణాళిక_ ఎన్యూమ్ రేటర్స్ మరియు విఓఏల శిక్షణా కార్యక్రమాన్ని ప్రాజెక్టు డైరెక్టర్ పి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగినది, ఈ శిక్షణా తరగతుల్లో భాగంగా ఎన్యూమ్ రేటర్లకు తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. ఎన్యూమరేటర్స్ సంఘ సభ్యులను సమావేశపరిచి ఖచ్చితమైన రుణ ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించడం అయినది. 2025-2026 సంఘ సభ్యులకు ఏ నెలలో ఏ అవసరానికి ఎంత మొత్తం కావాలో యాప్ నందు నమోదు చేయాలనీ తెలపడం జరిగింది.దీనికి మండల స్థాయి సిబ్బంది, విఓఏ
లు,ఎన్యూమ్ రేటర్స్ కు పూర్తి సహాయ సహకారాలు అందించాలని తెలియజేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో ఏపిఎం కే గోపాలకృష్ణ, సి సి లు యు.రాజయ్య, కే. వెంకటరెడ్డి, యం. దాసు, మండల సమాఖ్య అధ్యక్షురాలు షేక్ మెహరున్నీషా బేగం, అకౌంటెంట్ శ్రీదేవి పాల్గొన్నారు.
👉 రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ స్థాపనకు విస్తృత ఏర్పాట్లు. ఏప్రిల్ 2న పీసీ పల్లి మండలం దివాకరపురానికి మంత్రి లోకేష్, అనంత్ అంబానీ రాక కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి,జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ,ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి,ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు.సమన్వయంపై సంబంధిత అధికారులకు మంత్రి,కలెక్టర్ దిశా నిర్దేశం
👉 *ముస్లిం వర్క్ బోర్డు సవర్ణ బిల్లును వ్యతిరేకిస్తూ పొదిలి పట్టణంలో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారూ ..అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఆర్ ఐ కి వినతి పత్రం అందించినారు.

