👉పవన్‌ కళ్యాణ్‌కు షాక్‌…జనసేన ఎమ్మెల్యేల రహస్యభేటీ.. నాదెండ్ల మనోహర్‌ సైతం !….👉వక్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు*..ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం..!..👉 రాజీవ్ యువవికాసం దరఖాస్తుల తిరస్కరణ.. 👉28న రైతుల దేశవ్యాప్త నిరసన..!! ..👉సీఎం సార్.. మేం కూడా ఆడపిల్లలమే కదా! దద్దరిల్లిన హైదరాబాద్ కోఠి సెంటర్..!! ..👉హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య..!!!..👉స్వరూపానంద కబ్జా – నోటీసులు జారీ*👉నాడు మోదీ చెప్పారు.. నేడు అమరావతిలోనూ అదే దోపిడీ: YCP**యువతిపై ముగ్గురు అత్యాచారం.. 👉ప్రారంభోత్సవానికని పిలిచి వ్యభిచారం చేయాలని ఒత్తిడి..

👉పవన్‌ కళ్యాణ్‌కు షాక్‌…జనసేన ఎమ్మెల్యేల రహస్యభేటీ.. నాదెండ్ల మనోహర్‌ సైతం….*

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆ సంతృప్త ఎమ్మెల్యేలు ఇటీవల విజయవాడలోని ఒక హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారన్న వార్త గుప్పుమంది. ఈ సమావేశానికి జనసేన కీలకనేత, మంత్రి నాదెండ్ల మనో హర్ సైతం హాజరయ్యారని సమాచారం. ఈ రహస్య సమావేశంలో తమతమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమ నియోజకవర్గా్ల్లో టీడీపీ ఇన్చార్జీల మాటే చెల్లుబాటవుతుందని, ఎమ్మెల్యేలను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వాపోయినట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేనకు, టీడీపీకి మధ్య సమన్వయం లోపిస్తుందన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారనే ప్రచారం కూటమి పార్టీల్లో సంచలనంగా మారింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పరిస్థితులు.. తమ మాట చెల్లుబాటు పైనే ప్రధానంగా చర్చ చేసినట్లు సమాచారం. కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 21 మంది ఎమ్మెల్యేల్లో మంత్రులుగా ఉన్న ముగ్గురు మినహా మిగిలిన 18 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తాము ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి వివరించారు. అధికారులు తమ మాట వినడం లేదన్న ధోరణిలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతి పనికి జనసేన మంత్రుల దగ్గరకు వెళ్లాల్సి వస్తోందని మనోహర్ కు వివరించినట్లుగా తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో టీడీపీ ఇంఛార్జ్ ల మాటకే ప్రాధాన్యత దక్కుతుందని వాపోయినట్లు చెబుతున్నారు. ఎందుకీ పరిస్థితి డిప్యూటీ సీఎంగా పవన్, మంత్రులుగా ఉన్న మనోహర్ .. దుర్గేశ్ నియోజకవర్గాల్లో మాత్రం వారి మాట చెల్లుబాటు అవుతుందని చెప్పుకొచ్చారు. తమ నియోజకవర్గాల్లో అధికారులకు ఏం చెప్పినా పట్టించుకోవటం లేదని మొర పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కందుల దుర్గేశ్ నియోజకవర్గంలోనూ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించినట్లు సమాచారం. తాము నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నా.. పనులు అవ్వటం కోసం ముగ్గురు మంత్రుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదే రకంగా భవిష్యత్ లోనూ కొనసాగితే నియోజకవర్గంలో తమకు విలువ లేకుండా పోతుందని.. పరిస్థితుల్లో మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ఇదే సమయంలో పార్టీ పరిస్థితులు.. ప్రజలతో మమేకం కావాల్సిన అంశాల పైన ప్రస్తావనకు వచ్చి నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారి మాటే అమలవుతోందని.. తమ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని చెప్పుకొచ్చినట్లు సమాచారం. తమ నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇంచార్జ్ ల మాటే చెల్లుబాటు కావటంతో తాము ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని.. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులు డిప్యూటీ సీఎం పవన్ కు తెలిసేలా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారని చెబుతున్నారు. కాగా, మీటింగ్ లో జరిగిన అంశాల పైన ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి సమాచారం ఉందనే వాదన ఉంది. కాగా, ఈ సమావేశం పైన జనసేన ఎమ్మెల్యేలు ఓపెన్ గా స్పందించటానికి నిరాకరిస్తున్నారు.
👉వక్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు*

*వర్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. తొలి దశలో భాగంగా ఈనెల 26న బిహార్ రాజధాని పట్నాలో, 29న APలోని విజయవాడలో నిరసనలు జరపనున్నట్లు ప్రకటించింది. వీటికి మద్దతు ఇవ్వాలని టీడీపీ, వైసీపీ, కాంగ్రెసు కోరింది. ముస్లిం బోర్డు వినతిపై ఆయా పార్టీలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తిగా మారింది.. *
👉పోలీసులు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్..*

*నరసాపురం వైన్ కళాశాల గ్రౌండ్లో డీఎస్పీ శ్రీవేద ఆధ్వర్యంలో ఆదివారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. నరసాపురం సబ్ డివిజన్ స్థాయి టీమ్కి డీఎస్పీ శ్రీవేద కెప్టెన్గా, పెనుగొండ సర్కిల్ టీమ్కు సీఐ రాయుడు విజయ్ కుమార్ కెప్టెన్గా విడిపోయి మ్యాచ్ ఆడారు. ముందు బ్యాటింగ్ దిగిన డీఎస్పీ శ్రీవేద టీం 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేయగా, సెకండ్ బ్యాటింగ్ దిగిన పెనుగొండ టీం 56 పరుగులకు ఆలౌట్ అయింది..
👉*కీలక బాధ్యతల్లోకి నారా లోకేశ్!*

ఏపీలో టీడీపీ ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే కార్యక్రమం మహానాడు. అయితే ఈ ఏడాది మే నెలలో జరిగే మహానాడులో ఓ కీలక నిర్ణయం వెలువడనుందని తెలుస్తోంది. మంత్రి లోకేశ్కు పార్టీలో అత్యున్నత బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పార్టీలో లోకేశ్ ప్రాధాన్యం పెరిగేలా ఆయన కోసం ప్రత్యేకంగా “పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్” పదవిని ప్రవేశపెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం.
👉బెట్టింగ్ యాప్ కేసు.. నేడు విచారణకు యాంకర్ శ్యామల

బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులో టాలీవుడ్ సెలబ్రిటీల విచారణ కొనసాగుతోంది. ఇవాళ యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. తనపై నమోదైన FIRను కొట్టివేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా శ్యామలను అరెస్ట్ చేయొద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే విచారణకు సహకరించాలని ఆమెకు సూచించింది. అటు ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరిని విచారించిన పోలీసులు రేపు మరోసారి ఎంక్వైరీ చేయనున్నారు.
[*విశాఖలో భారీగా క్రికెట్ బెట్టింగ్​లు- పెదవాల్తేరులో ఓ గ్యాంగ్ నుంచి దాదాపు 80 బ్యాంకు ఖాతాల్లోని రూ.45 లక్షలు సీజ్, అంతే కాకుండా రూ.178 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు విచారణలో వెల్లడి..*

ఐపీఎల్‌ సీజన్‌ షురూ అయిన నేపథ్యంలో బెట్టింగ్‌ ముఠాల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. వీరి ఉచ్చులో చిక్కుకొని ఎంతో మంది పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి,ఆత్మహత్యలకు పాల్పడుతున్న బాధితులెందరో. బెట్టింగ్‌ల కోసం బ్యాంకుల్లో బంగారాన్ని సైతం కుదువపెట్టేవారు కొందరైతే, లోన్‌ యాప్‌లు, ప్రైవేట్‌ ఫైనాన్షియర్ల వద్ద వడ్డీలకు కాసే వారు మరికొందరు. ఈజీ మనీకోసం అత్యాశతో బెట్టింగ్ ముఠా వలలో ప్రధానంగా యువత, ఆటోడ్రైవర్లు, భవన కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు, చిన్నచిన్న వ్యాపారులు చిక్కుకుంటున్నారు. బెట్టింగ్లో రూ.178 కోట్ల లావాదేవీలు: బెట్టింగ్లో లక్కు ఎవరికో ఒకరికే అన్న సంగతి తెలిసే బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఇందులో ఓడిపోవడంతో అప్పులు తీర్చలేక ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్న ఉదంతాలు నిత్యకృత్యం అయ్యాయి. ఏపీలో ఎక్కువగా విశాఖలో ఈ బెట్టింగ్‌ ముఠాలకు సంబంధించి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో ఈ ఏడాది జనవరిలో బెట్టింగ్ గ్యాంగుల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పెదవాల్తేరులోని అపార్ట్‌మెంట్‌లో ఒక బుకీ పట్టుబడగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి దాదాపు 80 బ్యాంకు ఖాతాల్లోని రూ.45 లక్షలను సీజ్ చేశారు. నిందితులు బెట్టింగ్‌లను నిర్వహించి రూ.178 కోట్ల మేర లావాదేవీలు జరిపినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో ప్రధాన నిందితులతో సహా ఒక్కొక్కరిని అరెస్టు చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతానికి అరెస్టు అయిన నిందితుల సంఖ్య 13కి చేరింది.

అరెస్టు అయిన వారిలో ప్రధాన నిందితులు ఎక్కువగా రాజకీయ నేపథ్యం ఉంటోంది. దీంతో వారు ప్రస్తుతం బెయిల్‌పై బయటే ఉండటం గమనార్హం. అంతే కాకుండా మొన్నటి వరకు వైఎస్సార్సీపీలో ఉండి, ఇటీవల కూటమి నేతల చెంత చేరారు. వీరి వద్ద ఉన్న పాత కాంటాక్టులతో పక్కా ప్రణాళిక వేసుకుని ఐపీఎల్‌ బెట్టింగ్‌లకు దిగుతున్నట్లు సమాచారం. డిజిటల్‌ లావాదేవీలు కాకుండా నగదు డిపాజిట్లు చేయించుకుని ఒక ఫోన్‌ నంబరు ఇస్తారు. ఆ నంబర్‌కు ఫోన్‌ చేస్తే పాతవారైతేనే బెట్టింగ్‌ కలుపుతారు. బుకీలకు తెలియని లేదా కొత్త నెంబర్లు నుంచి ఫోన్లు వస్తే ఆ నెంబర్లను స్విచాఫ్‌ చేస్తారు.ఫిర్యాదు చేయాల్సిందిగా సీపీ సూచన: నగర శివారులోని పలు కాలనీల్లో అపార్ట్‌మెంట్లు అద్దెకు తీసుకుని నిందితులు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. బుకీల కదలికలు, బెట్టింగ్‌లపై పక్కా సమాచారం ఉన్నా కొందరు పోలీసు సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదని సమాచారం. ఇటీవల పట్టుబడిన ముఠాతో సంబంధాలు ఉన్నాయని రుజువు కావడంతో స్పెషల్‌ బ్రాంచి కానిస్టేబుల్‌పై సస్పెండ్‌ వేటు వేశారు. ఇలా కొందరు దాడులకు వస్తే సమాచారం ఇస్తాం అని బెట్టింగ్‌ ముఠాలతో జత కట్టినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్‌ల వల్ల మోసపోయినవారు ఫిర్యాదు చేస్తే నిందితులను అరెస్టు చేస్తామని సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు.
👉హైదరాబాద్‌లో మరో ఘోరం.. ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం..!* ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై యువకుడు అత్యాచారయత్నం.. ట్రైన్ నుంచి దూకేయ్యడంతో గాయపడిన యువతి.. గాంధీ ఆసుపత్రికిలో చికిత్సపొందుతున్న బాధితురాలు..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

ఎంఎంటీఎస్ రైలులో ఒక దుర్ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న ఒక యువతిపై ఒక యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువతి రైలు నుంచి దూకడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

మేడ్చల్‌లో ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన యువతి తన సెల్ ఫోన్ రిపేరు కోసం సికింద్రాబాద్ వెళ్లి, పని ముగిసిన తర్వాత తిరిగి ఎంఎంటీఎస్‌లో బయలుదేరింది. ఆమె మహిళా కోచ్‌లో ప్రయాణిస్తుండగా, ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్‌లో దిగిపోయారు. ఆ తర్వాత బోగీలో ఒంటరిగా ఉన్న ఆమెపై ఒక యువకుడు (25) అత్యాచారయత్నం చేయబోయాడు.దీంతో ఆమె అతని నుంచి తప్పించుకునేందుకు కొంపల్లి సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ వద్ద రైలు నుంచి దూకింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
👉నేనేదో కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారు: లావు శ్రీకృష్ణదేవరాయలు.. మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు.. మా వాళ్లకు ఒక న్యాయం, బయటివారికి ఒక న్యాయం ఉండదు..  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు.అమరావతిలో అనేక విద్యాసంస్థలు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నాయి.. మా వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తు లేదు.. ఇదంతా మీతో ఎవరు మాట్లాడించారో నాకు బాగా తెలుసు- లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ ఎంపీ
👉 రాజీవ్ యువవికాసం దరఖాస్తుల తిరస్కరణ.. 😱

పథకం ప్రారంభం కాకముందే అనేక ఆటంకాలు..ఆన్లైన్ సెంటర్లు, మీసేవ కేంద్రాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదంటున్న నిరుద్యోగులు..ఆధార్ కార్డుతో నమోదు చేసుకోగానే “ఆల్రెడీ అప్లైడ్” అని చూపిస్తూ, దరఖాస్తులు తిరస్కరిస్తున్న రాజీవ్ యువవికాసం వెబ్సైట్ ఏప్రిల్ 5వ తారీఖు వరకే దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండడంతో, నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

2017-18లో స్వయం ఉపాధి కోసం నమోదు చేసుకున్న వారి వివరాలు అధికారులు తొలగించడంతోనే ఈ సమస్య వచ్చిందంటున్న నిరుద్యోగులు..ఏప్రిల్ 6 నుండి మే 30 వ తేది వరకు లబ్ధిదారులను ఎంపిక చేసి, జూన్ 2 నుండి జూన్ 9వ తేది వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు..ఎన్నిసార్లు ప్రయత్నించినా వెబ్సైట్ దరఖాస్తులు స్వీకరించడం లేదని, మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగి తిరిగి విసుగెత్తిపోయామని, అధికారులు వెంటనే వెబ్సైట్ లోని లోపాలను సరిచేసి దరఖాస్తులు తిరస్కరించకుండా చూడాలని నిరుద్యోగులు కోరుతున్నారు
👉హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య..!!!

సంతోష్ నగర్ – న్యూ మారుతి నగర్ కాలనీలో లాయర్ ఇజ్రాయిల్‌ను కత్తితో పొడిచి దాడి చేసిన ఎలక్ట్రీషియన్ దస్తగిరి. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లాయర్ ఇజ్రాయిల్ మృతి …లాయర్ ఇజ్రాయిల్‌కు చెందిన ఇంట్లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న దస్తగిరి..నిందితుడు దస్తగిరి వేధింపులకు గురి చేస్తున్నాడని లాయర్ ఇజ్రాయిల్‌ను ఆశ్రయించిన మహిళ..మహిళ తరపున దస్తగిరిపై ఫిర్యాదు చేసిన లాయర్ ఇజ్రాయిల్ పై ఫిర్యాదు చేస్తారా అంటూ లాయర్ ఇజ్రాయిల్ కత్తితో దాడి చేసిన దస్తగిరి
👉మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీపై ప్రభుత్వ విచారణ!*

వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిగ్రీ వ్యవహారంపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విచారణ చేపట్టనున్నారు. వైసీపీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయిన తమ్మినేని నకిలీ డిగ్రీ ధ్రువీకరణ పత్రాలతో మోసం చేస్తున్నారని, దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని తాను ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు ఎమ్మెల్యే కూన రవికుమార్ నిన్న తెలిపారు. తమ్మినేని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఎన్నికల్లో నామినేషన్ వేసినట్టు ఎమ్మెల్యే ఆరోపించారు. తన ఫిర్యాదుపై స్పందించిన ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ఎస్. సురేశ్ కుమార్ దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ను ఆదేశించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.
👉ప్రారంభోత్సవానికని పిలిచి వ్యభిచారం చేయాలని ఒత్తిడి.. హైదరాబాద్‌లో బాలీవుడ్ నటిపై దాడి..కాపాడిన పోలీసులు*

నటికి ఫోన్ చేసి షాప్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించిన స్నేహితురాలు.. 18న హైదరాబాద్‌కు చేరుకుని మాసబ్‌ట్యాంక్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో బస చేసిన నటి ..ఇద్దరు మహిళలు వచ్చి తమతోపాటు వ్యభిచారం చేయాలని ఒత్తిడి.. ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు తమతో గడపాలని డిమాండ్.. గదిలో బంధించిన నటిని విడిపించిన పోలీసులు..  హైదరాబాద్‌లో బాలీవుడ్ నటిపై దాడి జరిగింది. షాప్ ప్రారంభోత్సవం కోసమని పిలిచి వ్యభిచారం చేయాలని బలవంతం చేయడంతో సదరు నటి నిరాకరించింది. దీంతో నిందితులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ముంబైలో ఉంటున్న బాలీవుడ్/టీవీ నటికి ఈ నెల 17న హైదరాబాద్‌కు చెందిన స్నేహితురాలు ఫోన్ చేసింది. ఇక్కడ ఓ షాప్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించింది. విమాన చార్జీలు, పారితోషికం ఇస్తారని చెప్పింది. దీంతో ఆమె ఈ నెల 18న హైదరాబాద్ చేరుకుంది. మాసబ్‌ట్యాంక్ శ్యామ్‌నగర్ కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో ఆమెకు బస ఏర్పాటు చేశారు. అక్కడామెకు ఓ వృద్ధురాలు అవసరమైన వసతులు ఏర్పాటు చేసింది..ఈ నెల 21న రాత్రి 9 గంటలకు ఇద్దరు మహిళలు అపార్ట్‌మెంట్‌కు వచ్చి తమతో కలిసి వ్యభిచారం చేయాలని నటిపై ఒత్తిడి తెచ్చారు. అదే రోజు రాత్రి 11 గంటలకు ముగ్గురు పురుషులు నటి ఉన్న గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని ఒత్తిడి చేశారు. అందుకామె నిరాకరించడంతో దాడి చేశారు. దీంతో ఆమె గట్టిగా అరిచి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగానే వారు అక్కడి నుంచి పారిపోయారు..ఆ వెంటనే ఇద్దరు మహిళలు, వృద్ధురాలు నటిని గదిలో బంధించి రూ. 50 వేల నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధిత నటి వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని విడిపించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
👉కడప కలెక్టరేట్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..*
* తన భూమిని పాస్ బుక్ లో ఎక్కుంచలేదని కడప కలెక్టరేట్లో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం.
* B.మఠం మండలం ముడమాల గ్రామానికి చెందిన గడిమె సుధాకర్ మండల రెవెన్యూ అధికారులు తన భూమికి సంబంధించిన రికార్డ్స్ పాస్ బుక్లో ఎక్కించలేదని ఆవేదన.
* ఈ మేరకు కలెక్టరేట్ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కిరోసిన్ పోసుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు వచ్చి అడ్డుకుని స్టేషన్ కు తీసుకెళ్లారు.
👉28న రైతుల దేశవ్యాప్త నిరసన..!!_*
సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు.. పంజాబ్‌ పోలీసుల చర్యపై ఆగ్రహం
చండీగఢ్‌ : డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పంజాబ్‌ పోలీసుల వైఖరిని నిరసిస్తూ మార్చి 28న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) జాతీయ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది.
సమస్యల సాధనకు ఆందోళన చేస్తున్న రైతులపై పంజాబ్‌ పోలీసులు అణచివేత విధానాన్ని అవలంబించారని ఎస్‌కేఎం ఆరోపించింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కిసాన్‌ మోర్చా, ఎస్‌కేఎం (రాజకీయేతర) తదితర రైతు సంఘాలు ఐక్యంగా ముందుకు వచ్చి అణచివేతపై పోరాటానికి దిగాలని విజ్ఞప్తి చేసింది. భగవంత్‌ మాన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు నేతలు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌, శర్వణ్‌ సింగ్‌ పాంథేర్‌తో పాటు 350 మందిని అరెస్ట్‌ చేసిందని ఆరోపించింది.

👉సీఎం సార్.. మేం కూడా ఆడపిల్లలమే కదా! దద్దరిల్లిన హైదరాబాద్ కోఠి సెంటర్..!!_*
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18,000 జీతం ఇవ్వాలని ఆశా వర్కర్లు (ASHA workers) డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. చలో హైదరాబాద్‌కి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆశా వర్కర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం కోఠిలోని డీఎంహెచ్ఓ వద్ద పెద్ద ఎత్తున చేపట్టిన ధర్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఆందోళన చేపట్టిన ఆశావర్కర్లను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పోలీసుల తోపులాటలో ఓ ఆశా వర్కర్ సృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీ ప్రకారం జీతం రూ.18 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఆడపిల్లలంటే సీఎంకు అభిమానం ఎక్కువ కదా.. మేం కూడా ఆడపిల్లలమే కదా సార్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ కల్పించి పనిభారాన్ని తగ్గించాలంని ఆశా వర్కర్లు పేర్కొన్నారు.
👉ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు గౌరవం ఇదేనా? హరీశ్ రావు ఫైర్_..
రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్ల అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడమే వారు చేసిన నేరమా? అని ప్రశ్నించారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్లకు తరలించడం దుర్మార్గమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనా? అంటూ నిలదీశారు. హామీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాన్ని 15నెలల్లోనే అన్ని వర్గాల ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. ఎన్నికల హామీ ప్రకారం, ఆశా వర్కర్ల వేతనాలను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దాకా ఆశా వర్కర్ల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
👉స్వరూపానంద కబ్జా – నోటీసులు జారీ*
జగన్మోహన్ రెడ్డి రాజగురువుగా ప్రసిద్ధి చెందిన స్వరూపానందకు చెందిన ఆశ్రమంలో ఇరవై రెండు సెంట్ల మేర ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్లుగా అధికారులు తేల్చారు. కబ్జా స్థలంలో నిర్మించిన కట్టడాలను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తూ నోటీసులు ఇచ్చారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి గజం లెక్క చెప్పాల్సిన వస్తోంది.
స్వరూపానందకు మొదట్లో ఓ అద్దె ఇంట్లో ఉంటూ స్వామిజీ అవతారం ఎత్తారు. తర్వాత ఓ వ్యక్తి స్థలం చూపించడంతో చినముషిడివాడలో శారదా పీఠం పేరుతో ఆశ్రమం పెట్టారు. ఆ ఆశ్రమం పక్కనే ప్రభుత్వ భూమి ఉంది. పలుకుబడి పెరిగే కొద్దీ దాన్ని కబ్జా చేస్తూ పోయారు. మొత్తంగా 22 సెంట్లు అంటే పదిహేను వందల గజాల వరకూ కబ్జా చేసి నిర్మాణాలు చేశారు. గతంలో సర్వే చేయడానికి కూడా అనుమతించేవారు కాదు..
ఇప్పుడు స్వరూపానంద విశాఖలో ఉండటం లేదు. ఆయన వారసుడిగా ప్రకటించుకున్న వ్యక్తి కూడా పెద్దగా బయట కనిపించడం లేదు. ఇప్పుడు ఈ కబ్జాలు తొలగిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. తొలగించకపోతే కూల్చివేస్తారు. అక్కడ ఆలయాల్లాంటి నిర్మాణాలు చేసి ఉంటే సమస్యలు వస్తాయి. అందుకే ఈ ఆక్రమణల విషయంలో ప్రభుత్వం వ్యవహరించే విధానంపై ఉత్కంఠ ఏర్పడింది.
👉ఆవు పాలు తాగడంతో మహిళకు రేబిస్.. మృతి*

*ఆవు పాలు తాగిన మహిళకు రేబిస్ సోకి మృతి చెందిన ఘటన UP నోయిడాలో జరిగింది. దీనిపై ప్రముఖ వైద్యుడు సుధీర్ అవగాహన కల్పించారు. ‘నోయిడాలో వీధి కుక్క కరవడంతో ఆవుకు రేబిస్ సోకింది. దాని పచ్చి పాలు తాగడంతో మహిళ కూడా ఆ వ్యాధి బారిన పడింది. ఇలాంటి కేసు ఇదే తొలిసారి. రేబిస్ సోకిన ఆవు పచ్చి పాలు తాగితే టీకా వేసుకోవాలి. పచ్చి పాలు ఎప్పుడూ తీసుకోవద్దు. మరగబెట్టాక తాగడమే సురక్షితం’ అని ఆయన ట్వీట్ చేశారు..✒️*
👉*యువతిపై ముగ్గురు అత్యాచారం..
*ఏలూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. జేపీ నగర్ కు చెందిన వంశీకృష్ణ ఓ యువతి(18)ని ప్రేమిస్తున్నానని నమ్మబలికి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ వంశీకృష్ణ స్నేహితులు సాయిచరణ్, శివశంకర్ సైతం ఆమెపై అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురితో పాటు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మొత్తం ఏడుగురిపై పోక్సో కేసు నమోదు చేశారు..

👉నాడు మోదీ చెప్పారు.. నేడు అమరావతిలోనూ అదే దోపిడీ: YCP*
*అమరావతిలో రూ.27,159 కోట్ల విలువైన కాంట్రాక్టులను 3.94-4.34% అధిక ధరకు సొంత మనుషులకు CBN కేటాయించారని YCP ఆరోపించింది. ‘పోలవరాన్ని చంద్రబాబు ATM మాదిరి వాడుకుంటున్నారని మోదీ ఏ క్షణాన అన్నారో కానీ నేడు అమరావతిలోనూ అదే జరుగుతోంది. అప్పు తెచ్చిన డబ్బంతా అమరావతిలో పోసి 59 ప్యాకేజీల పనులను తమవాళ్లకు ఇచ్చుకున్నారు. అందులో కమీషన్లు నొక్కుతూ చంద్రబాబు సంపన్నుడు అవుతున్నారు’ అని ట్వీట్ చేసింది..

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..