👉ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార ఘటన… బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ చందనదీప్తి.. 👉విశాఖ, కడపలో స్థానిక సంస్థల రాజకీయ వేడి…👉 జిల్లా ఎస్పీ  ఆదేశాలతో శక్తి యాప్ పై అవగాహన..👉*ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్ఐ..**కిలాడి లేడి ఈ మాయలేడి..👉పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం.. 👉రాజకీయాల్లో ఆధిపత్యం కోసం సొంత తండ్రినే హత్య చేయించిన కూతురు..

  • 👉ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటన… బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ చందనదీప్తి..  గాంధీ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ.. బాధితురాలు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళుతున్న సమయంలో ఘటన జరిగిందని వెల్లడి..  యువతి ప్రాణాపాయస్థితి నుంచి బయటపడిందన్న ఎస్పీ..ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచారయత్నం ఘటనపై రైల్వే పోలీసు ఎస్పీ చందనదీప్తి మీడియాతో మాట్లాడారు. గాంధీ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, నిన్న సాయంత్రం 26 ఏళ్ల యువతి ఎంఎంటీఎస్ రైలులోని మహిళా కంపార్టుమెంటులో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళుతుండగా ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. సికింద్రాబాద్‌లో ఆమె ఎక్కినప్పుడు ఇద్దరు మహిళలు ఉన్నారని, వారు అల్వాల్ స్టేషన్ వద్ద దిగిపోయారని తెలిపారు..అదే కంపార్టుమెంటులో ఉన్న వ్యక్తి తన వద్దకు వచ్చి గట్టిగా పట్టుకున్నట్లు యువతి తెలిపిందని, ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉందని అన్నారు. అతను ఏమైనా చేస్తాడేమోననే భయంతో యువతి రైలులో నుంచి దూకేసిందని ఎస్పీ తెలిపారు.నిందితుడిని గుర్తు పట్టలేనని బాధితురాలు చెబుతోందని, కానీ అతను ఎక్కడ ఎక్కాడో చెప్పగలనని తమకు తెలిపిందని ఆమె వెల్లడించారు. యువతి ప్రాణాపాయస్థితి నుంచి బయటపడిందని ఎస్పీ తెలిపారు. నాలుగు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

👉విశాఖ, కడపలో స్థానిక సంస్థల రాజకీయ వేడి… క్యాంపు రాజకీయాలకు తెరలేపిన వైసీపీ!

విశాఖలో మేయర్ పీఠంపై కన్నేసిన కూటమి…కడపలో మార్చి 27న జడ్పీ చైర్మన్ ఎన్నిక..తమ సభ్యులను కాపాడుకోవడంపై దృష్టిసారించిన వైసీపీ..

విశాఖ, కడపలో స్థానిక సంస్థలకు సంబంధించి రాజకీయ వేడి నెలకొంది. విశాఖలో మేయర్ పీఠం చేజిక్కించుకోవడంపై కన్నేసిన కూటమి… మేయర్ హరి వెంకటకుమారికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. దాంతో నగర పాలక సంస్థలో బలపరీక్ష అనివార్యమైంది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే కూటమికి 64 ఓట్లు కావాలి… ప్రస్తుతం ఉన్న బలం దృష్ట్యా మరో నలుగురు కార్పొరేటర్లు కూటమి వైపు వస్తే సరిపోతుంది. అయితే గెలుపు తమదేనని డిప్యూటీ మేయర్ జీఎం శ్రీధర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవతలి పక్షం వైపు వెళ్లిన వారు కూడా మళ్లీ తమ గూటికే రాబోతున్నారని అన్నారు. జగన్, బొత్స, అమర్నాథ్ ల అండదండలతో బలపరీక్షలో తామే నెగ్గబోతున్నామని అన్నారు. అటు కడప జిల్లా పరిషత్ లోనూ ఇదే తరహా సీన్ నెలకొంది. కడప జెడ్పీలో మొత్తం 50 స్థానాలు ఉండగా… ప్రస్తుతం వైసీపీ బలం 39గా ఉంది. కడపలో మార్చి 27న జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో, వైసీపీ వర్గం క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ప్రస్తుతానికి తమ వర్గంలో ఉన్న కార్పొరేటర్లను, జెడ్పీమెంబర్లను కాపాడుకోవడంపై దృష్టినిలిపింది. వారిలో కొందరిని ఊటీకి, మరికొందరిని బెంగళూరుకు తరలించినట్టు తెలుస్తోంది. పలువురు కుటుంబ సమేతంగా తరలి వెళ్లినట్టు సమాచారం.

👉 జిల్లా ఎస్పీ  ఆదేశాలతో శక్తి యాప్ డౌన్లోడ్, ఇన్స్టాల్ ల గురించి అవగాహన కల్పిస్తున్న శక్తి బృందాల సిబ్బంది

* గుత్తి KGBP ఉన్నత పాఠశాల వసతి గృహంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

జిల్లా ఎస్పీ  పి.జగదీష్ ఆదేశాలతో ఈరోజు గుత్తి KGBP ఉన్నత పాఠశాల వసతి గృహంలో విద్యార్థులకు గుంతకల్లు సబ్ డివిజన్ శక్తి టీమ్ సభ్యుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్ డౌన్లోడ్, ఇన్స్టాల్ ల గురించి శక్తి బృందాల సిబ్బంది అవగాహన చేశారు. ఈ సందర్భంగా శక్తి యాప్ సేవలు గురించి వివరించారు. మహిళలు విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా శక్తి యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. మహిళలకు ఆపద సమయంలో అత్యవసర సాయం అందించేందుకు శక్తి యాప్ ఒక అయధంగా పనిచేస్తుందన్నారు. కావున ప్రతి ఒక్క మహిళ, విద్యార్థులు ఈ యాప్ ను ఫోన్లో డౌన్లోడ్,రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. పలువురు విద్యార్థిని లకు ఆత్మ రక్షణ పై అవగాహన చేశారు. అదేవిధంగా… సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేయాలి మరియు డయల్ 100/112 ఉపయోగాలు, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ ల గురించి అవగాహన చేశారు.మద్యం మత్తులో యువకులు రచ్చ రచ్చ..పోలీసులపై తిరగబడి కానిస్టేబుల్ చొక్కా చించినా… ఆలస్యంగా వెలుగులోకి…చింతల చేను వైన్ షాప్ వద్ద శనివారం రాత్రి ఘటన..వైన్ షాప్ వద్ద గొడవ జరుగుతుందని 100 కు కాల్…బ్లూ కొట్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని గోడవెందుకని వెళ్లిపోవాలంటూ ఆదేశించినా… మీరెవరు చెప్పేదానికి అంటూ ప్రభుత్వ ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం….ఆపై కానిస్టేబుల్ మహేష్ చొక్కా పట్టుకుని బటన్ చించిన వైనం.. మందు బాబుల ఆగడాలను నివారించలేక రక్షక్ వాహనానికి సమాచారం ఇచ్చిన బ్లూ కోట్ సిబ్బంది.రక్షక్ వాహనంతో పాటు ఎస్సై సిబ్బంది చేరుకొని వారిని పోలీసు వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేసినా పోలీసులు తోసివేసి రోడ్డుపై దొర్లాడిన మందుబాబులు. అష్ట కష్టాలు పడి వారిరువురిని ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలింపు..  నాకు రాజకీయ అండదండలు ఉండాయంటూ పోలీసులను దుర్భాషలాడుతూ చిందులాట..మందుబాబులకు చిన్న గాయం కావడంతో ఆసుపత్రికి తరలించిన వైద్యులతో దురుసు ప్రవర్తన.  వైద్య సేవలు అందించలేమంటూ వారిని తీసుకు వెళ్లండి పోలీసులుకు ఆదేశించిన డాక్టర్లు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఈస్ట్ ఎస్సై గిరిబాబు.

👉*ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్ఐ..*కాకినాడ జిల్లా: పిఠాపురం._*

* పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి. దుర్గాప్రసాద్ వద్ద నుండి 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై గుణశేఖర్, పర్సనల్ డ్రైవర్ శివ.* _కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు..* _పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.._

👉*కిలాడి లేడి ఈ మాయలేడి* ఈ ఫోటోలో ఉన్న మహిళ కడప జిల్లా ప్రాంతంలో సంచరిస్తూ ఉంది..ఈమె టార్గెట్ ఫోన్ పే ఉన్నవాళ్లు .. గూగుల్ పే ఉన్నవాళ్లు మాత్రమే..

వారి వద్దకు ఈ మహిళ ఒక చిన్న బాబుతో వచ్చి

అన్నా మా బాబుకి బాగాలేదు హాస్పిటల్ కి వెళ్ళాలి మాకు తెలిసిన వాళ్లు హైదరాబాదు లో ఉన్నారు మా బాబుని హాస్పిటల్లో చూపించుకోవడానికి డబ్బులు పంపిస్తారు మీ దగ్గర ఫోన్ పే కానీ గూగుల్ పే ఉంటే మా వారు డబ్బులు వేస్తారు నాకు నగదు ఇవ్వండి అని చెప్పి బతిమాలుతుంది వీలైతే మీ రెండు కాళ్లు కూడా పట్టుకుంటుంది ఏడుస్తుంది మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత నే *అసలు కథ మొదలవుతుంది*..హైదరాబాదులో ఉన్న ఈమె బంధువులు వారి యొక్క టార్గెట్ ఫోన్ పే సీక్రెట్ లాక్ తెలుసుకోవడం తర్వాత మొబైల్ దొంగతనం మరియు వారి ఫోన్ పే ద్వారా నగదు వారికి సంబంధించిన ఫోన్ పే కి వెంటనే పంపించి హ్యాకింగ్ చేయడం.ఇక్కడ మహిళ కు ఫోన్ పే ద్వారా నగదు ఇచ్చిన వ్యక్తి యొక్క ఫోన్ ఫే హ్యాకింగ్ గురి కావడం ఫోన్ పే లో ఉన్నటువంటి నగదు దోచుకోవడం కడప జిల్లా ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు చాలా వరకు చోటు చేసుకున్నాయి ఇప్పటివరకు ఈ మహిళ మోసం చేసిన వ్యక్తుల యొక్క సంఖ్య 70 వరకు బాధితులు ఉన్నారు

నయా రకం మోసం…*

*నడి రోడ్డుపై దౌర్జన్యం* …*కొమ్ము కాస్తున్న పశ్చిమ నియోజకవర్గం నాయకులు మరియు ఒక పోలీస్ కానిస్టేబుల్…* పూర్తి ఎపిసోడ్ లో కీలకంగా వ్యవహరిస్తున్న సాయి రామ్, కళ్యాణ్ మరియు సందీప్ అనే యువకులు..పైన పేర్కొన్న యువకుల స్నేహితుల వద్దకు వచ్చి అత్యవసర పరిస్థితులని నమ్మబలికి కారు లేదా బైక్ సదరు వ్యక్తి వద్ద పెట్టి, రెండు మూడు రోజులు అడ్జస్ట్మెంట్ అంటూ బ్రతిమలాడి డబ్బులు తీసుకోవడం వీరికి వెన్నతో కూడిన విద్యా…. అలా ఒక వారం గడిచిన తర్వాత ఆ కార్ మాది అంటూ మరో గ్యాంగ్ ప్రత్యక్షమై, అప్పు ఇచ్చిన వాడిని బెదిరించి కారు లాక్కొని వెళ్లిపోవడం ఇప్పుడు విజయవాడలో నయా మోసం బయటకు వచ్చింది.. వారం క్రితం *పోరంకి* కి చెందిన సాయిరాం అనే వ్యక్తి పెనమలూరు మరియు గంగూరు గ్రామంలో స్నేహం ముసుగులో నమ్మించి రెండు కార్లు పెట్టి అవసరం కోసం అని డబ్బులు తీసుకోవడం జరిగింది..సరిగ్గా వారం గడిచిన తర్వాత గంగూరు వ్యక్తి కారు వేసుకుని పనిమీద విజయవాడ వెళ్లగా అతన్ని బెదిరించి కారు లాక్కోవడం జరిగింది…ఇక రెండవ కారును పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గా మహల్ వద్ద కారులో ప్రయాణిస్తున్న కుటుంబాన్ని నడిరోడ్డుపై ఆపి పదిమంది యువకులు స్థానికులను మరియు కారులో ప్రయాణిస్తున్న కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారు..ఇక్కడ వారి వ్యూహం బెడిసి కొట్టడంతో వీరి మీద పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు..

👉తెలంగాణ క్యాబినెట్లోకి నలుగురు కొత్త మంత్రులు!*

*క్యాబినెట్ విస్తరణపై నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గే, మీనాక్షి, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, ఉత్తమ్, మహేశ్ సుదీర్ఘంగా చర్చించారు. ఈక్రమంలో నలుగురికి కొత్తగా మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన హామీల మేరకు మక్తల్ MLA శ్రీహరి ముదిరాజ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి.వివేక్, బోధన్ MLA సుదర్శన్ రెడ్డికి ‘అమాత్య’ యోగం కల్పించనున్నట్లు సమాచారం..

👉రాజకీయాల్లో ఆధిపత్యం కోసం సొంత తండ్రినే హత్య చేయించిన కూతురు.. కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్యలో 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరులో చక్రయ్య గౌడ్‌ను అంతమొందించిన సొంత కూతురు, అల్లుడు సహా 11 మంది అరెస్ట్ .. సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలం మిరియాల గ్రామంలో ఈ 17న మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నేత చక్రయ్య గౌడ్ హత్య .. సొంత కూతురు, అల్లుడు సహా 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. గ్రామంలో రాజకీయ ఆధిపత్యం, వర్గ విభేదాలే చక్రయ్య గౌడ్ హత్యకు కారణమని తెలిపిన పోలీసులు..గ్రామంలో 30 సంవత్సరాలు సర్పంచ్, సహకార సంఘం చైర్మన్ పదవులు చేసిన చక్రయ్య గౌడ్.. తనకు వైరి వర్గంగా మారిన మామ చక్రయ్య గౌడ్‌ను అల్లుడు అంతమొందించాడని తెలిపిన పోలీసులు.

👉పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం*

*నేరం చేసే ముందు ఒక క్షణం ఆలోచించాలి: ఎస్.ఐ. నరసింహారావు*

కంభం:పోక్సో చట్టంపై అందరూ అవగాహన కలిగివుండాలని,పిల్లలపై వేధింపులు క్షమించరాని నేరమని ఎస్.ఐ నరసింహారావు వ్యాఖ్యనించారు.మంగళవారం స్థానిక ఎంఈవో కార్యాలయంలో ఎంఈఓ మాల్యాద్రి అధ్యక్షతన మండలంలోని ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలల ప్రధనోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో బాల్య వివాహాలు, పోక్సో చట్టాలపై ప్రధానోపాధ్యాయులకు అవగాన కలిగించారు.పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని,ఉద్యోగాన్ని సైతం కోల్పోవాల్సి ఉంటుందని అన్నారు. 18ఏళ్ల లోపు వయసు గల పిల్లల పై వేధింపులకు పాల్పడకుండా ఈ చట్టం ఉపయోగపడుతుందనీ,సెక్షన్ల వారీగా చట్టాల తీవ్రతను వివరించి అవగాహన కలిగించారు.నేరం చేయడం, నేరస్థులకు సహకరించడం కూడా శిక్షార్హమేనని,పాఠశాల స్థాయిలో నేరాల పట్ల అప్రమత్త అవసరమని,విద్యార్థులలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవగాహన కలిగించాలాన్నారు. క్షణికానందం కోసం తప్పులు చేస్తే శిక్షలు తప్పవని,ఎవరైనా నేరం చేసేముందు ఒక్కక్షణం సంబంధిత చట్టాలను గుర్తుతెచ్చుకోవాలని హెచ్చరికలు చేశారు. కార్యక్రమంలో ఎంఈవోలు బి.మాల్యాద్రి, టి. శ్రీనివాసులు, సీఆర్పీలు, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..