లోక్‌సభను అప్రజాస్వామికంగా నడుపుతున్నారు: రాహుల్ గాంధీ..👉భాషను వ్యతిరేకించేది అందుకే UP సీఎంకు స్టాలిన్ కౌంటర్..ప్రభుత్వఇఫ్తార్ విందును బహిష్కరణ..👉ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!👉 విజయవాడలో వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు….*ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం వారి నిర్వాకం..*గుంటూరు… దళారుల మోసంతో…మిర్చి రైతులకు ధరా ఘాతం…*ఆయనతో తాను టచ్‌లో ఉన్నట్లు గానీ నిరూపిస్తే తల నరుక్కుంటా: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పీఏ ఎంవీ కృష్ణారెడ్డి..👉 కాంగ్రెస్‌ అవినీతి, అరాచకపాలనను ప్రశ్నిస్తున్న తనపై రేవంత్‌ ప్రభుత్వం కత్తిగట్టి వేధింపులకు పాల్పడుతోంది : బీఆర్‌ఎస్‌ నేత కొణతం దిలీప్‌

👉భాషను వ్యతిరేకించేది అందుకే UP సీఎంకు స్టాలిన్ కౌంటర్.. తమిళనాడులో జరుగుతున్న ద్విభాషా ఉద్యమం న్యాయం, గౌరవం కోసమే తప్ప ఓట్ల కోసం కాదని సీఎం స్టాలిన్ స్పష్టతనిచ్చారు. తాము ఏ భాషను వ్యతిరేకించట్లేదని బలవంతంగా తమపై రుద్దడాన్నిమాత్రమే అడ్డుకుంటున్నామని తెలిపారు. ఓట్ల కోసమే NEPని వ్యతిరేకిస్తున్నారని UP సీఎం ఆరోపణలకు X వేదికగా స్టాలిన్ కౌంటరిచ్చారు. డీలిమిటేషన్, ఎడ్యుకేషనల్ పాలసీలపై రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమం బీజేపీ నేతలను కలవరపెడుతోందని తెలిపారు.

👉రాష్ట్రంలోని పలు ముస్లిం సంఘాల కీలక నిర్ణయం*

*ప్రభుత్వఇఫ్తార్ విందును బహిష్కరించనున్నట్టు ప్రకటన..*వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిర్ణయం..*వక్ఫ్‌ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలి*..ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యులు.. *ముస్లిం సంఘాలన్నీ రేపు ఇఫ్తార్‌ను బహిష్కరించాలి.. *ఈనెల 29న విజయవాడ ధర్నా చౌక్‌లో భారీ నిరసన*..ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యులు

👉 లోక్‌సభను అప్రజాస్వామికంగా నడుపుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. స్పీకర్‌ ఓం బిర్లా సభలో తనను మాట్లాడనివ్వడం లేదన్నారు. ఏడెనిమిది రోజులుగా ఇదే జరుగుతోందని తెలిపారు. బుధవారం సభాపతి సభను వాయిదావేసే ముందు.. సభ్యులు సభలో హుందాతనం పాటించాలని చెప్పారు. సభలో కొందరి ప్రవర్తన ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా లేదంటూ పలు దృష్టాంతాలు తన దృష్టికి వచ్చాయన్నారు. తండ్రి-కుమార్తె, తల్లి-కుమార్తె, భర్త-భార్య సభ్యులుగా ఉండడం ఈ సభ చూసిందని.. ఈ నేపథ్యంలో సభలో సభ్యులు 349 నిబంధనకు అనుగుణంగా నడచుకోవాలని, ముఖ్యంగా ప్రతిపక్ష నేత నియమాల ప్రకారం ప్రవర్తించాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. సభాపతి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి తక్షణ కారణమేంటో తెలియరాలేదు. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. ‘సభలో నన్ను మాట్లాడనివ్వాలని విజ్ఞప్తిచేశాను. కానీ ఆయన పారిపోయారు. సభ నడిపే పద్ధతి ఇది కాదు. నా గురించి నిరాధారంగా మాట్లాడారు. నా ప్రస్తావన తెచ్చినందున నాకు మాట్లాడే అవకాశమివ్వాలని అడిగాను. అవసరం లేకపోయినా ఆయన సభను వాయిదావేసి వెళ్లిపోయారు. సభలో ప్రసంగించేందుకు ప్రతిపక్ష నేతకు చాన్సివ్వడం సంప్రదాయం. నేను ఎప్పుడు లేచినా మాట్లాడేందుకు అనుమతించడం లేదు. ఏడెనిమిది రోజులుగా ఇది జరుగుతోంది. ఇదో కొత్త ఎత్తుగడ. ప్రతిపక్షానికి ఇక్కడ తావులేదు’ అని ఆరోపించారు.మరోవైపు.. స్పీకర్‌ నిష్క్రమించగానే.. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఉపనేత గౌరవ్‌ గొగోయ్‌, విప్‌ మాణిక్కం ఠాగూర్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సహా సుమారు 70 మంది కాంగ్రెస్‌ ఎంపీలు ఆయన చాంబరుకు హడావుడిగా చేరుకున్నారు. తమ నేతకు కొన్ని రోజులుగా అవకాశమివ్వడం లేదని ఆక్షేపించారు. ఆయనపై వ్యాఖ్యలు చేయడానికి కారణాలేంటో తెలుసుకోగోరారు. అయితే తమ ప్రయత్నం ఫలించలేదని కొందరు ఎంపీలు తెలిపారు. కాగా.. మౌలిక పార్లమెంటరీ మర్యాదల గురించి ప్రతిపక్ష నేతకు స్పీకర్‌ గుర్తుచేయాల్సి రావడం అవమానకరమని బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ వ్యాఖ్యానించారు. మాణిక్కం ఠాగూర్‌ సభలో ప్రసంగిస్తుండగా.. రాహుల్‌ లేచి తన సోదరి ప్రియాంక సీటు వద్దకు వెళ్లి ప్రేమగా ఆమె బుగ్గలు నొక్కుతున్న దృశ్యాన్ని మాలవీయ పోస్టు చేశారు. అన్నాచెల్లెళ్ల ప్రేమాభిమానాలకు ఇది నిదర్శనమైనప్పటికీ.. పార్లమెంటు జరుగుతుండగా రాహుల్‌ అలా చేయడాన్ని సభాపతి తీవ్రంగా పరిగణించినట్లు కనబడుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

👉ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద వద్ద పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ కుమార్ చనిపోయి కనిపించడం తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. ప్రవీణ్‌ది రోడ్డు ప్రమాదమని అనుకున్నప్పటికీ పాస్టర్లు మాత్రం ఇది హత్యగా అనుమానిస్తున్నారు. అందుకే ఈ కేసు చాలా సీరియస్‌ అయింది. ప్రభుత్వం కూడా సమగ్ర విచారణకు ఆదేశించింది.

ప్రవీణ్‌ మృతిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్న పోలీసులు వివిధ కోణాల్లో కేసు విచారణ చేస్తున్నారు. అర్థరాత్రి వేల చనిపోయినట్టు గుర్తించిన పోలీసుుల ఆ టైంలో ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఎస్సైలతో కూడిన టీం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో కీలకమైన ఆధారాలు సేకరించారు. ఇంకా ఎవరి వద్దైనా ఆధారాలు ఉంటే పోలీసులకు అందివ్వాలని విజ్ఞప్తి చేశారు.. *కొవ్వూరు టోల్‌ గేట్‌ సమీపంలో ప్రవీణ్‌ టూవీలర్‌పై వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ లభించింది. వాటి ఆధారంగా కేసును ఎనలైజ్ చేసిన పోలీసులు రాత్రి సోమవారం రాత్రి 11.43 గంటలకు ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. టోల్‌ గేట్‌ నుంచి 11.31 నిమిషాలకు బయల్దేరిన తర్వాత ప్రమాదం జరిగిన 11. 43 నిమిషాల మధ్య ఏం జరిగిందనేది ఇప్పుడు కేసులో కీలకం..ఈ టోల్‌గేట్‌ను దాటుకొని ప్రవీణ్‌ వెళ్లిన వాహనంతోపాటు మరికొన్ని వాహనాలు అదే టైంలో అటుగా వెళ్లాయి. ఐదు వాహనాల్లో ఓ రెడ్ కలర్ కారు కూడా ఉంది. అది ప్రవీణ్ టూతోపాటే ముందుకు మూవ్ అయింది. ఇప్పుడు పోలీసులు ఆ కారుపై కూడా ఫోకస్ పెట్టారు. ఆ కారులో ఎవరు ప్రయాణించారు. మిగతా వాహనాలపై కూడా దృష్టి పెట్టారు.

ప్రవీణ్‌ కుమార్‌ ఫోన్‌ కాల్‌డేటాను కూడా పోలీసులు ఎనాలసిస్ చేస్తున్నారు. ఆఖరి కాల్‌ రామ్మోహన్‌ ఆర్‌జేవైకి వెళ్లిందని పోలీసులు చెప్పారు. డెడ్‌బాడీ గురించి తెలిసిన తర్వాత ఆఖరి ఫోన్‌కాల్ చేసిన వ్యక్తికే ఫోన్ చేసి రప్పించారు. రామ్మోహన్‌ అతని భార్య వచ్చారు. వచ్చిన తర్వాత డెడ్‌బాడీ ప్రవీణ‌్‌కుమార్‌ది అని అన్నారు. విషయాన్ని కుటుంబ సభ్యలకు చేరవేశారు.

హైదరాబాద్‌కు చెందిన పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలుగు రాష్ట్రాల్లోనే పెను సంచలనంగా మారింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు అనుమాస్పద మృతిగా కేసు పెట్టారు. ఓవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు పాస్టర్ల డిమాండ్‌తో ఈ కేసులో సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోస్టుమార్టం కూడా పూర్తి చేశారు. ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్‌ మేజిజస్ట్రేట్‌తో దర్యాప్తు చేయనున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

*మృతదేహం తీసుకెళ్లకుండానే పాస్టర్లు ఆందోళన చేపట్టారు. దీనిపై చాలా అనుమానాలు ఉన్నాయని ప్రభుత్వం, అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని, కుటుంబ సభ్యులను ఒప్పించి డెడ్‌బాడీని హైదరాబాద్‌కు తరలించారు. డెడ్‌బాడీని రేపు ఆయన అభిమానుల కోసం హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద ఉంచనున్నారు. ..ప్రవీణ్ మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కచ్చితంగా ఇది హత్య అయితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

👉 *గుంటూరు… దళారుల మోసంతో…మిర్చి రైతులకు ధరా ఘాతం…*

*రాజకీయ ముసుగులో వ్యాపార దళారులు… వ్యాపారుల సిండికేట్ తో మిర్చి రైతు కుదేలు*

*గుంటూరు మిర్చి యార్డులోవ్యాపారుల అడ్డగోలు కొనుగోళ్లు… పంటకు అనేక సాకులతో ధరలకు కోతలు..**రైతు వెన్నుకు ధరా పాతం… గగ్గోలు పెడుతున్న చిన్నా సన్నకారు రైతాంగం..*గుంటూరు మిర్చి యార్డులో రైతులకు తీరని అన్యాయం నాటి నుండి నేటి వరకు అదే తంతూ …*ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డుగా పేరున్న గుంటూరు మిర్చి యార్డుకు ఇరు తెలుగు రాష్ట్రాలలో మిర్చి పండిస్తున్న రైతులు ఎక్కువగా రావడం గమనార్హం… రైతులు తెచ్చిన పంటను దళారులు ఏకమై గిట్టుబాటు ధరలు లేకుండా చేయడం ఇక్కడ గమనించదగ్గ విషయం.. ఒకప్రక్క ప్రభుత్వం రైతాంగానికి ఇబ్బందులు పడకుండా ఇప్పట్టికే కేంద్రంతో మాట్లాడి గిట్టుబాటు ధర కు తగు రూపకల్పన చేసిన విషయం తెల్సిందే… కానీ మిర్చి రైతులకు తీవ్ర అన్యాయం చేయడానికి రాజకీయ ముసుగులో దళారులు గా ప్రవేశించి వ్యాపారులే గిట్టుబాటు ధర పలకాకుండా గూడు పఠాని పన్నుతూన్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…రాజకీయ ముసుగులో దళారీలు రైతుల వెన్నుపై వేటువేయటం గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఆరాచకనికి పరాకాష్ట…తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు దళారీలు పై ఉక్కుపాదం మోపాలంటూ రైతులు ప్రాధేయపడుతుతున్నారు..వ్యాపారుల ముసుగులో రాజకీయ దళారులు మార్కెట్ యార్డులో జీవనం సాగిస్తు రైతుల పాలిట విష పురుగులుగా తయారయ్యారంటూ ఆవేదన చెందుతున్నారు

*గుంటూజిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రత్తిపాడు మండల కేంద్రంలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం వారి నిర్వాకం.*డబ్బులు కట్టిన బంగారం ఇవ్వము అంటున్న ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం.మార్చి నెల కావడంతో ఇప్పుడు బంగారం ఇవ్వము అంటున్న ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం.మేము బాకీ కడితే ఎందుకు ఇవ్వరు అంటున్న ఖాతాదారులు.. ముస్లిమ్స్ కి రంజాన్ నెల మరియు ఉగాది పండుగలు రావటంతో ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు ప్రత్తిపాడు లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి మేము బాకీ కడతాము తాకట్టులో ఉన్న బంగాళాన్ని ఇవ్వండి అంటుంటే ఇప్పుడు ఇవ్వటం కుదరదు మార్చి అయిపోయిన తర్వాత ఇస్తాము అంటున్నారు.

ఎందుకలా కారణం ఏమిటి?.. మేము మా రుణాన్ని చెల్లించినప్పుడు వెంటనే తాకట్టులో ఉన్న మా బంగారు వస్తువులను మాకు ఇవ్వాలి కదా?.. ముత్తూట్ ఫైనాన్స్ వారు ఎందుకు ఇవ్వటం లేదు?.. దీంతో ఖాతాదారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

👉 విజయవాడలో వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు.. హాజరైన వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్.. ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన వైయస్‌ జగన్‌ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్‌ చేశారు.అనంతరం వారితో కలిసి ఇఫ్తార్‌ విందు స్వీకరించారు.ముస్లిం సోదరులకు ఈద్‌ ముబారక్‌ అంటూ ఉర్దూలో ముందస్తు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్ధనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లాహ్‌ చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని ఆయన కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులతో పాటు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

👉గంజాయి స్మగ్లింగ్ కేసులో లేడీ డాన్ అరెస్టు..

ఒడిశాలో సంగీతా సాహును అరెస్టు చేసిన పోలీసులు

సంగీతా సాహుపై సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, ధూల్ పేట్ లో 4 కేసులు..ఇన్‌స్టాగ్రామ్‌ లో హీరోయిన్ లా సంగీతా సాహు రీల్స్..అనేక రాష్ట్రాల్లోని గంజాయి వ్యాపారస్తులతో పరిచయాలు.నాలుగేళ్ల క్రితం గంజాయి హోల్ సేల్ వ్యాపారంలోకి దిగిన సంగీతా సాహు

*దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది..పేమెంట్స్, ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి విషయాల్లో అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సాయంత్రం 7 గంటల తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. యూపీఐ సేవలందించే గూగుల్ పే, ఫోన్పే వంటి యాప్స్ పనిచేయడం లేదని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

👉కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి డైరెక్షన్‌లో తాను యాక్షన్‌ చేస్తున్నానని అంటున్నారని.. ఆయనతో తనకు సంబంధాలు ఉన్నాయని గానీ.. ఆయనతో తాను టచ్‌లో ఉన్నట్లు గానీ నిరూపిస్తే తల నరుక్కుంటానని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పీఏ ఎంవీ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన పులివెందుల ప్రెస్‌ క్లబ్‌లో మాట్లాడారు. వివేకా హత్య కేసులో సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ తనను తీవ్రంగా కొట్టారని.. సునీత, రాజశేఖర్‌రెడ్డి చిత్రహింసలు పెట్టారని పులివెందుల కోర్టులో ఇచ్చిన ప్రైవేట్‌ కంప్లయింట్‌ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని.. నాటి పులివెందుల సీఐ రాజు రెండు సార్లు తన వద్దకు వచ్చి 23 పేజీల స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తే.. ఏఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి రికార్డు చేశారని రాశారని.. వారికేం సంబంధముందని ప్రశ్నించారు. ‘నన్ను కొట్టలేదని రామ్‌సింగ్‌, సునీత, రాజశేఖర్‌రెడ్డి కాణిపాకంలో గానీ, తిరుపతిలో గానీ.. వారు చెప్పే ఏ చర్చిలో అయినా ప్రమాణం చేస్తే ప్రైవేట్‌ కంప్టయింట్‌ వెనక్కి తీసుకుంటా..’ అని స్పష్టంచేశారు.

👉 హైదరాబాద్‌లోని అమెజాన్‌ గోదాంపై బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించి నిల్వ చేసిన ఉత్పత్తులను పెద్ద ఎత్తున సీజ్‌ చేశారు. బీఐఎస్‌ హైదరాబాద్‌ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్ట్‌ సిటీలో ఉన్న గోదాంలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు తనిఖీలు చేశారు. ఇందులో దాదాపు రూ.50 లక్షల పైగా విలువైన 2,783 ఉత్పత్తులకు బీఐఎస్‌ ధ్రువీకరణ, ఐఎ్‌సఐ మార్క్‌, ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తులకు ఉండాల్సిన రిజిస్ట్రేషన్‌ మార్కు లేవని గుర్తించారు.ఆ ఉత్పత్తులను జప్తు చేశారు. వీటిలో 1,937 స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ వాటర్‌ బాటిళ్లు, 150 స్మార్ట్‌ వాచ్‌లు, 326 వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌, 170 మొబైల్‌ చార్జర్లు తదితరాలున్నాయి. దీనిపై పీవీ శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం బీఐఎస్‌ ధ్రువీకరణను తప్పనిసరి చేసిందని, ఐఎ్‌సఐ మార్కు, ఎలకా్ట్రనిక్‌ వస్తువులకు రిజిస్ట్రేషన్‌ మార్కు ఉండాలని చెప్పారు. బీఐఎస్‌ అనుమతి పొందకుండా తయారుచేసినా, విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. జరిమానతో పాటు జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. వస్తువుల నాణ్యతా ప్రమాణాలను బీఐఎస్‌ కేర్‌ యాప్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చని, ఉల్లంఘనలను గుర్తిస్తే అందులో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

👉రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పూర్తి ప్రదాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద బుధవారం కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి అధ్యక్షుడు జెరిపోతుల పరశురామ్‌, జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ధూంధాం సభకు టీడీపీ ఎంపీలు బీద మస్తాన్‌రావు, కలిశెట్టి అప్పలనాయుడు, బీజేపీ ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించినప్పుడే రాజ్యాంగాన్ని గౌరవించినట్టు అవుతుందన్నారు. నాడు అంబేడ్కర్‌ లేకుంటే నేడు ఆర్బీఐ లేదని ఆర్‌.కృష్ణయ్య అన్నారు.

👉 కాంగ్రెస్‌ అవినీతి, అరాచకపాలనను ప్రశ్నిస్తున్న తనపై రేవంత్‌ ప్రభుత్వం కత్తిగట్టి వేధింపులకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌ నేత కొణతం దిలీప్‌ ఓ ప్రకటనలో ఆరోపించారు. ఇప్పటికే 11 అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని, తాజాగా వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారన్నారు. కొత్త డైవర్షన్‌కు తెరలేపిన సీఎం కార్యాలయం తనపై మీడియాకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చిందని విమర్శించారు. వ్యక్తిగత విదేశీ పర్యటనలకు రూ.18 కోట్ల ప్రభుత్వ సొమ్ము ఖర్చుచేశానంటూ చేసిన ఆరోపణలు వాస్తవం కాదన్నారు. డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌గా అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బృందంలో భాగంగా పదేళ్లలో (2014-2023) తొమ్మిదిసార్లు విదేశాలకు వెళ్లినట్లు తెలిపారు. ఇవన్నీ పెట్టుబడుల ఆకర్షణ కోసం కేటీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వ బృందం చేసిన అధికారిక పర్యటనలేనన్నారు.ఈ పర్యటనలకైన ఖర్చంతా ఐటీ శాఖ అధికారికంగా చెల్లించిందని, ఇందులో డిజిటల్‌ మీడియా నిధులు ఒక్కపైసా కూడా వినియోగించలేదని దిలీప్‌ వివరించారు. ఆర్టీఐ కింద వచ్చిన సమాధానాలను సీఎం పీఆర్వో కార్యాలయం ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి కొన్ని పత్రికలకు పంపిందని తెలిపారు. మరోవైపు 2023లో డిజిటల్‌ మీడియా విభాగం ప్రత్యేక వీడియోల రూపకల్పన, వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌, డిజిటల్‌ మీడియాలో ప్రకటనలు ఇవ్వడంవల్ల అంతకుముందుతో పోల్చితే ఖర్చు ఎక్కువైందన్నారు. ఈ ఖర్చు మొత్తం ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల పర్యవేక్షణలో జరిగిందని, దీనిపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని కొణతం దిలీప్‌ తెలిపారు.

👉ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద వద్ద పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ కుమార్ చనిపోయి కనిపించడం తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. ప్రవీణ్‌ది రోడ్డు ప్రమాదమని అనుకున్నప్పటికీ పాస్టర్లు మాత్రం ఇది హత్యగా అనుమానిస్తున్నారు. అందుకే ఈ కేసు చాలా సీరియస్‌ అయింది. ప్రభుత్వం కూడా సమగ్ర విచారణకు ఆదేశించింది.

ప్రవీణ్‌ మృతిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్న పోలీసులు వివిధ కోణాల్లో కేసు విచారణ చేస్తున్నారు. అర్థరాత్రి వేల చనిపోయినట్టు గుర్తించిన పోలీసుుల ఆ టైంలో ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఎస్సైలతో కూడిన టీం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో కీలకమైన ఆధారాలు సేకరించారు. ఇంకా ఎవరి వద్దైనా ఆధారాలు ఉంటే పోలీసులకు అందివ్వాలని విజ్ఞప్తి చేశారు.. *కొవ్వూరు టోల్‌ గేట్‌ సమీపంలో ప్రవీణ్‌ టూవీలర్‌పై వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ లభించింది. వాటి ఆధారంగా కేసును ఎనలైజ్ చేసిన పోలీసులు రాత్రి సోమవారం రాత్రి 11.43 గంటలకు ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. టోల్‌ గేట్‌ నుంచి 11.31 నిమిషాలకు బయల్దేరిన తర్వాత ప్రమాదం జరిగిన 11. 43 నిమిషాల మధ్య ఏం జరిగిందనేది ఇప్పుడు కేసులో కీలకం..ఈ టోల్‌గేట్‌ను దాటుకొని ప్రవీణ్‌ వెళ్లిన వాహనంతోపాటు మరికొన్ని వాహనాలు అదే టైంలో అటుగా వెళ్లాయి. ఐదు వాహనాల్లో ఓ రెడ్ కలర్ కారు కూడా ఉంది. అది ప్రవీణ్ టూతోపాటే ముందుకు మూవ్ అయింది. ఇప్పుడు పోలీసులు ఆ కారుపై కూడా ఫోకస్ పెట్టారు. ఆ కారులో ఎవరు ప్రయాణించారు. మిగతా వాహనాలపై కూడా దృష్టి పెట్టారు.

ప్రవీణ్‌ కుమార్‌ ఫోన్‌ కాల్‌డేటాను కూడా పోలీసులు ఎనాలసిస్ చేస్తున్నారు. ఆఖరి కాల్‌ రామ్మోహన్‌ ఆర్‌జేవైకి వెళ్లిందని పోలీసులు చెప్పారు. డెడ్‌బాడీ గురించి తెలిసిన తర్వాత ఆఖరి ఫోన్‌కాల్ చేసిన వ్యక్తికే ఫోన్ చేసి రప్పించారు. రామ్మోహన్‌ అతని భార్య వచ్చారు. వచ్చిన తర్వాత డెడ్‌బాడీ ప్రవీణ‌్‌కుమార్‌ది అని అన్నారు. విషయాన్ని కుటుంబ సభ్యలకు చేరవేశారు.

హైదరాబాద్‌కు చెందిన పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలుగు రాష్ట్రాల్లోనే పెను సంచలనంగా మారింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు అనుమాస్పద మృతిగా కేసు పెట్టారు. ఓవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు పాస్టర్ల డిమాండ్‌తో ఈ కేసులో సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోస్టుమార్టం కూడా పూర్తి చేశారు. ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్‌ మేజిజస్ట్రేట్‌తో దర్యాప్తు చేయనున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

*మృతదేహం తీసుకెళ్లకుండానే పాస్టర్లు ఆందోళన చేపట్టారు. దీనిపై చాలా అనుమానాలు ఉన్నాయని ప్రభుత్వం, అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని, కుటుంబ సభ్యులను ఒప్పించి డెడ్‌బాడీని హైదరాబాద్‌కు తరలించారు. డెడ్‌బాడీని రేపు ఆయన అభిమానుల కోసం హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద ఉంచనున్నారు. ..ప్రవీణ్ మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కచ్చితంగా ఇది హత్య అయితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

*బేస్తవారపేట* : బిలీవర్స్ ఈస్ట్రన్ చర్చ్ ఫాధర్ గుర్రం జాన్ రంగయ్య ఆద్వర్యములో రెవ. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణము క్రైస్తవ ప్రజలకు తీరని లోటని ప్రవీణ్ పగడాల మరణము పై పలు అనుమానాలు ఉన్నాయి గనుక పోలీసులు విచారణ చేసి ప్రవీణ్ పగడాల కుటుబముకు తగు న్యాయము చేయవలసిన దిగ ఫాదర్ గుర్రం జాన్ రంగయ్య అన్నారు అనంతరము చర్చ్ వద్ద కొవ్వత్తు లతో నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమములో* ఫాధర్ గుర్రం జాన్ రంగయ్య, పాస్టర్ చిట్టిబాబు, పౌలుబాబు, డి. చిట్టిబాబు ప్రశాంతి పాల్గొన్నారు.

* తూ గో జిల్లా….కొవ్వూరు మండలం …దొమ్మేరు లో దారుణ హత్య…. పంట చేలో గాయాలతో వ్యక్తి మృతదేహం….సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు…..వివరాలు సేకరణ……

*ప్రకాశం జిల్లా…పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు సమీపం లోని జాతీయ రహదారి పై మిర్చి లారీ బోల్తా…డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా లారీ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో తప్పిన ప్రాణాపాయం..

*కారు బొలెరో ఢీ కొని ఒకరు మృతి. .! ..ప్రకాశం జిల్లా : బేస్తవారిపేట మండలం పందిల్లపల్లి టోల్గేట్ సమీపంలో కారు, బొలెరో వాహనం ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

👉ఆర్టిసి బస్సు టిప్పర్ డి*..గిద్దలూరు మండలం సింగం పల్లె గ్రామ సమీపంలో ఆర్టిసి బస్సు, టిప్పర్ ఢీ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..