👉 మోడీ ముందు ఎంపీలతో పరేడ్ అంటున్న స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి.. 👉 జ‌న‌సేన‌లో అసంతృప్తి.. గ్రౌండ్ లెవిల్‌లో గ‌డ‌బిడ‌!.. *👉 కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హత్య కేసు.. సూర్యాపేట డీఎస్పీ రవి పై వేటు..👉కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు పెట్టిన కొణతం దిలీప్..👉బెట్టింగ్ యాప్స్ కేసులు సీఐడీకి బదిలీ చేసే యోచన..👉ప్రియురాలు అప్సర హత్య కేసులో పూజారి వెంకట సాయి సూర్య కృష్ణకు జీవిత ఖైదు..👉భారత రెజ్లర్ సునీల్ కుమార్ కు కాంస్యం*👉ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే ‘అన్నా’

👉 మోడీ ముందు ఎంపీలతో పరేడ్ అంటున్న స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పట్టు వదలని విక్రమార్కుడి గా కనిపిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పట్టు వదలని విక్రమార్కుడి గా కనిపిస్తున్నారు. ఆయన డీలిమిటేషన్ వ్యవహరంలో ఎక్కడా తగ్గడం లేదు. గత కొంతకాలంగా ఆయన ఇదే ఇష్యూ మీద సీరియస్ గానే పోరాటం చేస్తూ వస్తున్నారు. తాజాగా దక్షిణాదికి చెందిన సీఎంలు కీలక రాజకీయ పార్టీల నేతలతో ఆయన అతి ముఖ్య సమావేశం పెట్టి సౌత్ వార్ కి తెర తీశారు. డీలిమిటేషన్ వ్యవహారంలో సౌత్ అంతా ఒక్కటే అని కేంద్రానికి నిరూపించారు. ఇపుడు చూస్తే ఆయన మరో వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. అదేంటి అంటే డీలిమిటేషన్ వల్ల తమిళనాడుకు దక్షిణాదికి ఎంత నష్టమో నేరుగా ప్రధాని నరేంద్రమోడీకే వివరించబోతున్నారు. అందుకోసం ఆయన తమిళనాడుకు చెందిన 39 మంది ఎంపీలతో ప్రధానిని కలవబోతున్నారు. ఈ విషయం స్వయంగా స్టాలిన్ మీడియాకు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో తొందరలోనే తామంతా కలవబోతున్నామని అన్నారు. ఇటీవల ముగిసిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తీర్మానాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి అందచేస్తామని చెప్పారు. తమ బాధలను ప్రధానికి చెబుతామని అన్నారు. డీలిమిటేషన్ తో తమకు తీరని నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. అందువల్ల తమ పోరాటం ఎక్కడా ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరులో తామే కచ్చితంగా విజయం సాధిస్తామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే స్టాలిన్ తమిళనాడు నుంచి 39 మంది ఎంపీలతో ప్రధానిని కలవాలనుకోవడం రాజకీయంగా అతి పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ఒక దక్షిణాది రాష్ట్రం నుంచి డీలిమిటేషన్ ఇష్యూ మీద ఇంత పెద్ద ఎత్తున ఎంపీలు కలిస్తే అది జాతీయ స్థాయిలోనూ చర్చగా మారుతుంది. అంతే కాదు కేంద్రం ఆలోచనలోనూ మార్పు రావచ్చు అని అంటున్నారు. బీజేపీకి ఈ రోజున దక్షిణాది మీద ఫోకస్ ఉంది. ఈ కీలక సమయంలో అనుకూల వాతావరణాన్ని పాడుచేసుకోదని అంటున్నారు. దాంతోనే స్టాలిన్ కూడా ప్రధానిని కలసి సమస్యలు చెబితే అంతా సానుకూలం అవుతుందని ధీమాగా ఉన్నారు. అయితే అంతా బాగానే ఉన్నా స్టాలిన్ 39 మంది ఎంపీలతో వస్తాను అంటే ప్రధాని ఆఫీసు అపాయింట్మెంట్ ఇస్తుందా అన్నది. ఒకవేళ ఇస్తే ఒక రకంగా ఇవ్వకపోతే మరో రకంగా రాజకీయం ఉండొచ్చు. సో బీజేపీ పెద్దలకు చిక్కులలో పడేసేలా స్టాలిన్ వ్యూహం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. స్టాలిన్ మోడీతో ఎపుడు ఈ కీలక భేటీని నిర్వహిస్తారో ఆ ముహూర్తం ఎపుడో.

👉 జ‌న‌సేన‌లో అసంతృప్తి.. గ్రౌండ్ లెవిల్‌లో గ‌డ‌బిడ‌! ఏపీలో కూట‌మి క‌ట్టి వైసీపీని అధికారంలోకి రాకుండా చేసిన జ‌న‌సేన పార్టీ.. ప్ర‌స్తుతం పాల‌న‌లో కీల‌క భూమిక పోషిస్తున్న విష‌యం తెలిసిందే. ఏపీలో కూట‌మి క‌ట్టి వైసీపీని అధికారంలోకి రాకుండా చేసిన జ‌న‌సేన పార్టీ.. ప్ర‌స్తుతం పాల‌న‌లో కీల‌క భూమిక పోషిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఉప ముఖ్య‌మంత్రిగా కూడా ఉన్నారు. నాదెండ్ల మ‌నోహ‌ర్‌, కందుల దుర్గేష్‌లు మంత్రులుగా వున్నారు. ఇత‌ర 21 మంది ఎమ్మెల్యేల్లో 18 మంది సాధార‌ణ ఎమ్మెల్యేలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ప‌ది నెల‌లు గ‌డిచిపోయ‌న నేప‌థ్యంలో తాజాగా వారి బాధ‌లు పార్టీకి విన్న‌వించుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ మాట‌కు విలువ లేకుండా పోయింద‌ని జ‌న‌సేన మెజారిటీ ఎమ్మెల్యేలు ముక్త కం ఠంతో చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. టీడీపీ నాయ‌కులు త‌మ‌ను ఓవ‌ర్ టేక్ చేసేస్తున్నార‌ని.. తాము చిన్న ప‌నిచెప్పినా.. క‌లెక్ట‌ర్ నుంచి బిల్లు క‌లెక్ట‌ర్ వ‌ర‌కు ఎవ‌రూ లెక్క చేయ‌డం లేద‌ని కూడా ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. అధికారుల బ‌దిలీల విష‌యంలో అస‌లు త‌మ మాట‌కే విలువ లేకుండా పోయింద‌ని.. కాంట్రాక్టుల నుంచి నిధుల వ్య‌వ‌హారం వ‌ర‌కు త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. తాజాగా సోమ‌వారం రాత్రి విజ‌య‌వాడ‌లోని ఓ హోటల్ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ అధ్య‌క్ష‌త‌న 18 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు ఉన్న నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌స్య‌లు చెప్పాల‌ని ఆయ‌న కోరారు. అయితే.. అస‌లు త‌మ‌ను పట్టించుకునే ప‌రిస్థితి లేన‌ప్పుడు.. ఇక‌, తాము ఏం చెబుతామ‌ని.. తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన ఓ మ‌త్స్య కార సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇదే మాట‌ను ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బ‌ల‌మైన నాయ‌కుడు ఒక‌రు చెప్పారు. మొత్తానికి గ్రౌండ్ స్థాయిలో జ‌న‌సేన ఎమ్మెల్యేల ప‌రిస్థితి అయితే ఇబ్బందిగానే ఉంద‌ని తేల్చి చెప్పారు. దీనిని అధిష్టానానికి చేర‌వేస్తాన‌ని.. నాదెండ్ల మ‌నోహ‌ర్ వారికి భ‌రోసా ఇచ్చారు. అయితే.. వాస్త‌వానికి ఎమ్మెల్యేల మాట ఎలా ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో కొన్ని చోట్ల మిలాఖ‌త్ అయిన నాయ‌కులు కూడా ఉన్నారు. మ‌రికొన్ని చోట్ల వివాదాల‌కు తెర‌దీసిన నాయకులు కూడా ఉన్నారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అంత తేలికేమీ కాద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

👉ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే ‘అన్నా’…

ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో పొదిలి టౌన్ షమ్స్-ఉల్-ఉలూమ్ కాలేజీ నందు షంషీర్ అలీ బేగ్  ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇఫ్తార్ విందు’లో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం వైకాపా సమన్వయకర్త  అన్నా రాంబాబు  పాల్గొన్నారు.ఉపవాస ప్రార్ధనలు ఫలించి సమాజానికి మంచి జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

👉భారత రెజ్లర్ సునీల్ కుమార్ కు కాంస్యం*

ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ సునీల్ కుమార్ కాంస్యంతో మెరిశాడు. నిన్న జరిగిన గ్రీకో రోమన్ 87 కేజీల విభాగం కాంస్య పతక పోరులో అతడు 5–1తో జియాగ్జిన్ హంగ్ (చైనా)ను ఓడించాడు. ప్రస్తుత ఆసియా ఛాంపియన్షిప్లో భారత్ కు ఇదే తొలి పతకం.

👉వర్క్ ఫ్రం హోం..20 లక్షల ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలోసుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశముందని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. గృహిణులు ఇంటి పనులు చూసుకుంటూనే.. మూడు, నాలుగు గంటలు వెచ్చిస్తే వారి అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని తెలిపింది. మహిళల ఆర్థిక స్వావలంభన పెరిగేలా… పేదలకు ఆర్థిక స్వేచ్ఛ లభించేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది.

👉 బెట్టింగ్ యాప్ స్కామ్, మాజీ సీఎం భూపేష్ బాఘేల్ ఇంట్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ తో చిక్కుల్లో ఇరుక్కున్నారు. 6,000 కోట్ల రూపాయల ఈ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో భూపేశ్ బాఘేల్ నివాసంపై సీబీఐ దాడులు చేసింది. . రాయ్‌పూర్, బిలాయ్ లోని ఆయన నివాసాలపై బుధవారం నాడు సీబీఐ ఆకస్మిక దాడులు చేసింది. ఇంటితో పాటు భిలాయ్‌లో ఆయన ఇంటిపై సీబీఐ తనిఖీలు చేపట్టింది. ఆయనకు సన్నిహితుడైన పోలీస్ అధికారి నివాసంలోనూ దాడులు కొనసాగుతున్నాయి. ఆరు వేల కోట్ల మహాదేవ్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి సంబంధించి ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం నుంచి సీబీఐ దర్యాప్తును చేపట్టింది, ఈ విభాగం బాఘేల్‌తో పాటు యాప్ ప్రమోటర్లు రవి ఉప్పల్, సౌరభ్ చంద్రకర్, శుభం సోని, అనిల్ కుమార్ అగర్వాల్ మరో 14 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు నేతలు, అధికారుల ప్రమేయం ఉందని తన దర్యాప్తులో తేలిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరోపించింది. బాఘేల్ మాత్రం ఈ కేసును రాజకీయ కక్షతో నమోదు చేసిన కేసుగా పేర్కొన్నారు. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్‌లకు ఈ బెట్టింగ్ యాప్ ఒక సిండికేట్ ప్లాట్‌ఫారమ్‌ అని అధికారులు చెబుతున్నారు. కొత్త వినియోగదారులను యాడ్ చేసుకుని, యూజర్ ఐడీలను క్రియేట్ చేసి బినామీ బ్యాంక్ ఖాతాలతో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అధికారులు గుర్తించారు.

👉ప్రియురాలు అప్సర హత్య కేసులో పూజారి వెంకట సాయి సూర్య కృష్ణకు జీవిత ఖైదు..సాక్ష్యాలను తారుమారు చేసినందుకు జీవిత ఖైదుతో పాటు 7 ఏళ్ల జైలు శిక్ష…సరూర్ నగర్ లో అప్సర అనే యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వివాహేతర సంబంధం పెట్టుకున్న వెంకట సాయి సూర్య కృష్ణ..పెళ్లి చేసుకోమని అడగడంతో 2023లో అప్సరను కారులో తీసుకెళ్లి హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని పూడ్చిన పూజారి వెంకట సాయి సూర్య కృష్ణ..

👉 కాంగ్రెస్ సీనియర్ నాయకుడి హత్య కేసు.. సూర్యాపేట డీఎస్పీ రవి పై వేటు..నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో మెంచు చక్రయ్య గౌడ్ మర్డర్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూర్యాపేట డీఎస్పి రవి, సీఐ పై బదిలీ వేటు, ఎస్సైకి మెమో.. డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ..మెంచు చక్రయ్య గౌడ్ కుటుంబం సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని హత్యకు ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చిన కుటుంబ సభ్యులు..ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన సూర్యాపేట డీఎస్పీ రవి, తుంగతుర్తి సీఐ పై బదిలీ వేటు, ఎస్సైకి మెమో…

👉కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు పెట్టిన కొణతం దిలీప్.. రూ. 18.50 కోట్ల ప్రజల డబ్బుతో కొణతం దిలీప్ విదేశీ పర్యటనలు.. డిజిటల్ మీడియా డైరెక్టర్ హోదాలో, విదేశీ పర్యటనల కోసం రూ.18.50 కోట్లు ఖర్చు పెట్టిన కేటీఆర్ ప్రధాన అనుచరుడు కొణతం దిలీప్..ఆర్టీఐ సమాచారంతో బయటికి వచ్చిన సంచలన నిజాలు

👉 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం.. రాజమండ్రి కొంతమూరు వద్ద మంగళవారం ఉదయం ప్రవీణ్ మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు ..ప్రవీణ్ మృతిపై ఎన్నో అనుమానాలు..పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రవీణ్ బామ్మర్ది రాజేష్ రాజు..కొంతమూరు వద్ద ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ..ప్రవీణ్ హత్యకేసును పర్యవేక్షిస్తున్న తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ..ఈ రోజు ఉదయం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం

👉బెట్టింగ్ యాప్స్ కేసులు సీఐడీకి బదిలీ చేసే యోచన

సైబరాబాద్‌లో నమోదైన కేసులను విచారించే అవకాశం

హైదరాబాద్ లో 11 మంది బెట్టింగ్ ప్రమోటర్లపై కేసు నమోదు.. బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలపై సైబరాబాద్‌లో కేసు నమోదు..యూట్యూబర్ల నుంచి సినీహీరోల వరకు కేసులు నమోదు..ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు..మరికొందరు సినీ నటులను విచారించనున్న పోలీసులు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..