పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు.. కేసీఆర్.. 👉 జగన్ మౌనానికి అర్థం మోదీకి మద్దతు ఇవ్వడమేనా?: షర్మిల .. 👉నిజం కళాశాల బాయ్స్ హాస్టల్ లో పరిశుభ్రత, సానిటైజర్ లోపాలు..👉బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్పై ఫిర్యాదు😱.. 👉మాజీ మంత్రి విడుదల రజని పై ఏసీబీ కేసు నమోదు? .. *విటిపిఎస్ లో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తానని 23 మంది నుంచి డబ్బు వసూళ్లు.. 👉 పోలీస్ స్టేష‌న్‌లోనే దొంగలు పడ్డారు..!

👉ఏపీ రాజకీయాలు పై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన ఆరోపణలు…. పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు.. బి ఆర్ ఎస్ పార్టీ లో ఉన్న కార్యకర్త ..ప్రతి ఒక్కడూ కేసీఆరే..!

ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు.. పార్టీ ఫీనిక్స్‌.. ప్రతి ఒక్కడూ కేసీఆరే!.. పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు.. ఎవరూ శాశ్వతంగా ఉండిపోరని.. ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్‌లా తయారు కావాలన్నారు. బెల్లం ఉన్న దగ్గరకే ఈగలు వస్తాయని, తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని..కానీ ఇప్పుడు అదే తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని..కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

👉 జగన్ మౌనానికి అర్థం మోదీకి మద్దతు ఇవ్వడమేనా?: షర్మిల డీలిమిటేషన్ పై జగన్ మౌనంగా ఉన్నారని షర్మిల మండిపాటు.. పరోక్షంగా జగన్ డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తున్నట్టేనని వ్యాఖ్య.. డీలిమిటేషన్ పై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడాలని డిమాండ్.. తన అన్న, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్ పై జగన్ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారని… ఆయన మౌనానికి అర్థం నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వడమేనా? అని ఆమె ప్రశ్నించారు. జగన్ మౌనంగా ఉన్నారంటే… పరోక్షంగా డీలిమిటేషన్ కు మద్దతు ఇచ్చినట్టేనని అన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఏపీ కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేస్తేనే మోదీకి బుద్ధి వస్తుందని చెప్పారు.*డీలిమిటేషన్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మౌనం వహించడం ముమ్మాటికీ రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. డీలిమిటేషన్ పై చంద్రబాబు, పవన్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి టీడీపీ, జనసేన, వైసీపీ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ముందుకు రావాలని కోరారు.

👉తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో నోటీసులు.. ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ..గత విచారణ సందర్భంగా ప్రభుత్వం, అసెంబ్లీ సెక్రటరీ, 10 మంది ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు.. బీఆర్ఎస్ పిటిషన్ పై ఈ నెల 22లోగా స్పందించాలన్న న్యాయస్థానం.. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మరో సారి నోటీసులు జారీ
👉నెల రోజులైనా లభించని కార్మికుల ఆచూకీ..

SLBC టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకొని నెల దాటింది. అయినా ఇప్పటివరకు ఒకరి మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడంలేదు. దీంతో సహాయక చర్యలపై NDRF, SDRF, ఆర్మీ తదితర విభాగాలతో TG CM రేవంత్ రెడ్డి రేపు సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది.
👉నిజం కళాశాల బాయ్స్ హాస్టల్ లో పరిశుభ్రత, సానిటైజర్ లోపాలు.. నిజాం కళాశాల విద్యార్థుల ఆందోళన.. నిజం కళాశాల బాయ్స్ హాస్టల్ లో పరిశుభ్రత, సానిటైజర్ లోపాల వల్ల మెస్సులో కూర్చుని తినడానికి నిరాకరించిన విద్యార్థులు.. హాస్టల్ మెస్ చెత్త కుప్పల మారిందని కూర్చొని తినలేక పోతున్నాను పేర్కొన్న విద్యార్థులు.. వర్కర్లకు సరైన సమయంలో జీతాలు చెల్లించకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్లు పరిశుభ్రత చేయమని నిరాకరించడంతో ఈ రోజు నిరసనకు దిగిన విద్యార్థులు…
👉బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్ పై ఫిర్యాదు😱😱😱

టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్లపై మారేడ్పల్లి పీఎస్లో రామారావు ఇమ్మనేని అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆహాలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్-2లో గోపిచంద్, ప్రభాస్.. Fun88 అనే చైనీస్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని రామారావు పేర్కొన్నారు.
👉మహిళను దారుణంగా కొట్టి.. కారులో ఎక్కించుకుని పోయి.. ఖమ్మం జిల్లాలో దారుణం ..*

ఖమ్మం: జిల్లాలో మహిళ కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. పెనుబల్లి మండలం గౌరారం టోల్ ప్లాజా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను అపహరించారు. ఇద్దరు వ్యక్తులు మహిళపై దాడి చేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని పరారయ్యారు. మార్చి 21న ఉదయం 11 గంటల సమయంలో జరిగిన కిడ్నాప్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టోల్‌ ప్లాజా వద్ద సీసీ కెమెరాలో కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి.
అయితే ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అపహరణకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అవి ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. అయితే నిందితులు ఎవరు, మహిళను ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఆమె ప్రాణాలతోనే ఉందా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు తక్షణమే కిడ్నాపర్లను పట్టుకుని మహిళను రక్షించాలని కోరుతున్నారు. మరోవైపు మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయంటూ ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు.
👉మాజీ మంత్రి విడుదల రజని పై ఏసీబీ కేసు నమోదు?*

లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ. 2.2 కోట్లు వసూలు చేసినట్టు రజినిపై అభియోగాలు..  విచారణ అనంతరం ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేసిన ఏసీబీ.. ఏ1గా రజిని, ఏ2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, ఏ3గా రజినీ మరిది గోపి..

పల్నాడు జిల్లా..యడ్ల పాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమాన్యాన్ని విజిలెన్స్‌ తనిఖీల ముసు గులో బెదిరించి వారి నుంచి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని, అప్పటి గుంటూరు ఆర్‌వీఈవో, ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలోని 384, 120బీ సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు పెట్టింది.ఏ1గా విడ దల రజిని, ఏ2గా ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువా, ఏ3గా విడదల రజిని మరిది విడదల గోపి, ఏ4గా రజిని పీఏ దొడ్డ రామకృష్ణ లను నిందితులుగా చేర్చింది. ఈ బెదిరింపులు, అక్రమ వసూళ్లపై తొలుత విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు అందింది. ఆ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ హరీష్‌కుమార్‌ గుప్తా విచా రణ జరిపించి, ప్రభుత్వాని కి నివేదిక సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు సర్కార్ ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ సింగ్‌ ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఆధారాలు లభించడంతో శనివారం కేసు నమోదు చేశారు. స్టోన్‌క్రషర్‌పై దాడులు చేయకుండా, మూయించకుండా ఉండాలంటే ఎమ్మెల్యేని కలవాలని హుకుం జారీ చేశారు. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజిని కార్యాలయానికి వెళ్లి కలిశారు. తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడవాలంటే అడిగినంత డబ్బులివ్వా ల్సిందేనని, మిగతా విష యాలు తన పీఏ రామకృష్ణ తో మాట్లాడాలని రజిని వారితో చెప్పారు. వారిద్ద రూ రామకృష్ణను కలవగా ఆయన రూ.5 కోట్లు డిమాండ్‌ చేశారు.ఆ తర్వాత ఆరు రోజులకే సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు రీజనల్‌ విజి లెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారి – ఆర్‌వీ ఈవోగా ఉన్న ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువా భారీ బృందంతో శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌లో తనిఖీలకు వెళ్లి హడావుడి చేశారు.ఆ స్టోన్‌ క్రషర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే జాషువా విచారణకు వెళ్లారు. అప్పటి విజిలెన్స్‌ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. విజిలెన్స్‌ ప్రధాన కార్యాలయానికి ఈ దాడుల సమాచారమే ఇవ్వలేదు. విచారణలో వెల్లడైన అంశాలతో నివేదిక సిద్ధం చేశారు.
👉నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపిన సైకో

మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ఫోసిస్ కల్పతరు ప్రాజెక్ట్‌లో లేబర్‌ యోగేశ్వర్ దంపతులు పనిచేస్తున్న సమయంలో పక్కనే ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని వెస్ట్ బెంగాల్‌కు చెందిన సైకో బీరు సీసాతో దాడి చేశాడు.పారిపోతున్న సమయంలో స్థానికులు పట్టుకొని సైకోను చితికబాది, తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు.చిన్నారి చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది.
👉ఇది ఎప్పుడైనా విన్నారా.. పోలీస్ స్టేష‌న్‌లోనే దొంగలు పడ్డారు..!

ఎక్కడైనా చోరీ జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు బాధితులు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. మరి పోలీస్ స్టేషన్లోనే చోరీ జరిగితే..? ఓర్నీ ఇదేంది..? అనుకుంటున్నారా..? అవును.. గాజువాక పోలీస్ స్టేషన్లో అది జరిగింది. మే 3న గాజువాకలో రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి ఓ బుల్లెట్ ను పోలీసులు సీజ్ చేశారు. దాన్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు. బుల్లెట్ యజమాని.. హరీశ్ కోర్టు నుంచి అనుమతితో వాహనం తీసుకోవడానికి స్టేషన్ కెళ్లాడు. తన వాహనం ఇవ్వాలని అక్కడ పోలీసులకు అడిగాడు. బుల్లెట్ ఇచ్చేందుకు సిద్ధమైన పోలీసులు.. దాన్ని పార్కింగ్ చేసిన చోటుకు వెళ్లి చూసారు. అక్కడ ఆ వాహనం కనిపించలేదు. దీంతో పోలీసులే షాకయ్యారు..కాగా.. పోలీస్ స్టేషన్‌లోనే బైక్ లు మాయమవ్వడం కలకలం రేపింది.. ఇదివరకు పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు ఇప్పుడు ఉన్నాయో..? లేదో అని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

👉ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం*విటిపిఎస్ లో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తానని 23 మంది నుంచి మధ్య వర్తి ద్వారా డబ్బులు వసూళ్లు చేసిన మరో కాంట్రాక్టు ఉద్యోగి… మరో ప్రధాన యూనియన్ నాయకులు కూడా నిరుద్యోగుల నుంచి దరఖాస్తులతో పాటు డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం..* తమను మోసం చేశాడని లబోదిబో మంటున్న డబ్బులు ఇచ్చిన నిరుద్యోగులు…రెండు, మూడు రోజుల్లో మీడియా ముందుకు బాధితులు…* నిరుద్యోగులను మోసం చేస్తున్న కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు పునరావృతం…* కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ఈ ప్రాంత నిరుద్యోగులకు నూతన యూనిట్ లో అవకాశాలు ఇవ్వాలని కోరుతున్న ప్రజలు..

👉 శభాష్ కొవ్వూరు రూరల్ ఎస్ ఐ..
తూర్పు గోదావరి జిల్లా..
రాజమండ్రి రూరల్ లో జరిగిన డబుల్ మర్డర్ కేసులో నిందితుడు పరారౌరవుతున్న సమయంలో ముళ్ళ కంచెలలో పరిగెడుతూ నిందితుడిని అదుపులోకి తీసుకుంటున్న సందర్భంలో నిందితుడి నుంచి ప్రతిఘటన ఎదురైంది. స్వల్పగాయాలైనప్పటికీ కర్తవ్య నిర్వహణలో ధైర్యసాహసాలు చూపించి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న కొవ్వూరు రూరల్ ఎస్ఐ శ్రీహరి.
👉 మార్కాపురం కొండేపల్లి రోడ్ లోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పద్మజ (52) స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలు విధులు నిర్వహిస్తున్న మృతురాలు పద్మజ.. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్న పోలిసులు…

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..